tribal families
-
దూసుకొచ్చిన మృత్యువు
సాక్షి ప్రతినిధి, విజయనగరం: నిశ్చితార్థానికి వెళ్లి ఆటోలో తిరిగి వస్తోన్న గిరిజన కుటుంబాలపై మృత్యువు లారీ రూపంలో దూసుకువచ్చింది. పార్వతీపురం మన్యం జిల్లాలో బుధవారం జరిగిన ఈ ఘటనలో ఐదుగురు మరణించారు. తీవ్ర గాయాలతో మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వారిని మెరుగైన వైద్యం కోసం విశాఖలోని కేజీహెచ్‌కు తరలించారు. గాయపడిన మరో ఐదుగురు పార్వతీపురం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం అంటివలసకి చెందిన 2 కుటుంబాల్లోని 12 మంది గిరిజనులు నిశ్చితార్థం కోసం అదే మండలంలోని తుమ్మలవలసకి వెళ్లారు. మధ్యాహ్న భోజనం తర్వాత తిరిగి సొంత గ్రామానికి ఆటోలో బయల్దేరారు. 20 నిమిషాల్లో ఇళ్లకు చేరతారనగా..చోళ్లపదం శివాలయం మలుపు వద్ద ఆటోను పార్వతీపురం నుంచి కూనేరు వైపు వెళ్తున్న లారీ ఢీకొట్టింది. దీంతో ఆటో నుజ్జునుజ్జ్జయింది. ప్రయాణిస్తోన్న వారంతా ఎగిరి పడిపోయారు. ప్రమాదంలో ఊయక నరసమ్మ (54), ఊయక లక్ష్మి (48), మెల్లిక శారద(35), మెల్లిక అమ్మడమ్మ(80), ఊయక వెంకట్(55) అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయాలైన మిగతా 8 మందిని పోలీసులు పార్వతీపురం జిల్లా ఆస్పత్రికి అంబులెన్స్‌ల్లో తీసుకువెళ్లారు. వారిలో ఊయక రామస్వామి, ఊయక వెంకటేష్‌ల పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యానికి విశాఖ కేజీహెచ్‌కు రిఫర్ చేశారు. జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు, అదనపు ఎస్పీ దిలీప్కిరణ్లు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి పార్వతీపురం ఆస్పత్రికి వచ్చి క్షతగాత్రులను పరామర్శించి బాధిత కుటుంబాలను ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని చెప్పారు. -
భద్రాద్రి కొత్తగూడెం ఏర్రబోడులోని గొత్తికోయలకు అటవీ అధికారుల నోటీసులు
-
మీ కోసం 'వెదురు' చూసే బొమ్మలం!
వేలేరుపాడు: జీవనది గోదావరి చెంతన పాపికొండలుకు వెళ్లే మార్గంలో విహార యాత్రా స్థలంగా ప్రసిద్ధి చెందిన గిరిజన గ్రామం పేరంటపల్లి (పేరంటాలపల్లి). పశ్చిమ గోదావరి జిల్లా వేలేరుపాడు మండలంలో గల ఈ గ్రామంలో శ్రీరామకృష్ణ మునివాటం ఆలయం ఉంది. అక్కడ శివుణ్ణి దర్శించి.. పచ్చని ఎత్తైన కొండల నుంచి జాలువారే జలపాతాలను.. గుడి వెనుక రాళ్ల నుంచి పారే నీటిని వీక్షించే పర్యాటకులు పరవశించిపోతారు. కొండ గుట్టల మధ్య సుమారు 170 మెట్లు ఎక్కితే 500 సంవత్సరాల క్రితం మాతంగి మహర్షిచే ప్రతిష్ఠించబడిన సీతారామలక్ష్మణ ఆంజనేయ సుందర విగ్రహాలు దర్శనమిస్తాయి. సీతారామ లక్ష్మణ అంజనేయస్వామి వార్లు సజీవంగా మన ఎదుట ప్రత్యక్షమైన అనుభూతి కలుగుతుంది. ఆ పక్కనే ఉండే వాలి, సుగ్రీవుల గుట్టలు కనువిందు చేస్తాయి. ఆ గ్రామంలో సుమారు 60 కొండరెడ్డి గిరిజన కుటుంబాలు జీవిస్తున్నాయి. అందరిదీ ఒకే వృత్తి. వెదురు బొమ్మల తయారీలో వారంతా నిష్టాతులే. కొండకోనల్లో దొరికే ములస వెదురు వీరికి ఉపాధినిస్తోంది. ఆకట్టుకునే కళాకృతులు తమచుట్టూ క్రూర మృగాలుంటాయని తెలిసినా అక్కడి గిరిజనులు ప్రమాదం అంచున జీవనం సాగిస్తుంటారు. అక్కడి గిరిజనులు దారీతెన్నూ లేని గుట్టల్లో ప్రయాణించి వెదురు బొంగులను సేకరిస్తారు. వాటితో వివిధ కళాకృతులు తయారు చేస్తుంటారు. తామర, గులాబీ పువ్వులు, వివిధ అంతస్తుల భవనాలు, లాంచీలు, బోట్లు, ఫైల్ ట్రే తదితర నమూనాల రూపంలో కళాకృతులను తయారు చేస్తున్నారు. వీటివల్ల నిరంతరం ఇళ్ల వద్దే వీరికి ఉపాధి దొరుకుతోంది. ఆదివారం, సెలవు రోజులతో పాటు దసరా, శివరాత్రి, సంక్రాంతి పండుగలకు పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఇక్కడి వెదురు కళాకృతులు పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి. వీటిని కొనుగోలు చేసి జ్ఞాపికలుగా తీసుకెళ్తుంటారు. ఒక్కో బొమ్మ సైజును బట్టి రూ.50 నుంచి రూ.350 వరకు ధర పలుకుతున్నాయి. పన్నెండేళ్ల క్రితం ఐటీడీఏ ఇచ్చిన శిక్షణ కొండరెడ్ల కళా నైపుణ్యాన్ని వెలుగులోకి తెచ్చింది. వెదురు వస్తువులే మా జీవనం వెదురు బొమ్మల తయారీతోనే మేం జీవిస్తున్నాం. పర్యాటకులు వచ్చే సీజన్లో నిత్యం 5 నుంచి 10 బొమ్మలు అమ్ముతా. రోజుకు రూ.500 వరకు ఆదాయం వస్తోంది. – కోపాల యశోద, పేరంటపల్లి వీటితోనే మా కుటుంబం గడుస్తోంది నేను రోజుకు రూ.600 వరకు సంపాదిస్తున్నా. పర్యాటకులు బాగానే కొంటున్నారు. రోజుకు 15 బొమ్మలు అమ్ముతున్నాను. వీటి తయారీ, విక్రయం ద్వారానే మా కుటుంబం గడుస్తోంది. – కెచ్చెల అనురాధ, పేరంటపల్లి -
ఆకలితో అడవిలోనే..!
అసలే అడవి.. కందమూలాలే ఆహారం.. చిన్నచిన్న గుడారాలే నివాసం.. ఊర్లోకి వచ్చేందుకు కరోనా భయం.. నలభై రోజులుగా బిక్కుబిక్కుమంటూ జీవనం.. ఇదీ ఏర్పేడు మండలానికి చెందిన 225 గిరిజన కుటుంబాల దయనీయస్థితి. గురువారం ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి పర్యటనతో గిరిపుత్రుల దీనస్థితి వెలుగుచూసింది. సాక్షి, తిరుపతి : ఏర్పేడు మండలంలోని పాయల్ సెంటర్, కుక్కలగుంట, సదాశివపురం, కందాడుకు చెందిన గిరిజన కుటుంబాలకు అటవీ ఉత్పత్తులే జీవనాధారం. సమీపంలోని సదాశివకోన అటవీప్రాంతంలో లభించే ఈత ఆకులను సేకరించి కట్టలు కట్టి విక్రయించి ఆ సొమ్ముతో పొట్ట పోసుకుంటుంటారు. ఏటా జనవరిలో అడవిలోకి వెళ్లి సుమా రు 3 నెలలపాటు అక్కడే ఉండి ఈత ఆకులను సేకరిస్తుంటారు. ఈ ఏడాది కూడా సంక్రాంతి పండుగ అనంతరం 225 గిరిజన కుటుంబాలు అడవిబాట పట్టాయి. మార్చిలో తిరిగి వచ్చే సమయానికి కరోనా కలకలం రేపడంతో గ్రామాలకు చేరుకునేందుకు భయపడ్డారు. ఊర్లోవాళ్లు కూడా ఇప్పడు రావద్దని చెప్పడంతో అడవిలోనే ఉండిపోయారు. రేషన్ తీసుకునేందుకు కూడా వీలులేక అలమటిస్తున్నారు. ఆకలికి తాళలేక అడవిలో దొరికిన దుంపలనే ఆహారంగా తీసుకుంటున్నారు. జలపాతాల్లోని నీటినే తాగుతున్నారు. చిన్నచిన్న పందిళ్లు వేసుకుని తలదాచుకుంటున్నారు. పిల్లాపాపలతో అర్ధాకలితో కాలం గడుపుతున్నారు. ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి వారికి సాయం చేసేందుకు వెళ్లినపుడు తమ దీనస్థితిని ఆయనకు మొరపెట్టుకున్నారు. నేనున్నానంటూ ఎమ్మెల్యే వారికి భరోసా ఇచ్చారు.(ప్రాణాలా.. పైసలా!) దుంపలు తిని బతుకుతున్నాం కరోనా భయంతో ఇక్కడే ఉండిపోయాం. అన్నం చేసుకోవడానికి బియ్యం కొరత వచ్చింది. ఊరిలోకి వెళ్లి తెచ్చుకోలేకపోయాం. అడవిలో దొరికే దుంపలు తింటూ బతుకుతున్నాం. అంతా ఒకచోట ఉండడం వల్ల కొంత ధైర్యంగా ఉంటున్నాం. రాత్రిళ్లు కిరోసిన్ దీపాలతో నెట్టుకొస్తున్నాం. విష పురుగులు దరిచేరకుండా గుడారం ముందు చిన్నాపాటి మంట వేసుకుంటున్నాం.– రమణమ్మ, గిరిజన మహిళ అయ్యా.. ఇదే మా గూడు ఈ నీరే తాగాలి -
పేదల భూములే టార్గెట్
సాక్షి, అమరావతి: ‘‘పేదలకు చెందిన భూముల స్వాధీనంపై గత ప్రభుత్వం ఇచ్చిన జీవోలను నిలిపివేస్తాం. పేదలకు ఇచ్చిన భూములను ప్రైవేట్ సంస్థలకు బదిలీ చేసే విధానాన్ని రద్దు చేస్తాం. పరిశ్రమల పేరుతో దళితుల దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్న అసైన్డ్ భూముల వివరాలను సేకరిస్తాం. దళితులకు న్యాయం చేస్తాం. భూమి లేని గిరిజన కుటుంబాలకు రెండెకరాల చొప్పున కొనుగులు చేసి పంపిణీ చేస్తాం’’... ఇదీ 2014 ఎన్నికల మేనిఫెస్టోలో తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీ. వీలైనంత త్వరగా సేకరించండి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని తెలుగుదేశం ప్రభుత్వం తుంగలో తొక్కుతోంది. పేదల పొట్టకొట్టి పెద్దల జేబులు నింపడమే లక్ష్యంగా పని చేస్తోంది. పరిశ్రమలు, వాణిజ్య అవసరాల కోసం ప్రధానంగా పేదల భూములపైనే సర్కారు గురి పెట్టింది. పేదలకు జీవనోపాధి కోసం గతంలో కేటాయించిన అసైన్డ్, పట్టా భూములను బలవంతంగా లాక్కొని, బడా పారిశ్రామికవేత్తలకు కట్టబెడుతోంది. విశాఖపట్నం, మచిలీపట్నం, దొనకొండ, శ్రీకాళహస్తి–ఏర్పేడు పారిశ్రామిక నోడ్స్ పేరుతో 20,603.65 ఎకరాల పేదల భూములను, 22,015.27 ఎకరాల పట్టా భూములను సేకరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ భూములను ఇప్పటికే పరిశ్రమల శాఖ గుర్తించింది. గుర్తించిన భూములను వీలైనంత త్వరగా సేకరించి, ఏపీఐఐసీకి అప్పగించాలని జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలు సైతం జారీ చేసింది. నాలుగు పారిశ్రామిక నోడ్స్ కోసం అసైన్డ్, పట్టా భూములతోపాటు ప్రభుత్వ భూమి కలిపి మొత్తం 61,315.38 ఎకరాలను గుర్తించింది. చట్టమంటే లెక్కలేదా? చట్టం ప్రకారం.. పేదలకు ఇచ్చిన అసైన్డ్ భూములను ఇతరులెవరూ కొనుగోలు చేయరాదు. ఎవరైనా కొనుగోలు చేస్తే రాష్ట్ర ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకోవాలి. అలా స్వాధీనం చేసుకున్న భూమిని తొలుత కేటాయించిన పేదలు ఉంటే వారికే ఇవ్వాలి. వారు లేకపోతే ఇతర పేదలకు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే, చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం లెక్కచేయడం లేదు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలకు చరమగీతం పాడేస్తోంది. ఎస్సీ, ఎస్టీలకు భూపంపిణీ కోసం పైసా కూడా ఖర్చు చేయకపోగా, వారి భూములను ఇతర అవసరాల కోసం ప్రభుత్వమే లాగేసుకోవడం బాధాకరమని ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. -
‘వలస’ పిల్లలకు సీజనల్ హాస్టళ్లు
బొంరాస్‌పేట : డ్రాపౌట్స్ నివారణ కోసం గ్రామాల్లో వలస కుటుంబాల పిల్లలకు సీజనల్ హాస్టళ్లు ఏర్పాటు చేస్తున్నట్లు పీపుల్స్ సర్వీస్ సొసైటీ(పీఎస్ఎస్) స్వచ్ఛంద సంస్థ చైర్మన్ పరమేశ్వర్ తెలిపారు. మండల పరిధిలోని చౌదర్పల్లి జెడ్పీహెచ్ఎస్, రేగడిమైలారం ఎంపీహెచ్ఎస్లో సీజనల్ హాస్టళ్లను జెడ్పీటీసీ సభ్యురాలు జ్యోతిరెడ్డి, ఎంఈఓ రాంరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పరమేశ్వర్ మాట్లాడారు. సర్వశిక్షా అభియాన్ సహకారంతో పీఎస్ఎస్ ఆధ్వర్యంలో సీజనల్ హాస్టళ్లను నిర్వహించనున్నట్లు చెప్పారు. వలస వెళ్లిన కుటుంబాల పిల్లలకు హాస్టల్ వసతి కల్పించి, సాయంత్రం పూట ట్యూషన్ చెప్పించే ఏర్పాటు చేశామని వివరించారు. తద్వారా వలస కుటుంబాల విద్యార్థులు బడి మానేయకుండా చదువు కొనసాగిస్తారనే లక్ష్యంతో సీజన్ హాస్టళ్లు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. వీటిని ప్రధానంగా గిరిజన కుటుంబాల వారు సద్వినియోగం చేసుకోవాలని జెడ్పీటీసీ, ఎంఈఓ సూచించారు. కార్యక్రమంలో ఆయా పాఠశాలల హెచ్ఎంలు రమేశ్‌బాబు, వెంకటేశ్, ఉపాధ్యాయులు ఆనంద్‌రావు, మల్లికార్జున్ ఉన్నారు. -
వివాదంగా మారిన ఆదివాసీల ముద్దుల పోటీలు
-
వివాదంగా మారిన ఆదివాసీల ముద్దుల పోటీలు
రాంచీ : పబ్లిక్‌గా ముద్దులు పెట్టుకోవటం అనేది భారతీయ సంస్కృతిలో భాగం కాదనేది కొందరి అభిప్రాయం. అయితే ఆధునికత పేరిట ఈ మధ్య యువత పెద్దగా పట్టించుకోవటం లేదు. కానీ, జార్ఖండ్‌లో ఈ మధ్య ఓ గ్రామంలో నిర్వహించిన ముద్దుల పోటీలు వివాదానికి కేంద్ర బిందువుగా మారాయి. రాంచీకి 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాకుర్ జిల్లా డుమారియా గ్రామంలో ఈ పోటీలు నిర్వహిస్తున్నారు. ఆ ప్రాంత ఎమెల్యే సిమన్ మరాండి(జేఎంఎం) నేతృత్వంలోనే ఈ పోటీలు జరుగుతుండటం విశేషం. పెళ్లయిన గిరిజన దంపతులు ఈ పోటీల్లో పాల్గొంటారు. ఎవరు ఎంత ఎక్కువ సేపు ముద్దు పెట్టుకుంటే.. వారి మధ్య అంత ప్రేమ ఉన్నట్లు లెక్క. చివరకు మిగిలిన జంటకు బహుమతులను అందిస్తారు. ‘‘ఆదివాసీయులు అమాయకులు.. పైగా నిరక్షరాస్యులు. అందుకే వారి కుటుంబాలలో బంధాలు అంత బలంగా ఉండవు. భార్యభర్తల మధ్య ప్రేమను పెంచేందుకే ఈ పోటీ నిర్వహిస్తున్నా. ఆధునికత నేర్పించి వారిని అభివృద్ధి బాటలోకి తీసుకొస్తా’’ అని సిమన్ చెబుతున్నారు. కాగా, ఇలా బహిరంగ ముద్దులు సభ్యత కాదని ఆరోపిస్తూ మహిళా సంఘాలు మానవ హక్కుల సంఘంలో ఫిర్యాదు చేశాయి. ఇక డుమారియాలో ఈ మేళాను రెండు రోజుల పాటు నిర్వహిస్తారు. గత 37 ఏళ్లుగా సిమన్ కుటుంబ సభ్యులే ఈ ఉత్సవాలను నిర్వహిస్తూ వస్తున్నారు. విలు విద్య, గిరిజన నృత్యాలు, పరుగు పందాలు తదితర పోటీలు నిర్వహిస్తుండగా.. ఈ ఏడాదే ప్రయోగాత్మకంగా ముద్దుల పోటీని ఆయన ప్రవేశపెట్టారు. శుక్ర, శని వారాల్లో ఈ పోటీలు నిర్వహించగా.. 18 మంది దంపతులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. -
గుక్కెడు నీటి కోసం మన్యం తండ్లాట!
భద్రాచలం ఏజెన్సీలో ఆదివాసీల అరణ్యరోదన దండకారణ్యం నుంచి బొల్లం శ్రీనివాస్, సాక్షిప్రతినిధి, ఖమ్మం: ఆ ఆదివాసీలంతా దేశ పౌరులే.. వారందరికీ ఓటరు కార్డులుంటాయి.. ఓట్లు వేయించుకునే వరకే నాయకులకు వారితో పని.. ఆ తర్వాత వారి వెతలు ఎవరికీ పట్టవు! గుక్కెడు నీటి కోసం అలమటిస్తున్నా అటు వైపు తొంగి చూసేవారుండరు.. గొంతు తడుపుకునేందుకు మండుటెండల్లో మైళ్ల దూరం నడుస్తున్నా ‘అయ్యో.. పాపం’ అనే నాథుడు ఉండడు.. కరువు రక్కసికి గూడేలు విలవిలలాడుతున్నాయి. కుటుంబంలో మూడ్రోజులకు ఒకరు అని వంతులు పెట్టుకొని స్నానాలు చేసే దుస్థితి నెలకొంది. ఛత్తీస్‌గఢ్ దండకారణ్యం సరిహద్దున భద్రాచలం ఏజెన్సీ పరిధిలో ఆదివాసీ, గిరిజన గూడేల్లోని వెతలపై ‘సాక్షి’గ్రౌండ్ రిపోర్ట్. చుక్క నీరు లేదు..: ఛత్తీస్‌గఢ్ నుంచి వలస వచ్చిన వేలాది మంది ఆదివాసీ, గిరిజన కుటుంబాలు భద్రాచలం ఏజెన్సీలో నివసిస్తున్నారుు. గోదావరికి సమీపంలో ఉన్న చర్ల, వెంకటాపురం, వాజేడు మండలాలు ఛత్తీస్‌గఢ్ దండకారణ్యానికి సరిహద్దున ఉన్నాయి. ఇక్కడే పోడు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వర్షాభావంతో ఆదివాసీ, గిరిజన గూడేల్లో ఉన్న మంచినీటి బావులు పూర్తిగా ఎండిపోయాయి. అక్కడక్కడా చేతి పంపులున్నా వాటిల్లో నీళ్లు లేవు. నీళ్ల కోసం జాతరలా.... గోదావరి ఒడ్డున ఉన్న పూసూరు గ్రామం వాజేడు మండల పరిధిలోకి వస్తుంది. ఇక్కడ 200 కుటుంబాలు నివసిస్తున్నాయి. గ్రామంలో మంచినీటి బోర్లు ఎండిపోగా.. బావుల్లో కూడా నీళ్లు అడుగంటాయి. గ్రామానికి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న గోదావరి చెలమ ఇప్పుడు ఈ గ్రామం దప్పిక తీరుస్తోంది. సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు గోదావరి ఇసుక తిన్నెల్లో జాతరగా చెలమకు వెళ్లి కావడిలో, బిందెల్లో నీళ్లు తెచ్చుకుంటున్నారు. ఈ గ్రామం గోదావరి ఒడ్డునే ఉన్నా.. నీరున్న పాయంతా వరంగల్ జిల్లా ఏటూరు నాగారం సమీపంలో ఉండటంతో 2 కి.మీ. నడక తప్పడం లేదు. ఇటీవలే ఏటూరు నాగారం-వాజేడు జాతీయ రహదారిని కలిపేందుకు గోదావరిపై బ్రిడ్జిని ప్రారంభించారు. గోదావరి నీటిని చూసుకుని మురుస్తున్నా.. తాగడానికి మంచినీళ్లు మాత్రం లేవని ఈ గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. గోదారి ఒడ్డున ఎడ్జర్ల పంచాయతీ పరిధి లో ఉన్న బొమ్మనపల్లి, ముత్తారం, కొత్తూరు, ఎడ్జర్లపల్లి ఆదివాసీలు, గిరిజనుల పరిస్థితి కూడా ఇంతే! గొంతు తడుపుతున్న 40 ఏళ్ల చెలమ చర్ల మండలం పార్శికగూడేనికి సమీపంలో ఉన్న రామబ్రహ్మం చెలమ 40 ఏళ్లుగా ఆదివాసీ గిరిజన గూడేల గొంతు తడుపుతోంది. ఎంత కరువు వచ్చి నా.. ఈ చెలమలో నీళ్లుంటున్నాయి. ఈ చెలిమపై ఉన్న రామబ్రహ్మం కుంట లో నీళ్లు లేకున్నా ఇందులో ఎప్పుడూ నీళ్లుంటాయి. పార్శికగూడెం, బర్లగూడెం, రామవరం ఆదివాసీలంతా ఉదయం, సాయంత్రం ఈ చెలమ నీరు తెచ్చుకుంటారు. గూడేల్లో ఎవరింట్లో శుభకార్యం ఉన్నా.. నాలుగైదు కుటుంబాలవారు కలసి ఆ ఇంటికి ఈ చెలమ నీటిని మోస్తారు. ‘నాకు పెళ్లైన కాడ్నుంచి 40 ఏళ్లుగా ఈ చెలమ నీళ్లే తాగుతున్నాం’ అని పార్శిగూడేనికి చెందిన సారమ్మ(65) చెప్పింది. దాహం తీరాలంటే 10 కి.మీ. వెళ్లాల్సిందే.. భద్రాచలం ఏజెన్సీలో ఒక్కొక్కరి ఇంట్లో పది నుంచి 20కి పైగా పశువులు ఉంటాయి. నీళ్లు లేకపోవడంతో పశువులను గోదావరి వైపునకు పంపుతున్నారు. తెల్లవారుజామునే గ్రామాల నుంచి మేత మేసుకుంటూ బయలుదేరిన పశువులు పది కిలోమీటర్లకుపైగా ఉన్న గోదావరికి చేరుకునే సరికి సాయంత్రం నాలుగైదు అవుతుంది. ఇలా వేలాది పశువులు గోదారి బాట పడతాయి. ముందే వెళ్లిన పశువులు ఇసుకలో వేడికి నడవలేక గోదారి ఒడ్డున కాసేపు సేదతీరుతాయి. సాయంత్రం వేడి చల్లారిన తర్వాత మళ్లీ కిలోమీటరు నడుచుకుంటూ వెళ్లి ఆవల ఉన్న పాయలో నీళ్లు తాగుతాయి. తర్వాత పశువులన్నీ సమూహంగా మళ్లీ రాత్రి గ్రామాల బాట పడతాయి. దేవుడిచ్చిన నీళ్లు అవి.. సబక చిన్ని (పటేల్)... ఈయన క్రాంతినగర్ గూడేనికి నాయకుడు (పటేల్). గూడెంలో అంతా ఈయన చెప్పినట్టే నడుచుకుంటారు. గూడేనికి ముందుగా వచ్చి పదేళ్ల క్రితం నివాసం ఏర్పాటు చేసుకుంది చిన్ని కుటుంబమే. ఐదేళ్ల క్రితం వర్షాల్లేక తాగటానికి నీళ్లు లేక అడవి బాట పట్టిన చిన్నికి సోమలదేవమ్మ గుట్ట కింద కొన్ని నీళ్లు కనిపించాయి. అప్పుడు ఆ నీళ్లున్న గుంటను పెద్ద తోగుగా చేయించాడు. ఆ గుంటలో ఎప్పుడు చూసినా 10, 15 బిందెల వరకు నీళ్లు వస్తాయి. గూడెం వారు ఇప్పుడు ఈ తోగుకే వెళ్లి నీళ్లు తెచ్చుకుంటున్నారు. ఇవి తమకు దేవుడిచ్చిన నీళ్లని చిన్ని చెప్పాడు. వంతుల వారీగా స్నానం చర్ల-భద్రాచలం ప్రధాన రహదారి పక్కనే చర్ల మండల పరిధిలో బి.ఎస్.రామయ్య నగరం ఉంది. ఇక్కడ 40 వరకు ఆదివాసీ గిరిజన కుటుంబాలు నివసిస్తున్నాయి. గూడెంలో ఉన్న రెండు మంచినీటి బావులు కూడా ఎండిపోయాయి. సబ్బంపేట పంచాయతీ పరిధిలోకి వచ్చే ఈ గూడేనికి వారానికి 2 రోజులు ట్యాంకర్ల ద్వారా నీళ్లందిస్తున్నారు. ఒక్కో కుటుంబానికి మూడురోజులకు ఒకసారి ఐదు బిందెలే నీళ్లు ఇస్తున్నారు. కుటుంబంలో 3 రోజులకు ఒకరు చొప్పున వంతులవారీగా స్నానం చేయాల్సిన దుస్థితి ఉంది. పది కిలోమీటర్ల మేర ఎక్కడా బోర్లు, బావులు లేకపోవడంతో ఈ గూడెం వాసులంతా ట్యాంకర్ నీళ్లు ఎప్పుడు వస్తాయా..? అని పడిగాపులు గాస్తున్నారు. తాగడానికి నీళ్లు లేకపోవడంతో పశువులను అడవికే వదిలారు. గ్రామంలో ఉన్న రెండు బావుల్లో ఓ బావిలో రోజూ రెండు బొక్కెన్ల నీళ్లే దొరుకుతాయి. ట్యాంకర్ రాని సమయంలో మూడ్రోజుల్లో ఎవరింట్లో నీళ్లు అయిపోతే ఆ కుటుంబం బొక్కెనతో నీళ్లు తోడుకోవాలి. చెలమలే దిక్కు... ఛత్తీస్‌గఢ్ నుంచి వలస వచ్చిన 30 కుటుంబాలు చర్ల మండలం క్రాంతినగర్‌లో పోడు వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నాయి. ఈ గూడెం అంతా దండకారణ్యంలో ఉంది. గ్రామంలోని మంచినీటి బావి ఎండిపోయింది. దీంతో గ్రామస్తులు మూడు కిలోమీటర్ల దూరంలోని ఎలగలతోగు (చెలమ) నుంచి నీళ్లు తెచ్చుకుంటున్నారు. ఒక్కరోజు తెచ్చుకున్న నీటిని రెండ్రోజుల వరకు జాగ్రత్తగా వాడుకుంటారు. అడవి జంతువుల నుంచి ముప్పు ఉందని తెలిసినా గ్రామస్తులు రాత్రివేళల్లో నీళ్ల కోసం గుంపులుగా వెళ్తారు. మండువేసవిలో తమ గొంతు తడుపుతున్న ఈ తోగుకు ‘సోమలదేవమ్మ’ అని పేరు పెట్టుకున్నారు. -
నడిరేయి దాటినా చెదరని సంకల్పం
* అలుపెరుగని బాటసారి కోసం జననిరీక్షణ * ముగిసిన వైఎస్ జగన్ పర్యటన సాక్షిప్రతినిధి, కాకినాడ: ఆపన్నులకు ఆసరాగా నిలవాలన్న చెదరని సంకల్పం ముందు నడిరేయి చిన్నబోయింది. అలుపెరుగని బాటసారికి జనాభిమానం పోటెత్తింది. అయిన వారిని కోల్పోయి దుఖఃసాగరంలో ఉన్న బాధిత కుటుంబాల్లో కొండంత ధైర్యాన్ని నింపుతూ వైఎస్ఆర్కాంగ్రెస్పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి గోదావరి జిల్లాల పర్యటన సాగింది. మూడు రోజుల పర్యటనలో భాగంగా తూర్పుగోదావరిలో 185 కిలోమీటర్లు పర్యటించిన జగన్ సముద్ర వేటకు వెళ్లి మృత్యువు కబళించిన 28 మత్స్యకార కుటుంబాలను ఓదార్చారు. రంపచోడవరం ఏజెన్సీలో పెళ్లి వ్యాన్ బోల్తాపడి మృతిచెందిన తొమ్మిది మందికి చెందిన గిరిజన కుటుంబాలను పరామర్శించారు. తునిలో గురువారం సాయంత్రం ఐదు గంటలకు మొదలైన జగన్ జిల్లా పర్యటన శనివారం రాజమండ్రితో ముగిసింది. తొలిరోజు తుని నియోజకవర్గం పెరుమాళ్లపురం సెంటర్లో జరిగిన సభలో జగన్ ప్రసంగం సెజ్ బాధిత కుటుంబాలకు కొత్త ఉత్తేజాన్నిచ్చింది. తీరప్రాంత మత్స్యకారులు జగన్‌ను చూసేందుకు, మాట్లాడేందుకు ఎగబడటంతో సుమారు 75 కిలోమీటర్లు పర్యటనకు 7.30 గంటల సమయం పట్టింది. పిఠాపురం నియోజకవర్గంలో తీరప్రాంతం యు కొత్తపల్లి మండలం రామన్నపాలెం, కొత్తపట్నం గ్రామాల్లో బాధిత కుటుంబాలను పరామర్శించేసరికి రాత్రి 12.18 గంటలైంది. అయినా ఆయన అలిసిపోకుండా రెండోరోజు శుక్రవారం కాకినాడ సిటీ, రూరల్ నియోజకవర్గాల్లో తీరప్రాంత మత్స్యకార గ్రామాల్లో బాధిత కుటుంబాలను ఓదార్చారు. ఆరోజు మధ్యాహ్నం రెండు గంటలకు ఏజెన్సీ గంగవరం మండలం సూరంపాలెం చేరుకోవాల్సి ఉండగా వెల్లువలా పోటెత్తిన జనాభిమానంతో 12 గంటలు ఆలస్యంగా అక్కడకు చేరుకున్నారు. అర్ధరాత్రి దాటాక కొత్తాడ చేరుకుని పెళ్లి వ్యాన్ ప్రమాద మృతుల కుటుంబాలను పరామర్శించారు. పోలవరం ముంపు మండలాలు, రంపచోడవరం నియోజకవర్గం ఇతర మండలాల నుంచి సూరంపాలెం వచ్చిన గిరిజనులు అర్ధరాత్రి సమయం దాటిపోయినా జగన్ రాకకోసం ఎదురుచూశారు. పిల్లలతో కలిసి అక్కడే వేచి ఉన్న వందలాది మంది గిరిజనులను చూసి జగన్ చలించిపోయారు. త్వరలోనే ముంపు మండలాల్లోను పర్యటిస్తానని వారికి హామీ ఇచ్చారు. రెండవ రోజు పర్యటనలో భాగంగా ఉదయం నుంచి క్షణం విశ్రమించకుండా సుమారు 18 గంటలపాటు 60 కిలోమీటర్లు పర్యటించిన జగన్ 19 కుటుంబాలను పరామర్శించారు. కేవలం నాలుగు గంటలు నిద్ర తర్వాత శనివారం తెల్లవారుజామున సుమారు 50 కిలోమీటర్లు ప్రయాణించి రాజమండ్రి చేరుకున్న జగన్ దివంగత ఎమ్మెల్యే వంగవీటి మోహన్‌రంగా జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పశ్చిమగోదావరి జిల్లా దొమ్మేరులో మన్యంవీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహానికి, వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తర్వాత దేవరపల్లి పొగాకు వేలం కేంద్రానికి భారీగా తరలివచ్చిన పొగాకు రైతులను ఉద్దేశించి ఉద్వేగంగా మాట్లాడారు. వారికి కనీస మద్దతు కోసం చంద్రబాబు సర్కార్‌కు 10 రోజులు గడువు ఇచ్చి అప్పటికీ ధర పెంచకుంటే సమరశంఖం పూరిస్తానని హెచ్చరికలు జారీచేసి రైతుల్లో మనోధైర్యాన్నినింపారు. తూర్పుగోదావరి జిల్లా పాత రామవరంలో శుక్రవారం అర్ధరాత్రి దాటాక వైఎస్ విగ్రహానికి పూలమాల వేసి ప్రజలకు అభివాదం చేస్తున్న వైఎస్ జగన్ -
తీజ్ ఆన్‌పడిఓచ్..
కాలం మారుతున్నా.. అనాదిగా వస్తున్న తమ ఆచార వ్యవహారాలను మాత్రం గిరిజనులు వీడడం లేదు. సంప్రదాయ పండగలు, జాతరలు, ఉత్సవాలు నిర్వహిస్తూ తమ సంసృ్కతి, సంప్రదాయాలను కాపాడుకుంటున్నారు. అలాంటి ఉత్సవాల్లో తీజ్ (మొలకల) పండగ ఒకటి. శ్రావణమాసంతో ప్రారంభమయ్యే తీజ్ ఉత్సవాలు ఇప్పటికే తండాల్లో మొదలయ్యాయి. పండగ జరిగే తొమ్మిది రోజులు తండాల్లోని గిరిజన యువతులు ఆడిపాడతారు. గురువారం చందంపేట మండలం తెల్దేవర్పల్లిలో కూడా తీజ్ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో పండగ విశేషాలు, విశిష్టతలను గుర్తు చేసుకుందాం. తీజ్ పండగొచ్చింది(ఆన్‌పడిఓచ్).. తండాల్లో సంబరాలు నింపింది. లంబాడీలు ఘనంగా నిర్వహించే పండగల్లో తీజ్ ఒకటి. తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ పండగకు బతకుదెరువ ు కోసం, ఇతర పనుల కోసం, ఉద్యోగాల రీత్యా ఇతర ప్రాంతాలకు తరలివెళ్లిన వారు కూడా తమ స్వస్థలాలకు వస్తారు. పంటలు బాగా పండాలని, పెళ్లికాని యువతులకు వివాహాలు జరగాలని, మంచి భర్తలు దొరకాలని గిరిజన కుటుం బాలు తమ ఇష్టదైవమైన మేరమ్మను కొలుస్తూ ప్రతిఏటా శ్రావణమాసంలో తీజ్ జరుపుకుంటారు. కాలక్రమంలో సమాజంలో, గిరిజనుల్లో మార్పులు చోటు చేసుకున్నా తీజ్ విషయంలో మాత్రం వారు ఆనాటి సంప్రదాయాన్నే పాటిస్తుండటం విశేషం. ప్రధానంగా పెళ్లీడుకొచ్చిన యువతులకు ఈ పండగ ప్రత్యేకం. మంచి జరుగుతుందని.. గిరిజనుల ఆరాధ్యదైవమైన శీతల భవానీలు(ఏడుగురు దేవతలు) మేరమ్మతల్లి, తుల్జాభవానీ, ద్వాళంగర్ అమ్మవారు, పెద్దమ్మతల్లి, ముత్యాలమ్మతల్లి, ఎల్లమ్మ తల్లి దేవతలను తలుచుకుంటూ ఈ తీజ్ పండగను నిర్వహిస్తుంటారు. దీంతో తండాకు ఎలాంటి కీడు రాదని, మంచి జరుగుతుందని గిరిజనుల నమ్మకం. అదే విధంగా పెళ్లి కాని యువతులు మాత్రమే ఈ పండగను నిర్వహించడం వల్ల వారికి మంచి గుణగణాలు కల్గిన భర్తలు దొరుకుతారనేది వారి విశ్వాసం. వర్షాలు కురుస్తాయని, పంటలు సమృద్ధిగా పండుతాయని కూడా నమ్ముతారు. తీజ్ పండగకు వారి ఆర్థిక స్థోమతను బట్టి గిరిజన యువతులకు నూతన వస్త్రాలు కొనుగోలు చేస్తారు. అంతేగాక ఇంటి ఆడపడుచులు ఇళ్లకు రావడంతో తండాల్లో సందడి నెలకొంటుంది. ప్రత్యేక పూజలు ప్రతిరోజు యువతులు స్నానమాచరించి ఆగరబత్తులతో తీజ్ బుట్టలకు మూడు సార్లు పూజలు చేస్తారు. అంతేగాక ప్రతిరోజు వారివారి బుట్టలలో నీళ్లు పోసి, కొబ్బరికాయలు కొట్టిమొక్కులు చెల్లిస్తారు. ఇలా ఎమిదవరోజు డంబోలి పండగను నిర్వహిస్తారు. ఆ రోజున ప్రతి ఇంటి నుంచి పూజారి బియ్యం, బెల్లం సేకరించి తీజ్ బుట్టలు ఏర్పాటు చేసిన చోట అన్నింటినీ కలిపి పాయసం తయారుచేస్తాడు. అంతేగాక తండా నుంచి గొర్రె పొట్టేళ్లను ఒకేచోట కోసి ప్రతి ఇంటికి ఆ మాంసాన్ని భాగాలుగా చేసి పంపిస్తారు. పాయసాన్ని ముద్దలుగా చేసి ప్రతి ఇంటికి అంద జేస్తారు. 9వ రోజు సాయంత్రం పందిరిపై నుంచి బుట్టలను తీసి కింద ఉంచి వాటి చుట్టూ పాటలు పాడుతూ ఆటలు ఆడుతారు. అదేవిధంగా తండాకు చెందిన పురుషులు తీజ్ బుట్టల వద్ద వరుసగా కూర్చుంటారు. అనంతరం యువతులు పెరిగిన గోధుమ గడ్డిని తెంచి పురుషుల తలలు, చెవులలో పెడతారు. అనంతరం ఆ బుట్టలను చెరువులో నిమజ్జనం చేసి అక్కడే సోదరుని వరుసయ్యే పురుషులు యువతుల కాళ్లను కడిగి వారిని ఇళ్లలో చేసుకొచ్చిన పంటలను(కేత్) తినిపించడం ఆనవాయితీ. పురుషులపై వేసిన ఆకులను ఇంటికి తీసుకెళ్లి దేవుని వద్ద భద్రపరుస్తారు. రోజూ వాటికి పూజలు చేస్తుంటారు. -
గిరిజనులపై టీడీపీ మాయూజాలం
శ్రీకాళహస్తి రూరల్, న్యూస్‌లైన్: ఎన్నికల వేళ టీడీపీ నాయుకులు ఓ వివాదాస్పద కార్యక్రవూనికి శ్రీకారం చుట్టారు. ఎన్నికల్లో గెలిచి పదవిలో ఉన్న ఐదేళ్లు పలకరించని నాయుకులు ఇంటి స్థలాలకు సంబంధించి వుంజూరు పట్టాలను చేతికందించడం తో అవాక్కవడం గిరిజనుల వంతైంది. శ్రీకాళహస్తి వుండలం అక్కుర్తి ఎస్టీకాలనీకి చెందిన 30 వుంది గిరిజన కుటుంబాలకు తహశీల్దార్ వుుద్రతో కూడిన ఇంటి నివేశనస్థలాలకు సంబంధించిన పట్టాలను సోవువారం రాత్రి స్థానిక టీడీపీ నాయుకులు పంపిణీ చేశారు. ఎస్టీ కాలనీలో 60కుటుంబాలు ఉంటున్నారుు. అరుుతే వీరిలో చాలావుందికి ఇంటిపట్టాలు లేవు. స్థలాలు లేకపోవడంతో చాలా అవస్థలను ఎదుర్కొంటున్నారు. అరుుతే వారి అవసరాలను గుర్తించిన టీడీపీ నాయుకులు ఓట్లకోసం సరికొత్త జిమ్మిక్కు రాజకీయూలకు నాంది పలికారు. 30వుందికి ఇంటిపట్టాలు వుంజూరయ్యూయుంటూ స్థానికనాయుకులతో వారికి పంపిణీ చేశారు. అరుుతే ఆ పట్టాల్లో ఇంటిస్థలం ఎక్కడ ఇస్తున్నారో... సర్వేనెంబరు, పట్టానెంబరు, తేదీ వంటి వివరాలేమీ నమోదు చేయుకుండా బాధితుల ఫొటోలతో మాత్రమే అందించారు. ఈ పట్టాలపై తహశీల్దార్ సంతకాలు రెండురకాలుగా కనిపిస్తున్నారుు. ఈ సంతకాలను బట్టిచూస్తే బోగస్‌పట్టాలని తేటతెల్లవువుతోంది. అరుుతే తహశీల్దార్ వుుద్ర పట్టాలపై ఉండడాన్ని బట్టిచూస్తే రెవెన్యూ కార్యాలయు అధికారుల ప్రమేయుంతోనే బోగస్‌పట్టాలు రూపుదిద్దుకున్నాయున్న అనువూనాలు వ్యక్తవువుతున్నారుు. ఈ వ్యవహారం బయుటకు పొక్కడంతో గ్రావూనికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయుకులు తవు అధినాయుకత్వం దృష్టికి తీసుకెళ్లి, రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసేందుకు సిద్ధవువుతున్నారు. -
మావోయిస్టుల హింస.. ఛత్తీస్‌గఢ్ నుంచి 70 కుటుంబాల వలస
మావోయిస్టులు పెడుతున్న చిత్రహింసలు తట్టుకోలేక.. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం నుంచి దాదాపు 11 కుటుంబాలు ఖమ్మం జిల్లాకు వలస వచ్చాయి. మొత్తం 70 కుటుంబాలు అక్కడి నుంచి బయల్దేరాయి. వేర్వేరు గ్రామాలకు వెళ్లిన వారిలో 11 కుటుంబాలు మాత్రం వాజేడు ప్రాంతానికి చేరుకున్నాయి. తమకు భోజనాలు పెట్టడం లేదని ఒకవైపు మావోయిస్టులు... మరోవైపు మావోయిస్టులకు సహకరిస్తున్నారంటూ పోలీసులు వేధిస్తున్నారని, ఈ వేధింపులను తట్టుకోలేకనే తాము ఛత్తీస్‌గఢ్ నుంచి వలస వచ్చేశామని ఆయా కుటుంబాల వారు చెప్పారు. ఓఎస్డీ తిరుపతి వారిని పరామర్శించారు. వారికి నెల రోజులకు సరిపడ నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. నిజ నిర్ధారణ కమిటీలు, ప్రజాసంఘాలు ఇలాంటి బాధితులను ఏమాత్రం పట్టించుకోవట్లేదని ఈ సందర్భంగా ఆయన మండిపడ్డారు. ఎప్పుడైనా ఎన్కౌంటర్లు జరిగితే అవి బూటకం అంటున్నారని, మరి ఈ గిరిజనుల వాదన వారికి కనపడట్లేదా అని ప్రశ్నించారు. ప్రజల కోసం పాటు పడుతామని చెప్పే మావోయిస్టులు చేసేది ఇదేనా అని ఆయన నిలదీశారు.