Transfers of officials
-
మాకు ఈ ఖర్మేంటి?!
సాక్షి, అమరావతి: బదిలీల కోసం రెండేళ్లుగా ఎదురు చూస్తున్న వాణిజ్య శాఖ ఉద్యోగుల ఆశలపై ప్రభుత్వం నీళ్లు జల్లింది. గతేడాది జీఎస్టీ అమలుకు ఇబ్బందులొస్తాయని భావించిన ప్రభుత్వం వీరి బదిలీలను నిలిపివేసింది. ఈ ఏడాదైనా బదిలీలు చేస్తారు కదా అని ఎదురుచూస్తున్న వారు.. సాధారణ బదిలీలకు అవకాశం ఇవ్వకుండా పరిమితులు విధించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేవలం పరస్పర అంగీకారం, రిక్వెస్ట్ బదీలకు మాత్రమే అనుమతిస్తూ జీవో ఇవ్వడంపై మండిపడుతున్నారు. ఖర్చులు తగ్గించుకునేందుకు ప్రభుత్వం ఎత్తుగడ! వాణిజ్య శాఖలో 557 గెజిటెడ్ ఆఫీసర్లు, 102 సర్కిల్స్‌లోని సిబ్బందిలో 80 శాతం మందికిపైగా ఉద్యోగులు అయిదేళ్లు దాటినా ఒకే చోట పనిచేస్తున్నారు. ఇలా ఒకే వ్యక్తి ఒకేచోట ఎక్కువ కాలం పనిచేస్తే డీలర్లతో పరిచయాలు పెరిగి అది వసూళ్లపై కూడా ప్రభావం చూపుతుందంటున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం ఖర్చులు టీఏ, డీఏ ఖర్చులు తగ్గించుకోవడానికే ఈ ఎత్తుగడ వేసిందని ఉద్యోగులు విమర్శిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు అటు పిల్లల చదువుల పరంగా, ఇటు ఆర్థికంగా నష్టపోతున్నారని వాణిజ్య శాఖ ఉద్యోగ సంఘం చెబుతోంది. కొంతమంది గ్రామీణ ప్రాంతానికి బదిలీ అయి, పిల్లల చదువుల కోసం చాలామంది కుటుంబాలకు దూరంగా ఉంటున్నారు. కానీ గడిచిన నాలుగేళ్లుగా 20 శాతానికి మించి ఉద్యోగులకు బదిలీలు చేయకపోవడం, గతేడాది అసలు పూర్తిగా లేకపోవడంతో వీరు ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో పనిచేసే ఉద్యోగులకు ఇంటి అద్దె అలవెన్సు ఎక్కువని, అలాగే అమరావతి పరిధిలో పనిచేసే వారికి సిటీ కాంపెన్సేటరీ అలవెన్స్(సీసీఏ) అదనంగా లభిస్తుందని.. అయితే గ్రామీణ ప్రాంతంలో దీర్ఘకాలంగా పనిచేస్తున్న ఉద్యోగులు మాత్రం ఆర్థికంగా నష్టపోతున్నారని చెబుతున్నారు. ఆర్థిక మంత్రిని కలుస్తాం.. వాణిజ్య శాఖలో సాధారణ బదిలీలకు అనుమతించాలని త్వరలోనే ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడుతో పాటు, ఆ శాఖ ప్రధాన కార్యదర్శిని కలిసి విజ్ఞప్తి చేయనున్నట్లు ఆల్ ఇండియా వాణిజ్య పన్నులశాఖ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కె.ఆర్ సూర్యనారాయణ చెప్పారు. ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని సాధారణ బదిలీలకు అనుమతించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. -
గంటా వర్గానికి ముకుతాడు
యనమలకు ఇన్చార్జి బాధ్యతలు మంత్రుల ఆదిపత్యానికి అడ్డుకట్ట యనమలతో అయ్యన్నకు సాన్నిహిత్యం గంటా వర్గానికి ప్రతికూల పరిణామం విశాఖపట్నం : గతేడాది అధికారుల బదిలీల సమయంలో జిల్లా మంత్రులపై వెల్లువెత్తున అవినీతి ఆరోపణలు రాష్ర్ట స్థాయిలో చర్చనీయాంశమయ్యాయి. ఈ ఏడాది ఆ పరిస్థితి తలెత్తకుండా బదిలీల్లో స్థానిక మంత్రుల పెత్తనానికి చెక్ పెట్టేందుకు జిల్లాకో ఇన్చార్జి మంత్రిని నియమించింది. మన జిల్లాకు రాష్ర్ట ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడ్ని నియమించడంతో జిల్లా మంత్రులకు చెక్ పడుతుందో లేక..ఆదిపత్యపోరు మరింత ఆజ్యం పోస్తుందోననే చర్చ పార్టీలో జరుగుతోంది. సాధారణంగా ఎమ్మెల్యేలకు కేటాయించే ఏసీడీపీ, ఎస్డీఎఫ్, సీడీపీ వంటి నిధులను ఖర్చు చేసే విషయంలో పెత్తనం జిల్లా ఇన్చార్జి సాక్షి, విశాఖపట్నం: విశాఖ మహానగరంతో పాటు జిల్లాలోని ఎనిమిది మండలాల్లో తీరం ఉంది. 134 కిలోమీటర్ల తీర ప్రాంతంలో 62 మత్స్యకార గ్రామాలున్నాయి. సుమారు లక్షా 20 వేల మంది మత్స్యకారులున్నారు. వీరిలో సుమారు 35వేలమంది పూర్తిగా చేపలవేటే జీవనోపాధిగా జీవిస్తున్నారు. 650 మెక నైజ్డ్ బోట్లు, 1500కు పైగా ఇంజన్ బోట్లు ఉన్నాయి. వందలాదిగా తెప్పలు,నావలు ఉన్నాయి. వేట నిషేధ సమయంలో మెకనైజ్డ్, ఇంజన్ బోట్లు లంగరేయాల్సిందే. మెకనైజ్డ్ బోటుపై 8 నుంచి 10 మంది, ఇంజన్ బోటుపై ఆరు నుంచి ఎనిమిది మంది వరకు మత్స్యకారులు పని చేస్తుంటారు. ఇక పరోక్షంగా మరో 10వేల నుంచి 15వేల మంది వరకు జీవనోపాధి పొందుతుంటారు. ప్రతీ ఏటా ఏప్రిల్-15వ తేదీ నుంచి మే-31వ తేదీ వరకు వేట నిషేధం అమలులో ఉండేది. గతేడాది వరకు 47రోజులు పాటు ఉండే వేటనిషేధ సమయాన్ని ఈ ఏడాది నుంచి ఏకంగా 61రోజులకు పెంచారు. గతంలో నిషేధ సమయంలో కుటుంబానికి 31 కిలోల బియ్యంతో సరిపెట్టేవారు. ఏటా నిషేధ సమయంలో జీవనోపాధి కోల్పోయే మత్స్యకారుల జాబితాలు మారుతుంటాయి. కొన్ని సార్లు పెరుగుతుంటాయి.. మరి కొన్ని సార్లు తగ్గుతుంటాయి. అలాంటిది గతేడాది మంజూరైన సాయం ఈ ఏడాది పంపించడం.. ఈ ఏడాది సాయం వచ్చే ఏడాది పంచిపెట్టడం పరిపాటిగా మారిపోయింది. గతేడాది నిషేధ సమయంలో జీవనోపాధి కోల్పోయిన మత్స్యకారులకు నేటికీ బియ్యం పంపిణీ జరగలేదు. ఇక ఈ ఏడాది నుంచి నిషేధసమయం పెంచడంతో బియ్యం స్థానంలో నగదు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కుటుంబానికి రూ.2వేల చొప్పున వారి బ్యాంకు ఖాతాలోనే జమచేయనున్నారు. నిషేధం అమలు లోకి వచ్చిసగం రోజులు గడిచినా అది ఇంకా ప్రతిపాదనల దశలోనే ఉంది. మెకనైజ్డ్, ఇంజన్ బోట్లపై ఆధారపడి జీవించే సుమారు ఐదువేల మంది మత్స్యకారులతో పాటు వీటిపై పరోక్షంగా ఆధారపడిజీవించే మరో 15వేల మంది మత్స్యకారులకు లబ్ధి చేకూర్చే విధంగా రూ.4కోట్లతో జిల్లా మత్స్యశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ఆర్థిక లోటు కారణంగా ఈ ప్రతిపాదనలు కార్యరూపం దాల్చలేదు. దీంతో సాపాటు లేక..సాయం లేక గంగపుత్రులు ఈ ఏడాది పస్తులతో అలమటించాల్సిన పరిస్థితి దాపురించింది. -
సీఎంతో ఖడ్సేకు విభేదాలు..?
సాక్షి, ముంబై: రాష్ట్ర బీజేపీలో అప్పుడే లుకలుకలు మొదలయ్యాయనే ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఇటీవల ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ 42 మంది ఉన్నతస్థాయి అధికారులను బదిలీ చేసిన సంగతి తెలిసిందే . ఈ సమయంలో విభేదాలు మరింత ముదిరినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ తీరుపై పార్టీ సీనియర్ మంత్రి ఏక్నాథ్ ఖడ్సే గుస్సాగా ఉన్నట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. అధికారుల బదిలీల నేపథ్యంలో రెవెన్యూ శాఖ ప్రధాన కార్యదర్శిగా మనుకుమార్ శ్రీవాస్తవ్ మంగళవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ బదిలీ ప్రక్రియను వ్యతిరేకిస్తూ సీఎంకు రెవెన్యూ శాఖ మంత్రి ఏక్నాథ్ ఖడ్సే లేఖను రాసినట్లు వార్తలు గుప్పుమన్నాయి. దాంతో తాను బదిలీలకు సంబంధించి సీఎంకు ఎటువంటి లేఖ రాయలేదని ఖడ్సే వివరణ ఇవ్వాల్సి వచ్చింది. కాగా, ఖడ్సే ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయలేదని, ఆయన మా పార్టీ సీనియర్ నాయకుడని దీంతో తాము కీలక నిర్ణయాలు తీసుకునేముందు ఆయనతో కూడా చర్చలు జరిపామని సీఎం స్పష్టంచేశారు. ఇదిలా ఉండగా, మరోవైపు మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా కేంద్ర సహకార మంత్రి రావ్‌సాహెబ్ దానవే పేరును ప్రకటించడంపై కూడా ఖడ్సే అసంతృప్తి వ్యక్తంచేసినట్లు సమాచారం. -
బదిలీలపై అసమ్మతి సెగలు
సాక్షి ప్రతినిధి, విజయనగరం: జిల్లాలో అధికారుల బదిలీలపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజాప్రతినిధులపై ఆ పార్టీ నేతలే ఆరోపణలు, విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. సహజంగా బది‘లీలల’పై ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పిస్తాయి. ముడుపులు తీసుకుని నచ్చినవారికి పోస్టింగ్లిచ్చారని మండిపడతాయి. గతంలో ఇలాంటి సంఘటనలు ఎన్నో జరిగాయి. కానీ ఇప్పుడు అధికార పక్షమే విపక్షంగా తయారైంది. వారి మధ్య నెలకొన్న అంతర్గత పోరు బదిలీల వ్యవహారంతో తారస్థాయికి చేరింది. తనను వ్యతిరేకిస్తున్న నేతలు సిఫారసు చేసిన అధికారులకు పోస్టింగ్లిస్తే భవిష్యత్‌లో ముప్పు వస్తుందనే ఉద్దేశంతో మంత్రి తన పవర్‌ను ఉపయోగించి వాటిని నిలిపివేశారు. అయితే తాము సూచించిన వారి పేర్లను కనీసం పరిశీలించలేదన్న ఆవేదనతో పలువురు ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు మంత్రి మృణాళిని లక్ష్యంగా చేసుకుని తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బదిలీల ప్రక్రియలో చేతులు మారిన ముడుపులు, ఇతరత్రా వ్యవహారాలన్నీ బయట పెడుతున్నారు. కొందరైతే ఏకంగా మంత్రిని లక్ష్యంగా చేసుకుని పావులు కదుపుతున్నారు. గత ప్రభుత్వ పెద్దలతో కుమ్మకై అప్పట్లో హవా సాగించిన అధికారులను తీసుకొచ్చి పరోక్షంగా సహకరించారన్న వాదనలను తెరపైకి తీసుకొస్తున్నారు. మరికొందరైతే సత్తిబాబు టీమ్‌ను తెచ్చారని బాహాటంగా విమర్శలు గుప్పిస్తున్నారు. ఆ మధ్య జెడ్పీ గెస్ట్ హౌస్‌లో రహస్యంగా సమావేశం ఏర్పాటు చేశామని, ఇప్పుడేకంగా బహిరంగ పోరుకు సన్నద్ధమని సవాల్ విసురుతున్నారు. మంత్రికి వ్యతిరేకంగా అసమ్మతి వాదులంతా ఒక్కటవుతున్నారు. తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. జిల్లాకొచ్చిన అధికారులెవరు? గతంలో వారి పనితీరు? వారిపై ఉన్న ఆరోపణలు? ఎవరికి అనుకూలంగా వ్యవహరించారు ? తదితర వివరాలను సేకరించి తొలుత అశోక్ గజపతిరాజు వద్ద పెడతామని, ఆ తర్వాత సీఎం వద్ద పంచాయతీ (పంచాయితీ) పెడతామని చెబుతున్నారు. ఇంక వేచి చూడలేమని, ఏదోకటి తేల్చుకుంటామని అంటున్నారు. ఇదెంతవరకు వెళ్తుందో? లేదంటే మేకపోతూ గాంభీర్యంగా మిగిలిపోతుందో వేచి చూడాలి. -
ఏపీలో ఎస్పీల బదిలీలు
24 మంది ఐపీఎస్‌లను బదిలీ చేసిన ప్రభుత్వం పోస్టింగ్స్ పొందిన ఎస్పీల్లో బయటి రాష్ట్రాలవారూ.. ‘రోస్టర్ విధానం’తో కేడర్ మారితే మరోసారి బదిలీలు హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక తొలిసారిగా ఎస్పీ స్థాయి అధికారుల బదిలీలు జరిగాయి. మొత్తం 13 జిల్లాలు, మూడు అర్బన్ జిల్లాల అధికారులతోసహా 24 మంది ఐపీఎస్‌లకు స్థానచలనం కల్పిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. వీరిలో 11 మంది డెరైక్ట్ ఐపీఎస్‌లు కాగా... మిగిలినవారు కన్ఫర్డ్ ఐపీఎస్‌లు. డెరైక్ట్ అధికారుల్లో ఐదుగురు ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు చెందిన రాష్ట్రేతర అధికారులు కూడా ఉన్నారు. వీరిలో గ్రేవల్ నవ్‌దీప్‌సింగ్(స్వస్థలం పంజాబ్), తఫ్సీర్ ఇక్బాల్(జార్ఖండ్), ఎస్.సెంథిల్‌కుమార్(తమిళనాడు), నవీన్ గులాటి(గుజరాత్)లను నాలుగు జిల్లాలకు ఎస్పీలుగా నియమించారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఇరు రాష్ట్రాల మధ్య ఐపీఎస్ అధికారుల పంపిణీకోసం ఏర్పాటైన ప్రత్యుష సిన్హా కమిటీ సిఫార్సులు మరో నెల రోజుల్లో అమల్లోకి రానున్నాయి. వీటిప్రకారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో పనిచేస్తున్న రాష్ట్రేతర అధికారుల్ని రోస్టర్ పద్ధతిలో పంచుతారని తెలుస్తోంది. ఇది అమలైతే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో పనిచేస్తున్న రాష్ట్రేతర అధికారులను వేరే రాష్ట్రానికి కేటాయించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కేడర్లు మారితే నెల రోజుల తరువాత మరోసారి ఐపీఎస్‌ల బదిలీలు చేపట్టే అవకాశముంది. మరోవైపు తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ప్రధాన విజిలెన్స్ అండ్ భద్రతా అధికారిగా పనిచేస్తున్న జి.శ్రీనివాస్‌ను చిత్తూరు ఎస్పీగా నియమించిన ప్రభుత్వం టీటీడీలో ఎవరికీ పోస్టింగ్ ఇవ్వలేదు. ప్రస్తుతం గుంటూరు రూరల్, రాజమండ్రి అర్బన్, ప్రకాశం, కృష్ణా జిల్లాల్లో ఎస్పీలుగా పనిచేస్తున్న అధికారుల్ని ప్రాధాన్యం లేని పోస్టుల్లోకి మార్చింది.