ప్రాక్టీస్కు ధోనీ దూరం
ఢాకా: ఆసియా కప్లో భాగంగా పాకిస్తాన్తో మ్యాచ్కు ముందు రోజు శుక్రవారం ప్రాక్టీస్ సెషన్కు టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ గైర్హాజరయ్యాడు. కండరాల నొప్పితో బాధపడుతున్న ధోనీ విశ్రాంతి తీసుకున్నాడు. ధోనీతో పాటు సీనియర్ పేసర్ ఆశీష్ నెహ్రా కూడా ప్రాక్టీస్కు దూరంగా ఉన్నాడు.
ఆసియా కప్ ఆరంభానికి ముందే ధోనీ గాయపడిన సంగతి తెలిసిందే. దీంతో కీపర్/బ్యాట్స్మన్ పార్థివ్ పటేల్ను జట్టులోకి తీసుకున్నారు. ధోనీ పూర్తిగా కోలుకోకున్నా బంగ్లాదేశ్తో జరిగిన ఆరంభ మ్యాచ్లో ఆడాడు. అయితే పాక్తో మ్యాచ్కు ముందు ధోనీ ప్రాక్టీస్కు దూరంగా ఉండటంతో ఈ మ్యాచ్లో ఆడుతాడా లేదా అనేది కచ్చితంగా తెలియరాలేదు. ఈ మ్యాచ్కు ధోనీ దూరమైతే అతని స్థానంలో పార్థివ్ తుది జట్టులోకి రానున్నాడు. శనివారం రాత్రి 7 గంటల నుంచి భారత్, పాక్ల మధ్య మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసిందే.