Travel ban orders
-
‘కోవిడ్’ దిగ్బంధనం
న్యూఢిల్లీ: కోవిడ్–19 (కరోనా వైరస్) విజృంభిస్తుండటంతో వైరస్ కట్టడికి కేంద్ర ప్రభుత్వం మరికొన్ని చర్యలు తీసుకుంది. యూరోపియన్ యూనియన్, బ్రిటన్, టర్కీ నుంచి వచ్చే ప్రయాణికులు భారత్‌లో ప్రవేశించడంపై మార్చి 31 వరకూ నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది. కోవిడ్ కేసుల సంఖ్య పెరిగిపోతున్న కారణంగా ఈ ముందు జాగ్రత్త చర్య తీసుకున్నట్లు సోమవారం ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. మార్చి 18న అర్ధరాత్రి నుంచి ఈ నిషేధం అమల్లోకి రానుందని సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. సోమవారం నుంచి దేశ అంతర్జాతీయ సరిహద్దుల ద్వారా అన్ని రకాల ప్రయాణికుల రాకపోకలను నిషేధించారు. దేశం మొత్తమ్మీద వైరస్ నియంత్రణ చర్యల పుణ్యమా అని అధికశాతం విద్యార్థులకు ఇళ్లకు పరిమితమైపోగా, ఉద్యోగులు ఇళ్ల నుంచే పనిచేసే పరిస్థితి ఏర్పడింది. జిమ్‌లు, సినిమాహాళ్లు, స్విమ్మింగ్ పూల్స్ వంటివి దాదాపు అన్ని రాష్ట్రాల్లో మూసేశారు. కొత్త టోల్‌ఫ్రీ నంబర్ వైరస్‌కు సంబంధించిన సందేహాల నివృత్తి కోసం కేంద్రం సోమవారం నుంచి కొత్త టోల్‌ఫ్రీ నంబర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటివరకూ ఉన్న 011– 23978046తోపాటు 1075 నంబర్‌కు ఫోన్ చేయడం ద్వారా కోవిడ్‌కు సంబంధించిన వివరాలు తెలుసుకోవచ్చునని ఆరోగ్య శాఖ అధికారులు ప్రకటించారు. ncov2019 @gmail. comకు ఈ మెయిల్ చేయడం ద్వారా సమాచారం తెలుసుకోవచ్చు. (కరోనా బారిన పడ్డాను) నవోదయకు ముందుగానే సెలవులు కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో దేశంలోని 600 జవహర్ నవోదయ విద్యాలయాలకు ముందుగానే సెలవులు ప్రకటించనున్నారు. పరీక్షలు అయిపోతున్న నేపథ్యంలో వేసవి సెలవులను ముందుగానే ప్రకటిస్తున్నామని మార్చి 21 నుంచి మే 25 వరకూ సెలవులు కొనసాగుతాయని అధికారులు తెలిపారు. ఒడిశాలో తొలి కేసు భారతదేశంలో కరోనా కోరలు చాస్తూనే ఉంది. ఒడిశాలో సోమవారం తొలి కరోనా కేసు నమోదైంది. ఇటలీ నుంచి మార్చి 6న ఢిల్లీకి వచ్చి ఆ తరువాత రైలు మార్గం ద్వారా మార్చి 12న భువనేశ్వర్‌కు వచ్చిన 33 ఏళ్ల వ్యక్తికి కరోనా సోకినట్లు అధికారులు నిర్ధారించారు. ప్రస్తుతానికి అతడి పరిస్థితి నిలకడగానే ఉంది. లదాఖ్, కశ్మీర్, కేరళల్లో నమోదైన ఒక్కో కేసును పరిగణనలోకి తీసుకుంటే దేశం మొత్తమ్మీద సోమవారానికి ఈ వ్యాధి బారిన పడ్డ వారి సంఖ్య 114కు చేరుకున్నట్లు ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. వ్యాధి కారణంగా మరణించిన ఇద్దరితోపాటు 17 మంది విదేశీయులు, చికిత్స పొంది ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయిన వారు ఈ 114 మందిలో ఉన్నారు. ముంబైలో నలుగురు వ్యక్తులు కరోనా వైరస్ బారిన పడటంతో మహారాష్ట్రలో ఈ వ్యాధి బారిన పడ్డ వారి సంఖ్య 37కు చేరుకుంది. దేవాలయాలకు తాళాలు కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా మహారాష్ట్రలోని ప్రముఖ దేవాలయాలు, ముంబైలోని సిద్ధి వినాయక ఆలయం, ఒస్మానాబాద్లోని తుల్జా భవానీ ఆలయాలను మూసివేయనున్నట్లు దేవాలయ అధికారులు తెలిపారు. సిద్ధి వినాయక ఆలయం తదుపరి ఉత్తర్వుల వరకూ మూతపడగా.. తుల్జాభవానీ ఆలయం మంగళవారం నుంచి ఈ నెలాఖరు వరకూ మూతపడనుంది. సామూహిక సమావేశాలను నివారించాలన్న ప్రభుత్వం పిలుపు మేరకు ఈ చర్యలు తీసుకున్నట్లు సిద్ధివినాయక ఆలయం ట్రస్టు చైర్మన్ అదేశ్ భండేకర్ తెలిపారు. శక్తివంచన లేకుండా కృషి: మోదీ వైరస్ నుంచి ప్రజలను రక్షించేందుకు ప్రభుత్వం శక్తి వంచన లేకుండా అన్ని ప్రయత్నాలూ చేస్తున్నట్లు ప్రధాని మోదీ పేర్కొన్నారు. వ్యాప్తి నిరోధాల విషయంలో వైద్యులు, నర్సులు, ఆరోగ్య కార్యకర్తలు విశేష కృషి చేస్తున్నారని కొనియాడారు. (కరోనా మరణాలు @ 7007) పరిష్కారాలు సూచించండి వైరస్ నియంత్రణకు mygov. in వెబ్సైట్లో టెక్నాలజీ ఆధారిత పరిష్కారాలు సూచించాల్సిందిగా దేశ ప్రధాని మోదీ కోరారు. వ్యాధిని ఎక్కడికక్కడ నియంత్రించేందుకు పౌరులకు తగిన సమాచారం అందడం చాలా ముఖ్యం. కొంతమంది వ్యక్తులు, కంపెనీలు బయో ఇన్ఫర్మాటిక్స్, డేటాసెట్స్, వ్యాధి నిర్ధారణకు అప్లికేషన్ వంటివి అభివృద్ధి చేశారు. ఈ టెక్నాలజీలన్నింటినీ వినియోగించుకోవడం ద్వారా వైరస్‌ను కట్టడి చేయవచ్చునని పేర్కొన్నారు. వ్యాక్సిన్ పరీక్షలు షురూ వాషింగ్టన్: ప్రాణాంతక కోవిడ్‌కు విరుగుడుగా అభివృద్ధి చేసిన ఓ టీకాను అమెరికా పరీక్షిస్తోంది. అమెరికాలోని నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్ ఆర్థిక సాయంతో ఒక మహిళా వాలంటీర్‌కు ప్రయోగాత్మక టీకా వేశారు. అన్నీ సవ్యంగా సాగి ఈ పరీక్షలు విజయవంతమైతే అందరికీ అందుబాటులోకి వచ్చేందుకు మరో ఏడాదిన్నర సమయం పట్టే అవకాశముందని అధికారులు చెప్పారు. సియాటెల్‌లోని కైసర్ పెర్మనెంటే వాషింగ్టన్ హెల్త్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఆరోగ్యంగా ఉన్న 45 మంది స్వచ్ఛంద కార్యకర్తలకు ఎన్ఐహెచ్, మోడెర్నా అనే కంపెనీలు సంయుక్తంగా అభివృద్ధి చేసిన టీకాలు ఇస్తాయి. తీవ్రమైన దుష్ప్రభావాలేవీ లేనట్టు నిర్ధారించుకునేందుకు మాత్రమే ఈ ప్రయోగం చేస్తున్నామని, ఇందులో వైరస్ ఏదీ లేని కారణంగా టీకా తీసుకున్న వ్యక్తికి కోవిడ్ సోకే అవకాశమూ లేదని వివరించారు. సియెటెల్లో టీకా వేస్తున్న దృశ్యం అమెరికా, జర్మనీ మాటల యుద్ధం క్యూర్‌వ్యాక్ అనే కంపెనీ తయారు చేస్తున్న కరోనా నిరోధక టీకా ఒకటి అమెరికా, జర్మనీల మధ్య మాటల యుద్ధానికి కారణమవుతోంది. జర్మనీకి చెందిన ఈ కంపెనీ అభివృద్ధి చేస్తున్న టీకాపై తాము హక్కులు కొనుక్కుంటామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించడంపై జర్మన్లు విరుచుకుపడుతున్నారు. జర్మనీ అమ్మకానికి లేదని ఆ దేశ ఆర్థిక శాఖ మంత్రి పీటర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. డైవెల్ట్ అనే పత్రిక ప్రచురించిన కథనం ప్రకారం.. క్యూర్‌వ్యాక్ అభివృద్ధి చేస్తున్న టీకాపై హక్కుల కోసం అమెరికా 100 కోట్ల డాలర్లు ఇవ్వచూపింది. ఆ టీకా అమెరికాలో వాడాలన్నది షరతు. మరోవైపు, క్యూర్వ్యాక్లో పెట్టుబడులు పెట్టిన వారు మాట్లాడుతూ ఏ ఒక్క ప్రభుత్వానికో తాము టీకా అమ్మబోమని స్పష్టం చేశారు. సమర్థమైన టీకా అందుబాటులోకి వస్తే అది ప్రపంచ ప్రజలందరినీ రక్షించాలని కోరుకుంటున్నట్లు డైట్ హాప్ అనే పెట్టుబడిదారు వ్యాఖ్యానించారు. -
అమెరికాకు విదేశీ పర్యాటకుల తగ్గుముఖం
వాషింగ్టన్: వీసా నిబంధనలు కఠినతరం చేయడం, ట్రావెల్ బ్యాన్ కారణంగా ఈ ఏడాది జూన్ వరకు అమెరికాకు వచ్చిన విదేశీ పర్యాటకుల సంఖ్య గణనీయంగా తగ్గింది. వ్యాపార పనుల మీద వచ్చే వారి సంఖ్య దీని కన్నా మరింత పడిపోయిందని అమెరికా ట్రావెల్ అండ్ టూరిజం కార్యాలయం తన నెలవారీ నివేదికలో వెల్లడించింది. అందులోని వివరాలు... గతేడాది తొలి ఆరు నెలల కాలంతో పోలిస్తే అమెరికాలో పర్యటించిన వారి సంఖ్య నాలుగు శాతం పడిపోయింది. మెక్సికో పర్యాటకుల సంఖ్యలో 9 శాతం, బ్రిటన్ పర్యాటకుల సంఖ్యలో ఆరు శాతం తగ్గుదల నమోదైంది. వ్యాపారాల నిమిత్తం వచ్చే వారి సంఖ్య 9 శాతం పడిపోయింది. అధ్యక్షుడు ట్రంప్ ప్రయాణ నిషేధ ఉత్తర్వుల ఫలితంగా మధ్య ప్రాచ్య దేశాల నుంచి వచ్చే పర్యాటకుల సంఖ్య 30 శాతం పడిపోయింది. ఆఫ్రికా పర్యాటకుల సంఖ్య 27 శాతం తగ్గింది. ఉత్తర అమెరికా, కరీబియన్, తూర్పు ఐరోపాల నుంచి తగ్గిన పర్యాటకుల శాతం రెండంకెలకు చేరడం గమనార్హం. భారత్, వెనెజులా, అర్జెంటీనా, బ్రెజిల్ తదితర దేశాల పర్యాటకుల్లో 10 శాతానికి పైగా తగ్గిపోయారు. విచిత్రంగా అమెరికాతో యుద్ధానికి కాలు దువ్వుతున్న ఉ.కొరియా నుంచి పర్యాటకులు 18 శాతం పెరిగారు. -
డొనాల్డ్ ట్రంప్‌కు షాక్...
వాషింగ్టన్: ట్రంప్ యంత్రాంగం పలు ముస్లిం దేశాలపై విధించిన ట్రావెల్ బ్యాన్‌కు మళ్లీ చుక్కెదురైంది. తొలి రెండు నోటిపికేషన్లను నిలిపివేసిన తరహాలోనే మూడో ఉత్తర్వులనూ హవేలి ఫెడరల్ జడ్జ్ బ్లాక్ చేశారు. గత ఉత్తర్వుల మాదిరే బుధవారం నుంచి అమల్లోకి రానున్న తాజా ట్రావెల్ బ్యాన్ ఉత్తర్వులు దేశ ప్రయోజనాలకు విరుద్ధమని, ఆరు నిర్థిష్ట దేశాల నుంచి వలసలను నిరోధించడం అమెరికా ప్రయోజనాలకు భంగకరమని జడ్జి డెర్రిక్ వాట్సన్ వ్యాఖ్యానించారు. ప్రభుత్వ ఉత్తర్వులు జాతీయత ఆధారంగా వివక్షకు గురిచేయడమేనని పేర్కొన్నారు. 40 పేజీల రూలింగ్ ట్రంప్ ప్రభుత్వంలో కలకలం రేపింది. జస్టిస్ వాట్సన్ రూలింగ్ ప్రమాదకరమని, ఆయన జారీ చేసిన ఉత్తర్వులు జాతి భద్రతకు ముప్పని వైట్ హౌస్ ఆందోళన వ్యక్తం చేసింది. హోంల్యాండ్ సెక్యూరిటీ, రక్షణ, న్యాయ శాఖాధికారులు విస్తృతంగా చర్చించిన మీదట తాజాగా ట్రావెల్ బ్యాన్‌ను పకడ్బందీగా రూపొందించామని వైట్ హౌస్ వర్గాలు పేర్కొన్నాయి. అమెరికా వలస వ్యవస్థ, దేశ భద్రతకు తాజా నియంత్రణలు కనీస భద్రతా ప్రమాణాలని వైట్ హౌస్ వ్యాఖ్యానించింది. ఈ ఏడాది జనవరి, మార్చిలో ట్రంప్ విధించిన రెండు ట్రావెల్ బ్యాన్‌లకు పలు కోర్టుల్లో చుక్కెదురవగా, జూన్ చివరిలో కొద్దిపాటి మార్పులతో రెండో బ్యాన్ ఉత్తర్వుల పాక్షిక అమలుకు సుప్రీం కోర్టు అనుమతించింది. అది కూడా గత నెలలో ముగియడంతో మరికొన్ని దేశాలను జోడిస్తూ మూడో ట్రావెల్ బ్యాన్ ఉత్తర్వులను ట్రంప్ యంత్రాంగం ఇటీవల వెల్లడించింది. దీపావళీ వేడుకల్లో ట్రంప్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. వైట్‌హౌస్‌లోని ఓవల్ ఆఫీస్‌లో ఇండో అమెరికన్ అడ్మినిస్ట్రేషన్ సభ్యులతో కలిసి ఆయన దీపాలను వెలిగించారు. ఈ వేడుకల్లో ఐరాసలో భారత అంబాసిడర్ నిక్కీ హాలీ నిక్కీ హేలీ, సెంటర్ ఫర్ మెడికేర్ అడ్మినిస్ట్రేటర్ సీమా వర్మ, యూఎస్ ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమిషన్ ఛైర్మన్ అజిత్ పాయ్ తదితర భారతీయ అమెరికన్లు పాల్గొన్నారు. భారత్-అమెరికన్ కమ్యూనిటీతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొనడం చాలా గర్వంగా ఉందని తన ఫేస్బుక్ పేజ్‌లో వీడియో పోస్ట్ చేశారు ట్రంప్. భారత ప్రధాని మోదీతో ఉన్న బలమైన సంబంధాలకు తాను చాలా విలువిస్తున్నానని పేర్కొన్నారు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యాన్ని నిర్మించిన గొప్ప ప్రజలు భారతీయులని ప్రశంసించారు. దీపావళి వేడుకల్లో ట్రంప్ కుమార్తె ఇవాంక కూడా పాల్గొన్నారని వైట్ హౌస్ వర్గాలు పేర్కొన్నాయి. -
ఏం జరిగినా జడ్జిదే బాధ్యత
► ప్రయాణ నిషేధ ఉత్తర్వుల్ని అడ్డుకోవడంపై ట్రంప్ మండిపాటు ► అమెరికన్లు ఆ జడ్జినే ప్రశ్నించాలంటూ అమెరికా అధ్యక్షుడి ట్వీట్ ► పుతిన్ ను గౌరవిస్తా.. రష్యాతో కలిసి సాగడం మంచిది: ట్రంప్ వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు మళ్లీ కోపమొచ్చింది. ఈసారి ఏ దేశాధినేతో లేక వ్యతిరేకులపైనో కాకుండా ఏకంగా జడ్జిపైనే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడు ముస్లిం ఆధిక్య దేశాల నుంచి పౌరుల రాకపై నిషేధాన్ని అడ్డుకున్నందుకు శాన్ ప్రాన్సిస్కో జిల్లా జడ్జి జేమ్స్ రాబర్ట్‌ను ట్వీటర్లో తీవ్రంగా తప్పుపట్టారు. దేశంలో ఏదైనా జరిగితే అమెరికన్లు ఆ జడ్జినే తప్పుపట్టాలంటూ ట్వీట్ చేశారు. నిషేధాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తూ జేమ్స్ రాబర్ట్ శనివారం ఆదేశాలిచ్చిన సంగతి తెలిసిందే. ‘మన దేశాన్ని ఇలాంటి ఆపదలోకి ఒక జడ్జి నెడతారనే విషయం నమ్మలేకుండా ఉన్నాను. ఒకవేళ ఏదైనా జరిగితే ఆ జడ్జిని, న్యాయవ్యవస్థనే తప్పుపట్టండి. శరణార్థులు ప్రవాహంలా వస్తున్నారు. ఇది విచారకరం’ అంటూ సోమవారం ట్వీట్ చేశారు. శాన్ ఫ్రాన్సిస్కో కోర్టు ఆదేశాలపై వైట్‌హౌస్ అప్పీలును తొమ్మిదో సర్క్యూట్ కోర్టు తోసిపుచ్చిన అనంతరం ట్రంప్ వరుస ట్వీట్లు చేశారు. నిషేధం సరైనదే: సమర్ధించుకున్న ట్రంప్ ‘అమెరికాకు వచ్చే వారిని చాలా జాగ్రత్తగా తనిఖీ చేయమని హోం ల్యాండ్ సెక్యూరిటీ అధికారుల్ని ఆదేశించా. మేం చేయాల్సిన పనిని కోర్టులు చాలా కఠినం చేశాయి. జడ్జి అభిప్రాయం హాస్యాస్పదం’ అని ట్రంప్ పేర్కొన్నారు. అమెరికా ఏమైనా అమాయక దేశమా? రష్యా అధ్యక్షుడు పుతిన్ పాలనను ఒకవైపు తప్పుపడుతూనే మరోవైపు ఆ దేశానికి ట్రంప్ స్నేహ హస్తం అందించారు. పుతిన్ పాలనలో జరిగిన హత్యలతో పాటు అమెరికా చేసిన తప్పుల వల్ల ప్రపంచవ్యాప్తంగా అనేక మంది ప్రజలు మరణించారంటూ ఫాక్స్ న్యూస్ ఇంటర్వూ్యలో వెల్లడించారు. పుతిన్ హంతకుడు కదా? అని విలేకరి ప్రశ్నించగా... ‘అవును... అనేక తప్పులు జరిగాయి. అనేకమంది హత్యకు గురయ్యారు. అయితే మన వద్ద కూడా చాలామంది హంతకులు ఉన్నా రు. అమెరికాను అమాయక దేశంగా భావిస్తున్నారా?’ అంటూ ట్రంప్ ప్రశ్నించారు. రష్యా సహకారం తీసుకుంటా ఐసిస్‌పై పోరులో రష్యాతో కలసి పనిచేసేందుకు తాను సిద్ధమని డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. ‘నేను పుతిన్ ను గౌరవిస్తాను. అయితే దానర్థం స్నేహితులని కాదు. నేను అనేక మంది ప్రజల్ని గౌరవిస్తాను. అంతమాత్రాన వారితో నేను వారితో స్నేహం చేయాలని ఆశిస్తున్నట్లు కాదు. పుతిన్ రష్యా అధినేత. ఐసిస్‌పై పోరులో మనకు సాయం చేస్తే... రష్యా తో కలిసి సాగడం మంచిదని నేను చెప్పగలను’ అంటూ ప్రకటించారు. రష్యాతో సంబంధాలపై ట్రంప్ వ్యాఖ్య ల్ని డెమోక్రటిక్ పార్టీ సెనెటర్లు తప్పుపట్టారు.