రోజుకొకరు ఆస్పత్రిపాలు!
ఒంగోలు: ప్రకాశం జిల్లా పొలీస్ ట్రైనింగ్ కళాశాలకు జబ్బు చేసింది. వారం రోజులుగా ట్రైనీ కానిస్టేబుల్స్ రోజుకొకరు చొప్పున ఆసుపత్రి పాలవుతున్నారు. ఇద్దరు మహిళా కానిస్టేబుల్స్ సృహతప్పి పడిపోయారు. వీరిని స్థానిక ప్రయివేటు ఆసుపత్రికి తరలించారు. పోలీసు శిక్షణను తట్టుకోలేక ట్రైనీ కానిస్టేబుళ్లు స్పృహ తప్పిపడిపోయారా? లేక సరైన పౌష్టికాహారం లేకపోవడం వల్ల పడిపోయారా? అన్నది తెలియడంలేదు.
ఏది ఏమైనా ఇలా రోజుకొకరు ఆస్పత్రిపాలు కావడంతో పోలీస్ ఉన్నతాధికారులు ఆందోళన చెందుతున్నారు. తమమీదకు ఎక్కడ వస్తుందోనని వారు భయపడుతున్నారు.