Transport Deputy Commissioner
-
అన్నింటికీ ఆధార్
♦ రవాణాశాఖలో సమూల మార్పులు ♦ ఈనెల 15 నుంచి అన్ని సేవలు ఆన్లైన్లోనే ♦ రవాణాశాఖ డిప్యూటీ కమిషనర్ సుందర్‌వద్ది అనంతపురం సెంట్రల్ : రవాణాశాఖలో త్వరలో సమూల మార్పులు తీసుకువస్తున్నట్లు డిప్యూటీ ట్రాన్స్‌పోర్టు కమిషనర్ సుందర్‌వద్ది తెలిపారు. ఈనెల 15 నుంచి అన్ని సేవలు ఆన్లైన్లోనే పొందే వెసులుబాటును కల్పిస్తున్నట్లు వివరించారు. ఈ సందర్భంగా ఆయన సాక్షితో మాట్లాడారు. రవాణాశాఖలో నూతన సాఫ్ట్వేర్ వస్తోందనీ, డ్రైవింగ్ లైసెన్స్, ఎల్ఎల్ఆర్, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్స్ తదితర అన్ని సేవలను ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. అధికారులు కూడా కంప్యూటర్ ద్వారానే సర్టిఫికెట్లు మంజూరు చేయాల్సి ఉంటుందన్నారు. అలాగే అన్ని సేవలకు ఆధార్‌కార్డు ఉంటే చాలనీ, భవిష్యత్‌లో రకరకాల సర్టిఫికెట్లు ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. దీనివల్ల ప్రజలు ఇంటి వద్ద నుంచే అన్ని కార్డులు పొందవచ్చన్నారు. ఒక్కసారి మాత్రమే కార్యాలయానికి రావాల్సి ఉంటుందని తెలిపారు. ఆన్లైన్ విధానంపై త్వరలో డీలర్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. అలాగే రోడ్డు ప్రమాదాల నివారణపై కూడా కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నామన్నారు. ప్రతి వాహనానికి జీపీఎస్ తప్పనిసరిగా అమర్చుకోవాలనీ, పరిమితికి మించి వేగంగా వెళ్తే జరిమానా విధించేందుకు సిద్ధమవుతున్నట్లు వెల్లడించారు. ప్రతి 50 కిలో మీటర్లుకు ఒక ట్రామాకేర్ హాస్పిటల్‌ను జాతీయ రహదారిలో నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిందనీ. దీని వల్ల క్షతగాత్రులకు వెంటనే వైద్యం అందుతుందన్నారు. -
ప్లాట్లు, పొలాలు, నగలు, నగదు
కాకినాడ రూరల్ : కాకినాడలో రవాణాశాఖ డిప్యూటీ కమిషనర్‌గా పని చేస్తున్న ఆదిమూలం మోహన్‌కు ఏపీ, తెలంగాణ, కర్నాటకల్లో గల ఆస్తులపై అవినీతి నిరోధకశాఖ అధికారులు గురువారం ఏకకాలంలో దాడులు చేశారు. మోహన్ ఆదాయూనికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న సమాచారంతో ఈ దాడులు చేశామని ఏసీబీ డీఎస్పీ ఎ.రమాదేవి చెప్పారు. దాడుల్లో భారీగా బంగారం, వెండి వస్తువులు, నగదుతో పాటు రూ.కోట్ల విలువ చేస్తే ప్లాట్లు, పొలాలు, బినామీ పేర్లతో ఉన్నా ఐదు కంపెనీలకు సంబంధించిన దస్తావేజులు, రెండు కార్లు స్వాధీనం చేసుకున్నారు. మోహన్‌కు నెల్లూరు, హైదరాబాద్‌లలో పలు కంపెనీలున్నట్లు దాడుల్లో బయటపడింది. డీటీసీ మోహన్ భారీగా ఆస్తులు కూడబెట్టడంతో పాటు బంధువుల పేరుతో రక,రకాల వ్యాపారాలు సృష్టించి నల్లధనాన్ని తెలుపు చేసుకునేందుకు యత్నించారని ఏసీబీ అధికారులు చెప్పారు. కాకినాడ రూరల్ మండలం రమణయ్యపేట పంచాయతీ గైగోలుపాడులోని మోహన్ నివాసంతో పాటు ఏపీ, తెలంగాణ , కర్నాటక రాష్ట్రాల్లో తొమ్మిదిచోట్ల ఈ దాడులు నిర్వహిస్తున్నారు. దాడుల్లో బయటపడ్డ ఆస్తుల మార్కెట్ విలువ రూ.35 కోట్లు పైబడి ఉండవచ్చని, వాస్తవ విలువ రూ.100 కోట్ల నుంచి రూ.150 కోట్ల వరకూ ఉండొచ్చని ఏసీబీ అధికారుల అంచనా. హైదరాబాద్‌లో 12 ప్లాట్లు, ఓ అపార్ట్మెంట్ కాకినాడతో పాటుహైదరాబాద్, అనంతపురం, విజయవాడ, ప్రొద్దుటూరు, కడప, నెల్లూరు, కాకినాడ, చిత్తూరు, బళ్లారిల్లో ఏకకాలంలో ఏసిబీ అధికారులు దాడులు చేసి తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్‌లోని కొంపల్లిలో 8 ప్లాట్లు, మాదాపూర్‌లో నాలుగు ప్లాట్లు, పంజాగుట్టలో ఒక ప్లాటు, జూబ్లీ హిల్స్‌లో 699 గజాల్లో నాలుగంతస్తుల అపార్టుమెంటు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. విజయవాడలో కుమార్తె పేరుతో ఒక ఇల్లు అల్లుడి పేరుతో రెండు ఇళ్లు, చిత్తూరులో తొమ్మిది ఎకరాల భూమి, ప్రకాశం జిల్లాలో 45 ఎకరాల భూమికి సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఇవి కాక బళ్లారి, చిత్తూరు, నెల్లూరు, విజయవాడ, హైదరాబాదుల్లో ఇంకా అనేక ఎకరాల భూములు ఉన్నట్లు భావిస్తున్నామని ఏసీబీ అధికారులు తెలిపారు. బ్యాంక్ ఖాతాలు, లాకర్ల సీజ్ కాకినాడతో పాటు రాష్ట్రంలో డీటీసీ మోహన్‌తో పాటు అతని కుటుంబసభ్యుల పేర్లతో ఉన్న బ్యాంకు ఖాతాలను, లాకర్లను సీజ్ చేయనున్నట్లు డీఎస్పీ రమాదేవి చెప్పారు. దాడుల్లో పలు కీలక దస్తావేజులతో పాటు సెల్ఫోన్లు, బ్యాంకు పుస్తకాలు సీజ్ చేశామని, సోదాలు మరో రెండు రోజులు కొనసాగుతాయని వివరించారు. మోహన్ కుమార్తె పేరుతో హైదరాబాదు, నెల్లూరుల్లో ఐదు సంస్థలు నడుపుతున్నట్లు రికార్డులున్నా ఆ ప్రాంతాల్లో ఖాళీ స్థలాలే తప్ప సంస్థలు లేవని తేలిందన్నారు. రికార్డుల్లో శ్రీ తేజా బయోఫ్యూయల్ ప్రైవేట్ లిమిటెడ్, తేజ అండ్ తేజశ్రీ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్, మెర్క్ మినరల్ ప్రైవేట్ లిమిటెడ్, సాయి దివ్య డెవలపర్స్, రోజాలిన్ రాక్స్ అండ్ మైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేర్లతో సంస్థలు నడుపుతున్నట్లు ఉందన్నారు. మూడు రాష్ట్రాల్లో తొమ్మిది చోట్ల జరుగుతున్న దాడుల్లో ముగ్గురు డీఎస్పీలు, 9 మంది సీఐలు, 25 మంది సిబ్బంది పాల్గొన్నట్లు చెప్పారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్లు గుర్తించిన డీటీసీ మోహన్‌ను అరెస్టు చేసి విజయవాడ ఏసీబీ కోర్టుకు తరలిస్తున్నట్లు చెప్పారు. కాకినాడలో నిర్వహించిన దాడుల్లో డీఎస్పీ రమాదేవితో పాటు సీఐలు సుదర్శనరెడ్డి, సతీష్‌కుమార్, ఎస్ఐ విష్ణువర్ధన్‌లతో పాటు మరో ఆరుగురు సిబ్బంది పాల్గొన్నారు. ఇరిగేషన్ ఏఈ నుంచి డీటీసీగా.. డీటీసీ మోహన్ ఇరిగేషన్ శాఖలో అసిస్టెంట్ ఇంజనీరుగా ఉద్యోగ జీవితం ప్రారంభించారు. 1989లో ఆర్టీవో అరుు వరంగల్, నిజామాబాద్, హైదరాబాదుల్లో పనిచేశారు. 1998లో గ్రూప్-1 అధికారిగా ఎంపికై నేరుగా రవాణాశాఖ అసిస్టెంట్ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టారు. నెల్లూరు, చిత్తూరు, అనంతపురం, విజయవాడ, మళ్లీ నెల్లూరుల్లో పనిచేసి డీటీసీగా కాకినాడకు ఏడాదిన్నర క్రితం వచ్చారు. -
పన్నులు సకాలంలో చెల్లించాలి
తమ్మరబండపాలెం(కోదాడరూరల్):వాహనదారులు తమ వాహనాల పన్నులను సకాలంలో చెల్లించి ఆర్టీఓ అధికారులకు సహకరించాలని జిల్లా ట్రాన్స్‌పోర్టు డిప్యూటీ కమిషనర్ మామిండ్ల చంద్రశేఖర్‌గౌడ్ కోరారు. జిల్లాలో నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఆయన మంగళవారం కోదాడ మం డలంలోని తమ్మరబండపాలెం కార్యాలయాన్ని తనిఖీ చేశారు. రికార్డులను, అధికారుల పనితీరును పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ కోదాడ ఆర్టీఓ కార్యాలయ పరిధిలోని ఏడు మండలాలలోని పన్ను మినహాయింపు పోగ మిగి లిన వాహనదారులు తమ పన్నులను సకాలంలో చెల్లించాలన్నారు. లేకుంటే 200 శాతం అధిక పన్ను విధించాల్సి వస్తుందన్నారు. జిల్లాలోనే మూడు అంతరాష్ట్ర చెక్‌పోస్టులున్నాయని తెలి పారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత అక్టోబర్ నెల చివరి వరకు జిల్లాలో రూ.44.2కోట్ల ఆదాయం వచ్చిందని తెలిపారు. పన్నుల ద్వారా రూ.16.42 కోట్లు, జీవితకాలం పన్నుల ద్వారా 18.40 కోట్లు, ఫీజుల ద్వారా 4.6కోట్లు, సర్వీస్ ట్యాక్స్ ద్వారా 1.42 లక్షలు, తనిఖీల ద్వారా 3.5 కోట్ల ఆదాయం వచ్చిందని పేర్కొన్నారు. ఆర్టీఓ ద్వారా జిల్లాకు కోట్లరూపాయాల ఆదాయం ఉండి సూర్యాపేటకు మాత్రమే సొంత భవనం ఉందన్నారు. మిగిలిన కార్యాలయాలకు కూడా నూతన భవనాల నిర్మాణాలకు, సొంతస్థలం కొరకు రెవెన్యూ అధికారులకు, కలెక్టర్‌కు ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. కార్యాలయనికి వచ్చిన వాహనాదారులకు సమాచారాన్ని, సల హాలు ఇచ్చేందుకు హెల్ప్‌డెస్క్‌లు ఏర్పా టు చేస్తున్నట్లు తెలిపారు. కోదాడను యూనిట్ ఆఫీసుగా మార్చేందుకు ప్రయత్నిస్తునట్లు తెలిపారు. డ్రైవింగ్‌పై అవగాహన కార్యక్రమాలు.. జిల్లాలోని వాహనదారులకు, డ్రైవర్లకు, విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు వివి ధ శాఖల అధికారుల సమన్వయంతో కలెక్టర్ అధ్యక్షతన అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. పాఠశాలల బస్సుల డ్రైవర్లు జాగ్రత్తగా వాహనాలు నడపాలన్నారు. విద్యార్ధులను పరిమిత సంఖ్యలో ఎక్కించుకోవాలని ఈ విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. చెక్‌పోస్టుల పరిశీలన కార్యాలయ పరిశీలన అనంతరం మండల పరిధిలోని నల్లబండగూడెం శివారులోని అంతరాష్ట్ర ట్రాన్స్‌పోర్టులను పరిశీలించారు. జిల్లాలోని చెక్‌పోస్టులను మరింత పటిష్టంగా మారుస్తామని, కంప్యూటరైజ్డ్ బిల్లులుకు, అన్ని వసతులు కల్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. ఇతర రాష్ట్రవాహనాలతో పాటు జూన్ 2 తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో రిజిస్ట్రేషన్ అయినా వాహనాలకు చెక్‌పోస్టులలో తప్పకుండా ట్యాక్స్ కట్టాల్సిందేనన్నారు. ఆయన వెంట కోదాడ ఎంవీఐ శ్రీనివాసరెడ్డి, చెక్‌పోస్టు ఎంవీఐలు షౌకత్అలీఖాన్, సాదుల శ్రీనివాస్ తదితరులున్నారు.