Transport aircraft
-
మహీంద్రాతో ఎంబ్రేయర్ భాగస్వామ్యం
ముంబై: భారత వైమానిక దళం కోసం సీ–390 మిలీనియం మల్టీ మిషన్ రవాణా విమానాల కొనుగోళ్లకు సంబంధించిన మీడియం ట్రాన్స్పోర్ట్ ఎయిర్‌క్రాఫ్ట్ (ఎంటీఏ) ప్రాజెక్ట్ కోసం ఎంబ్రేయర్ డిఫెన్స్, సెక్యూరిటీ తాజాగా మహీంద్రా గ్రూప్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. న్యూఢిల్లీలోని బ్రెజి ల్ దౌత్య కార్యాలయంలో ఈ మేరకు ఒప్పందంపై ఇరు సంస్థలు శుక్రవారం సంతకాలు చేశాయి. ఎంటీఏ ప్రాజెక్టులో భాగంగా తయారీ వ్యవస్థను అభివృద్ధి చేయడానికి దేశీయంగా ఉన్న ఏరోస్పేస్ పరిశ్రమతో ఎంబ్రేయర్, మహీంద్రా సంప్రదింపులు జరుపనుంది. సీ–390 విమానాల విషయంలో భవిష్యత్తు కేంద్రంగా భారత్‌ను మార్చగల సామర్థ్యాన్ని ఇరు సంస్థలు అన్వేషిస్తాయి. ‘సీ–390 మిలీనియం మార్కెట్లో అత్యంత అధునాతన మిలిటరీ ఎయిర్‌లిఫ్టర్. ఈ భాగస్వామ్యం ఐఏఎఫ్ కార్యాచరణ నైపుణ్యాన్ని పెంపొందిస్తుంది. మేక్ ఇన్ ఇండియా లక్ష్యాలతో సజావుగా సరిపోయే సమర్థవంత పారిశ్రామికీకరణ పరిష్కారాన్ని కూడా అందిస్తుందని నమ్ముతున్నాము’ అని మహీంద్రా ఏరోస్పేస్, డిఫెన్స్ బిజినెస్ ప్రెసిడెంట్ వినోద్ సహాయ్ ఈ సందర్భంగా తెలిపారు. కాగా, మీడియం ట్రాన్స్పోర్ట్ ఎయిర్‌క్రాఫ్ట్ (ఎంటీఏ) కొనుగోలు ప్రాజెక్టులో భాగంగా భారత వైమానిక దళం (ఐఏఎఫ్) 40 నుంచి 80 విమానాలను కొనుగోలు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇందుకోసం భారత్‌కు సాంకేతిక బదిలీతోపాటు తయారీ వ్యవస్థ ఏర్పాటు కానుంది. 18 నుంచి 30 టన్నుల వరకు బరువు మోయగల విమానాలను ఐఏఎఫ్ సేకరించనుంది. -
కాబూల్ నుంచి భారతీయ సిబ్బంది వెనక్కి
న్యూఢిల్లీ: తాలిబన్ల వశమైన అఫ్గాన్‌లో పరిస్థితులు దారుణంగా మారడంతో కాబూల్‌లో భారత రాయబారిని, ఇతర దౌత్య సిబ్బందిని కేంద్రం సురక్షితంగా వెనక్కి తీసుకువచ్చింది. దౌత్య సిబ్బందిని తీసుకువచ్చిన భారత వైమానిక దళానికి చెందిన సి–17 రవాణా విమానంలో మొత్తం 150 మంది దౌత్యవేత్తలు, అధికారులు, భద్రతా సిబ్బందిని తీసుకువచ్చారు. దేశ రాజధాని న్యూఢిల్లీలోని హిండెన్ విమానాశ్రయంలో మంగళవారం సాయంత్రం 5 గంటలకు ఈ విమానం ల్యాండయింది. అంతకు ముందే మరో విమానంలో 40 మంది భారత్‌కి చేరుకున్నారు. (చదవండి: తాలిబన్లు సంచలన ప్రకటన) దీంతో అఫ్గాన్ నుంచి దౌత్య సిబ్బంది తరలింపు పూర్తయిందని భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. ఇప్పుడు తమ దృష్టి అంతా అక్కడున్న భారతీయుల్ని తీసుకురావడంపైనే ఉందని స్పష్టం చేసింది. ఢిల్లీకి చేరుకోవడానికి ముందు ఉదయం ఇంధనం నింపుకోవడానికి గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో విమానం కాసేపు ఆగింది. అఫ్గానిస్తాన్‌లో భారత రాయబారి రుద్రేంద్ర టాండన్ జామ్‌నగర్‌లో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ కాబూల్ అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉందని అన్నారు. అఫ్గాన్‌లో ఇంకా చాలా మంది భారతీయులు ఉన్నారని వారిని వెనక్కి తీసుకురావడానికి ఎయిర్ ఇండియా తప్పనిసరిగా విమానాలు నడపాలన్నారు. అయితే తాము అఫ్గాన్ ప్రజల నుంచి దూరమయ్యేమని భావించడం లేదని , వారి సంక్షేమం కోసం ఏదైనా చేస్తామని అన్నారు. వారితో ఏర్పడిన బంధం విడదీయలేదని చెప్పారు. అందుకే వారితో నిరంతరం టచ్‌లో ఉంటామని, పరిస్థితులు ఎలా రూపాంతరం చెందుతాయో చెప్పలేమని టాండన్ పేర్కొన్నారు. ఎదురైన ఎన్నో సవాళ్లు భారతీయ దౌత్య సిబ్బందిని వెనక్కి తీసుకురావడంలో ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి. కాబూల్‌లోని భారత రాయబార కార్యాలయానికి ఇన్నాళ్లూ రక్షణ కల్పించిన ఇండో–టిబెట్ సరిహద్దు భద్రతా సిబ్బంది (ఐటీబీపీ) భద్రత మధ్య వీరు విమానాశ్రయానికి చేరుకున్నారు. భారత్‌కు రావాలనుకునే ప్రయాణికులకు వీసాలు ఇచ్చే కార్యాలయం షహీర్ వీసా ఏజెన్సీపై తాలిబన్లు దాడికి దిగడంతో రెండు విమానాల్లో సిబ్బందిని తీసుకువచ్చారు. తొలివిడతలో ప్రయాణించాల్సిన భారతీయులు కాబూల్ విమానాశ్రయానికి వస్తుండగా తాలిబన్లు అడ్డగించారు. వారి దగ్గరున్న వస్తువులన్నీ లాక్కున్నారు. ఇక రెండో విడత వచ్చిన విమానంలో రాయబారి టాండన్ సహా 30 మంది దౌత్య సిబ్బంది, 99 ఐటీబీపీ కమాండోలు, నలుగురు జర్నలిస్టులతో సహా మొత్తం 21 మంది సాధారణ పౌరులు ఉన్నారు. కాబూల్‌లో పరిస్థితుల్ని సమీక్షిస్తున్నాం: జై శంకర్ మరోవైపు కాబూల్‌లో ఎప్పటికప్పుడు పరిస్థితుల్ని సమీక్షిస్తున్నామని విదేశాంగ మంత్రి జై శంకర్ అన్నారు. ç21 మంది భారత పౌరులను కాబూల్ నుంచి పారిస్‌కు తరలించినందుకు ఫ్రాన్స్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. మన పౌరులను క్షేమంగా తీసుకురండి: ప్రధాని మోదీ అఫ్గానిస్తాన్‌లోని భారత పౌరులందరినీ క్షేమంగా వెనక్కి తీసుకొచ్చేందుకు తక్షణమే చర్యలు చేపట్టాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంబంధిత అధికారులను ఆదేశించారు. భారత్‌కు రావాలని కోరుకుంటున్న అఫ్గాన్‌లోని హిందువులు, సిక్కులకు మన దేశంలో ఆశ్రయం కల్పించాలని చెప్పారు. అఫ్గానిస్తాన్‌ను తాలిబన్లు ఆక్రమించిన నేపథ్యంలో భారత్‌లో భద్రతపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఇందులో భాగంగా మంగళవారం కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ(సీసీఎస్) సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్, ఆర్థిక శాఖ మంత్రి నిర్మల, జాతీయ భద్రతా సలహాదారు దోవల్, విదేశాంగ శాఖ కార్యదర్శి హర్షవర్దన్ల్, అఫ్గానిస్తాన్‌లో భారత రాయబారి రుద్రేంద్ర టాండన్‌లు హాజరయ్యారు. ఎంతో మంది అఫ్గాన్ పౌరులు భారత్ నుంచి సాయం అర్థిస్తున్నారని మోదీ చెప్పారు. వారందరికీ తగిన సాయం అందించాలని సూచించారు. (చదవండి: తాలిబన్ల తొలి మీడియా సమావేశం.. కీలక వ్యాఖ్యలు) -
విమానం జాడపై తొలగని ఉత్కంఠ
ఈటానగర్/న్యూఢిల్లీ: భారత వైమానిక దళానికి చెందిన ఏఎన్–32 రకం రవాణా విమానం ఆచూకీ ఇంకా తెలియరాలేదు. దీనికి సంబంధించి గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. వాయుసేన విమానం జాడ కనిపెట్టేందుకు మంగళవారం భారతీయ నేవీ కూడా రంగంలోకి దిగింది. మొత్తం 13 మందితో వెళ్తున్న ఏఎన్–32 విమానం అస్సాంలోని జోర్హత్ నుంచి టేకాఫ్ అయిన 33 నిమిషాలకే అదృశ్యమైన విషయం తెలిసిందే. అరుణాచల్‌ప్రదేశ్‌లోని మెచుకా ప్రాంతానికి చేరాల్సి ఉండగా, మార్గమధ్యంలోనే గల్లంతైంది. అదృశ్యమైన విమానాన్ని వెతికేందుకు శక్తివంతమైన పీ8ఐ విమానం తమిళనాడులోని ఎర్నాకులంలో ఉన్న ఐఎన్ఎస్ రాజలీ నుంచి మంగళవారం మధ్యాహ్నం బయలుదేరిందని నేవీ అధికార ప్రతినిధి కెప్టెన్ డీకే శర్మ వెల్లడించారు. ఇది ఎలక్ట్రో ఆప్టికల్, ఇన్ఫ్రారెడ్ సెన్సార్ల సాయంతో గాలింపు చర్యలు చేపడుతుందని తెలిపారు. ఇప్పటికే ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన రెండు ఎంఐ–17 విమానాలు, అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్లు విమానం కోసం మెంచుకా అటవీ ప్రాంతంలో గాలిస్తున్నాయని పేర్కొన్నారు. క్షేత్ర స్థాయిలో కొంతమంది బృందాలుగా ఏర్పడి విమానం జాడ కోసం వెతుకుతున్నాయని తెలిపారు. సోమవారం ఓ చోట విమానం కూలిపోయినట్లు తమకు సమాచారం అందిందని.. వెంటనే అక్కడకు వెళ్లి పరిశీలించగా అలాంటిదేం లేదని గుర్తించామని భారత వైమానిక దళం ఒక ప్రకటనలో వెల్లడించింది. అస్సాంకు చేరిన ఫ్లైట్ లెఫ్టినెంట్ కుటుంబసభ్యులు పటియాలా: అదృశ్యమైన విమానంలో ఎనిమిది మంది వైమానిక సిబ్బంది సహా ఐదుగురు ప్యాసింజర్లు ఉన్నారని తెలిపింది. వీరిలో పటియాలాలోని సమానా ప్రాంతానికి చెందిన ఫ్లైట్ లెఫ్లినెంట్ మోహిత్ గార్గ్ కూడా ఉన్నారు. విమానం గల్లంతైన వార్త తెలియగానే మోహిత్ తండ్రి సురీందర్ గార్గ్, అంకుల్ రిషీ గార్గ్ అస్సాంకు చేరుకున్నారని వారి కుటుంబసభ్యులు వెల్లడించారు. మోహిత్ క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తున్నట్లు అతని సోదరుడు అశ్వనీ గార్గ్ తెలిపారు. మోహిత్‌కు గతేడాది వివాహమైంది. అతని భార్య అస్సాంలోని ఓ బ్యాంకులో పనిచేస్తోంది. పదేళ్ల క్రితమూ ఇలాగే.. అది 2009 సంవత్సరం జూన్ నెల. భారత వాయుసేనకు చెందిన ఏఎన్–32 రకం రవాణా విమానం 13 మందిని ఎక్కించుకుని వెళ్తుండగా అరుణాచల్ ప్రదేశ్‌లో కూలిపోయింది. అందులోని మొత్తం 13 మంది మరణించారు. పశ్చిమ సియాంగ్ జిల్లాలోని రించీ హిల్‌పైన ఆ విమానం కూలిపోయింది. ఆ విమానం మెచుకా నుంచి అసోంలోని మోహన్బరి వైమానిక స్థావరానికి వెళ్తుండగా మెచుకాకు 30 కిలోమీటర్ల దూరంలో దుర్ఘటన జరిగింది. విచిత్రం ఏమిటంటే సరిగ్గా పదేళ్లకు జూన్ నెలలోనే 13 మందితో మెచుకా వెళ్తున్న ఏఎన్–32 రకం విమానం సోమవారం కన్పించకుండా పోయింది. ఇందులో కూడా 13 మందే ఉండటం గమనార్హం. ఈ విమానం మెచుకాకు వెళుతుండగా అదృశ్యం కావడం విశేషం. -
ఎయిర్‌ఫోర్స్ విమానం గల్లంతు
-
కూలిన ఐఏఎఫ్ కొత్త విమానం
ఐదుగురు సిబ్బంది మృత్యువాత కొండను ఢీకొట్టడంతో ప్రమాదం! న్యూఢిల్లీ/జైపూర్: భారత వైమానిక దళానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇటీవల కొనుగోలు చేసిన అమెరికా తయూరీ రవాణా విమానం ఒకటి శుక్రవారం గ్వాలియర్ సమీపంలో కుప్పకూలింది. ప్రమాద సమయంలో అందులో ఉన్న మొత్తం ఐదుగురు సిబ్బంది మరణించారు. జైపూర్‌లోని రక్షణ శాఖ వర్గాల కథనం ప్రకారం.. సి-130 జే అనే ఈ అత్యాధునిక రవాణా విమానం ఉదయం 10 గంటల సమయంలో రోజువారీ కసరత్తులో భాగంగా ఆగ్రా వైమానిక స్థావరం నుంచి బయలుదేరింది. అరుుతే 11 గంటల సమయంలో గ్వాలియర్ వైమానిక స్థావరానికి పశ్చిమంగా 70 మైళ్ల దూరంలో.. గోటాఘాట్ ప్రాంతం వద్ద చంబల్ నది ఒడ్డున ఈ విమానం కుప్పకూలిందని రక్షణ శాఖ తెలిపింది. ఇద్దరు వింగ్ కమాండర్లు పి.జోషి, ఆర్.నాయర్, ఇద్దరు స్క్వాడ్రన్ లీడర్లు కె.మిశ్రా, ఎ.యూదవ్ (నేవిగేటర్), వారంట్ ఆఫీసర్ కె.పి.సింగ్ ఈ ప్రమాదంలో మరణించినట్లు పేర్కొంది. ప్రమాదానికి గల కారణాలపై విచారణకు ఆదేశించినట్లు వైమానిక దళ ప్రతినిధి ఒకరు న్యూఢిల్లీలో చెప్పారు. చిన్న కొండను ఢీకొట్టిన విమానం కుప్పకూలి మంటల్లో చిక్కుకున్నట్టుగా సమీప గ్రామస్తుల కథనాన్ని బట్టి తెలుస్తోందని కరౌలి జిల్లా కలెక్టర్ చెప్పారు. సుమారు రూ.6వేల కోట్ల వ్యయంతో అమెరికా నుంచి కొనుగోలు చేసిన ఆరు సి-130 జే సూపర్ హెర్క్యులస్ విమానాలను రక్షణ శాఖ ఇటీవలే ఐఏఎఫ్‌లో ప్రవేశపెట్టింది. ఈ విమానం 20 టన్నుల వరకు బరువును రవాణా చేయగలదు. అతి త క్కువ ఎత్తులో ఎగరడం వంటి వ్యూహాత్మక కసరత్తు కోసం ఈ తరహా విమానాలు రెండు టేకాఫ్ తీసుకోగా ఇందులో ఒకటి ప్రమాదానికి గురైందని అధికారులు చెప్పారు. గ్రౌండ్ కంట్రోల్‌తో సంబంధాలు కోల్పోయేముందు అత్యవసర పరిస్థితికి సంబంధించిన ఎలాంటి సమాచారం విమానం నుంచి అందలేదన్నారు.