హాల్‌టికెట్ లేకున్నా ఎడ్‌సెట్ రాయొచ్చు
హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా నేడు జరిగే టీఎస్ ఎడ్‌సెట్-2015ను హాల్‌టికెట్ లేకున్నా రాయవచ్చని హైదరాబాద్ రీజినల్ సహాయకుడు డాక్టర్ ధర్మతేజా తెలిపారు. ఎడ్‌సెట్‌కు చెల్లించిన ఫీజు రశీదు, ఒక పాస్‌పోర్టు సైజు ఫొటోతో ఏదైనా ఒక పరీక్షాకేంద్రానికి గంట ముందుగా చేరుకొని అధికారులను సంప్రదించి అనుమతి తీసుకోవచ్చని పేర్కొన్నారు. జంటనగరాల్లో ఏర్పాటు చేసిన 32 పరీక్షా కేంద్రాల్లో 19,104 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కానున్నట్లు వివరించారు. పూర్తి వివరాల కోసం 98488 22381 నంబర్లో సంప్రదించాలని సూచించారు.
నేడు మండలిలో ఎడ్‌సెట్ ప్రశ్నపత్రం ఎంపిక
టీఎస్ ఎడ్‌సెట్-2015 ప్రశ్నపత్రాన్ని శనివారం ఉదయం 6.45 నిమిషాలకు రాష్ట్ర ఉన్నత విద్య మండలి కార్యాలయంలో మండలి చైర్మన్ పాపిరెడ్డి ఎంపిక చేయనునట్లు కన్వీనర్ ప్రసాద్ తెలిపారు.