trs mp balka suman
-
ఏదో ఆశించి కోదండరామ్ భంగ పడ్డారు
-
'జైళ్లకు, కోర్టులకు వెళ్లడం రేవంత్‌కి అలవాటు'
హైదరాబాద్ : రాష్ట్రంలో నియోజకవర్గాల పునర్విభజనపై టీడీపీ అసత్య ప్రచారం చేస్తోందని టీఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్ ఆరోపించారు. హైదరాబాద్‌లో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.... విపక్షాలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ ప్రారంభం కాలేదన్నారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన రాలేదని స్పష్టం చేశారు. ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగానే ప్రభుత్వం కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తోందని ఆయన చెప్పారు. అనవసరంగా విపక్షాలే రాద్ధాంతం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. జైళ్లకు, కోర్టులకు వెళ్లడం టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డికి అలవాటని బాల్క సుమన్ ఎద్దేవా చేశారు. -
‘బ్లాక్ మెయిల్‌కు ఆయన బ్రాండ్ అంబాసిడర్’
హైదరాబాద్ : ఓటుకు కోట్లు కేసులో చట్ట ప్రకారమే వ్యవహరిస్తున్నామని టీఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్ అన్నారు. ఆయన సోమవారమిక్కడ మాట్లాడుతూ ఈ అంశం కోర్టు పరిధిలో ఉందన్నారు. బ్లాక్ మెయిల్‌కు బ్రాండ్ అంబాసిడర్ రేవంత్ రెడ్డి అని బాల్క సుమన్ వ్యాఖ్యానించారు. కాగా టీఆర్ఎస్ ప్రభుత్వంలో మహిళలకు రాజకీయ భాగస్వామ్యం లేదని, రాష్ట్రంలో ఆడబిడ్డలను సీఎం కేసీఆర్ బతుకమ్మ, బోనాలకే పరిమితం చేశారని రేవంత్ రెడ్డి విమర్శలు చేసిన విషయం తెలిసిందే. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టించిన ఓటుకు కోట్లు కేసు మళ్లీ తెరమీదకు వచ్చింది. ఈ కేసును పునర్విచారణ చేయాలని ఏసీబీ కోర్టు సోమవారం ఆదేశాలు ఇచ్చింది. వచ్చేనెల 29వ తేదీలోగా ఈ విచారణ పూర్తి చేయాలని ఏసీబీని ఆదేశించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు స్వరంపై ఫోరెన్సిక్ పరీక్షల నివేదికను మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కోర్టు ముందు ఉంచిన విషయం తెలిసిందే. -
'ఆంధ్ర మంత్రులు సైకోల్లా వ్యవహరిస్తున్నారు'
పెద్దపల్లి (కరీంనగర్ జిల్లా) : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుతో సహా మంత్రులంతా మతిస్థిమితం కోల్పోయి సైకోల్లా వ్యవహరిస్తున్నారని టీఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్ దుయ్యబట్టారు. గురువారం కరీంనగర్ జిల్లా పెద్దపల్లి నియోజకవర్గంలో ఎంపీ పర్యటించిన సందర్భంగా జరిగిన మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుతోపాటు ఆంధ్ర మంత్రులు నోరు, ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని లేకుంటే తెలుగు ప్రజలు క్షమించరని ఆయన అన్నారు. అవినీతి రహిత పాలన అందిస్తున్నామంటున్న ఎన్డీయే సర్కార్‌కు చంద్రబాబు అవినీతి అక్రమాలు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ఎన్డీయే నుంచి టీడీపీ మంత్రులను ఎందుకు బహిష్కరించడంలేదని నిలదీశారు. -
ఓయూలో ఉద్రిక్తత
హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సీటీ ఆర్ట్స్ కాలేజీ వార్షికోత్సవంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గురువారం ఉస్మానియా యూనివర్సీటీ వార్షికోత్సవంలో పాల్గొనేందుకు టీఆర్ఎస్ ఎంపీ బాల్కసుమన్, ఎమ్యెల్యే గాదరి కిషోర్‌లు వచ్చారు. అయితే, వీరిని కార్యక్రమానికి రాకుండా అన్నా నిరుద్యోగ జేఏసీ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. ముందస్తు జాగ్రత్తగా పోలీసులు నిరుద్యోగులను అదుపులోకి తీసుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.