హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సీటీ ఆర్ట్స్ కాలేజీ వార్షికోత్సవంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గురువారం ఉస్మానియా యూనివర్సీటీ వార్షికోత్సవంలో పాల్గొనేందుకు టీఆర్ఎస్ ఎంపీ బాల్కసుమన్, ఎమ్యెల్యే గాదరి కిషోర్‌లు వచ్చారు. అయితే, వీరిని కార్యక్రమానికి రాకుండా అన్నా నిరుద్యోగ జేఏసీ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. ముందస్తు జాగ్రత్తగా పోలీసులు నిరుద్యోగులను అదుపులోకి తీసుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.