Tropical
-
ఈ మొక్క కొవ్వుని ఈజీగా కరిగించేస్తుంది! ఒబెసిటీకి చక్కటి ఔషధం!
ఈ మొక్క కొవ్వుని కరిగించేసి అధిక బరువు సమస్య నుంచి బయటపడలే చేస్తుంది. అంతేగాదు ఒబెసిటీ, ఫ్యాటీ లివర్ సమస్యలకు చెక్పెడుతుందట. ఎలాంటి వ్యాయామాలు, ఎక్సర్సైజ్లు చేస్తే ఎలాగైతే బరువు అదుపులో ఉంటుందో అలానే ఈ మొక్క కూడా చేస్తుందట. దీని ఆకుల్ని ఆహారంలో భాగంగా చేసుకుంటే చాలా ఈజీగా బరువు తగ్గిపోతాం అంటున్నారు చైనా శాస్త్రవేత్తలు. తమ పూర్వీకులు ఈ మొక్క నుంచి తయారు చేసిన షాన్ కుచా అనే పానీయాన్ని వైద్యంలో ఔషధంగా ఉపయోగించేవారని చెబుతున్నారు. ఇది పిత్తాశయానికి సంబంధించిన సమస్యలను నివారిస్తుందని వారు బలంగా నమ్మేవారని తెలిపారు. అయితే తాము ఈ మొక్కపై జరిపిన పరిశోధనల్లో మరన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయని చెప్పారు. శరీరంలో పేరుకుపోయిన కొవ్వుని వెన్నలా కరిగించడం గుర్తించినట్లు చెప్పారు. రక్తంలోని ప్రోటీన్లు, కొవ్వుల స్థాయిని మెరుగుపరుస్తుందని, అల్కహాల్ తీసుకోవడం వల్ల వచ్చే ఫ్యాటీ లివర్ని సైతం తగ్గిస్తుందని అన్నారు. ఒబెసిటీకి ఇది చక్కటి ఔషధం అని అంటున్నారు. సుమారు 36 ఎలుకలపై ఈ మొక్క ఆకులను వాటి ఆహారంలో భాగం చేయగా ఇవి మంచి ఆరోగ్యంతో ఉండగా వాటి కొలస్ట్రాల్ స్థాయిలు కూడా అదుపులో ఉన్నట్లు తెలిపారు. ఈ మొక్కని మల్లోటస్ ఫ్యూరెటియానస్ అని పిలుస్తారు. ఇది కొవ్వు నిల్వలను నియంత్రించి బరువుని అత్యంత ఈజీగా తగ్గించడంలో దివ్యౌషధంలా పనిచేస్తుందని చెప్పారు. తమ పరిశోదన బృందం యాంటీ ఒబేసిటీ ఆహార పదార్థాల కోసం పరిశోధనలు చేస్తున్నట్లు తెలిపారు. ఆ క్రమంలోను ఈ మొక్కపై పరిశోధనలు చేసినట్లు తెలిపారు. అంతేగాదు యాంటీబెసిటీ డైట్లో ఇది చక్కటి ఆహారంగా ఈ మొక్కను సూచిస్తున్నారు. ఇది ప్రజలను ఆరోగ్యంగా ఉంచి వారి ఆయుః ప్రమాణాన్ని పెంచుతుందని ధీమాగా చెబుతున్నారు చైనా శాస్త్రవేత్తలు (చదవండి: బిపాసా కూతురికి గుండెల్లో రంధ్రాలు..పుట్టుకతో గుండె లోపం ఎందుకు వస్తుంది..?) -
తీరం దాటినా గులాబ్ తుఫాన్
-
Cyclone Gulab: దూసుకొస్తున్న గులాబ్ తుపాను
-
బోట్‌ల్యాండ్
దీవిని ఐల్యాండ్ అంటారు. అదే దీవి బోట్లో ఉంటే... బోట్‌ల్యాండ్ అనాలిగా! అలాంటిదే ఈ యాట్ (కొంచెం పెద్దసైజు పడవ). చుట్టూ నీళ్లు... నీళ్ల మధ్యలో ద్వీపం... ఆ ద్వీపంలో చిన్న ఇల్లు... ఆ ఇంటిలో మనం ఉంటే? భలేగా ఉంటుంది కదూ! ఆ అద్భుతమైన అనుభూతిని ఆస్వాదించే అవకాశం మనకు త్వరలో కల్పించబోతోంది... ట్రాపికల్ ప్యారడైజ్ ఐల్యాండ్. ఐల్యాండ్ అన్నాం కాబట్టి అది సముద్రం మధ్యలో ఉంటుందనుకునేరు. ఇది సముద్రం మధ్యలో ఉండే దీవి కాదు.. సముద్రం పైన తేలియాడే దీవి. అన్ని హంగులతో ఓ యాట్‌లో అందంగా సృష్టించిన దీవి. కరీబియన్, పాలినీసియా దీవుల స్ఫూర్తితో దీన్ని తయారు చేశారు. దాదాపు 295 అడుగుల పొడవుండే ఈ సూపర్ యాట్ అడుగు భాగాన్ని ఉక్కుతో నిర్మిస్తారు. పైభాగం మాత్రం అల్యూమినియం, ఫైబర్ రీఎన్ఫోర్స్డ్ ప్లాస్టిక్‌తో సిద్ధం చేస్తారు. యాట్ వెనుక భాగంలో పర్వతం మాదిరిగా కనిపిస్తున్నది కృత్రిమ అగ్నిపర్వతం.అయితే ఈ పర్వతం నుంచి లావా కాదు... నీరు వస్తుంది. అది జలపాతంలా ప్రవహించి ప్రవహించి నేరుగా ముందువైపున ఉండే స్విమ్మింగ్‌పూల్‌లోకి చేరుతుంది. స్విమ్మింగ్ పూల్ పక్కనే కృత్రిమ బీచ్ ఉంటుంది. దాని చుట్టూ చక్కని కాటేజీలు, వాటి చుట్టూ పచ్చని చెట్లు కలిసి నిజంగానే ఓ దీవిలో ఉన్న అనుభూతిని కలిగిస్తాయి. ఈ దీవిలో ఉండే చెట్లన్నీ సహజమైనవే కావడం మరో విశేషం. ఇవి కాక సినిమాహాలు, లైబ్రరీ, జిమ్ వంటివి అదనపు హంగులూ ఉన్నాయి. పదిమంది యాత్రికులకు సరిపోయే ఈ యాట్ని ‘యాట్ ఐల్యాండ్ డిజైన్’ అనే సంస్థ నిర్మిస్తోంది. ఇది గంటకు 15 నాటికల్ మైళ్ల వేగంతో ప్రయాణిస్తుంది. దాదాపు ఐదేళ్ల క్రితమే దీని డిజైన్ పూర్తికాగా... ఈ ఏడాది నిర్మాణం పూర్తి చేసుకోనుంది!