Mallotus Furetianus Tropical Plant Found In China Reveals Antiobesity Potential - Sakshi
Sakshi News home page

Anti Obesity Secret From China Plant: ఈ మొక్క కొవ్వుని ఈజీగా కరిగించేస్తుంది! ఒబెసిటీకి చక్కటి ఔషధం!

Published Mon, Aug 7 2023 4:46 PM | Last Updated on Mon, Aug 7 2023 6:41 PM

Mallotus Furetianus Tropical Plant Found In China Fights Fat In Tests - Sakshi

ఈ మొక్క కొవ్వుని కరిగించేసి అధిక బరువు సమస్య నుంచి బయటపడలే చేస్తుంది. అంతేగాదు ఒబెసిటీ, ఫ్యాటీ లివర్‌ సమస్యలకు చెక్‌పెడుతుందట. ఎలాంటి వ్యాయామాలు, ఎక్సర్‌సైజ్‌లు చేస్తే ఎలాగైతే బరువు అదుపులో ఉంటుందో అలానే ఈ మొక్క కూడా చేస్తుందట. దీని ఆకుల్ని ఆహారంలో భాగంగా చేసుకుంటే చాలా ఈజీగా బరువు తగ్గిపోతాం అంటున్నారు చైనా శాస్త్రవేత్తలు.

తమ పూర్వీకులు ఈ మొక్క నుంచి తయారు చేసిన షాన్‌ కుచా అనే పానీయాన్ని వైద్యంలో ఔషధంగా ఉపయోగించేవారని చెబుతున్నారు. ఇది పిత్తాశయానికి సంబంధించిన సమస్యలను నివారిస్తుందని వారు బలంగా నమ్మేవారని తెలిపారు. అయితే తాము ఈ మొక్కపై జరిపిన పరిశోధనల్లో మరన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయని చెప్పారు. శరీరంలో పేరుకుపోయిన కొవ్వుని వెన్నలా కరిగించడం గుర్తించినట్లు చెప్పారు.

రక్తంలోని ప్రోటీన్‌లు, కొవ్వుల స్థాయిని మెరుగుపరుస్తుందని, అల్కహాల్‌ తీసుకోవడం వల్ల వచ్చే ఫ్యాటీ లివర్‌ని సైతం తగ్గిస్తుందని అన్నారు. ఒబెసిటీకి ఇది చక్కటి ఔషధం అని అంటున్నారు. సుమారు 36 ఎలుకలపై ఈ మొక్క ఆకులను వాటి ఆహారంలో భాగం చేయగా ఇవి మంచి ఆరోగ్యంతో ఉండగా వాటి కొలస్ట్రాల్‌ స్థాయిలు కూడా అదుపులో ఉన్నట్లు తెలిపారు.

ఈ మొక్కని మల్లోటస్ ఫ్యూరెటియానస్‌ అని పిలుస్తారు. ఇది కొవ్వు నిల్వలను నియంత్రించి బరువుని అత్యంత ఈజీగా తగ్గించడంలో దివ్యౌషధంలా పనిచేస్తుందని చెప్పారు. తమ పరిశోదన బృందం యాంటీ ఒబేసిటీ ఆహార పదార్థాల కోసం పరిశోధనలు చేస్తున్నట్లు తెలిపారు. ఆ క్రమంలోను ఈ మొక్కపై పరిశోధనలు చేసినట్లు తెలిపారు. అంతేగాదు యాంటీబెసిటీ డైట్‌లో ఇది చక్కటి ఆహారంగా ఈ మొక్కను సూచిస్తున్నారు. ఇది ప్రజలను ఆరోగ్యంగా ఉంచి వారి ఆయుః ప్రమాణాన్ని పెంచుతుందని ధీమాగా చెబుతున్నారు చైనా శాస్త్రవేత్తలు

(చదవండి: బిపాసా కూతురికి గుండెల్లో రంధ్రాలు..పుట్టుకతో గుండె లోపం ఎందుకు వస్తుంది..?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement