Trolleys
-
సప్తశృంగేరీ భక్తులకు ట్రాలీ సదుపాయం!
నాసిక్‌ః పన్నెండేళ్ళకోసారి కుంభమేళాతో దేశంలోని భక్తుల దృష్టిని ఆకర్షించే నాసికా త్రయంబకం దగ్గరలోని సప్త శృగేరీ దేవి భక్తులకు త్వరలో కొత్త సదుపాయం అందుబాటులోకి రానుంది. సప్తశృంగి అమ్మవారిని నదీమార్గంలోనూ, కాలినడకన దర్శించే భక్తులు... ఇకపై ప్రత్యేక ట్రాలీలలో ప్రయాణించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే ట్రాలీ ప్రాజెక్టు పూర్తి చేసి మరో రెండు నెలల్లో భక్తులకు అందుబాటులోకి తేనున్నట్లు అధికారులు చెప్తున్నారు. కొండపై కొలువైన సప్తశృంగి ఆలయాన్ని దర్శించే భక్తులకు ట్రాలీ సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తున్నారు. జిల్లాలోని ఎత్తైన కొండపైకి భక్తులు చేరడాన్ని సులభతరం చేసేందుకు ట్రాలీ ప్రాజెక్టును ప్రారంభించినట్లు అధికారులు వెల్లడించారు. సుయోగ్ గుర్బాక్సానీ ఫునిక్యులర్ రోప్‌వేస్ సంస్థ ప్రారంభించిన ఈ ప్రాజెక్టుకు సుమారు 85 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని అంచనా. ఈ ప్రత్యేక సదుపాయం ప్రారంభించినట్లైతే భక్తులు ఇక 500 మెట్లను కాలి నడకన ఎక్కాల్సిన అవసరం ఉండదని, కేవలం మూడు నిమిషాల్లో కొండపైకి చేరుకో గల్గుతారని ప్రాజెక్ట్ మేనేజర్ రాజీవ్ లుంబా తెలిపారు. భక్తులను తరలించేందుకు రెండు ట్రాలీలను ఏర్పాటు చేస్తున్నామని, అలాగే వికలాంగులు, వృద్ధులకోసం ప్రత్యేక సేవలను అందించనున్నట్లు ఆయన తెలిపారు. కొత్తగా ఏర్పాటు చేసే రోప్ వే సౌకర్యంలోని ఒక్కో ట్రాలీలో ట్రిప్పుకు 60 మంది వరకూ ప్రయాణించవచ్చని, రెండు ట్రాలీలు కలిసి గంటకు సుమారు 12 వందల మంది భక్తులను కొండపై ఆలయానికి చేరవేయగల్గుతాయని అధికారులు చెప్తున్నారు. అంతేకాక ట్రాలీల్లో ఏసీ సౌకర్యం కూడ ఉన్నట్లు తెలిపారు. నాసిక్ కు దగ్గరలోని కల్వాన్ తాలూకా నండూరి గ్రామంలో సప్తశృంగి ఆలయం ఉంది. ఈ ప్రసిద్ధ ఆలయాన్ని నవరాత్రుల సమయంలో లక్షలకొద్దీ భక్తులు సందర్శిస్తుంటారు. మహరాష్ట్ర ప్రభుత్వం, సప్తశృంగీ దేవి నివాసిని ట్రస్ట్ సంయుక్తంగా ఈ ప్రాజెక్ట్ నిర్వహణకు నిర్ణయించినట్లు ప్రాజెక్ట్ అధికారి లుంబా తెలిపారు. -
వేల సంఖ్యలో మెసేజ్‌లొస్తున్నాయి - దీపికా పదుకొనే
సినీ తారలు ఏం చేసినా పబ్లిసిటీ స్టంట్ అంటారు. పాపం... మంచి పని చేసినా, మంచి విషయం మాట్లాడినా ఇదంతా కేవలం డబ్బు కోసమే అని చాలా మంది వ్యాఖ్యానిస్తూ ఉంటారు . దీపిక క్కూడా ఇలాంటి పరిస్థితే ఎదురైంది. బాలీవుడ్లో మిగతా కథానాయికలతో పోలిస్తే దీపిక సమ్‌థింగ్ స్పెషల్. తన మనసుకు నచ్చినట్టు మాట్లాడటం దీపికకు ఉన్న ప్రత్యేకత . అయితే దీపిక ఇంత ధైర్యంగా గతంలో ఉండేవారు కాదు. కొన్నాళ్లపాటు ఆమె తీవ్రాతితీవ్రంగా డిప్రెషన్‌తో కుంగిపోయారు. తర్వాత బయట పడ్డారనుకోండి. అయితే చాలా మంది అలాంటి విషయాలు మీడియా ముందు చెప్పరు. కానీ దీపిక చాలా ధైర్యంగా తన మానసిక పరిస్థితి గురించి చెప్పేశారు.అంతేకాకుండా తనలా డిప్రెషన్లో కుంగిపోయిన వారికి అండగా నిలబడటం కోసం ‘ లివ్ లవ్ లాఫ్’ అనే సంస్థను నెలకొల్పారు. ‘‘ కేవలం ఫార్మాస్యూటికల్ కంపెనీకి ప్రచారం కోసం ఈ సంస్థ నెలకొల్పారని, ఇదో పబ్లిసిటీ స్టంట్ అని చాలా మంది నన్ను మొదట్లో విమర్శించారు. కానీ ఈ సంస్థ గురించి వస్తున్న రెస్పాన్స్ మాత్రం సూపర్బ్. మీ వల్ల నా ప్రాణం నిలబడింద ని చెబుతూ ఓ అమ్మాయి నాకు సందేశం పంపింది. అదొక్కటి చాలు. ఇలాంటి మెసేజ్‌లు కొన్ని వేల సంఖ్యల్లో వస్తున్నాయి. నాలాంటి పరిస్థితి ఇంకెవ్వరికీ రాకూడదనే ఉద్దేశంతో ఈ ఫౌండేషన్ .అంతేగానీ డబ్బు సంపాదించాలన్న అత్యాశ మాత్రం కాదు’’ అని దీపిక స్పష్టం చేశారు. -
ఇసుక అక్రమ తవ్వకాలను అడ్డుకున్న కార్మికులు
పెరవలి/నిడదవోలు రూరల్ : ప్రజాప్రతినిధులు, అధికారులు ఒక్కటై జరుపుతున్న ఇసుక అక్రమ తవ్వకాలను ర్యాంప్ కార్మికులు, స్థానికులు అడ్డుకున్న ఘటన గురువారం రాత్రి పెండ్యాల-కానూరు ర్యాంప్‌లో చోటుచేసుకుంది. దీంతో అధికారులు చేసేది లేక వాహనాలను స్వాధీనం చేసుకోవాల్సి వచ్చింది. వివరాలు ఇలా ఉన్నాయి. పెండ్యాల ర్యాంపులో కొంతకాలంగా ఇసుక అక్రమ తవ్వకాలు సాగిస్తున్నారు. గురువారం రాత్రి అక్రమంగా ఇసుకను తవ్వడానికి రెండు ప్రొక్లెయినర్లు, ట్రాలీలు తీసుకువచ్చి లారీలతో ర్యాంపులోకి దిగి ఇసుకను లోడు చేశారు. ఇదిలా ఉండగా 20 రోజుల క్రితం ఇక్కడ ఇసుకను మూటలుగా కట్టి అమ్ముకుంటున్న ర్యాంప్ కార్మికులు, కూలీలను సమిశ్రగూడెం ఎస్సై అడ్డుకుని తీవ్రంగా హెచ్చరించారు. దీనిపై కార్మికులు గుర్రుగా ఉన్నారు. ర్యాంప్‌ను మూసివేయడంతో ఉపాధి కోల్పోయామని, ఇసుక మాఫియా ప్రజాప్రతినిధుల అండతో అక్రమంగా తరలిస్తున్నా చర్యలు తీసుకోవడం మాని తమపై చర్యలేమిటని కొందరు అప్పుడు ప్రశ్నించారు. ఈ ఘటన నేపథ్యంలో కార్మికులు అవకాశం కోసం ఎదురు చూస్తుండగా గురువారం రాత్రి ర్యాంప్‌లో తవ్వకాలు జరుపుతున్నారని తెలియడంతో 100 మంది కార్మికులు అక్కడకు చేరుకుని అడ్డుకున్నారు. అధికారులకు సమాచారం ఇచ్చినా ఎవరూ స్పందించకపోవడంతో నిడదవోలుకు చెందిన సీపీఎం నేత జువ్వల రాంబాబుకు సమాచారం ఇచ్చారు. దీంతో ఆయన వచ్చారు. ఇసుక తవ్వకందారులు తాము ఎమ్మెల్యే అనుచరులమని, తమను అడ్డుకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని కార్మికులు, రాంబాబును హెచ్చరించారు. రాంబాబు పోలీసులు, రెవెన్యూ అధికారులకు ఫోన్ చేసి ఘటనా స్థలానికి రాకపోతే పరిస్థితులు చేయిదాటతాయని చెప్పడంతో ఎట్టకేలకు సమిశ్రగూడెం ఎస్సై ఎస్ఎస్ఎస్పి కుమార్, రెవెన్యూ అధికారులు ఘటనాస్థలానికి వచ్చారు. రెండు లారీలను, రెండు పొక్లైన్లు, ఒక ట్రాలీ, ఒక ట్రాక్టరును స్వాధీనపర్చుకున్నారు. అధికారులపై ప్రజాప్రతినిధి ఆగ్రహం వాహనాలను పోలీసులు పట్టుకోవడంతో స్థానిక ప్రజాప్రతినిధి అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంలో రాత్రి 11 గంటల నుంచి 2 గంటల వరకు ఆయన అధికారులకు, పోలీసులకు అనేకమార్లు ఫోన్ చేసి ఒత్తిడి తెచ్చారు. అయినప్పటికీ వాహనాలను స్వాధీనం చేసుకోవడంతో బదిలీలు తప్పవంటూ హెచ్చరించారు.