Trainee constables
-
ఉన్నతాధికారులపై దాడి చేసిన ట్రైనీ కానిస్టేబుళ్లు
పాట్నా : లా అండ్ ఆర్డర్‌ని కాపాడాల్సిన పోలీసులే.. చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకున్నారు. తమ సహోద్యోగి మృతికి కారణమయిన ఓ కమాండెంట్‌తో సహా పలువురు ఉన్నతాధికారులను చితక్కొట్టడమే కాకా గాల్లోకి కాల్పులు కూడా జరిపారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వివరాలు ట్రైనింగ్‌లో ఉన్న ఓ మహిళా కానిస్టేబుల్‌కి డెంగ్యూ వచ్చింది. దాంతో సదరు మహిళ సెలవు ఇవ్వాల్సిందిగా అధికారులను కోరింది. కానీ వారు అంగీకరించలేదు. దాంతో ఆ మహిళా కానిస్టేబుల్ మరణించింది. సెలవు మంజూరు చేయకపోవడం వల్లే సదరు ఉద్యోగిని మరణించిందని తేలిసి ఆగ్రహం చెందిన మిగతా ట్రైనీ కానిస్టేబుళ్లు కమాండెంట్‌తో సహా పలువురు ఉన్నతాధికారుల మీద దాడికి దిగారు. అసభ్య పదజాలంతో తిడుతూ.. పదునైన ఆయుధాలతో దాడి చేయడమే కాకా గాల్లోకి కాల్పులు కూడా జరిపారు. అంతటితో ఊరుకోక కొన్ని ప్రభుత్వ వాహనాలతో పాటు ఫర్నిచర్‌ని కూడా ధ్వంసం చేశారు. Patna: Police personnel protest and create ruckus allegedly after an ailing woman constable passed away due to lack of treatment.Protesters claim the commandant did not grant her an adequate leave period to get treated.The commandant was injured after being thrashed by protesters pic.twitter.com/GtJbgN1owL — ANI (@ANI) November 2, 2018 ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఈ వీడియో బిహార్ సీఎం నితిష్ కుమార్ దృష్టికి చేరింది. ఘటనకు సంబంధించిన పూర్తి నివేదికను ఇవ్వాల్సిందిగా నితిష్ కుమార్ అధికారులను ఆదేశించారు. -
ట్రైనీకానిస్టేబుళ్లకు మే 1 నుంచి శిక్షణ
సాక్షి, హైదరాబాద్: స్టెపెండరీ క్యాడెట్ ట్రైనీ పోలీస్ కానిస్టేబుల్ (ఎస్‌సీటీపీసీఎస్) ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు మే 1వ తేదీ నుంచి శిక్షణ ప్రారంభించనున్నట్లు ఐజీ (శిక్షణ) చారు సిన్హా శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎంపికైన అభ్యర్థులు ఈ నెల 28వ తేదీ ఉదయం 10 గంటలకు యూనిట్ అధికారులకు రిపోర్ట్ చేయాలని అన్నారు. ఈ నెల 30వ తేదీ ఉదయం 8 గంటలకు కేటాయించిన శిక్షణ కేంద్రాల్లో రిపోర్టింగ్ చేసేందుకు ఆయా యూనిట్ అధికారులు పంపుతారని తెలిపారు. అభ్యర్థులు శిక్షణ కేంద్రంలో రిపోర్టింగ్ చేసేటప్పుడు మెస్, ఇతర చార్జీలకు రూ.6,000 జమ చేయాలని (మెస్ చార్జీలు శిక్షణ అనంతరం వాపసు చేస్తారు) చెప్పారు. అభ్యర్థులు వారి వెంట 2 కాకి నిక్కర్లు, 2 చిన్న చేతుల తెల్ల బనియన్లు, ప్లాస్టిక్ బకెట్, మగ్, బూట్ పాలిష్, బూట్ బ్రష్, ఒక జత తాళం, దిండు తెచ్చుకోవాలని సూచించారు. అలాగే ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్, ఆరోగ్య భద్రత కార్డుల కోసం 10 పాస్‌పోర్ట్ సైజు ఫొటోలు తీసుకురావాలని ఆమె కోరారు. శిక్షణ కేంద్రానికి అభ్యర్థులు విలువైన వస్తువులు తేవద్దని తెలిపారు. -
రోజుకొకరు ఆస్పత్రిపాలు!
ఒంగోలు: ప్రకాశం జిల్లా పొలీస్ ట్రైనింగ్ కళాశాలకు జబ్బు చేసింది. వారం రోజులుగా ట్రైనీ కానిస్టేబుల్స్ రోజుకొకరు చొప్పున ఆసుపత్రి పాలవుతున్నారు. ఇద్దరు మహిళా కానిస్టేబుల్స్ సృహతప్పి పడిపోయారు. వీరిని స్థానిక ప్రయివేటు ఆసుపత్రికి తరలించారు. పోలీసు శిక్షణను తట్టుకోలేక ట్రైనీ కానిస్టేబుళ్లు స్పృహ తప్పిపడిపోయారా? లేక సరైన పౌష్టికాహారం లేకపోవడం వల్ల పడిపోయారా? అన్నది తెలియడంలేదు. ఏది ఏమైనా ఇలా రోజుకొకరు ఆస్పత్రిపాలు కావడంతో పోలీస్ ఉన్నతాధికారులు ఆందోళన చెందుతున్నారు. తమమీదకు ఎక్కడ వస్తుందోనని వారు భయపడుతున్నారు.