‘అంగన్వాడీ’ సమస్యలు పరిష్కరించండి
ఖలీల్‌వాడి,న్యూస్‌లైన్ : అంగన్వాడీ ఉద్యోగుల ఓట్లతో గద్దెనెక్కిన ఎంపీలు,ఎమ్మెల్యేలు ఇప్పుడు వారి సమస్యలను పరిష్కరించాలని కోరుతుంటే పట్టించుకోవడంలేదని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు టి.సాగర్ ఆగ్రహం వ్యక్తం చేశా రు. అంగన్వాడీ కార్యకర్తలు మూడు రోజు లుగా చేస్తున్న నిరవధిక దీక్షలను భగ్నం చేసినా, ఉద్యమం ఆపేదిలేదని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్ బాబు స్పష్టం చేశారు. జిల్లా కేంద్రంలోని ధర్నాచౌక్ వద్ద చేపట్టిన దీక్షలను శుక్రవారం ఉదయం 6గంటల సమయంలో పోలీసులు భగ్నం చేశారు. దీక్షలో కూర్చున్న వారిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలిం చారు.
అంతకుమందు అంగన్వాడీ కార్యకర్తలకు సాగర్‌తో పాటు జిల్లా కార్యదర్శి పెద్ది వెం కట్ రాములు ఆధ్వర్యంలో ధర్నాచౌక్ నుంచి ర్యాలీగా వెళ్లి సంఘీభావం తెలిపారు. అనంతరం దీక్ష భగ్నానికి నిరసనగా స్థానిక బస్టాండ్ వద్ద సీపీఎం, సీఐటీయూ ఆధ్వర్యంలో అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు రాస్తారోకో, మాన వహారం నిర్వహించారు. ఈ సందర్భంగా సాగర్ మాట్లాడుతూ.. కేవలం ఐదేళ్లు పనిచేసి ఎమ్మెల్యేలు నెలకు రూ. 15వేల పెన్షన్ తీసుకుంటుంటే, ఐసీడీఎస్ సంస్థలో వయసంతా గడిచిపోయినా పెన్షన్ సౌకర్యం కల్పించలేక పోవడం సిగ్గుచేటన్నా రు. వెంటనే అంగన్వాడీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, లేని పక్షంలో ఉ ద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ఆ యన హెచ్చరించారు.