trisur
-
Nalini Jameela: అందుకే ‘సెక్స్ వర్కర్’గా మారింది.. కానీ ఇప్పుడు
Nalini Jameela Gets Kerala Film Award: నళినీ జమీలా తన ఆత్మకథ రాసి సంచలనం రేపింది కేరళలో.ఎందుకంటే ఆమె జీవితం ‘సెక్స్ వర్కర్’గా గడిచింది. ‘ఒక సెక్స్ వర్కర్ ఆత్మకథ’గా వచ్చిన ఆ పుస్తకం ఎన్నో భాషల్లో అనువాదం అయ్యింది. ఆ తర్వాత సాధారణ జీవితం గడుపుతున్న నళిని తాజాగా ఒక సినిమా కోసం కాస్ట్యూమ్ డిజైనర్‌గా పని చేసింది. ఆమె ఎంత బాగా పని చేసిందంటే 2020 సంవత్సరానికి గాను శనివారం కేరళ ప్రభుత్వం ప్రత్యేక అవార్డు ప్రకటించింది. నిజంగానే ఆమెది ఒక చిత్రమైన ప్రయాణం.. సెక్స్‌వర్కర్‌గా జీవించడంలో ఆత్మగౌరవాన్ని కోల్పోవడం, సమాజాన్ని ఎదుర్కొనడం కంటే పోలీసుల హింసని, విటుల దాష్టీకాన్ని భరించడం కష్టం. 2005లో కేరళలోని త్రిశూర్ జిల్లాలోని కల్లూర్ అనే చిన్న ఊరి నుంచి నళినీ జమీలా 52 ఏళ్ల వయసులో తన జీవితం ఆధారంగా ‘ఒక సెక్స్‌వర్కర్ ఆత్మకథ’ పేరుతో పుస్తకం రాసి దేశంలో ఒక రకమైన సంచలనం రేపింది. ఆ పుస్తకం స్త్రీలు గతిలేని స్థితుల్లో ఎలా సెక్స్ వర్కర్లుగా మారుతారో చెప్పడమే కాదు పోలీసులు, సంఘంలోని పెద్ద మనుషులు, కుటుంబం ఎలా సెక్స్‌వర్కర్లను కీలుబొమ్మలుగా చేస్తారో కూడా చెప్పింది. అంతే కాదు... మగవారి ప్రవర్తన మీద లోతైన పరిశీలనలు చేసింది. దేశంలోని అనేక భాషలతో పాటు తెలుగులో కూడా వెలువడ్డ ఈ పుస్తకం (హెచ్‌బిటి ముద్రణ) పెద్ద చర్చను లేవదీసింది. ఇప్పుడు ఆ నళినీ జమీలా తన 67వ ఏట ఒక సినిమా కాస్ట్యూమ్ డిజైనర్‌గా కేరళ ప్రభుత్వ ప్రత్యేక అవార్డు పొందడం పెద్ద విశేషంగా మారింది. నళినీ జమీలాను ఒక విశేష వ్యక్తిగా మళ్లీ చర్చకు తెచ్చింది. భర్త మరణించాక నళినీ జమీలా బాల్యం ఏమీ సౌకర్యంగా నడవలేదు. తండ్రి పిల్లల్ని దగ్గరకు తీసేవాడు కాదు. పెళ్లయ్యాక ఇద్దరు అమ్మాయిలు పుట్టాక భర్త కేన్సర్‌తో మరణిస్తే జరుగుబాటు చాలా కష్టమైంది. కొన్నాళ్లు ఇంటి పనులు వెతుక్కున్న జమీలాకు ఒక స్నేహితురాలు వ్యభిచార వృత్తి గురించి చెప్పింది. ఆమే జమీలాను ఒక పోలీస్ ఆఫీసర్ దగ్గరకు పంపింది. ఆ గెస్ట్‌హౌస్ నుంచి తెల్లవారుజామున ఇంటికి వెళుతుంటే పోలీసులు ఆమెను పట్టుకుని హింసించడంతో జమీలా సెక్స్‌వర్కర్ జీవితం మొదలవుతుంది. ఆ లైఫ్‌లో ఆమె ఎందరో పోలీసుల, విటుల, గూండాల టార్చర్‌ను అనుభవించింది. అయినా సరే కూతుళ్ల కోసం రాటుదేలుతూ వృత్తిలో కొనసాగింది. దాని నుంచి బయట పడ్డాక కొందరు మిత్రుల సూచన మేరకు ఆత్మకథ రాసి సంచలనం రేపింది. ఆ పుస్తకం తెచ్చిన పేరుతో మరో మూడు నాలుగు పుస్తకాలు వెలువరించింది. రచయిత్రిగా, సెక్స్‌వర్కర్ల విముక్తికి పని చేసే యాక్టివిస్ట్, రిలేషన్స్ కౌన్సిలర్‌గా పని చేస్తూ వస్తున్న జమీలాకు ఇంత పేరు ఉన్నా ఆమెను ఆమె గతం వెంటాడుతూనే ఉంది. ‘సెక్స్‌వర్కర్లకు ఎవరూ ఇల్లు అద్దెకు ఇవ్వరు. నేను ఇంటి కోసం ఎన్ని బాధలు పడుతున్నానో నాకే తెలుసు. ఒకరకంగా నేను ఇప్పటికీ నా మొఖం దాచుకుని దొంగబతుకు బతకాల్సి వస్తోంది’ అంటుంది జమీలా. ‘సెక్స్‌వర్కర్ల పట్ల కేరళలో దారుణమైన చిన్నచూపు ఉంది. తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల్లో కొంచెమైనా వారితో మెరుగ్గా ప్రవర్తిస్తారు. సెక్స్‌వర్కర్లు పొట్టకూటి కోసం ఆ పని చేస్తారు. ఆడపిల్లలను ఆ వృత్తిలో దింపే ట్రాఫికర్స్ దుర్మార్గులు. ఆ తేడాను నేను సమాజానికి పదే పదే తెలియచేస్తున్నాను’ అంటుందామె. కాస్ట్యూమ్ డిజైనర్‌గా ప్రఖ్యాత సినిమాటోగ్రాఫర్ సంతోష్ శివన్ తమ్ముడు సంజీవ్ శివన్ జమీలా జీవితం మీద ‘సెక్స్, లైస్ అండ్ ఏ బుక్’ అనే డాక్యుమెంటరీ తీశాడు. తన జీవితం ఆధారం గా ఒక సినిమా రావాలని జమీలాకు ఉందికాని అది ఇంకా కార్యరూపం దాల్చలేదు. ఈలోపు ఇటీవల ‘భరతపుజా’ అనే సినిమాకు ఆమెకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా పని చేసే అవకాశం వచ్చింది. ‘ఆ సినిమా దర్శకుడు మణిలాల్ నాకు చాలాకాలం నుంచి తెలుసు. ఆ కథ కూడా ఒక సెక్స్‌వర్కర్ జీవితానికి సంబంధించిందే. అందుకని మీరు ఆమె కాస్ట్యూమ్స్ చూడండి అని కోరాడు. సరేనన్నాను. మధ్య వయసులో ఉన్న ఆ హీరోయిన్ (నటి సిజి ప్రదీప్) బట్టలను నేను ఆ వయసులో ఎలాంటి బట్టలు కడుతూ వచ్చానో ఎలా కనిపించానో దాని ఆధారంగా డిజైన్ చేశాను. 13 చీరలు మాత్రమే కొన్నాను. వాటిలో పూనమ్ చీరలే ఎక్కువ. మరో రెండు ఆ తర్వాత కొనాల్సి వచ్చింది. రాత్రిళ్లు గాఢమైన రంగుల చీరలను, పగలు తేలిక రంగుల చీరలను హీరోయిన్ కోసం ఉపయోగించాను. యూనిట్‌తో పాటు నేనూ ఉన్నాను. ఆ సినిమాకు కేరళ ప్రభుత్వం ప్రత్యేకంగా నాకు అవార్డు ఇవ్వడం ఊహించలేకపోతున్నాను. నా జీవితంలో ఇది నాకు గొప్ప ఘనత’ అంది జమీలా. వృద్ధ సెక్స్‌వర్కర్ల కోసం ‘ఒకప్పుడు విమానం ఎక్కితే చాలనుకున్నాను. కాని అనేక దేశాలు తిరిగి చూడగలిగాను. ఇప్పుడు నా కోరిక ఒక్కటే. వృద్ధ సెక్స్‌వర్కర్ల కోసం ఒక హోమ్ కట్టాలి. వారికి జరుగుబాటు లేక భిక్షాటన చేస్తున్నారు. వారిని ఆదుకోవాలి.’ అంది జమీలా. 1970–2000 సంవత్సరాల మధ్య 8 మంది విటులతో తనకు ఏర్పడిన అనుబంధాన్ని ‘రొమాంటిక్ ఎన్కౌంటర్స్ ఆఫ్ ఎ సెక్స్‌వర్కర్’ పేరుతో 8 కథలుగా రాసిన జమీలా పుస్తకం ఇంకా తెలుగులో రావాల్సి ఉంది. చదవండి: రెస్టారెంట్ విచిత్ర షరతు.. ఫైర్ అవుతున్న నెటిజన్లు! -
టూమచ్: గడ్కరీ ట్వీట్ చేశాకే అందరికీ తెలిసింది
Kuthiran Tunnel: ప్రతిష్టాత్మకంగా నిర్మించుకున్న ప్రాజెక్టు లాంఛింగ్ గురించి ఆ రాష్ట్ర ప్రభుత్వానికే కనీస సమాచారం లేకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కేరళ కుథిరన్ టన్నెల్.. ఎన్‌హెచ్ 544పై మన్నూథి-వడక్కన్‌చెరి మధ్య కేరళ సర్కార్ నిర్మించిన ఈ ట్విన్ ట్యూబ్ టన్నెల్(సొరంగ మార్గాలు). శనివారం ఎలాంటి సమాచారం లేకుండానే తెరుచుకోవడం అక్కడి మంత్రులు, అధికారుల్ని విస్మయానికి గురి చేసింది. తిరువనంతపురం: కుథిరన్(త్రిస్సూర్) వద్ద కేరళ-తమిళనాడు, కర్ణాటక జాతీయ రహదారులను కలుపుతూ మార్గం ఉంటుంది. అయితే ఇక్కడ ట్రాఫిక్‌జామ్‌లో గంటల తరబడి వాహనదారులు ఎదురు చూడాల్సి వచ్చేది. అంతేకాదు ఇరుకు రహదారి, ప్రమాదకరమైన మలుపులతో తరచూ ప్రమాదాలు కూడా జరుగుతుండేవి. దీంతో ఆరు లైన్ల రోడ్డుకి అనుసంధానిస్తూ.. పీచీ-వలహని వైల్డ్ లైఫ్ శాంక్చురీ వద్ద కొండల్ని తొలగించి సుమారు 964 మీటర్ల పొడవుతో రెండు సొరంగ మార్గాలు నిర్మించాలని కేరళ ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఈ సొరంగం వల్ల కొచ్చి-కొయంబత్తూర్‌ల మధ్య దూరం 3 కిలోమీటర్ల దూరం తగ్గడంతో పాటు ప్రధాన ట్రాఫిక్ సమస్య-ప్రమాదాలకు చెక్ పెట్టొచ్చని కేరళ భావించింది. హైదరాబాద్‌కు చెందిన కేఎంసీ కంపెనీ, సబ్‌కాంట్రాక్ట్‌తో ది ప్రగతి గ్రూప్‌లు ఈ ప్రాజెక్టులో భాగం అయ్యాయి. 2016, జూన్‌లో టన్నెల్ పేలుడుతో మొదలైన పనులు.. ఐదేళ్లుగా నడుస్తూ వచ్చాయి. దీంతో సౌత్‌లోనే ఇదొక సుదీర్ఘమైన ప్రాజెక్టుగా పేరు దక్కించుకుంది. సుమారు 200 కోట్లు(లెక్కల్లో 165 కోట్లు), ఐదేళ్ల తర్వాత ఎట్టకేలకు సొరంగ మార్గాల నిర్మాణం పూర్తైంది. అయితే ఒకవైపు నిర్మాణ సంస్థ నుంచి మరోవైపు ఎన్హెచ్ఏఐ(నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా) నుంచి ఈ సొరంగాలు ఎప్పుడు తెరుచుకుంటాయో అనేదానిపై క్లారిటీ లేకుండా పోయింది. దీంతో కేరళ ప్రభుత్వం కేంద్రాన్ని ఆరాతీయగా.. ఆగస్టులో ఈ టన్నెల్ లాంఛింగ్ ఉండొచ్చని బదులిచ్చింది కేంద్ర రోడ్డు రవాణా శాఖ. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ట్వీట్ చేసేదాకా.. కేరళ అధికారులకు, మంత్రులకు, ఆఖరికి సదరు కంపెనీకి సైతం ఈ సొరంగ ప్రారంభోత్సవ కార్యక్రమం ఉంటుందనే విషయం తెలియకపోవడం విశేషం. We will open one side of the Kuthiran Tunnel in Kerala today. This is the first road tunnel in the state and will drastically improve connectivity to Tamil Nadu and Karnataka. The 1.6 km long tunnel is designed through Peechi- Vazahani wildlife sanctuary. pic.twitter.com/9yG0VhrsLq — Nitin Gadkari (@nitin_gadkari) July 31, 2021 ఇక సాయంత్రం ఐదు గంటలకు త్రిస్సూర్ జిల్లా కలెక్టర్ హరిత కుమార్‌కు, ఎన్హెచ్ఏఐ(నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా) డైరెక్టర్‌కు మాత్రమే కేంద్రం నుంచి సమాచారం అందింది. దీంతో వాళ్లు టన్నెల్ దగ్గరికి చేరుకుని.. 7గం.55ని.ఎడమ టన్నెల్‌ను ప్రారంభించగా సామాన్యుల రాకపోకలను అనుమతి లభించింది. అయితే ఇది దారుణమని, అయినప్పటికీ ప్రజలకు పనికొచ్చే పని కావడంతో విమర్శలు-వివాదం చేయదల్చుకోలేదని అధికారులు అంటున్నారు. మరోవైపు కుడి సొరంగమార్గాన్ని డిసెంబర్ నాటికి ప్రారంభించే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఇక ప్రజల నుంచి టోల్ కలెక్షన్, మన్నూథి-వడక్కన్‌చెరీ ఆరులేన్ల రోడ్(కిలోమీటర్ మేర) పూర్తయ్యాకే వసూలు చేయాలని కేఎంసీ కన్ స్ట్రక్షన్స్ లిమిటెడ్‌కు కేరళ ప్రభుత్వం సూచించింది. ఎందుకంటే ఈ రోడ్ నిర్మాణ సమయంలో అవినీతి ఆరోపణలు పెద్ద ఎత్తునే వినిపించాయి కాబట్టి. -
అతడి రోజు రాబడి 350 రూపాయలు!
జేబులో 170 రూపాయలు, చేతిలో ఆర్డినరీ సైకిల్, ఆ సైకిల్ క్యారియర్‌కి టీ తయారు చేసే సరంజామా. అతడు బయలుదేరింది ఆ పట్టణంలో ఏదో ఓ సెంటర్లో టీ అమ్ముకోవడానికి కాదు. టీ అమ్ముకుంటూ జమ్ము– కశ్మీర్ చేరడానికి. ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఇది నిజం. వందరోజుల్లో కశ్మీర్ చేరాలనే సంకల్పం అతడిది. దారి ఖర్చులకు టీ కేరళలో పుట్టిన నిధిన్కి పర్యటనలంటే చాలా ఇష్టం. ఈ ఏడాది కశ్మీర్ చూడాలనుకున్నాడు. అతడిలో పర్యటించాలనే కోరిక అయితే బలంగా ఉంది. కానీ విమానంలో కాదు కదా, రైల్లో వెళ్లి రావడానికి కూడా తగినంత డబ్బు లేదు. తనకు టీ చక్కగా చేయడం వచ్చు. దారి ఖర్చులు కూడా దారిలోనే సంపాదించుకోవచ్చనుకున్నాడు. సైకిల్‌కి టీ కెటిల్ తగిలించుకుని ప్రయాణం మొదలుపెట్టాడు. ఐదు రాష్ట్రాలు నిదిన్ వయసు 23. అతడి ప్రయాణ దూరం 3,300 కిలోమీటర్లు. అతడు తనకు తాను నిర్దేశించుకున్న లక్ష్యం వంద రోజులు. జనవరి ఒకటవ తేదీన సొంతూరు త్రిశూర్‌లో గూగుల్ మ్యాప్ సహాయంతో మొదలైన ప్రయాణం కర్నాటక, గోవా, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల మీదుగా నెలాఖరుకు రాజస్థాన్ చేరింది. త్రిశూర్ నుంచి బయలుదేరేటప్పుడు అతడి జేబులో ఉన్న 170 రూపాయలు పాలు కొనడానికి పెట్టుబడి అన్నమాట. పాలు దొరికే చోటును రాత్రి బసకు ఎంచుకునే వాడు. దగ్గరగా ఉన్న పెట్రోల్ బంకులో గుడారం వేసుకుని నిద్రపోతాడు. అతడి దినచర్య రోజూ ఉదయం ఐదున్నరకు మొదలవుతుంది. టీ తయారు చేసి అక్కడ అమ్మగా మిగిలిన టీని ఫ్లాస్కులో పోసుకుని బయలుదేరేవాడు. అలా అతడి రోజు రాబడి మూడు వందల యాభై రూపాయలు. నిదిన్ సంకల్పం తెలిసిన వాళ్లు అతడి టీ కొనడమే కాక విరాళంగా తోచినంత డబ్బు సహాయం చేసేవారు. ఈ ప్రయాణంలో తాను ఎంతో నేర్చుకున్నానని చెబుతున్నాడు నిదిన్. ‘చేతిలో డబ్బు ఉండి రైల్లోనో, విమానంలోనో వెళ్లి ఉంటే ప్రదేశాలను మాత్రమే చూడగలిగేవాడిని. ఇప్పుడు సమాజాన్ని చూడగలిగాను. సాటి మనిషికి చేయగలిగినంత సహాయం చేసే మనుషులు మన మధ్య ఇంకా ఉన్నారు. నేను ఇంటి నుంచి బయలుదేరినప్పుడు నాకు మంచి హెల్మెట్, గ్లవ్స్ లేవు. ఇప్పుడు వాటిని కొనుక్కోగలిగానంటే... ఎంతో మంది సామాన్యులు నా మీద చూపించిన ఆదరణే. ఇదే స్ఫూర్తితో నా గడువు లోపే కశ్మీర్ చేరుతాను’ అన్నాడతడు. -
కేరళకు మోదీ క్షమాపణలు
త్రిసూర్: ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన 19 నెలల తర్వాతగానీ కేరళ రాష్ట్రానికి రాలేకపోయానని, అందుకే కేరళకు క్షమాపణలు చెబుతున్నానని నరేంద్ర మోదీ అన్నారు. సోమవారం త్రిసూర్ పట్టణంలో భారతీయ జనతాపార్టీ ఏర్పాటుచేసిన బహిరంగ సభలో మాట్లాడిన ఆయన.. కేరళలో బీజేపీ దారుణ రాజకీయ హింసను ఎదుర్కున్నదన్నారు. 'దేశంలోని మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే కేరళలో భారతీయ జనతాపార్టీ ఘోర రాజకీయ హింసను ఎదుర్కొంది. ఇతర పార్టీల చేతుల్లో వందలాది బీజేపీ కార్యకర్తలు ప్రాణాలు కోల్పోయారు. ఆ అమరులకు నివాళులర్పిస్తున్నా. అయితే ఇప్పుడు పరిస్థితులు మారాయి. కార్యకర్తల కృషితో కేరళలో బీజేపీకి ఆదరణ పెరిగింది. ప్రజలు మన పట్ల నమ్మకాన్ని ప్రదర్శిస్తున్నారు' అంటూ భావోద్వేగంగా మాట్లాడారు ప్రధాని నరేంద్ర మోదీ. ప్రకృతి అందాలకే కాక, మానవ వనరులకూ నిలయంగా ఉన్న కేరళ నుంచి లక్షలాది యువత ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో తమ ప్రతిభ చాటుకుంటున్నదని, తన విదేశీ పర్యటనల సందర్భంలో కేరళ ఎన్నారైలతో ముచ్చటించిన విషయాలను మోదీ గుర్తుచేసుకున్నారు. విదేశాల్లో కేరళీయులు ఎదుర్కొంటున్న సమస్యలను ఆదేశాధినేతలతో మాట్లాడి పరిష్కరించేందుకు ఎన్డీఏ సర్కార్ కృషిచేస్తున్నదనన్నారు. కేరళ యువశక్తి, వారి ప్రతిభాపాటవాలు.. తాము తలపెట్టిన 'మేక్ ఇన్ ఇండియా'ను ముందుకు నడిపిస్తాయనడంలో ఎలాంటి సందేహంలేదని ప్రధాని అన్నారు. ప్రధాని ప్రసంగంలో మరికొన్ని ముఖ్యాంశాలు.. - 2022లో భారత్ 75వ స్వాతంత్ర్యదినోత్సవాన్ని జరుపుకోనుంది. ఆలోగా ప్రతి పౌరుడి సొంత ఇంటి కలను సాకారం చేయాలన్నది నా కల. - కేరళలో మత్యకారుల అభివృద్ధి కోసం త్వరలో భారీ పథకాన్ని ప్రారంభిస్తాం - ప్రధాన మంత్రి ముద్ర యోజన ద్వారా కేరళలోని 2.25 లక్షల మంది లబ్ధిదారులకు రూ. 2100 కోట్లు సమకూరాయి. -
కేరళకు మోదీ క్షమాపణలు