ఎమ్మెల్సీ సలీం ఇంట్లో సీఎం బక్రీద్ వేడుకలు
సాక్షి, హైదరాబాద్: బక్రీద్ వేడుకలను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తమ పార్టీ నేతలతో కలసి జరుపుకున్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ మహ్మద్ సలీం ఇంట్లో శుక్రవారం జరిగిన వేడుకలకు ఆయన హాజరయ్యారు. హైదరాబాద్‌లోని రాంనగర్ అడిక్‌మెట్ ప్రాంతంలో సలీం ఇంట్లో జరిగిన విందులో పాల్గొన్నారు. డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఎంపీ కల్వకుంట్ల కవిత కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ సలీంకు సీఎం కేసీఆర్‌తో పాటు ఇతర నేతలు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు.