training session
-
ప్రారంభంకానున్న క్యాంప్.. శిక్షణలో 13 మంది
కొలంబొ: కరోనా వైరస్ లాక్డౌన్ కారణంగా మార్చి చివరి వారం నుంచి ప్రపంచ వ్యాప్తంగా ఎలాంటి క్రికెట్ టోర్నీలు జరగలేదు. అయితే అనేక దేశాలు లాక్డౌన్ సడలింపులు ఇస్తున్న నేపథ్యంలో క్రికెట్ పునరుద్దరణకు బాటలు పడుతున్నాయి. ప్రస్తుత పరిస్థితులను పరిశీలిస్తుంటే త్వరలోనే క్రికెట్ మ్యాచ్‌లు జరిగే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) బౌలర్ల కోసం ప్రత్యేకంగా శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేసింది. ఇంగ్లండ్ బాటలో మరిన్ని దేశాలు పయనించేందుకు సిద్దమవుతున్నాయి. (‘ఇదేందయ్య ఇది.. నేనెప్పుడు చూడలేదు’) తాజాగా శ్రీలంక తమ ఆటగాళ్ల కోసం ముఖ్యంగా బౌలర్ల కోసం ట్రెయినింగ్ సెషన్ ఏర్పాటు చేసింది. ఈ శిక్షణా శిబిరం సోమవారం నుంచి ప్రారంభం కానుందని, ఇందులో 13 మంది క్రికెటర్లు పాల్గొంటున్నారని శ్రీలంక క్రికెట్ బోర్డు తెలిపింది. కొలంబో క్రికెట్ క్లబ్లో 12 రోజుల పాటు సాగనుందని వివరించింది. అంతేకాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని పేర్కొంది. ఇక అన్నీ కుదిరితే జులైలో స్వదేశంలో టీమిండియాతో వన్డే/టీ20 సిరీస్ నిర్వహించాలని శ్రీలంక భావిస్తోంది. అయితే కరోనా పరిస్థితులు, అంతర్జాతీయ సర్వీసుల పునరుద్దరణ తర్వాతే తమ నిర్ణయం ఏంటో చెప్పగలమని బీసీసీఐ తేల్చిచెప్పింది. ఇక దక్షిణాఫ్రికా కూడా క్రికెట్ పునరుద్దరణ చర్యలు చేపట్టింది. ఒకరితో ఒకరికి సంబంధం లేకుండా వేర్వేరు మైదానాల్లో తమ ఆటగాళ్ల కోసం ట్రైయినింగ్ సెషన్స్ ఏర్పాటు చేయాలని దక్షిణాఫ్రికా భావిస్తోంది. (సచిన్ ఈ రికార్డును తిరగరాయ్.. యువీ ఛాలెంజ్) -
ట్రైనింగ్ సెషన్లో గాయపడిన అశ్విన్
బెంగళూరు: వెస్టిండీస్ పర్యటనకు వెళ్లే ముందు టీమిండియాకు ప్రతికూలత ఎదురైంది. భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ గాయపడ్డాడు. బెంగళూరు జాతీయ క్రికెట్ అకాడమీలో నిర్వహించిన భారత క్రికెట్ శిక్షణ శిబిరంలో చివరి రోజు అశ్విన్ చేతికి గాయమైంది. చీఫ్ కోచ్ అనిల్ కుంబ్లే పర్యవేక్షణలో భారత టెస్టు జట్టు క్రికెటర్లు ప్రాక్టీస్ చేశారు. ట్రైనింగ్ సెషన్లో అశ్విన్ కుడిచేతికి బంతి తగలడంతో గాయపడినట్టు క్రికెట్ వర్గాలు తెలిపాయి. దీంతో అతను ట్రైనింగ్ సెషన్ నుంచి వైదొలిగాడు. వెస్టిండీస్ పర్యటనలో టీమిండియా తరపున కీలక పాత్ర పోషిస్తాడని భావిస్తున్న అశ్విన్ గాయపడటం ఆందోళన కలిగించే విషయం. ఈ నెల 21 నుంచి వెస్టిండీస్‌లో జరిగే నాలుగు టెస్టుల సిరీస్‌లో టీమిండియా ఆడనుంది. -
ప్రాక్టీస్‌కు ధోనీ దూరం
ఢాకా: ఆసియా కప్‌లో భాగంగా పాకిస్తాన్‌తో మ్యాచ్‌కు ముందు రోజు శుక్రవారం ప్రాక్టీస్ సెషన్‌కు టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ గైర్హాజరయ్యాడు. కండరాల నొప్పితో బాధపడుతున్న ధోనీ విశ్రాంతి తీసుకున్నాడు. ధోనీతో పాటు సీనియర్ పేసర్ ఆశీష్ నెహ్రా కూడా ప్రాక్టీస్‌కు దూరంగా ఉన్నాడు. ఆసియా కప్ ఆరంభానికి ముందే ధోనీ గాయపడిన సంగతి తెలిసిందే. దీంతో కీపర్/బ్యాట్స్‌మన్ పార్థివ్ పటేల్‌ను జట్టులోకి తీసుకున్నారు. ధోనీ పూర్తిగా కోలుకోకున్నా బంగ్లాదేశ్‌తో జరిగిన ఆరంభ మ్యాచ్‌లో ఆడాడు. అయితే పాక్‌తో మ్యాచ్‌కు ముందు ధోనీ ప్రాక్టీస్‌కు దూరంగా ఉండటంతో ఈ మ్యాచ్‌లో ఆడుతాడా లేదా అనేది కచ్చితంగా తెలియరాలేదు. ఈ మ్యాచ్‌కు ధోనీ దూరమైతే అతని స్థానంలో పార్థివ్ తుది జట్టులోకి రానున్నాడు. శనివారం రాత్రి 7 గంటల నుంచి భారత్, పాక్‌ల మధ్య మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసిందే.