TS CM KCR
-
తీరని కన్నీటి వ్యథ.. భద్రకాళి చెరువుకు గండి
రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలు మిగిల్చిన వ్యథ ఇప్పట్లో తీరే పరిస్థితి కనిపించడం లేదు. వరదల్లో తమవారిని కోల్పోయిన ఆవేదనలో కొందరు.. ఇళ్లు, సామగ్రి, పశువులు, పంటలు నష్టపోయిన ఆందోళనలో మరికొందరు.. ఎక్కడ చూసినా విషాదమే కనిపిస్తోంది. రోడ్లు, వంతెనలు దెబ్బతిని రాకపోకలు లేక, సరిగా సాయం అందక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మూడు రోజులుగా విద్యుత్ సరఫరా లేక గ్రామాలు చీకట్లోనే మగ్గుతున్నాయి. ముఖ్యంగా నీట మునిగిన వరంగల్ నగరంతోపాటు పూర్తిగా దెబ్బతిన్న మోరంచపల్లి, కొండాయి గ్రామాల్లో పరిస్థితి ఇంకా దారుణంగానే ఉంది. దీనికితోడు వరంగల్ నగరంలో శనివారం భద్రకాళి చెరువుకు గండిపడటం మరోసారి భయాందోళన రేపింది. అధికారులు సకాలంలో స్పందించి, దిగువన కాలనీలను ఖాళీ చేయించడంతో ప్రమాదం తప్పింది. భద్రకాళి చెరువుకు గండి ఇప్పటికే నీట మునిగి అతలాకుతలమైన వరంగల్‌లోని భద్రకాళి చెరువుకు శనివారం గండిపడింది. చెరువుకు ఒక్కసారిగా వరద పెరగడంతో.. పోతననగర్ వైపు కట్టకు కోతపడింది. దీంతో పోతననగర్, సరస్వతినగర్ కాలనీల జనం భయాందోళనకు గురయ్యా రు. విషయం తెలిసిన అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. పోలీసులు, మున్సిపల్, రెవెన్యూ అధికారులు రంగంలోకి దిగి.. ఈ రెండు కాలనీలతోపాటు కాపువాడ కాలనీ, రంగపేటల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. గండిపడిన ప్రాంతంలో వెంటనే మరమ్మతులు చేపట్టారు. చెరువు గండిని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ప్రభుత్వ చీఫ్‌విప్ వినయ్‌భాస్కర్‌లు పరిశీలించారు. కాలనీల ప్రజలను ముందు జాగ్రత్తగా మాత్రమే తరలించామని.. చెరువు గండి కారణంగా ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టం జరగకుండా చర్యలు చేపట్టామని మంత్రి తెలిపారు. కాగా.. భద్రకాళి చెరువు శిఖం భూముల్లో ఆక్రమణలే ప్రస్తుత దుస్థితికి కారణమని స్థానికులు మండిపడుతున్నారు. పాత రికార్డుల ప్రకారం భద్రకాళి చెరువు విస్తీర్ణం 621 ఎకరాలు అయి తే.. సుమారు41 ఎకరాలు ఆక్రమణకు గురైనట్టు చెప్తున్నారు. ఇంకా నీటిలోనే పలు కాలనీలు..: భారీ స్థాయిలో వరదలతో జలమయమైన వరంగల్ నగరంలో ఇంకా పలు కాలనీలు నీటిలోనే ఉన్నాయి. 33వ డివిజన్ సీఆర్‌నగర్, 34వ శివనగర్, 39వ డివిజన్ శాకరాసికుంట కాలనీ రోడ్లపై వరద నీరు పారుతూనే ఉంది. అక్కడి ప్రజలు పునరావాస కేంద్రాల్లోనే తలదాచుకుంటున్నారు. ఖిలా వరంగల్ అగర్త చెరువుల మత్తడి నీరు మైసయ్యనగర్ మీదుగా శివనగర్‌లోని రహదారులపై పారుతోంది. ఇక మిగతా ప్రాంతాల్లోని కాలనీల్లో వరద తగ్గిపోవడంతో జనం ఇళ్లకు చేరుకుంటున్నారు. కానీ ఇళ్ల నిండా బురద ఉండటం, సామగ్రి అంతా తడిసిపోవడాన్ని చూసి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వరంగల్‌లో వరద నష్టం రూ. 414కోట్లు: వరంగల్ ఉమ్మడి జిల్లా పరిధిలో భారీ వర్షాలు, వరదలతో ఊహించని విధంగా ప్రాణ, ఆస్తినష్టం జరిగిందని.. బాధితులను అన్నివిధాలా ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు చెప్పారు. శనివారం హనుమకొండ కలెక్టరేట్లో ఉమ్మడి జిల్లా అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఉమ్మడి జిల్లా పరిధిలో రూ.414 కోట్లు నష్టం జరిగినట్టు ప్రాథమికంగా అంచనా వేశామని మంత్రి తెలిపారు. వరంగల్, హన్మకొండ జిల్లా ల్లో 36 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశామని.. 38 రెస్క్యూ టీమ్‌ల ద్వారా 2,055 మందిని వివరించారు. 207 ఇళ్లు పూర్తిగా, 480 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయని అధికారులు గుర్తించినట్టు తెలిపారు. బాధితులు ఆందోళన చెందవద్దని, త్వరలో పరిహారం అందజేస్తామని భరోసా ఇచ్చారు. -
సీఎం కేసీఆర్‌పై కేంద్ర మంత్రి ఫైర్
- ప్రజల స్వాతంత్ర్యాన్ని హరిస్తున్నారన్న సాధ్వి నిరంజన్ జ్యోతి మేడ్చల్ : బీజేపీ జాతీయ నాయకురాలు, కేంద్ర మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నాడు వేల మంది ప్రాణత్యాగాలు చేయడం వల్లే హైదరాబాద్ రాష్ట్రం నిజాం పరిపాలన నుంచి విముక్తి పొందిందని, అయితే ఇప్పుడు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత.. సీఎం కేసీఆర్ తన రాజకీయాల కోసం తెలంగాణ ప్రజల స్వాతంత్య్రాన్ని హరిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినంగా గుర్తించకపోవడాన్ని ఆమె తప్పు పట్టారు. తెలంగాణ బీజేపీ శాఖ చేపట్టిన ‘విమోచన యాత్ర’లో భాగంగా బుధవారం మేడ్చల్‌లో నిర్వహించిన బహిరంగ సభకు కేంద్ర మంత్రి సాధ్వీ నిరంజన్ జ్యోతి హాజరై ప్రసంగించారు. ‘‘1947లోనే దేశానికి స్వాతంత్య్రం వచ్చినా, తెలంగాణకు స్వాతంత్య్రం రాలేదు. ఇక్కడి ప్రజలు నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాటాలు చేసి ప్రాణాలు అర్పించారు. వారి త్యాగాలను గుర్తించిన సర్దార్ వల్లభాయ్‌పటేల్.. 1948, సెప్టెంబర్ 17న తెలంగాణకు స్వాతంత్య్రాన్ని తెచ్చిపెట్టారు. త్యాగాలకు నిలయమైన తెలంగాణలో విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపకపోవడం శోచనీయం. సెప్టెంబర్ 17 దినోత్సవాన్ని జరపాలని బీజేపీ ఎన్ని పోరాటాలు చేస్తున్నా పాలకులు స్పందించకపోవడం బాధాకరం’’ అని సాధ్వి నిరంజన్ జ్యోతి అన్నారు. చరిత్రను వక్రీకరిస్తున్న కేసీఆర్ : లక్ష్మణ్ త్యాగాలతో సాధించిన తెలంగాణ చరిత్రను ముఖ్యమంత్రి కేసీఆర్ తన స్వార్థం కోసం వక్రీకరిస్తూ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. విమోచన యాత్రలో భాగంగా ఉదయం విలేకరుల సమావేశం అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడారు. విమోచన దినంపై కేసీఆర్ ఉద్యమ సమయంలో ఒకమాట, అధికారంలోకి వచ్చాక మరోమాట మాట్లాడడాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు. తమ విమోచన యాత్ర ద్వారా ప్రజలను చైతన్యపరుస్తూ మరో ఉద్యమానికి శ్రీకారం చుడతామన్నారు. సెప్టెంబర్ 17ను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించకపోతే ప్రజలు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నిమజ్జనం చేయడం ఖాయమన్నారు. యాత్ర సాగిందిలా.... మేడ్చల్ మండలంలోని ఎల్లంపేట్ గ్రామానికి మంగళవారం రాత్రి విమోచన యాత్ర చేరుకోగా పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్ కార్యకర్తలతో కలిసి పట్టణంలోనే బస చేశారు. బుధవారం ఉదయం కంట్రీ క్లబ్లో విలేకరుల సమావేశం నిర్వహించి అనంతరం పట్టణంలోని ప్రధాన వీధులు, జాతీయ రహదారిపై బైక్ ర్యాలీ నిర్వహించి వివేకానంద విగ్రహం వద్దనున్న సభా స్థలికి చేరుకున్నారు. మహిళలు బోనాలు, బతుకమ్మలు, గిరిజన నృత్యాలు చేశారు. అక్కడ బహిరంగ సభ అనంతరం యాత్ర కీసర వైపు పయనమైంది. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మోహన్‌రెడ్డి, మల్లారెడ్డి, ప్రధాన కార్యదర్శి ఆచారి, జిల్లా అధ్యక్షుడు కాంతారావు, యాత్ర కన్వీనర్లు శ్రీవర్ధన్‌రెడ్డి, సుభాష్‌చందర్, గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు బిక్కు నాయక్, ఎమ్మెల్సీ రామచందర్, మాజీ ఎమ్మెల్యే ధర్మారావు, సత్యనారాయణ, రాష్ట్ర నాయకుడు విక్రంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కేంద్ర కేబినెట్ విస్తరణ వేళ ఢిల్లీకి కేసీఆర్
సాక్షి, హైదరాబాద్ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేంద్ర మంత్రివర్గ విస్తరణ కసరత్తులో మునిగితేలుతున్న సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ చేరుకోవడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. మూడు రోజుల పర్యటన నిమిత్తం కేసీఆర్ శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ నుంచి బయలుదేరి దేశ రాజధానికి చేరుకున్నారు. కేంద్ర కేబినేట్ విస్తరణకు సంబంధించి ఢిల్లీలో అనేక పరిణామాలు చోటుచేసుకుంటున్న తరుణంలో కేసీఆర్ ఢిల్లీ చేరుకోవడం గమనార్హం. ఎందుకంటే విస్తరణలో భాగంగా కేంద్రంలోని అనేక మంది మంత్రులు తమ రాజీనామాలు సమర్పించారు. ఈ నెల 3 వ తేదీ ఆదివారం ఉదయం కేబినేట్ విస్తరణ జరగనుంది. పైగా ఎన్డీఏ కూటమిలో కొత్త భాగస్వామ్య పక్షాలు చేరుతున్నట్టు వార్తలొస్తున్నాయి. ఇలాంటి తరుణంలో కేసీఆర్ ఆకస్మిక పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే, కేసీఆర్ ఢిల్లీ పర్యటనలో విశేషమేమీ లేదని అధికారవర్గాలు చెబుతున్నాయి. కొంత కాలం కిందట కేసీఆర్ ఢిల్లీ వెళ్లినప్పుడు కంటి పరీక్షలు చేయించుకున్నారు. కంటికి శస్త్రచికిత్స అవసరం అవుతుందని, అయితే కొంతకాలం తర్వాత నిర్వహించాలని అప్పట్లో వైద్యులు సూచించినట్టు చెబుతున్నారు. మరోసారి కంటి వైద్య పరీక్షల నిమిత్తం ఆయన ఢిల్లీ వెళ్లారని అంటున్నారు. రాష్ట్రానికి సంబంధించి కేంద్ర వద్ద పెండింగ్ అంశాలపై ప్రధానమంత్రిని కలిసి మరోసారి వివరించే అవకాశాలున్నాయని కూడా చెబుతున్నారు. ఏది ఏమైనప్పటికీ ఆదివారం ఉదయం వరకు రాజకీయ సస్పెన్స్ తప్పదని తెలుస్తోంది. (కేంద్ర మంత్రి పదవికి దత్తాత్రేయ రాజీనామా) -
ఆనందోత్సాహాలతో జరుపుకోవాలి
► రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్, సీఎం, ఏపీ సీఎం హైదరాబాద్: ముస్లిం సోదరులు పవిత్రమైన రంజాన్ (ఈద్–ఉల్– ఫితర్) పండుగను సోమవారం జరు పుకోనున్నారు. ఆదివారం రాత్రి నెల వంక దర్శనమిచ్చినట్లు హైదరాబాద్ రూహియత్–ఏ–హిలాల్ కమిటీ అధ్యక్షుడు మౌలానా ఖుబూల్ పాషా సుత్తారి ప్రకటించారు. అలాగే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ముస్లిం సోదరులు సోమవారం ఈద్–ఉల్–ఫితర్ పండుగను జరుపుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. దీంతో రంజాన్ మాసం దీక్షలు ముగిసినట్లయింది. రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులకు గవర్నర్ ఈఎస్ఎల్.నరసింహన్, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, ఏపీ సీఎం చంద్ర బాబు, ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ పర్వదినాన్ని ఆనందోత్సాహలతో జరుపుకోవాలని వారు ఆకాంక్షించారు. -
దేశంలో క్యాంపు అఫీసుకు రాని ఏకైక సీఎం కేసీఆర్
-
కేరళతో త్వరలో ఐటీ ఒప్పందం
-
కేరళతో త్వరలో ఐటీ ఒప్పందం
- సీఎం కేసీఆర్ వెల్లడి.. కేరళ సీఎం విజయన్‌కు విందు - శబరిమలలో తెలంగాణ భవన్ నిర్మాణంపై చర్చ - రాష్ట్రంలో చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు వివరించిన సీఎం సాక్షి, హైదరాబాద్: సీపీఎం మహాజన పాదయాత్ర ముగింపు సభలో పాల్గొనేందుకు రాష్ట్రానికి వచ్చిన కేరళ సీఎం పినరయి విజయన్ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుతో మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు. ఆదివారం మధ్యాహ్నం ప్రగతి భవన్లో కేసీఆర్‌ను కలుసుకున్నారు. అక్కడే సీఎం కేసీఆర్‌తో కలసి భోజనం చేశారు. ఈ సందర్భంగా ఇరురాష్ట్రాల ముఖ్యమంత్రులు పరస్పరం వారి ఆలోచనలు పంచుకున్నారు. రెండు రాష్ట్రాల అభివృద్ధి, సంక్షేమ పథకాలపై ప్రధానంగా చర్చించటంతోపాటు త్వరలోనే కేరళ–తెలంగాణ మధ్య ఐటీ సంబంధ ఒప్పందం జరుగుతుందని వెల్లడించారు. అందుకు సంబంధించి ప్రాథమిక చర్చలు జరిపారు. శబరిమలలో తెలంగాణ భవన్ నిర్మాణంపై ఇరువురి మధ్య చర్చ జరిగింది. అందుకు త్వరగా భూమిని కేటాయించాలని విజయన్ను కేసీఆర్ కోరారు. ఇప్పటికే చేసుకున్న ఎంవోయూను ప్రస్తావించారు. స్థల కేటాయింపు అంశం ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు వద్ద పెండింగ్‌లో ఉందని విజయన్ వెల్లడించారు. తెలంగాణ నుంచి శబరిమలకు లక్షలాది మంది భక్తులు వెళ్తారని, అందుకే ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని కేసీఆర్ కోరారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో దేశంలో తెలంగాణ నంబర్ వన్‌గా నిలిచినందుకు విజయన్ అభినందనలు తెలిపారు. అవినీతిరహిత కొత్త పారిశ్రామిక విధానంతో తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయని ఈ సందర్భంగా కేసీఆర్ వివరించారు. టీఎస్ఐపాస్ విధాన ప్రతిని విజయన్‌కు అందజేశారు. విదేశీ కంపెనీల ఆసక్తి.. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయన్న సీఎం.. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌తో సహా రాష్ట్రంలో అమలవుతున్న ఇతర సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. టూరిజం, హెల్త్ టూరిజం, హైదరాబాద్‌లో ఐటీ పరిశ్రమ విస్తరిస్తున్న తీరును మంత్రి కేటీఆర్ వివరించారు. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన మైక్రోసాఫ్ట్, గూగుల్, ఆపిల్ కంపెనీలు హైదరాబాద్‌లో హెడ్ క్వార్టర్స్ ఏర్పాటు చేసుకున్నాయని గుర్తుచేశారు. హైదరాబాద్ లో శాంతి భద్రతలు, భౌగోళిక స్థితిగతులు, భూకంపరహిత వాతావరణం ప్రపంచ ఐటీ రంగాన్ని విశేషంగా ఆకట్టుకుంటున్న అంశాలుగా మంత్రి వివరించారు. ల్యాండ్ రికార్డుల భద్రత అంశం ఇరు రాష్ట్రాల సీఎంల మధ్య ప్రస్తావనకు వచ్చింది. నిజాంకాలం నాటి నుంచీ రికార్డులను భద్ర పరచిన తీరును వివరించిన సీఎం కేసీఆర్.. ఇటీవల ఉచితంగా సాదా బైనామాల రిజిస్ట్రేషన్ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. ఒకరిపై ఒకరు తమకున్న నమ్మకం, విశ్వాసంతో తెల్ల కాగితంపై చేసుకున్న సాదా బైనామాలను రిజిస్ట్రేషన్ చేస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే 11.5 లక్షల దరఖాస్తులు అందాయని, రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కొనసాగుతోందని వివరించారు. ఈ సందర్భంగా కేరళ సహజ సౌందర్యంపైనా ఇరువురు మాట్లాడుకు న్నారు. కేరళ భూతల స్వర్గం అని కేసీఆర్ కితాబిచ్చారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, ఎంపీ బాల్క సుమన్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ప్రభుత్వ ఉన్నతాధి కారులు పాల్గొన్నారు.