ప్రభుత్వానికి గుణపాఠం తప్పదు
ఆలేరు : నల్లగొండ జిల్లా కేంద్రంలో మాజీ మంత్రి కోమటిరెడ్డిపై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడికి పాల్పడడం హేయమైన చర్య అని డీసీసీ అధ్యక్షుడు బూడిద భిక్షమయ్యగౌడ్ అన్నారు. ఆలేరులోని ప్రభుత్వ అతిథిగృహంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఉమ్మడి జిల్లాలో టీఆర్ఎస్ నాయకులు నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తున్నారని.. ఇలాంటి వైఖరి సరికాదన్నారు. ప్రభుత్వం నియంతలా వ్యవహరిస్తోందని ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఈ సమావేశంలో కొలుపుల హరినాథ్ కె సాగర్‌రెడ్డి, ఎండీ జైనోద్దీన్, పల్లె సంతోష్, నీలం పద్మ, గ్యాదపాక నాగరాజు, ఇల్లెందుల మల్లేశం, జంపాల దశరథ, బేతి రాములు, పుట్ట మల్లేశం, ఎగ్గిడి యాదగిరి, ముదిగొండ శ్రీకాంత్, ఎండీ బాబా తదితరులు పాల్గొన్నారు.