tripura government
-
పీడీ.. వ్యక్తిగత స్వేచ్ఛపై దండయాత్రే: సుప్రీం
న్యూఢిల్లీ: ముందస్తు నిర్బంధం(పీడీ) అనేది పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛపై తీవ్రమైన దండయాత్రేనని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. ఇలాంటి చర్యలు చేపట్టే విషయంలో రాజ్యాంగం, చట్టాలు కల్పించిన రక్షణలు, నియమ నిబంధనలకు కట్టుబడి ఉండాలని స్పష్టం చేసింది. 2021 నవంబర్ 12న త్రిపుర ప్రభుత్వం జారీ చేసిన పీడీ ఉత్తర్వును ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యు.యు.లలిత్, జస్టిస్ ఎస్.రవీంద్ర భట్, జస్టిస్ జేబీ పార్దీవాలాల ధర్మాసనం శుక్రవారం కొట్టివేసింది. పీఐటీఎన్‌డీపీఎస్ చట్టం–1988 కింద అరెస్టు చేసిన నిందితుడిని వెంటనే విడుదల చేయాలని çఆదేశించింది. పీడీ చట్టం కింద అరెస్టు చేస్తే నిందితులు ఏడాదిపాటు జైల్లోనే ఉండాల్సి వస్తోందని, దీనివల్ల వారికి తమపై నమోదైన కేసుల్లో నిరపరాధినని నిరూపించుకొనే అవకాశం లేకుండా పోతోందంది. ప్రచారం కోసం ఇక్కడికి రావొద్దు కేవలం ప్రచారం కోసం న్యాయస్థానానికి రావొద్దని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల(ఈవీఎంల)ను ఎన్నికల సంఘం (ఈసీ) కాకుండా కొన్ని కంపెనీలు నియంత్రిస్తున్నాయంటూ మధ్యప్రదేశ్‌కు చెందిన జన్ వికాస్ పార్టీ వేసిన పిటిషన్‌పై Ôజస్టిస్ ఎస్కే కౌల్, జస్టిస్ ఏఎస్ ఓకాల ధర్మాసనం విచారణ చేపట్టింది. ‘దేశంలో దశాబ్దాలుగా ఈవీఎంలు వాడకంలో ఉన్నాయి. కానీ, ఎప్పటికప్పుడు సమస్యలు లేవనెత్తేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అటువంటిదే ఇది. ఓటర్ల ఆదరణ పెద్దగా పొందలేని ఓ రాజకీయ పార్టీ ఇటువంటి పిటిషన్ల ద్వారా గుర్తింపు పొందాలని ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది’అని ధర్మాసనం పేర్కొంది. నాలుగు వారాల్లోగా సుప్రీంకోర్టు గ్రూప్–సి ఉద్యోగుల సంక్షేమ సంఘంలో రూ.50 వేలు జమ చేయాలని ఆదేశిస్తూ పిటిషన్‌ను కొట్టివేసింది. -
వామపక్ష రాష్ట్రంలో యోగా తప్పనిసరి
అది ఓ వామపక్ష పాలిత రాష్ట్రం. అయినా అక్కడి విద్యార్థులకు యోగా తప్పనిసరి చేశారు. గుజరాత్ తర్వాత అలా చేసిన ఏకైక రాష్ట్రం.. త్రిపుర! అవును.. జనవరి 1 నుంచి ఆ రాష్ట్రంలో 1-8వ తరగతి వరకు చదివే విద్యార్థులందరూ తప్పనిసరిగా యోగా నేర్చుకోవాలని ఉత్తర్వులు జారీ అయ్యాయి. తొలిదశలో రాష్ట్రంలోని వంద స్కూళ్లలో దీన్ని అమలుచేస్తామని, క్రమంగా అన్నింటికీ విస్తరిస్తామని ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి తపన్ చక్రవర్తి చెప్పారు. పట్టణ, గ్రామీణ, త్రిపుర ట్రైబల్ ఏరియాస్ అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్ (టీటీఈఈడీసీ) ప్రాంతాల నుంచి ఈ స్కూళ్లను ఎన్నుకుంటారు. ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. పిల్లల మానసిక, శారీరక ఆరోగ్యం కోసం యోగాను నేర్పిస్తామని తపన్ చక్రవర్తి తెలిపారు. దీనివల్ల భావితరాలు క్రమశిక్షణతో ఉంటాయని ఆయన అన్నారు. ముందుగా కొంతమంది టీచర్లకు యోగాలో శిక్షణ ఇప్పిస్తామని, వాళ్లు పిల్లలకు నేర్పిస్తారని చెప్పారు. ఈ నిర్ణయాన్ని కొంతమంది స్వాగతిస్తుండగా, మరికొందరు మాత్రం అనవసరమని కొట్టిపారేస్తున్నారు. మాణిక్ సర్కార్ ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోదీని మంచి చేసుకోడానికే యోగా ప్రవేశపెడుతోందని ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. రాష్ట్ర బీజేపీ వర్గాలు మాత్రం.. ఈ నిర్ణయాన్ని స్వాగతించాయి. -
ఉపాధ్యాయ పోస్టుల నిలుపుదలపై సుప్రీంకు..
అగర్తలా: గత 2010 ఉపాధ్యాయ పోస్టుల భర్తీని వెంటనే నిలిపివేయాలని త్రిపుర హైకోర్టు ఆదేశాలు జారీ చేయడంతో అక్కడి రాష్ట్ర ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఎట్టకేలకు 10, 323 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చే్ద్దామని భావించిన అక్కడి ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు మరింత నీరు గార్చాయి. గత నోటిఫికేషన్ లో పోస్టులను రద్దు చేసి తాజాగా ఉపాధ్యాయ ఉద్యోగుల భర్తీ చేయాలని మే 7 వ తేదీన హైకోర్టు ఆదేశాలు జారీ చేయడంతో ప్రభుత్వానికి గట్టి షాక్ తగిలింది. ఈ తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళతామని ప్రభుత్వం తెలిపింది. దీనికి సంబంధించి న్యాయ సలహా కోరేందుకు రాష్ట్ర అడ్వకేట్ జనరల్ కు ప్రభత్వం ఆహ్వానం పంపింది. ఈ తీర్పుకు సంబంధించి అక్కడి ముఖ్యమంత్రి మానిక్ సర్కార్ మీడియాతో మాట్లాడుతూ.. 2010 ఉపాధ్యాయ భర్తీని నిలిపివేయమని హైకోర్టు తీర్పును సవాల్ చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఉపాధ్యాయ పోస్టుల నిలుపుదల తీర్పుపై తప్పకుండా తాము సుప్రీంకోర్టుకు వెళతామని స్పష్టం చేశారు. పోస్టు గ్రాడ్యుయేట్ పరిధిలో 1, 100, గ్రాడ్యుయేట్ పరిధిలో 4, 617, అండర్ గ్రాడ్యుయేట్ పరిధిలో 4, 606 పోస్టులను భర్తీ చేసేందుకు సిద్ధం చేసుకున్న తరుణంలో హైకోర్టు తీర్పు త్రిపుర ప్రభుత్వాన్ని డోలాయమాన పరిస్థితిల్లోకి నెట్టింది. కొన్ని ప్రతిపక్షాలు త్రిపుర ప్రభుత్వానికి బాసటగా నిలుస్తుండగా, ప్రధాన ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్, బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ లు హైకోర్టు తీర్పును ప్రశంసించాయి. దీనికి ప్రతిచర్యగా ముఖ్యమంత్రి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ ఆ పార్టీలు డిమాండ్ చేశాయి.