మాట్లాడుతున్న జెడ్పీటీసీ సభ్యురాలు జ్యోతిరెడ్డి
బొంరాస్‌పేట : డ్రాపౌట్స్ నివారణ కోసం గ్రామాల్లో వలస కుటుంబాల పిల్లలకు సీజనల్ హాస్టళ్లు ఏర్పాటు చేస్తున్నట్లు పీపుల్స్ సర్వీస్ సొసైటీ(పీఎస్‌ఎస్) స్వచ్ఛంద సంస్థ చైర్మన్ పరమేశ్వర్ తెలిపారు. మండల పరిధిలోని చౌదర్‌పల్లి జెడ్పీహెచ్‌ఎస్, రేగడిమైలారం ఎంపీహెచ్‌ఎస్‌లో సీజనల్ హాస్టళ్లను జెడ్పీటీసీ సభ్యురాలు జ్యోతిరెడ్డి, ఎంఈఓ రాంరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పరమేశ్వర్ మాట్లాడారు. సర్వశిక్షా అభియాన్ సహకారంతో పీఎస్‌ఎస్ ఆధ్వర్యంలో సీజనల్ హాస్టళ్లను నిర్వహించనున్నట్లు చెప్పారు. వలస వెళ్లిన కుటుంబాల పిల్లలకు హాస్టల్ వసతి కల్పించి, సాయంత్రం పూట ట్యూషన్ చెప్పించే ఏర్పాటు చేశామని వివరించారు. తద్వారా వలస కుటుంబాల విద్యార్థులు బడి మానేయకుండా చదువు కొనసాగిస్తారనే లక్ష్యంతో సీజన్ హాస్టళ్లు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. వీటిని ప్రధానంగా గిరిజన కుటుంబాల వారు సద్వినియోగం చేసుకోవాలని జెడ్పీటీసీ, ఎంఈఓ సూచించారు. కార్యక్రమంలో ఆయా పాఠశాలల హెచ్‌ఎంలు రమేశ్‌బాబు, వెంకటేశ్, ఉపాధ్యాయులు ఆనంద్‌రావు, మల్లికార్జున్ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment