
'ఆంధ్ర మంత్రులు సైకోల్లా వ్యవహరిస్తున్నారు'
పెద్దపల్లి (కరీంనగర్ జిల్లా) : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుతో సహా మంత్రులంతా మతిస్థిమితం కోల్పోయి సైకోల్లా వ్యవహరిస్తున్నారని టీఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్ దుయ్యబట్టారు. గురువారం కరీంనగర్ జిల్లా పెద్దపల్లి నియోజకవర్గంలో ఎంపీ పర్యటించిన సందర్భంగా జరిగిన మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
చంద్రబాబుతోపాటు ఆంధ్ర మంత్రులు నోరు, ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని లేకుంటే తెలుగు ప్రజలు క్షమించరని ఆయన అన్నారు. అవినీతి రహిత పాలన అందిస్తున్నామంటున్న ఎన్డీయే సర్కార్‌కు చంద్రబాబు అవినీతి అక్రమాలు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ఎన్డీయే నుంచి టీడీపీ మంత్రులను ఎందుకు బహిష్కరించడంలేదని నిలదీశారు.