transport vehicles
-
రవాణాశాఖ వింత వ్యవహారం .. కామ్‌గా కట్టించేస్తున్నారు!
సాక్షి, హైదరాబాద్: బస్సు చార్జీలు పెంచినప్పుడు ఆర్టీసీ అధికారులు బహిరంగంగానే వెల్లడించారు.. కరెంటు చార్జీలు పెరిగితే అధికారులు ముందే చెప్పారు.. కానీ వాహనాలకు సంబంధించి జీవిత కాల పన్ను, హరిత పన్నులు పెంచిన రవాణా శాఖ ఒక్కమాట కూడా బహిరంగంగా చెప్పలేదు. ఏయే చార్జీలు ఏ మేరకు, ఎప్పటి నుంచి పెరుగుతున్నాయన్నది అధికారులెవరూ చెప్పలేదు. కానీ పన్ను చెల్లించే సమయంలో భారీ చార్జీలు చూసి జనం నోరెళ్లబెట్టాల్సి వస్తోంది. రూ.12 లక్షల విలువైన వాహ నాన్ని కొంటే.. వారం కిందటి వరకు రూ.1,68,000 (14 శాతం) జీవితకాల పన్ను (లైఫ్ ట్యాక్స్) చెల్లించాల్సి వచ్చేది. ఇప్పుడది రూ.2,04,000కు (17శాతానికి) పెరిగింది. ఇంత ప్రభావం చూపే మార్పు జరిగితే ఎక్కడా రవాణా శాఖ నుంచి జనానికి తెలియజేసే అధికారిక ప్రకటన వెలువడలేదు. గత ఆర్థిక సంవత్సరం జీవితకాల పన్ను రూపంలో రూ.2,900 కోట్ల ఆదాయాన్ని పొందింది. తాజా ఉత్తర్వులతో అదనంగా మరో రూ.1,400 కోట్లమేర ఆదాయం లభిస్తుందని అధికారవర్గాలు అంచనా వేస్తున్నాయి. ఫిట్నెస్ పంచాయితీ.. రవాణా వాహనాలు ఏడాదికోసారి తప్పనిసరిగా ఫిట్నెస్ పరీక్ష చేయించి సర్టిఫికెట్ పొందాలి. ఇలా ఫిట్నెస్ పరీక్షలు చేయించకుండా తిరిగే ట్రాన్స్‌పోర్టు వాహనాలకు రోజుకు రూ.50 చొప్పున పెనాల్టీ విధించాలి. కేంద్రం ఈ సంవత్సరం ఏప్రిల్ ఒకటి నుంచి దీన్ని అమల్లోకి తెచ్చింది. రాష్ట్ర రవాణా శాఖ మాత్రం ఎన్ని సంవత్సరాల నుంచి ఫిట్నెస్ చేయించటం ఆపేశారో.. అప్పటి నుంచీ లెక్కగట్టి పెనాల్టీలు వసూలు చేస్తోంది. ► హైదరాబాద్‌కు చెందిన అష్రాఫ్ అనే ఆటోడ్రైవర్ ఏడేళ్లుగా ఫిట్నెస్ సర్టిఫికెట్ లేకుండా ఆటో నడుపుతున్నాడు. కొత్త నిర్ణయం రావటంతో పెనాల్టీలు కట్టే బాధ ఉండొద్దని ఫిట్నెస్ పరీక్ష కోసం వెళ్లాడు. ఏడేళ్ల నుంచి రోజుకు రూ.50 చొప్పున పెనాల్టీ కలిపి మొత్తంగా రూ.1.13 లక్షలు కట్టాలని అధికారులు చెప్పారు. దీనితో బెంబేలెత్తిన అష్రాఫ్ ఆటోను తీసుకెళ్లి ఇంట్లో పెట్టేశాడు. ఆటో నడిపితేనే రోజు గడిచే ఆయన.. ఇప్పుడు దానిని బయటికి తీయట్లేదు. ఇలా 75వేల ఆటోలు పాత బకాయిల పేరిట భారీ పెనాల్టీ చెల్లించాల్సిన పరిస్థితి ఉందని.. దీనితో దాదాపు 40వేల మంది డ్రైవర్లు ఆటోలను బయటికి తీయడం మానేశారని యూనియన్ నేతలు చెప్తున్నారు. ఇదే తరహాలో దాదాపు 4 వేల టాటా ఏస్ మినీ ట్రక్లు, మరో 2 వేల వరకు డీసీఎం వాహనాలు, చిన్న లారీలు ఇలాగే మూలకు చేరాయని అంటున్నారు. ఆటో అమ్ముకోలేక, కొత్తది కొనలేక ఇబ్బందిపడుతున్నారు. ఫీజులు పెంచిన తర్వాత నాలుగు రోజుల క్రితం ఓ లారీకి వచ్చిన పన్ను మొత్తం రూ.13,920 కాలుష్యం పేరిట... వాహనాలు పాతబడే కొద్దీ కాలుష్యం పెరుగుతుందన్న ఉద్దేశంతో వాటి వాడకాన్ని తగ్గించడానికి హరితపన్ను (గ్రీన్ ట్యాక్స్) విధిస్తున్నారు. రవాణాశాఖ ఇటీవలే హరితపన్నును పెంచింది. దీనినీ మూడు శ్లాబులు చేసింది. ఈ విషయాన్నీ బయటికి వెల్లడించలేదు. ఏ శ్లాబుకు ఎంత పన్ను చెల్లించాలో వాహన యజమానులకు తెలియదు. రవాణాశాఖ కార్యాలయంలో వివరాలన్నీ నమోదుచేశాక వచ్చే పన్నుమొత్తం చూసి బెంబేలెత్తుతున్న పరిస్థితి ఉంది. ► పాత రేట్ల ప్రకారం ఓ లారీకి గ్రీన్‌టాక్స్ రూ.238 మాత్రమే ఉండేది. అదనంగా ప్రభుత్వ ఫీజు చెల్లించాల్సి వచ్చేది. ► గతంలో ద్విచక్ర వాహనానికి గ్రీన్‌ట్యాక్స్ రూ.285, ప్రభుత్వ ఫీజు రూ.735 ఉండగా.. ఫీజులు పెంచాక గ్రీన్‌ట్యాక్స్ రూ.2,035, ప్రభుత్వ ఫీజు రూ.1,400గా మారింది. ► కార్లకు సంబంధించి గ్రీన్‌ట్యాక్స్ రూ.535, ప్రభుత్వ ఫీజు రూ.1,200 ఉండేది. ఇప్పుడు ట్యాక్స్ రూ.5035, ఫీజు రూ.1,500 అయింది. ఆదాయం కోసం దొడ్డిదారిన పన్ను పెంచారు గ్రీన్‌ట్యాక్స్ పెంచినంత మాత్రాన వాతావరణంలో కాలుష్యం తగ్గుతుందా..? ఇదేం విడ్డూరం. కాలుష్యం వెదజల్లుతున్న వాహనాలను సీజ్ చేయండి, లేదా మరమ్మతు చేయించుకునేలా చేయండి. అలాకాకుండా పన్ను చెల్లించి పొగవదిలితే ఉపయోగం ఉంటుందా? కేవలం ఆదాయం పెంచుకునేందుకు ఇలా దొడ్డిదారిన గ్రీన్‌ట్యాక్స్ పెంచారు. – మంచిరెడ్డి రాజేందర్‌రెడ్డి, తెలంగాణ లారీ యజమానుల సంఘం అధ్యక్షుడు 40వేలకుపైగా రవాణా వాహనాలు నిలిచిపోయాయి ఏళ్లపాటు ఫిట్నెస్ పెనాల్టీ లెక్కగట్టి బెదిరిపోయేలా చేశారు. దాదాపు 40 వేలకుపైగా రవాణా వాహనాలు రోడ్డెక్కకుండా చేసిన ఈ పెనాల్టీ విధానాన్ని ఉపసంహరించుకోవాలి. ఆరు నెలల గడువిస్తే అన్ని వాహనాలకు ఫిట్నెస్ చేయించేసుకుంటారు. అలాగాకుండా ఆదాయం కోసం దీన్ని ఆయుధంగా వాడటం సరికాదు – ఎ.సత్తిరెడ్డి, తెలంగాణ ఆటో డ్రైవర్ల సమాఖ్య ప్రధాన కార్యదర్శి -
వాహనదారులకు అలర్ట్.. కొత్త రూల్..అమలులోకి వచ్చేది అప్పుడే..!
సెంట్రల్ మోటర్ వెహికల్ రూల్స్ -1989 చట్టంను కేంద్ర ప్రభుత్వం సవరించిన విషయం తెలిసిందే. ఈ సవరణలో భాగంగా ట్రాన్స్పోర్ట్ వాహనాలు రిజిస్టర్డ్ ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్ (ATS) ద్వారా మాత్రమే ఫిట్నెస్ సర్టిఫికేట్ పొందడాన్ని తప్పనిసరి చేస్తూ రోడ్డు రవాణా , రహదారుల మంత్రిత్వ శాఖ గురువారం (ఏప్రిల్ 7)న నోటిఫికేషన్ జారీ చేసింది. అన్నీ ట్రాన్స్పోర్ట్ వాహనాలు వచ్చే ఏడాది నుంచి ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్ల నుంచి మాత్రమే ఫిట్నెస్ సర్టిఫికెట్లను తప్పనిసరిగా పొందాల్సి ఉంటుందని పేర్కొంది. 8 ఏళ్ల పాత వాహనాలకు రెండు సంవత్సరాల పాటు, అంతకు మించిన పాత వాహనాలకు ఒక ఏడాది పాటు ఫిట్నెస్ సర్టిఫికేట్ ఏటీఎస్ అందించనుంది. రోడ్డు రవాణా,రహదారుల మంత్రిత్వ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం...హెవీ గూడ్స్ వెహికల్స్/హెవీ ప్యాసింజర్ మోటార్ వెహికల్స్ కోసం ఏప్రిల్ 1, 2023 నుంచి, మీడియం గూడ్స్ వెహికల్స్/మీడియం ప్యాసింజర్ మోటార్ వెహికల్స్, లైట్ మోటర్ వెహికల్స్ (రవాణా) కోసం జూన్ 1, 2024 నుంచి వెరిఫికేషన్ తప్పనిసరి అవుతుందని నోటిఫికేషన్ వెల్లడించింది. ఫిట్నెస్ సర్టిఫికేట్ నిబంధనలలో మార్పులను ప్రతిపాదిస్తూ గతంలో డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. కాగా తుది నోటిఫికేషన్‌ను జారీ చేయడానికి అభ్యంతరాలు లేదా సూచనలను లేవనెత్తడానికి 30 రోజుల సమయాన్ని రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ఇచ్చింది. MoRTH has issued a notification regarding mandatory fitness of motor vehicles only through registered Automated Testing Station. pic.twitter.com/DBtkJIFSX9 — MORTHINDIA (@MORTHIndia) April 7, 2022 ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్ (ATS)ద్వారా వాహన ఫిట్‌నెస్‌ని తనిఖీ చేయడానికి అవసరమైన వివిధ పరీక్షలను ఆటోమేట్ చేయడానికి మెకానికల్ పరికరాలతో చేయనుంది. ఈ టెస్టింగ్ కోసం రాష్ట్ర ప్రభుత్వాలు, కంపెనీలు ఫిట్నెస్ను పరీక్షించడానికి ఏటీఎస్ పరీక్ష కేంద్రాలను నెలకొల్పేందుకు గత ఏడాది అనుమతులను జారీ చేసినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. చదవండి: భారీ డీల్‌ను కైవసం చేసుకున్న టాటా మోటార్స్..! -
దూకుడుకు లాక్
సాక్షి, హైదరాబాద్ : వాహనాల వేగనియంత్రణ చర్యల్లో రవాణా శాఖ స్పీడ్ పెంచింది. ఫిట్నెస్పైనా ప్రత్యేక దృష్టి సారించింది. మరో 2 రోజుల్లో అన్నిరకాల రవాణా వాహనాలకు (ఆటోరిక్షాలకు మినహాయింపు) స్పీడ్ గవర్నర్స్ తప్పనిసరి చేయనుంది. స్పీడ్ గవర్నర్స్ ఉన్నవాటికే అధికారులు ఫిట్నెస్ ధ్రువీకరణ చేస్తారు. ఆర్టీసీ, స్కూల్, ప్రైవేట్ బస్సులు, క్యాబ్‌లు, ట్యాంకర్లు, చెత్త తరలింపు వాహనాలు, లారీలు, డీసీఎంలు తదితర అన్ని రకాల ప్రయాణికుల, సరుకు రవాణా వాహనాలు స్పీడ్ గవర్నర్స్‌ను ఏర్పా టు చేసుకోవలసి ఉంటుంది. వాహ నాల వేగాన్ని గ్రేటర్ హైదరాబాద్‌లో 60 కిలో మీటర్ల వరకు, ప్రధాన రహదారులపై 80 కిలోమీటర్ల వరకు అనుమతినిచ్చారు. అపరిమితమైన వేగంతో దూసుకెళ్లే వాహనాలను అదుపు చేయడంలో డ్రైవర్లు విఫలం కావడం వల్లే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నట్లు ప్రభుత్వం గుర్తించి స్పీడ్ గవర్నర్స్‌ను తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే. అయితే, 2015 తరువాత తయారైన అన్నిరకాల రవాణా వాహనాలకు వాటి నిర్మాణ సమయంలోనే కంపె నీలు వేగ నియంత్రణ పరికరాలను ఏర్పాటు చేశారు. 2015 కంటే ముందు తయారైన వాహనాలకు మాత్రం అలాంటి పరికరాలు లేవు. దీనిని దృష్టిలో ఉంచుకొని ఈ స్పీడ్ గవర్నర్స్ నిబంధనను తప్పనిసరి చేశారు. దీనిపై పలు లారీ యాజమాన్య సంఘాల నేతలు, వాహన యజమానులు తమకు కొంత గడువు కావాలని రవాణాశాఖను కోరారు. మరోవైపు మరికొన్ని సంస్థలు రహదారి భద్రత దృష్ట్యా వేగ నియంత్రణ పరికరాలను తప్పనిసరిగా అమలు చేయాలని న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. ఆ సంస్థలకే ధ్రువీకరణ బాధ్యత ఆటోమెబైల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఏఆర్ఏఐ), ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఆటోమోటివ్ టెక్నాలజీ వంటి కేంద్రప్రభుత్వ గుర్తింపు పొందిన సాంకేతిక సంస్థలు ధ్రువీకరించిన కంపెనీలకు చెందిన స్పీడ్ గవర్నర్స్‌ను మాత్రమే వాహనాలకు ఏర్పాటు చేయాలనే నిబంధన ఉంది. ఈ రెండు సంస్థలు దేశవ్యాప్తంగా 37 స్పీడ్‌గవర్నర్స్ తయారీ కంపెనీలను సర్టిఫై చేశాయి. ఈ కంపెనీలు తయారు చేసిన పరికరాలకు ఐఎస్ఐ ఆమోదం కూడా లభించింది. ఎంకే, ప్రికోల్ వంటి సంస్థలకు చెందిన స్పీడ్‌గవర్నర్స్ అంతర్జాతీయంగా కూడా ప్రామాణికమైనవనే గుర్తింపు ఉంది. కానీ తెలంగాణలో కేవలం 3 కంపెనీలు కాన్వెర్జ్, మెర్సిడా, క్రిసాల్లకు చెందిన స్పీడ్ గవర్నర్స్ ఏర్పాటుకు మాత్రమే రవాణా అధికారులు ఇప్పటి వరకు అనుమతినిచ్చారు. నియంత్రణలేని ధరలు.. కాన్వెర్జ్, మెర్సిడా, క్రిసాల్ కంపెనీల స్పీడ్ గవర్నర్స్ ఆంధ్రప్రదేశ్, కర్ణాటక తదితర రాష్ట్రాల్లో రూ.2,500 నుంచి రూ.3,000లకే ఒక పరికరం చొప్పున విక్రయిస్తుండగా తెలంగాణలో వీటి ధర రూ.7,500 చొప్పున ఉండటంపట్ల లారీ యాజమాన్యసంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఒకే కంపెనీకి చెందిన ఒకేరకమైన ఉత్పత్తులను ఒక్కోరాష్ట్రంలో ఒక్కోవిధమైన ధరలకు ఎలా విక్రయిస్తారని ప్రశ్నిస్తున్నాయి. 4 లక్షల వాహనాలకు స్పీడ్ గవర్నర్స్ సుమారు 4 లక్షల రవాణా వాహనాలు స్పీడ్ గవర్నర్స్ పరిధిలోకి రానున్నాయి. వీటన్నింటికీ నిర్ణీత గడువులోపు స్పీడ్ గవర్నర్స్ ఏర్పాటు చేయాలని అధికారులు భావిస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లో ట్రాఫిక్ రద్దీ, ఇరుకు రోడ్లు, ఫ్లైఓవర్, మెట్రోరైలు నిర్మాణ పనుల దృష్ట్యా వాహనాలు గంటకు 40 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో వెళ్లే పరిస్థితి లేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
ఎక్కడ లారీలు అక్కడే !
విజయవాడ : రవాణా రంగ సమస్యల పరిష్కారం కోసం ఆలిండియా మోటార్ ట్రాన్స్‌పోర్టు కాంగ్రెస్ పిలుపు మేరకు దేశ వ్యాప్త ఆందోళనలో భాగంగా శనివారం కృష్ణా జిల్లాలో రెండో రోజు లారీల నిరవధిక సమ్మె కొనసాగింది. జిల్లా వ్యాప్తంగా లారీలన్నీ ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. విజయవాడ నగరంలో ఆటోనగర్, భవానీపురం, జిల్లాలో గుడివాడ, నందిగామ, ఇబ్రహీంపట్నం, నూజివీడు ప్రాంతాల్లో రవాణా వాహనాలు నిలిపివేశారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే లారీలు కూడా గమ్యస్థానాలకు చేరుకుని నిలిపివేశామని కృష్ణా జిల్లా లారీ యజమానుల సంఘం అధ్యక్షుడు కోనేరు రామారావు, ప్రధాన కార్యదర్శి అడుసుమిలి సదాశివరావు, ఆంధ్రప్రదేశ్ లారీ యజమానుల సంఘం ప్రధాన కార్యదర్శి వైవీ ఈశ్వరరావులు సంయుక్త ప్రకటనలో తెలిపారు. లారీ యజమానులు చేపట్టిన సమ్మెకు టాక్సీ, మినీట్రాన్స్‌పోర్టు, తదితర సంఘాలు కూడా సంఘీభావం ప్రకటించాయి. లారీ ఓనర్ల సమస్యలు పరిష్కరించకపోతే తాము కూడా బంద్‌లో పాల్గొంటామన్నారు. -
ఎస్టీ రైతుల వ్యవ‘సాయా’నికి కొత్త పథకం
సాక్షి, హైదరాబాద్: గిరిజన రైతులను అన్ని విధాలుగా ఆదుకుని, వారు ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేసేందుకు ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. పంట వేసుకునేందుకు ఆర్థిక సాయంతో పాటు, వ్యవసాయ ఉత్పత్తులను మార్కెటింగ్ చేసుకునే వరకు సహకారం అందించాలని యోచిస్తోంది. ఈ పథకానికి ఎస్టీ శాఖ ఆధ్వర్యంలో తుది మెరుగులు దిద్దుతున్నారు. ఈ శాఖ పరిధిలోని ట్రైకార్(ఎస్టీ సహకార ఆర్థిక కార్పొరేషన్) ద్వారా ఈ పథకాన్ని అమలుచేయాలని ప్రభుత్వం భావిస్తోం ది. రైతులు ఒక బృందంగా ఏర్పడి పంటను వేయడం మొదలుకుని, ఉత్పత్తి చేతికొచ్చాక దానిని గిడ్డంగుల్లో భద్రపరిచి మంచి ధర వచ్చినపుడు విక్రయించేలా పథకం రూపొందిస్తున్నారు. వరంగల్జిల్లాలో మిర్చి, ఆదిలాబాద్ జిల్లాలో సోయా, ఇలా మిగతా జిల్లాల్లో అక్కడి ప్రత్యేకతలను బట్టి ఆయా పంటలను వేయిస్తూ రైతులు ఆర్థికంగా లాభపడేలా చేయడం ఈ పథకం ఉద్దేశం. త్వరలో వాహన పథకం... డ్రైవింగ్‌లో అనుభవముండి, సొంతంగా వాహనాలు నడుపుకోగలిగే ఎస్టీలకు ప్యాసింజర్, రవాణా వాహనాలు అందించనున్నారు.డ్రైవర్ కమ్ ఓనర్ పథకంలో భాగంగా ఈ వాహనాలు ఇస్తారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే దీనిని ప్రారంభించి ,పదిజిల్లాల్లో వెయ్యి మందికి ఊతమివ్వనున్నారు. దీన్ని ఎస్టీ ఆర్థిక సహకార కార్పొరేషన్ (ట్రైకార్) ద్వారా అమలుచేయనున్నారు.ఈ పథకం నేరుగా లబ్ధిదారులకే చేరేలా నిబంధనలను రూపకల్పన చేస్తున్నారు. -
సమ్మెట పోటు..
స్తంభించిన సరకు రవాణా... ఎక్కడికక్కడ నిలిచిన లారీలు..ట్యాంకర్లు లక్షలాది కార్మికుల జీవనోపాధికి గండి తొలిరోజే రూ.20కోట్లకు పైగా లావాదేవీలకు బ్రేకు సమ్మెట పోటు మొదలైంది. సరకు రవాణా స్తంభించింది. అఖిలభారత ట్రాన్స్‌పోర్టు కాంగ్రెస్ పిలుపుతో లారీలు.. ట్యాంకర్లు.. టిప్పర్లతో సహా సరకు రవాణా వాహనాలు బుధవారం అర్ధరాత్రి నుంచి ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. గురువారం ఉదయం ఆరు గంటల తరువాత ఏ ఒక్క వాహనం అడుగు ముందుకేయలేదు. రూ.కోట్లలో లావా దేవీలకు బ్రేకుపడింది. లక్షలాది మంది కార్మికులకు జీవనోపాధి లేకుండా పోయింది. సమ్మె ప్రభావంతో పలుచోట్ల పెట్రోల్ బంకులు మూత పడగా.. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినప్పటికీ నిత్యావసరాల రవాణాకు ఇబ్బందులు తప్పలేదు. సాక్షి, విశాఖపట్నం: దేశ వ్యాప్త సమ్మెలో భాగంగా గురువారం జిల్లాపరిధిలో భారీవాహనాలకు బ్రేకులు పడ్డాయి. జిల్లాలోని 25,617 సరకు రవాణా వాహనాలతో పాటు వివిధ జిల్లాల నుంచి ఇక్కడకు రాకపోకలు సాగించే మరో 30వేల లారీలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. విశాఖ పోర్టు ట్రస్ట్, గంగవరం పోర్టు ఏరియాలతో పాటు ఆటోనగర్, ఇండస్ట్రియల్ ఏరియాల్లో వేలాది వాహనాలు నిలిచి పోయాయి. జాతీయరహదారిపొడవునా రోడ్లకు ఇరువైపులా వందలాదిలారీలు..ట్యాంకర్లు నిలిపివేశారు. వాటిపై పనిచేసే డ్రైవర్లు, క్లీనర్లు, ఇతర సిబ్బంది ఎక్కడికక్కడ రోడ్లపైనే వంటలు వార్పులు చేసుకుంటూ వాహనాల కింద భోజనాలు చేస్తూ గడిపారు. పౌరసరఫరాలశాఖ పరిధిలో సరకు రవాణా చేసే వాహనాలను సైతం ఎక్కడక్కడ నిలిపివేశారు. రేషన్ దుకాణాలకు నిత్యావసరాల తరలింపు నిలిచిపోయింది. పాలు, నీళ్లు, వైద్యం ఇలా అత్యవసర సేవలకు మినహాయింపునివ్వడం ఊరట నిచ్చింది. సమ్మె ప్రభావంతో ఈ రంగంపై ఆధారపడి జీవించే వేలాది మంది కార్మికులతో పాటు ఎగుమతులు, దిగుమతులు వంటి కార్య కలాపాలు నిలిచిపోవడంతో మరో లక్ష మందికి పైగా కార్మికులు ఉపాధికి దూరమయ్యే దుస్థితి దాపురించింది. వీరితో పాటు రాష్ర్ట వ్యాప్తంగా పెట్రోల్ బంకులు సమ్మె బాట పట్టిన ప్పటికీ జిల్లాలో మాత్రం సమ్మెకు దూరంగా ఉన్నారు. అయితే ట్యాంకర్ల సమ్మె కారణంగా స్టాక్ లేక జిల్లాలోని 50కు పైగా బంకులు మూత పడ్డాయి. మరో పక్క గ్రామీణ ప్రాంతాలనుంచి రైతు బజార్లు, మార్కెట్లకు కూరగాయల రవాణాకు ఇబ్బంది లేకుండా ఆర్టీసీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది. ఇందుకోసం ప్రత్యేకంగా 12 బస్సులను ఏర్పాటు చేసిన ఆర్టీసీ యంత్రాంగం అవసరాన్ని బట్టి పెంచుతామని ప్రకటించింది. తొలి రోజు సామాన్యులకు ఇబ్బందులేకున్నప్పటికీ రూ.వేలకోట్ల లావాదేవీలు జరిగే పోర్టులు, పరిశ్రమలపై ప్రభావం కనబడింది. విశాఖ షిప్పింగ్ లాజిస్టిక్ పరిధిలోనే ఏకంగా వెయ్యికి పైగా టిప్పిర్లు నిలిచిపోయాయి. పోర్టునుంచి రోజు 40వేల మెట్రిక్ టన్నుల బొగ్గును టిప్పర్లు సంబంధిత పరిశ్రమలకు రవాణా చేస్తుంటాయి. టిప్పర్ల సమ్మెతో ఆ మేరకు పరిశ్రమలకు అందాల్సిన ముడిసరకు నిలిచిపోయింది. మరో పక్క విదేశాల నుంచి దిగుమతైన లక్ష మెట్రిక్ టన్నులకు పైగా ఎరువులు విశాఖ పోర్టులో ఉన్నాయి. వీటిని రాష్ర్టంలోని వివిధ జిల్లాలతో పాటు పొరుగు రాష్ట్రాలకు కూడా రవాణా చేయాల్సి ఉంది. సమ్మె ప్రభావం ఎరువుల రవాణాపై పడింది. అలాగే అభివృద్ధి పనులపై కూడా ప్రభావం కనబడింది. అసలే ఇసుక దొరక్క ఇబ్బందుల పడుతున్న నిర్మాణ రంగంపై లారీల సమ్మె రోకలిపోటుగా మారింది. క్వారీల నుంచి రాళ్లు, ఇసుక, ఇనుము తదితర నిర్మాణ ముడి సరకు నిలిచిపోవడంతో ఆ రంగం మరింత కుదేలయ్యే పరిస్థితి ఏర్పడింది. సమ్మె కారణంగా జిల్లా వ్యాప్తంగా రూ.20కోట్ల మేర లావాదేవీలకు బ్రేకుపడినట్టుగా వాణిజ్య వర్గాలు చెబుతున్నాయి. నిరవధిక సమ్మెలో భాగంగా లారీలు, ట్యాంకర్లు, టిప్పర్ల యజమానులు, కార్మికులు ఎక్కడికక్క నిరసనలు వ్యక్తం చేశారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కారంపై కేంద్ర,రాష్ర్ట ప్రభుత్వాలు కచ్చితమైన హామీ లిచ్చేవరకు సమ్మెను విరమించే ప్రసక్తే లేదని ఏపీ లారీ ఓనర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు, ఆల్ ఇండియా మోటార్ ట్రాన్స్‌పోర్టు కాంగ్రెస్ (ఎఐఎం టీసీ)సభ్యుడు ఎం. జానకిరామ్‌రెడ్డి స్పష్టం చేశారు. అప్పటి వరకు సమ్మె ఆగదన్నారు. -
లెక్క తేలాల్సిందే..!
- పన్ను చెల్లించని రవాణా వాహనాలపై స్పెషల్ డ్రైవ్ - ఇంటింటి తనిఖీలకు ఆర్టీఏ సన్నాహాలు - ఫైనాన్సియర్లు, విద్యాసంస్థలపై ప్రత్యేక దృష్టి - ‘సాక్షి’ కథనంతో కదిలిన ఆర్టీఏ సాక్షి, సిటీబ్యూరో: పన్ను చెల్లించని రవాణా వాహనాల లెక్క తేల్చేందుకు ఆర్టీఏ రంగంలోకి దిగింది. ఏకంగా ఇంటింటి తనిఖీలకు శ్రీకారం చుట్టింది. ఇందుకోసం గ్రేటర్ పరిధిలో సుమారు 70 మందికి పైగా మోటారు వాహన ఇన్స్పెక్టర్లు, సహాయ తనిఖీ అధికారులు రంగంలోకి దిగారు. రెవిన్యూ మండలాల వారీగా పన్నులు చెల్లించని మొండి వాహనాల జాబితాను సిద్ధం చేశారు. సుమారు రూ.200 కోట్ల వరకు పన్ను చెల్లించకుండా తిరుగుతున్న వాహనాలపై ‘చేతులెత్తేసిన ఆర్టీఏ’ అనే శీర్షికన ఇటీవల ‘సాక్షి’లో కథనం ప్రచురితమైన సంగతి తెలిసిందే. దీంతో రవాణా కమిషనర్ సందీప్‌కుమార్ సుల్తానియా పన్ను చెల్లించని వాహనాలపై మరింత దృష్టి సారించారు. ఏ ఒక్క వాహనాన్ని కూడా వదిలిపెట్టకుండా క్షుణ్ణంగా తనిఖీలు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల అధికారులు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. కేవలం రోడ్లపైన కనిపించే వాహనాలు మాత్రమే కాకుండా ఇళ్ల వద్ద ఉండే రవాణా వాహనాలను కూడా తనిఖీ చేయాలని నిర్ణయించారు. రెండు జిల్లాల్లో కలిపి సుమారు లక్ష వరకు రవాణా వాహనాలు పన్ను చెల్లించకుండా ఉన్నట్లు అంచనా. వీటిలో 2003 నుంచి ఇప్పటి వరకు చెల్లించకుండా ఉన్నవి కొన్నయితే, 2010 తరువాత పన్ను చెల్లించనివి మరి కొన్ని ఉన్నాయి. ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించకపోవడంతో భారీ సంఖ్యలో పెండింగ్ జాబితాలో పడిపోయాయి. మండలాల వారీగా జాబితాలు.. నాన్ పేమెంట్ వాహనాల్లో ఎక్కువ శాతం ఫైనాన్షియర్ల చేతుల్లోనే ఉన్నట్లు ఆర్టీఏ అధికారులు గుర్తించారు. ఒక ఫైనాన్షియర్ నుంచి మరో ఫైనాన్షియర్‌కు. ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు వాహనాలు బదిలీ అయ్యాయి. ఈ క్రమంలో కొన్ని తుక్కు కింద మారాయి. ఇలా రకరకాల కారణాల వల్ల వేల సంఖ్యలో పన్ను చెల్లించకుండా పేరుకుపోయాయి. మరోవైపు స్కూల్ బస్సులు, వస్తు రవాణా వాహనాలు కూడా ఒకరి నుంచి ఒకరికి చేతులు మారే క్రమంలో, కాలం చెల్లినవి తుక్కు కింద మారే క్రమంలో ఆ విషయం సంబంధిత ఆర్టీఏ కార్యాలయంలో నమోదు కాకపోవడంతో పెండింగ్ జాబితా పెరిగినట్లు అధికారుల పరిశీనలో వెల్లడైంది. ఈ క్రమంలో మనుగడలో ఉన్నవాటిపైనా లేని వాటిపైనా కచ్చితమైన అవగాహన కోసం ఇళ్లు, కార్యాలయాలు, స్కూళ్లను కేంద్రంగా చేసుకొని నిర్వహించే ప్రత్యేక తనిఖీలు దోహదం చేయగలవని ఆర్టీఏ అధికారులు భావిస్తున్నారు. ఈ దిశగా రెండు జిలాలల్లోనూ మండలాల వారీగా జాబితాలను సిద్ధం చేసి స్పెషల్ డ్రైవ్‌కు చర్యలు తీసుకుంటున్నారు. తనిఖీల్లో పట్టుబడితే భారీ జరిమానా పన్ను చెల్లించని వాహనదారులు స్వచ్ఛందంగా ముందుకు రావాలని హైదరాబాద్ సంయుక్త రవాణా కమిషనర్ టి.రఘునాథ్ సూచించారు. ఒకవేళ ఇప్పటికే తమ వాహనాలు కాలం చెల్లిపోయి తుక్కు (స్క్రాప్) కింద మారినా ఆ విషయాన్ని రాతపూర్వకంగా తెలియజేయాలని పేర్కొన్నారు. అలా కాకుండా తాము నిర్వహించే ప్రత్యేక తనిఖీల్లో వాహనాలు పట్టుబడితే భారీ పెనాలిటీ చెల్లించవలసి వస్తుందని హెచ్చరించారు. చెల్లించవలసిన పన్ను మొత్తంపైన 200 శాతం వరకు అధికంగా జరిమానా ఉండవచ్చునని తెలిపారు. - జేటీసీ రఘునాథ్ -
‘హారన్ ఓకే ప్లీజ్’ ఇక వద్దు
- లారీల వెనక ఇలాంటి సంకేతాలు రాయకూడదని రవాణా శాఖ ఆదేశం - ప్రాంతీయ రవాణా కార్యాలయాలకు ఉత్తర్వులు జారీ సాక్షి, ముంబై: రవాణా వాహనాల వెనుక ‘హారన్ ఓకే ప్లీజ్’ అన్న సంకేతాలను తొలగించాలని రాష్ర్ట రవాణా శాఖ ఆదేశించింది. ఈ మేరకు అన్ని ప్రాంతీయ రవాణా కార్యాలయాలకు ఉత్తర్వులు జారీ చేసింది. ఇలా రాయడం వల్ల వెనక వస్తున్న వాహనదారులకు తప్పుడు సమాచారం వెళుతుందని పేర్కొంది. ట్రక్కు, టెంపో వంటి సరుకులు చేరవేసే భారీ వాహనాల వెనక భాగంలో హారన్ ఓకే ప్లీజ్ అని రాసి ఉండడం అందరికి తెలిసిందే. అయితే దాని వెనకు ఉన్న అసలు ఉద్దేశం.. రవాణా శాఖ నియమాల ప్రకారం ముందు వెళుతున్న వాహనాన్ని అధిగమించే (ఓవర్టేక్) సమయంలో హరన్ కొట్టాలి. అయితే ఈ విషయం తెలియక అనవసర సమయాల్లో కూడా హారన్ కొట్టడంతో పక్క వాహన చోదకులు ఇబ్బందులు పడుతుంటారు. ముందు వాహనాలు కనిపించక ప్రమాదాలు జరిగే అవకాశముంది. లోడుతో వెళుతున్న భారీ వాహనాలకు వెనక వస్తున్న సరిగా కనబడదు. దీంతో ఓవర్ టేక్ సమయంలో ప్రమాదం జరిగే ఆస్కారముంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని వాహనాన్ని అధిగమించే సమయంలో హారన్ కొట్టాలని దాని సందేశం. మరో సందేశమేమిటంటే పదే పదే హారన్ కొట్టి విసిగించవద్దు, మీరు కొట్టిన హారన్ చాలు వీలు దొరకగానే ఓవర్ టేక్ చేసేందుకు అవకాశం ఇస్తామని దాని అర్థం. కాని అలా రాసిన సందేశంవల్ల హారన్ ఎక్కడైన కొట్టవచ్చని కొందరు భావిస్తున్నారు. ఆ సందేశాన్ని సరిగా అర్థం చేసుకోక అనేక మంది డ్రైవర్లు అనవసరంగా హారన్ కొడుతూ రోడ్డుపై వెళుతున్న వారిని, ముందు వెళుతున్న వాహన చోదకులను విసిగెత్తిస్తుంటారు. హారన్ ఓకే ప్లీజ్ అంటే ఇష్టమున్న చోట హార్న్ కొట్టవచ్చని కొందరు భావిస్తున్నారని రవాణ శాఖ అభిప్రాయపడింది. దీంతో ఆ సందేశాన్ని తొలగించాలని నిర్ణయం తీసుకుంది. గత సంవత్సర కాలంలో రవాణ శాఖ పోలీసులు అనవసరంగా హారన్ కొట్టి ధ్వని కాలుష్యం చేస్తున్న 15,534 మంది డ్రైవర్లపై చర్యలు తీసుకున్నారు. వారి నుంచి రూ.13.25 లక్షలు జరిమానా వసూలు చేశారు. -
పన్ను విధింపుపై పునరాలోచించాలి
రాష్ట్ర ప్రభుత్వానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి అదనపు పన్ను భారం ప్రజలపైనే పడుతుందని ఆందోళన సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే రవాణా వాహనాలపై పన్ను విధించాలని తీసుకున్న నిర్ణయంపై తెలంగాణ ప్రభుత్వం పునరాలోచించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ విజ్ఞప్తి చేసింది. తెలంగాణ సర్కారు అదనంగా రూ. 40 కోట్ల నుంచి రూ. 50 కోట్లు ట్యాక్స్ రూపంలో లాభం చూసుకుంటే ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఆ ప్రభావం తెలంగాణ ప్రజలపై పడుతుందని పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి పేర్కొన్నారు. బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఏపీ నుంచి వచ్చే వాహనాలకు అదనపు పన్ను వసూలు చేస్తాం, ఈ విషయంలో ఇక ముందు ఎవరితోనూ చర్చలుండవని రవాణా మంత్రి మహేందర్‌రెడ్డి పేర్కొనడం సబబుగా లేదని, ఇది ఎంతమాత్రం మంచిది కాదని హితవు పలికారు. పంజాబ్, హరియాణాలకు ఛండీగఢ్ రాజధాని అని అక్కడ ఎంట్రీ ట్యాక్స్ వసూలు చేయడం లేదని గుర్తుచేశారు. అక్కడి నిబంధనలనే తెలంగాణ సీఎం కేసీఆర్ పాటిం చాలని డిమాండ్ చేశారు. విభజన చట్టంలో హైదరాబాద్ పదేళ్లు ఉమ్మడి రాజధానిగా ఉందన్న విషయం మరువకూడదన్నారు. 2 రాష్ట్రాల రవాణా విషయంలో ప్రజలు, వాహనదారుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని చెప్పా రు. తెలంగాణ సర్కారు అవలంబించిన పన్ను వసూలు విధానం ఏపీ సర్కారు కూడా అవలంబిస్తే తెలంగాణ రాష్ట్ర పరిస్థితి ఏంటో ఓసారి ఆలోచించాలని కోరారు. వాహనాలపై విధించే అదనపు పన్ను భారం చివరికి రెండు రాష్ట్రాల ప్రజలపైనే ఏదో ఒకవిధంగా పడుతుందన్నా రు. వైఎస్సార్ సీపీకి రెండు తెలుగు రాష్ట్రాలూ సమానమేనని, రెండు రాష్ట్రాల ప్రజలు ఇబ్బం దులు పడకూడదని తాము ఆలోచిస్తున్నామని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంతో సరుకు రవాణా భారంగా మారనుందని, ఉభయ గోదావరి జిల్లాల నుంచి హైదరాబాద్‌కు కూరగాయలు, పూలు, పండ్లు రవాణా అవుతుంటాయని, వీటి ధరలు కూడా పెరిగే అవకాశం ఉందని రాఘవరెడ్డి చెప్పారు. -
ట్రాన్స్పోర్ట్ వాహనాలపై విజిలెన్స్ దాడులు
కడప(ప్రొద్దుటూరు): పన్ను కట్టకండా అక్రమంగా రవాణా చేస్తున్న ట్రాన్స్పోర్ట్ వాహనాలపై విజిలెన్స్ అధికారులు దాడులు చేశారు. ఈ ఘటన గురువారం సాయంత్రం కడప జిల్లా ప్రొద్దుటూరులో చోటు చేసుకుంది. సుంకం చెల్లించకుండా తీసుకెళ్తున్న రెడిమేడ్ దుస్తులు, ఎలక్ట్రికల్ వస్తువులను గుర్తించిన విజిలెన్స్ సీఐ ఓబులేసు వాటి విలువ ప్రకారం ఆదాయపు పన్ను శాఖకు రావాల్సిన పన్ను 1.80 లక్షలుగా తేల్చారు. ఈ మొత్తాన్ని చెల్లించాల్సిందిగా విజయ, సాయిరాం ట్రాన్స్‌పోర్టు కార్యలయాలకు నోటీసులు జారీ చేశారు.