Tribal language
-
గిరిజన భాషలో విద్యార్థులకు పాటలు
-
గిరిజన భాషలో మాట్లాడితే ఫైన్
సాక్షి, అక్కన్నపేట: గిరిజన విద్యార్థుల మాతృ భాషపై కేజీబీవీ ప్రత్యేకాధికారి ఆంక్షలు విధిస్తున్నాడు. ఆ భాషలో మాట్లాడితే జరిమానా చెల్లించాలంటూ ఎస్ఓ హుకుం జారీ చేస్తున్నాడు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట కేజీబీవీ ఆశ్రమ పాఠశాలలో ఇది జరుగుతోంది. అకౌంటెంట్ ఉన్నప్పటికీ అన్నీ వ్యవహారాలు ఎస్ఓ చేతి మీదుగా సాగుతున్నాయని, నిధుల దుర్వినియోగంతో పాటు ఆమె ఆడిందే ఆట.. పాడిందే పాట.. అన్న చందంగా పరిస్థితి తయారైందని ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. ఎస్ఓ విషయం తెలుసుకున్న గిరిజన సంఘాల నాయకులు భగ్గుమంటున్నారు. సోమవారం అక్కన్నపేట మండల ఎంపీపీ మాలోతు లక్ష్మి కేజీబీవీ బాలికల విద్యాలయాన్ని తనిఖీ చేశారు. విద్యార్థులతో మాట్లాడి ఆరా తీశారు. మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారా? అని తెలుసుకున్నారు. కాగా, తరగతి గదిలో ‘గిరిజన భాషలో మాట్లాడితే ఫైన్’వేస్తున్నారని ఓ గిరిజన విద్యార్థిని తెలిపింది. ఎంపీపీ మాట్లాడుతూ తమ సమస్యలను చెప్పుకోవడానికి విద్యార్థులు భయపడుతున్నారని, గిరిజన భాషలో మాట్లాడితే ఫైన్ విధించడాన్ని తప్పుపట్టారు. -
గోండు లిపి పుస్తకావిష్కరణ
దేశంలో ప్రథమంగా వెలుగులోకి... హైదరాబాద్, న్యూస్‌లైన్: ఆదివాసి గోండు లిపి పుస్తకాలను, ప్రత్యేక ఫాంట్లను శుక్రవారమిక్కడి సెంట్రల్ యూనివర్సిటీలో ఆవిష్కరించారు. దళిత్, ఆదివాసి అధ్యయనం, అనువాద విభాగం ఆధ్వర్యంలో అంతర్జాతీయ భాషా దినోత్సవంలో భాగంగా హైకోర్టు న్యాయమూర్తి ఎల్.నర్సింహారెడ్డి వీటిని అవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ వెలుగులో లేని అదివాసి, గిరిజన భాషలకు ప్రాచుర్యం కల్పించేందుకు విశ్వవిద్యాల యాలు కృషిచేయాలని సూచిం చారు. ప్రత్యేక ఫాంట్, పుస్తకాల ప్రచురణ ద్వారా ఈ గిరిజన భాషలకు జీవం కల్పించిన వాళ్లమయ్యామన్నారు దేశంలో మొదటిసారిగా గోండు లిపిలో పుస్తకాల ఆవిష్కరణ, ఫాంట్లను వెలుగులోకి తెచ్చామని సీడీఏఎస్టీ డెరైక్టర్ ప్రొఫెసర్ కృష్ణ చెప్పారు. కార్యక్రమానికి హెచ్‌సీయూ వీసీ రామకృష్ణ రామస్వామి, సీడీఏఎస్టీ విజిటింగ్ ప్రొఫెసర్ జయధీర్ తిరుమలరావు, ఐటీడీఏ ఉట్నూర్ ప్రాజెక్టు అధికారి జనార్దన్ నివాస్ తదితరులు హాజరయ్యారు.