Transco authorities
-
పేదింట వెలుగులు!
సాక్షి, ఊర్కొండ: గ్రామీణ ప్రాంతాల పేదల ఇళ్లలో వెలుగు నింపాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి దీన్‌దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ జ్యోతి యోజన పథకం ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా దరఖాస్తు చేసుకున్న అన్ని కులాల నిరుపేదలకు రూ.125లకే విద్యుత్ మీటరు కనెక్షన్ ఇస్తున్నారు. రూ.125 కూడా దరఖాస్తు చేసుకునేందుకు అయ్యే ఖర్చు మాత్రమే. ఈ పథకాన్ని మార్చి 31వరకు పొడిగించినట్లు ట్రాన్స్‌కో అధికారులు తెలిపారు. లబ్ధిదారులు ఆధార్‌కార్డు జిరాక్స్, రెండు ఫొటోలు, ఫోన్ నంబర్‌తో సంబంధిత విద్యుత్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి. విచారణ అనంతరం విద్యుత్ మీటర్‌తో పాటు ఉచితంగా విద్యుత్ కనెక్షన్ ఇస్తారు. అనంతరం సంబంధిత విద్యుత్ శాఖ అధికారులు విచారణ జరిపి విద్యుత్ మీటర్ ఏర్పాటు చేసి సర్వీస్ వైరు, మీటర్, స్విచ్ బోర్డు, ఎల్ఈడీ బల్బు, ఎర్తింగ్ తదితర కనెక్షన్లు ఉచితంగా ఇస్తారు. సింగిల్ ఫేస్ ట్రాన్స్ఫార్మర్ల బిగింపు గ్రామాల్లో విద్యుత్ లో–ఓల్టేజీ లేకుండా ఇప్పటికే కొత్త మీటర్లు ఏర్పాటు చేస్తున్న వీధుల్లో ట్రాన్స్‌కో అధికారులు సింగిల్ ఫేజ్, త్రీ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్లు సమకూరుస్తున్నారు. దీన్‌దయాళ్ పథకం కింద విద్యుత్ కనెక్షన్ ఇవ్వడంతో పాటు కొన్ని గ్రామాల్లో లో–ఓల్టేజీ సమస్యను అధిగమించేందుకు ఈ ట్రాన్స్ఫార్మర్లు ఉపయోగపడనున్నాయి. ధ్రువీకరణ పత్రం తప్పనిసరి దీన్‌దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ జీవన్‌జ్యోతి పథకం కోసం దరఖాస్తు చేసుకునే ఎస్సీ, ఎస్టీలకు కుల ధ్రువీకరణ పత్రాలు సమర్పిస్తే సరిపోతుంది. వారికి ఉచితంగానే కనెక్షన్ ఇచ్చి ప్రతినెలా వారి బిల్లులో రూ.5 అదనంగా వసూలు చేస్తారు. ఇలా రూ.125 అయ్యేవరకు ఉంటుంది. 100 యూనిట్లు వాడుకునేందుకు ప్రభుత్వం వారికి సబ్సిడీ కల్పిస్తుందని, గతంలో విద్యుత్ కనెక్షన్ తీసుకున్న వారు ఎస్సీ, ఎస్టీలు అయితే కుల ధ్రువీకరణ పత్రం సమర్పిస్తే వారిని 100 యూనిట్ల సబ్సిడీలో చేర్చే అవకాశం ఉంటుంది. ఇతర కులాలకు చెందిన నిరుపేదలకు కూడా రూ.125లకే మీటర్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. సద్వినియోగం చేసుకోవాలి కరెంట్ మీటర్ లేని నిరుపేదలంతా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మండలంలో ఇప్పటికే 1000 మీటర్ల దాకా బిగించాం. మీటర్లు బిగించిన చోట లోఓల్టేజీ రాకుండా సింగిల్, త్రీ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేశాం. దాదాపు మండలంలోని అన్ని గ్రామాల్లో ప్రతి ఇంటిలో వెలుగులు నింపాం. ఇంకా కావాల్సిన వారు దరఖాస్తు చేసుకుంటే తక్షణమే మీటర్లు ఏర్పాటు చేస్తాం. – రవి, ఏఈ, ఊర్కొండ -
చీకట్లో కోడుమూరు
- కరెంట్ బకాయి చెల్లించలేదని పట్టణానికి విద్యుత్ సరఫరా నిలిపివేత - అప్పుల్లో మేజర్ పంచాయతీ - జీతాలు చెల్లించలేని దుస్థితి - భారమైన నిర్వహణ కోడుమూరు: పట్టణంలో వీధిలైట్లు వెలగక ప్రజలు చీకట్లో మగ్గిపోతున్నారు. విద్యుత్ బకాయిలు చెల్లించలేదని ఈ నెల 23న ట్రాక్స్‌కో అధికారులు పంచాయతీ కార్యాలయానికి, వీధిలైట్లకు విద్యుత్ సరఫరాను నిలిపి వేశారు. దీంతో రెండు రోజులుగా కోడుమూరు పట్టణం చీకటిమయమైంది. రాత్రి గాడాంధకారంలో జనం బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. విద్యుత్ పునరుద్ధరణ కోసం సర్పంచ్ సిబి.లత ట్రాక్స్‌కో ఎస్ఈని సంప్రదించినప్పటికి ఫలితం లేకపోయింది. బకాయి పడ్డ రూ.80 లక్షలు చెల్లిస్తేగానీ విద్యుత్ సరఫరా పునరుద్ధరించమని అధికారులు తేల్చి చెప్పారు. పంచాయతీ పరిధిలో ఐదేళ్లుగా విద్యుత్ బకాయిలు పేరుకుపోయాయి. ఈ మొత్తానికి నెలనెలా ట్రాక్‌కో అధికారులు వడ్డీ వేస్తున్నారు. పంచాయతీకి వివిధ పన్నుల రూపంలో ఏటా రూ.60 లక్షలు ఆదాయం లభిస్తోంది. ట్రాక్టర్ నిర్వహణ, శానిటేషన్ సిబ్బంది, వాటర్ వర్కర్లు, వీధిలైట్లు వేసే సిబ్బంది జీతాలు ఏడాదికి రూ.28 లక్షలు అవసరమవుతోంది. విద్యుత్ బిల్లు నెలకు రూ.4.5 లక్షల ప్రకారం సంవత్సరానికి రూ.54 లక్షలు విద్యుత్ చార్జీలే చెల్లించాల్సిన పరిస్థితి ఉంది. ప్రతి ఏటా జీతాలు, విద్యుత్ బిల్లుల కోసం రూ.82 లక్షలు ఖర్చవుతోంది. ఆదాయం రూ.60 లక్షలు కాగా ఇంకా దాదాపు రూ.22 లక్షలు ప్రతి ఏటా పంచాయతీకి లోటు బడ్జెట్ ఏర్పడుతోంది. ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుని బకాయి ఉన్న రూ.80 లక్షలు మాఫీ చేస్తే తప్పా కోడుమూరు గ్రామపంచాయతీ పరిధిలో అభివృద్ధి పనులు జరుగవని సర్పంచ్ సిబి.లత కోరారు. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో తాగునీటికి సమస్య తలెత్తింది. -
పంటెండిపాయే
నిజామాబాద్ అర్బన్, న్యూస్‌లైన్: పది రోజులుగా ఎండల తీవ్రత పెరగడంతో వరి పంటలు నీరు లేక ఎండిపోతున్నాయి. దీనికి తోడు ట్రాన్స్‌కో అధికారులు ఇష్టారీతిన కోతలు విధిస్తున్నారు. ఏ సమ యంలో కరెంటు వస్తుందో తెలియక రైతులు అయోమయం చెందుతున్నారు. వ్యవసాయానికి ఏడు గంటల ఉచిత కరెంటు అందించాల్సి ఉండగా ట్రాన్స్‌కో అధికారులు అధికారికంగా ఐదు గంటలుగా నిర్ణయించి కోతలు విధించారు. ఈ ఐదు గంటలు కూడా కరెంటు సరఫరా చేయడం లేదు. అనధికారికంగా కోతలు విధిస్తూ వ్యవసా యానికి మూడు గంటలే కరెంటు ఇస్తున్నారు. ట్రాన్స్‌కో ప్రకటించిన ప్రకారమే జిల్లాలో నాలుగు గ్రూపులుగా విభజించి ఐదు గంటల పాటు కరెంటు అందించాల్సి ఉంది. మొదటి గ్రూపులో తెల్లవారు జాము 4.15 గంటల నుంచి ఉదయం 9.15 గంటల వరకు, రెండవ గ్రూపులో ఉదయం 9.15 గంటల నుంచి మధ్యాహ్నం 2.15 గంటల వరకు, మూడవ గ్రూపులో మధ్యాహ్నం 2.15 గంటల నుంచి సాయంత్రం 7.15 గంటల వరకు , 4వ గ్రూపులో రాత్రి 9.15 గంటల నుంచి అర్ధరాత్రి దాటిన తర్వాత 2.15 గంటల వరకు జిల్లాలోని వివిధ ప్రాం తాల్లో కరెంటును సరఫరా చేయాల్సి ఉంది.ఐదు గంటల చొప్పున అందించాల్సిన కరెంటులో రెండు గంటల కోతను అధికారులు విధిస్తున్నారు. జిల్లాలో ఈ రబీ సీజన్ లో 1.25 లక్షల హెక్టార్లలో వరి పంట సాగవుతోంది. ప్రస్తుతం వరి కొన్ని ప్రాంతాల్లో పొట్టదశలో ఉండగా మరికొన్ని ప్రాంతాల్లో 20 రోజుల్లో చేతికొచ్చే విధంగా ఉంది. పొట్టదశలో ఉన్న వరికి నీరు చాలా అవసరం కాగా, ఈ సమయంలో కరెంటు కోతల ప్రభావం తీవ్రంగా పడుతోంది. కష్టించి నాట్లు వేసిన రైతులు చేతికొచ్చే సమయంలో వరి పంట ఎండిపోవడంతో బేజారవుతున్నారు. సిరికొండ మండలంలో కొండపూర్ గ్రామానికి చెందిన రైతు మొగిలి సాయిలు నాలుగు రోజుల క్రితం తీవ్ర వేదనతో వరి పంటకు నిప్పుపెట్టుకున్నారు. ట్రాన్స్ఫార్మర్ చెడిపోయి కరెంటు సక్రమంగా సరఫరా కాకపోవడంతో కళ్లముందే పంట ఎండిపోవడం చూడలేక రైతు ఈ చ ర్యకు పాల్పడ్డాడు. కరెంటు కోతలను నిరసిస్తూ కామారెడ్డి మండలం గర్గుల్‌లో రైతులు ప్రధాన రహదారిపై ధర్నా చేశారు. వ్యవసాయ రంగానికి ఏడు గంటల పాటు సరఫరా చేయాలని వారు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో క్రాఫ్ హాలిడే ప్రకటిస్తామని హెచ్చరించారు. పిట్లం మండలంలోని చిల్లర్గి సబ్‌స్టేషన్‌ను ఆ గ్రామ రైతులు ముట్టడించారు. ఎడాపెడా కరెంటు కోతల కారణంగా పంటలు ఎండిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రెండు రోజుల క్రితం భీంగల్ మండలంలో రైతులు కరెం టు సరఫరా కోసం ఆందోళన చేశారు. ఇదిలా ఉండగా జిల్లాలో కరెంటు కోతల తీవ్రత మరింత పెరిగే ప్రమాదం ఉందని ట్రాన్స్‌కో వర్గాలు పేర్కొంటున్నాయి. నీటి కాలువలు లేని కామారెడ్డి, ఎల్లారెడ్డి, భీంగల్ తదితర ప్రాంతాల్లో కరెంటు కోతలు పంటకు మరింత దుర్గతి పట్టించవచ్చని అంటున్నారు. పంటలను నష్టపోనీయం వ్యవసాయ రంగానికి కరెంటు సరఫరాలో కొద్ది పాటి ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. నాలుగు రోజుల క్రితం వేయి మెగావాట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. త ర్వాత పునరుద్ధరించాం. వరి పంటలను నష్టపోనీయకుండా కరెంటు సరఫరా చేస్తాం. జిల్లాలో వరి పంటలు ఎండిపోతున్నట్లు నా దృష్టికి తీసుకువస్తే అక్కడ కరెంటు సరఫరాను పరిశీలించి సరఫరా చేయిస్తాం. వీలైనంత వరకు ఐదు గంటల పాటు ఖచ్చితంగా కరెంటు సరఫరా చేస్తాం.