transportation departments
-
అక్రమ రిజిస్ట్రేషన్లు చేయించి అమ్మేశారు
-
రోడ్డెక్కితే 'రిస్కే'..
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. రోడ్డెక్కాలంటేనే భయపడే పరిస్థితి ఏర్పడింది. ప్రతి జిల్లాలోనూ రోడ్లు రక్తసిక్తమవుతూనే ఉన్నాయి. ఈ ఏడాది మొదటి ఏడు నెలలకు సంబంధించిన రోడ్డు ప్రమాదాలపై నివేదికను రవాణా శాఖ విడుదల చేసింది. జనవరి నుంచి జూలై వరకు 11,969 రోడ్డు ప్రమాదాలు జరిగితే.. 6,088 మంది ప్రాణాలు కోల్పోయారు. అత్యధిక ప్రమాదాలు కృష్ణా జిల్లాలో జరగ్గా.. మరణాల సంఖ్య మాత్రం తూర్పుగోదావరి జిల్లాలో ఎక్కువగా ఉంది. దీన్ని బట్టి రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేస్తున్నామంటూ ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలన్నీ కాగితాలకే పరిమితమవుతున్నాయనే విషయం స్పష్టమవుతోందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. రహదారి భద్రత కోసం ఐదు విభాగాలు(పోలీస్, రవాణా, ఆర్అండ్బీ, వైద్య, విద్యా శాఖలు) కలిసి పనిచేస్తున్నాయని చెబుతున్నా.. ప్రమాదాల సంఖ్య మాత్రం ఏటా పెరిగిపోతోంది. అటకెక్కిన రహదారి భద్రత సమావేశాలు.. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు హడావుడి చేయడం, ఆ తర్వాత వదిలేయడం రాష్ట్రంలోని రవాణా, పోలీస్ అధికారులకు పరిపాటిగా మారింది. ఏపీలో అమలవుతున్న రహదారి భద్రతపై సుప్రీంకోర్టు కమిటీ పలుమార్లు అసంతృప్తి కూడా వ్యక్తం చేసింది. డ్రైవర్ల అనుభవలేమి, ఓవర్ లోడింగ్, ఇంజినీరింగ్ లోపాలు, అధిక వేగం, మద్యం సేవించి వాహనం నడపడం, బ్లాక్‌స్పాట్స్, ప్రమాదకరమైన మలుపులు, సైన్ బోరŠుడ్స లేకపోవడం, ప్రమాదాలు జరిగినప్పుడు అందుబాటులో లేని ట్రామాకేర్ సెంటర్లు తదితరాల వల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. రహదారి భద్రత కౌన్సిల్ చైర్మన్‌గా సీఎం చంద్రబాబు వ్యవహరిస్తున్నారు. ఆయా జిల్లాల్లో కలెక్టర్లు, ఎస్పీల ఆధ్వర్యంలో రహదారి భద్రతపై సమావేశాలు జరగాలి. అయితే జిల్లాల్లో ఎవరూ ఈ సమావేశాల్ని పట్టించుకోవడం లేదు. దీనిపై ఇప్పటికే సుప్రీంకోర్టు కమిటీ ఆగ్రహం వ్యక్తం చేసినా కూడా ప్రభుత్వ తీరు మారలేదు. రాష్ట్రంలో మొత్తం 1,100 బ్లాక్‌స్పాట్స్ ఉన్నాయని గుర్తించడమే తప్ప.. వాటిని సరిచేసిన దాఖలాలే లేవు. మలుపులు లేని రహదారులను సరిచేయడం, డ్రైవర్లకు విశ్రాంతి కేంద్రాలు ఏర్పాటు తదితర అంశాలను పట్టించుకోలేదు. డ్రంకన్ డ్రైవ్.. బైక్‌లతోనే అధిక ప్రమాదాలు డ్రంకన్ డ్రైవ్, బైక్‌ల వల్లే అత్యధిక ప్రమాదాలు జరుగుతున్నాయని రవాణా శాఖ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. 52 శాతం ప్రమాదాలు డ్రంకన్ డ్రైవ్ వల్ల జరుగుతున్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇటీవలే రవాణా శాఖ రూ.10 కోట్లతో స్పీడ్ గన్లు, బ్రీత్ ఎనలైజర్లు తదితర రహదారి భద్రత పరికరాలు కొనుగోలు చేసింది. టోల్‌ప్లాజాల్లో బ్రీత్ ఎనలైజర్లతో పరీక్షలు నిర్వహించాలని సుప్రీంకోర్టు కమిటీ స్పష్టంగా పేర్కొన్నా.. రాష్ట్రంలో ఎక్కడా అమలు చేస్తున్న దాఖలాలు లేవు. -
నిలిచిన ప్రగతి చక్రం
సాక్షి, హైదరాబాద్: నూతన మోటారు వాహన చట్ట సవరణ బిల్లు–2016కు వ్యతిరేకంగా భారత రోడ్డు రవాణా సంస్థల సమన్వయ కమిటీ దేశవ్యాప్తంగా నిర్వహించిన ఒక్కరోజు సమ్మె ప్రశాంతంగా ముగిసింది. ఆర్టీసీ, ప్రైవేటు రవాణా సంఘాలు కూడా సమ్మెకు మద్దతు పలకడంతో మంగళవారం ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రతిరోజూ సుమారు 97 లక్షలమందిని గమ్యస్థానాలకు చేరవేసే 10,500 ఆర్టీసీ బస్సులు మంగళవారం సాయంత్రం దాకా డిపోలకే పరిమితమయ్యాయి. సోమవారం అర్ధరాత్రి నుంచే సమ్మె మొదలైంది. సమ్మెకు అన్ని సంఘాలు మద్దతు ప్రకటించడంతో కార్మికులెవరూ విధులకు హాజరు కాలేదు. రాష్ట్రంలోని 98 డిపోల వద్ద అన్ని కార్మిక సంఘాలు కేంద్రానికి వ్యతిరేకంగా నిరసనలు, ధర్నాలు నిర్వహించాయి. మోటారు వాహన చట్టం సవరణ బిల్లును వెంటనే వెనక్కి తీసుకోవాలని కార్మికులు డిమాండ్ చేశారు. తెలంగాణæ మజ్దూర్ యూనియన్, ఎంప్లాయీస్ యూనియన్, నేషనల్ మజ్దూర్ యూనియన్, ఏఐటీయూసీ, సీఐటీయూ, బీకేయూ, టీజేఎంయూ, ఐఎన్టీయూసీ, బీఎస్పీ సంఘాలు సమ్మెకు మద్దతు ప్రకటించాయి. ఒక్క బీఎంఎస్ అనుబంధ కార్మిక సంఘ్ మినహా కార్మికులంతా సమ్మెలో పాల్గొన్నారు. కాగా, ఆర్టీసీకి సమ్మె కారణంగా దాదాపు రూ.12 కోట్లు నష్టం వాటిల్లినట్లు అధికారులు వెల్లడించారు. పాక్షికంగా ఆటోలు, క్యాబ్‌లు.. వాస్తవానికి రాష్ట్రవ్యాప్తంగా తామూ సమ్మెలో పాల్గొంటామని ఆటోలు, క్యాబ్‌ల సంఘాలు ప్రకటించినప్పటికీ, వీరు పాక్షికంగా సర్వీసులు నడిపారు. ఆర్టీసీ ఎలాంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లుచేయకపోవంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. హైదరాబాద్‌లో ఉదయం 4 గంటల నుంచే ఆటో సర్వీసులు మొదలయ్యాయి. సమ్మె నెపంతో ప్రయాణికుల వద్ద రెట్టింపు చార్జీలు వసూలు చేశారు. జిల్లాల నుంచి హైదరాబాద్‌కు వచ్చే ప్రయాణికుల వద్ద ప్రైవేటు కార్ల డ్రైవర్లు.. సూపర్ లగ్జరీ చార్జీల కంటే రెండింతలు వసూలు చేశారు. వరంగల్, నిజామాబాద్, నల్లగొండ, విజయవాడ, షాద్‌నగర్ రూట్లలో ఈ దోపిడీ కొనసాగింది. ఏపీ నుంచి 30 శాతం బస్సులే.. ఏపీ నుంచి రావాల్సిన బస్సులపైనా సమ్మె ప్రభావం పడింది. రోజూ వచ్చే బస్సుల్లో 30 శాతం బస్సులే వచ్చాయని ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఏపీలో గుర్తింపు సంఘం ఎన్నికల హడావుడి వల్ల అక్కడి సంఘాలు పెద్దగా సమ్మెలో పాల్గొనలేదు. రైల్వే ప్రత్యేక సర్వీసులు.. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే అదనపు సర్వీసులను నడిపించింది. లింగంపల్లి –ఫలక్‌నుమా, లింగంపల్లి– సికింద్రాబాద్ మధ్య ప్రత్యేక ఎంఎంటీఎస్ సర్వీసులను నడిపించారు. కాజీపేట నుంచి సికింద్రాబాద్ మధ్య రెండు ప్రత్యేక రైళ్లు నడిచాయి. ఇంతకీ సమ్మె దేనికి? నూతన మోటార్ వాహన చట్టం సవరణ బిల్లు–2016ను చూసి రవాణా రంగంపై ఆధారపడ్డ వారంతా బెంబేలెత్తుతున్నారు. ఈ బిల్లు వల్ల దేశంలో రవాణా వ్యవస్థ కుంటుపడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కార్పొరేట్ కంపెనీలకు అనుకూలంగా ఉందని, రవాణాా రంగాన్ని నమ్ముకున్న పేద, మధ్య తరగతి కుటుంబాలకు అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ రవాణాా సంస్థల ఉద్యోగులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కొత్త చట్టం నిబంధనలివే.. - కొత్త మోటార్ వాహన చట్ట సవరణ బిల్లు–2016 ప్రకారం.. ప్రైవేటు వాళ్లు రూట్లను కొనేసుకోవచ్చు. అంటే నిత్యం లాభాలు వస్తూ, బిజీగా ఉండే రూట్లను ఏ ప్రైవేటు కంపెనీ కొనుక్కున్నా ఆ రూటులో ఆర్టీసీ బస్సు నడవకూడదు. ఉదాహరణకు తెలంగాణ నుంచి విజయవాడ చాలా రద్దీ రూటు. దీన్ని ఏదైనా ప్రైవేటు సంస్థ కొనుగోలు చేస్తే ఆ దారిలో ఆర్టీసీ బస్సులు నడపకూడదు. ఈ విధానం అమలైతే ఆర్టీసీ బస్సులు లాభాలున్న రూట్లలో తిరగలేవు. అప్పుల ఊబిలో ఉన్న ఆర్టీసీ ఉనికే ప్రశ్నార్థకంగా మారుతుంది. - థర్డ్‌పార్టీ ఇన్సూరెన్స్ క్లెయిమ్‌లు భారీగా పెంచుతున్నారని రవాణా రంగం మీద ఆధారపడ్డవారు ఆరోపిస్తున్నారు. - కొత్త బిల్లులో భారీగా జరిమానాలు పెంచారు. ఉదాహరణకు సరైన పర్మిట్లు లేకుండా నడిపిస్తే రూ.10,000 జరిమానా విధిస్తారు. - లైసెన్సు నిబంధనలకు విరుద్ధంగా వాహనం నడిపితే.. రూ.25 వేల నుంచి 1 లక్ష వరకు జరిమానా. - ఓవర్‌లోడ్‌కి రూ.20,000 జరిమానా, మూడేళ్ల పాటు డ్రైవింగ్ లైసెన్సు రద్దు. - అధిక ప్రయాణికులను ఎక్కిస్తే ఎంతమంది ఎక్కువగా ఉంటే అంతమందికి రూ.1000 చొప్పున వసూలు చేస్తారు. సాయంత్రానికి రోడ్డెక్కిన బస్సులు 24 గంటల సమ్మె అయినా సాయంత్రం 6 గంటలు దాటాక హైదరాబాద్‌లో సగం బస్సులు రోడ్డెక్కాయి. జిల్లాల్లోని డిపోల్లో కొన్ని బస్సులు రోడ్డెక్కాయి. అర్ధరాత్రి నుంచి పూర్తిస్థాయిలో బస్సు సర్వీసులు ప్రారంభం అవుతాయి. కాగా, ఆర్టీసీ సమ్మెలో పాల్గొని విజయవంతం చేసిన కార్మికులకు వివిధ యూనియన్ల నాయకులు అశ్వత్థామరెడ్డి (టీఎంయూ), నాగేశ్వర్రావు, అశోక్ (ఎన్ఎంయూ) రాజిరెడ్డి (ఈయూ), హన్మంత్ (టీజేఎంయూ) కృతజ్ఞతలు తెలిపారు. -
ఒకే శాఖగా రైల్వే, ఉపరితల రవాణా, నౌకాయానం?
- నరేంద్రమోడీ కసరత్తు - రైల్వే శాఖలో విస్తృత చర్చ సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఇప్పటి వరకు విడివిడిగా ఉన్న రైల్వే, ఉపరితల రవాణా, నౌకాయాన శాఖలను కలిపి ఇక ఒకే మంత్రిత్వ శాఖగా మార్చేందుకు.. త్వరలో ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న నరేంద్రమోడీ బృందం సమాయత్తమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ మూడింటితో కూడిన శాఖను సీనియర్ మంత్రికి కేటాయించబోతున్నట్టు సమాచారం. ఆ మంత్రి ఆధ్వర్యంలో ఒక్కో అంశానికి విడివిడిగా ముగ్గురు సహాయ మంత్రులు పర్యవేక్షించే అవకాశం ఉందని.. రైల్వే శాఖ అధికారుల్లో విస్తృత చర్చ జరుగుతోంది. పాలనలో తనదైన మార్కు చూపుతానంటున్న నరేంద్రమోడీ తన మంత్రివర్గ కూర్పులో కూడా వైవిధ్యానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటివరకు కొనసాగినట్టుగా.. ఒక్కో శాఖకు ఒక మంత్రి, అంతగా ప్రాధాన్యం లేని వాటికి సహాయ మంత్రులు ఉండే పద్ధతికి స్వస్తి చెప్పి.. రెండుమూడు విభాగాలను ఒకే గొడుగు కిందకు తెచ్చి సీనియర్ మంత్రులకు అప్పజెప్పాలని ఆయన యోచిస్తున్నట్టు సమాచారం. దీనికి సంబంధించి ఇప్పటికే రైల్వే శాఖకు సమాచారం అందిందని.. మోడీ సన్నిహితులు ఉన్నతాధికారులతో మాట్లాడి సమాచారం సేకరించారని చెప్తున్నారు. ఈ మూడు రకాల రవాణా శాఖలు ఒకే గొడుగు కింద ఉంటేనే వాటి పర్యవేక్షణలో సమస్యలు రాకుండా ఉంటాయనేది మోడీ ఆలోచనగా ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. గడ్కారీకి రైల్వే శాఖ? ఆర్థిక, హోం, రక్షణ.. ఇలా ప్రాధాన్యతా శాఖల జాబితాలో రైల్వే శాఖ కూడా ఒకటి. ప్రస్తుతం కాంగ్రెస్ ఏలుబడిలో ఉన్న మహారాష్ట్రలో త్వరలో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ రాష్ట్రాన్ని బీజేపీ ఖాతాలోకి తెచ్చే క్రమంలో కొన్ని కీలక శాఖలు ఆ రాష్ట్రానికి కేటాయించాలని మోడీ నిర్ణయించినట్టు సమాచారం. ఇందులో భాగంగా రైల్వే శాఖను కూడా ఆ రాష్ట్రానికి చెందిన ఎంపీకే ఇవ్వాలని మోడీ భావిస్తున్నారని, ఇందుకు ఆయన సన్నిహితుడైన నితిన్‌గడ్కారీ పేరును పరిశీలిస్తున్నారని రైల్వే శాఖ ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. అయితే ఇందులో ఇంకా స్పష్టత మాత్రం రాలేదనేది వారి అభిప్రాయం. రైల్వేశాఖ ద్వారా స్థానికంగా పరిస్థితులను అనుకూలంగా మలచుకోవాలని బీజేపీ భావిస్తోంది. ఇటీవలి వరకు రైల్వే శాఖ మంత్రిగా పనిచేసిన మల్లికార్జున ఖర్గే ఈ ఎన్నికల్లో విజయం సాధించేందుకు ఆ శాఖనే అడ్డుపెట్టుకొని నెట్టుకొచ్చారని అధికారులంటున్నారు. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న గుల్బర్గా నియోజకవర్గంలో గెలుపు అంత సులభం కాదని ముందే గ్రహించిన ఖర్గే, రైల్వే బడ్జెట్‌తో సంబంధం లేకుండా తన నియోజకవర్గానికి రైలు కోచ్‌ల విడిభాగాలు తయారు చేసే కర్మాగారాన్ని మంజూరు చేయించారు. గుల్బర్గా నియోజకవర్గం పరిధిలోని యద్గీర్ ప్రాంతంలో బడియాల్ గ్రామంలో గత ఫిబ్రవరిలో హడావుడిగా ఈ కర్మాగారం భూమిపూజ చేయించారు. దీనిద్వారా స్థానికులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా భారీగా ఉపాధి అవకాశాలు కలుగుతాయని ఆయన విస్తృతంగా ప్రచారం చేసుకున్నారు. ఆయన విజయంలో ఇదే కీలక పాత్ర పోషించిందని అధికారులు విశ్లేషిస్తున్నారు. మహారాష్ట్రను ఎంపిక చేయటానికి కూడా ఇలాంటి కారణం ఉందనేది వారి అభిప్రాయం.