tufan
-
నా లుక్ కొత్తగా ఉంటుంది: సత్యరాజ్
‘‘బాహుబలి’ తర్వాత సినిమాల రేంజ్ పెరిగింది. తెలుగు ప్రేక్షకులతో నాకు మంచి అనుబంధం ఏర్పడింది. ‘తుఫాన్’ సినిమాతో వారికి మరింత దగ్గరవుతానని ఆశిస్తున్నాను’’ అని విజయ్ ఆంటోనీ అన్నారు. విజయ్ ఆంటోనీ హీరోగా నటించిన చిత్రం ‘తుఫాన్’. విజయ్ మిల్టన్ దర్శకత్వంలో కమల్ బోరా, డి. లలిత, బి. ప్రదీప్, పంకజ్ బోరా నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 2న విడుదల కానుంది.ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో విజయ్ ఆంటోనీ మాట్లాడుతూ–‘‘తుఫాన్’ కంటెంట్, క్వాలిటీ మాకు సక్సెస్ ఇస్తాయన్న నమ్మకం ఉంది. నిర్మాతలు ఎంతో కష్టపడి ఈ సినిమాను తమిళంతోపాటు తెలుగులోనూ విడుదల చేస్తున్నారు. వారికి థ్యాంక్స్’’ అన్నారు.‘‘నాకు నచ్చిన థ్రిల్లర్ మూవీ ‘తుఫాన్’. ఈ సినిమాలో నా లుక్, మేకోవర్, క్యారెక్టర్ కొత్తగా ఉంటాయి’’ అన్నారు సత్యరాజ్. ‘‘తుఫాన్’ను థియేటర్స్‌లో చూడండి’’ అన్నారు విజయ్ మిల్టన్. ‘‘తుఫాన్’లో క్వాలిటీ కంటెంట్, కమర్షియల్ అంశాలు ఉన్నాయి’’ అన్నారు ధనుంజయ. -
ఏమైంది తల్లీ? కష్టాలు వింటూ.. కన్నీళ్లు తుడుస్తూ..
సాక్షి, తిరుపతి: తుపాన్ ప్రభావిత ప్రాంతాల పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం గూడూరు నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేశారు. ముందుగా ఆయన ఏరియల్ సర్వే చేశారు. ఆపై క్షేత్ర స్థాయిలో పర్యటించి వరద నష్టాన్ని స్వయంగా పరిశీలించారు. బాధితుల కష్టాలు విని చలించిపోయారు. అన్నదాతల కన్నీళ్లు తుడుస్తూ అండగా ఉంటానని ధైర్యం చెప్పారు. వాకాడు మండలంలోని తొమ్మిది గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడకుండా స్వర్ణముఖి నదిపై హైలెవల్ బ్రిడ్జి నిర్మాణానికి రూ.30 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. వరదల కారణంగా పూర్తిగా దెబ్బతిన్న పంటలు తిరిగి వేసుకునేందుకు 80 శాతం సబ్సిడీతో విత్తనాలు ఇవ్వనున్నట్లు వెల్లడించారు. సీఎం ప్రకటనపై అన్నదాతలు హర్షం వ్యక్తం చేశారు. వాకాడు మండలంలోని బాలిరెడ్డిపాళెం పరిధిలో కోతకు గురైన స్వర్ణముఖి నది లోలెవల్ కాజ్వే, వరి పంటలను పరిశీలించి ఆవేదనకు లోనయ్యారు. కలెక్టర్ వెంకటరమణారెడ్డి, ఎమ్మెల్యే వరప్రసాద్, జిల్లా పార్టీ అధ్యక్షులు నేదురమల్లి రామ్‌కుమార్‌రెడ్డి, వాకాడు మాజీ ఏఎంసీ చైర్మన్ కొడవలూరు దామోదర్‌రెడ్డిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. బారులుదీరిన అభిమానం! ముఖ్యమంత్రి వస్తున్నారని తెలుసుకున్న స్థానికులు విద్యానగర్ నుంచి బాలిరెడ్డిపాళెం వరకు బారులు తీరారు. తమ రాకకోసం నిరీక్షిస్తున్నారని గుర్తించిన ముఖ్యమంత్రి వారిని ఆప్యాయంగా పలకరించారు. రైతుల ఆవేదనను స్వయంగా విని చలించిపోయారు. వృద్ధురాలి కన్నీటిని తుడుస్తూ.. ‘ఏడ్వకవ్వా.. నేనున్నాను’ అంటూ భరోసానిచ్చారు. మానవత్వంతో స్పందించిన తీరుని చూసి వృద్ధురాలు సీఎం ముఖాన్ని పట్టుకుని ‘నువ్వ చల్లంగా ఉండాలి నాయనా’ అంటూ దీవెనలందించారు. అక్కడే ఉన్న స్థానికులను ఆప్యాయంగా పలకరిస్తూ ముందుకు సాగారు. ‘జగన్ మామయ్యా.. జగన్ మామయ్యా’ అంటూ దీనంగా తనవంక చూసి అరుస్తున్న చిన్నారుల వద్దకు వెళ్లి బుగ్గలు నిమిరారు. ‘బాగా చదువుకో’ అంటూ ముందుకు కదిలారు. ముఖాముఖి సమావేశంలో ప్రజల నుంచి వచ్చిన అర్జీలను తీసుకుని వాటి పరిష్కరించాలని కలెక్టర్‌ని ఆదేశించారు. సాధారణ పరిస్థితులు నెలకొనేవరకూ ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని భరోసానిచ్చారు. శరవేగంగా సాగుతున్న సహాయక చర్యలపై సీఎం నేరుగా ప్రజలతో మాట్లాడి వారి నుంచి వివరాలు తీసుకున్నారు. బాధిత కుటుంబాలకు అందించే నిత్యావసర సరుకుల పంపిణీపైనా ఆరా తీశారు. విద్యుత్, రహదారులు, తాగునీటి సౌకర్యం పునరుద్ధరణ, పంట నష్టం అంచనాకు సంబంధించి ఎన్యూమరేషన్ ప్రక్రియపై అధికారులను వివరాలు అడిగిన తెలుసుకున్నారు. ఈ సందర్భంగా శ్రీకాళహస్తి, సత్యవేడు, సూళ్లూరుపేట ఎమ్మెల్యేలు బియ్యపు మధుసూదన్‌రెడ్డి, ఆదిమూలం, కిలివేటి సంజీవయ్య తమ నియోజకవర్గాల్లో జరిగిన నష్టాలను సీఎం వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్లారు. సీఎంకు ఘన స్వాగతం.. వాకాడు మండలం, బాలిరెడ్డిపాళెం వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించేందుకు వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డికి కోట మండలం, విద్యానగర్‌లో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ వద్ద నాయకులు ఘన స్వాగతం పలికారు. సీఎం వెంట ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి, మంత్రి తానేటి వనిత ఉన్నారు. కాగా హెలీప్యాడ్ వద్ద మంత్రి కాకాణి గోవర్దన్‌రెడ్డి, గూడూరు, సూళ్లూరుపేట, ఆత్మకూరు ఎమ్మెల్యేలు వరప్రసాద్‌రావు, సంజీవయ్య, మేకపాటి విక్రమ్‌రెడ్డి, ఎమ్మెల్సీలు మేరిగ మురళీధర్, పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డి, బల్లి కల్యాణచక్రవర్తి, వైఎస్సార్సీపీ తిరుపతి జిల్లా అధ్యక్షులు నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. ఇవి చదవండి: అపోహలొద్దు.. ఆదుకుంటాం -
తుఫాన్ ఫస్ట్‌లుక్ పోస్టర్ విడుదల..
న్యూఢిల్లీ: బాలీవుడ్ నటుడు, ‘బాగ్‌మిల్కాబాగ్’ ఫేమ్ ఫర్హాన్ అక్తర్ తన కొత్త సినిమా తుఫాన్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. బాక్సింగ్ రింగ్‌లో సాధన చేస్తున్న ఫొటో నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. వచ్చే ఏడాది అక్టోబర్ 2న తుఫాన్ చిత్రాన్ని విడుదల చేయనున్నామని అక్తర్ ట్వీట్ చేశారు. స్పోర్ట్స్ డ్రామాతో కూడిన ఫిక్షన్ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. ఈ సినిమాకు ఓమ్ప్రకాశ్ మెహ్రా దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన బాగ్‌మిల్కాబాగ్ సంచలన విజయాన్ని నమోదు చేసుకున్న విషయం తెలిసిందే. తుఫాన్ సినిమా షూటింగ్‌కు ముందు నుంచే ఫర్హాన్ తన పాత్ర కోసం సాధన చేయడం విశేషం. బాలీవుడ్ నటుడు పరేష్ రావల్ ఈ చిత్రంలో కీలక పాత్రలో నటించనున్నారు. ‘అద్భుత నటుడు ఫర్హాన్‌తో నటించడం థ్రిల్‌కు గురిచేస్తుంద’ని పరేష్ రావల్ ట్వీట్ చేశారు. ఈ సినిమాకు ఫర్హాన్ అక్తర్ నిర్మాతగా వ్యవహరించడం గమనార్హం. -
శ్రీశైలం ఘాట్‌లో ప్రమాదం
- తుఫాన్ వాహనం బోల్తా - ఆరుగురికి తీవ్ర గాయాలు - వారిలో ఇద్దరి పరిస్థితి విషమం పెద్ద దోర్నాల: ప్రయాణికులతో వెళ్తున్న తుఫాన్ వాహనం బోల్తా పడటంతో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన మండల పరిధిలో శ్రీశైలం ఘాట్ రోడ్లో బోడేనాయక్ తండా సమీపంలో సోమవారం జరిగింది. క్షతగాత్రుల్లో డోన్ మండలం హసనాపురానికి చెందిన హేమారెడ్డి, అవుకు మండలం చెర్లోపల్లికు చెందిన తుఫాన్ డ్రైవర్ కొట్టం వెంకటయ్య, పత్తికొండ మండలం పులికొండకు చెందిన దంపతులు నార్ల తిప్పయ్య, అనసూయమ్మ, ఆమె సోదరి నార్ల నరసమ్మ, తిప్పనూరు మండలం గోనెంట్లకు చెందిన నాగేంద్ర ఉన్నారు. ప్రమాదంలో నార్ల తిప్పయ్య ఆరేళ్ల కుమార్తె వనజకు కూడా స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదాన్ని గుర్తించిన ఇతర వాహనాల డ్రైవర్లు క్షతగాత్రుల్లో కొందరిని తమ వాహనాల్లో పెద్దదోర్నాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మిగిలిన క్షతగాత్రులను 108 సిబ్బంది వైద్యశాలకు తీసుకెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. హేమారెడ్డి, కొట్టం వెంకటయ్యల పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం మార్కాపురం, కర్నూలు వైద్యశాలలకు తరలించారు. -
తుపాన్ సమయంలో అప్రమత్తం
కర్నూలు(రాజ్‌విహార్): వర్దా తుఫాను విపత్తు పట్ల అప్రమత్తంగా ఉండాలని విద్యుత్ శాఖ రాష్ట్ర ప్రభుత్వ ఎనర్జీ సెక్రటరీ అజయ్‌జైన్ అధికారులకు సూచించారు. సోమవారం ఆయన విజయవాడలోని ప్రధాన కార్యాలయం నుంచి స్థానిక అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెన్నై, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు తదితర ప్రాంతాల్లో వర్దా తుఫాను బీభత్సం సృష్టిస్తోందన్నారు. తుఫాను కారణంగా సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయని, వీటి పట్ల అప్రమత్తంగా ఉండి వెంటనే పరిష్కరించేందుకు తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రైతులు, వినియోగదారుల సేవల్లో లోపం లేకుండా చూడాలని, సమస్యలపై ఫిర్యాదులు వచ్చిన వెంటనే స్పందించి పరిష్కరించాలని ఆదేశించారు. సమావేశంలో ఎస్ఈ భార్గవ రాముడు, డీఈ పీవీ రమేష్, ఏడీఈలు ప్రసాద్, రంగస్వామి, విజయసారధి, నవీన్‌బాబు పాల్గొన్నారు. -
ఈసారి ‘తుపాను’ సమావేశాలే
ఇరు పక్షాలు దాడి ఎత్తుగడలతోనే బరిలోకి దిగుతున్న ఈ పార్లమెంటరీ సంగ్రామం... పోల్చడానికే వీల్లేని మోదీ, రాహల్‌లకు అగ్నిపరీక్షే. నిరాసక్త నేతగా ప్రసిద్ధుడైన రాహుల్ కాంగ్రెస్ పగ్గాలు పట్టనున్న నేత. ఇప్పుడు చూపుతున్న సమరోత్సహం ఎలా ఉన్నా, సభలో ప్రధాన విపక్ష సేనాని పాత్రను ఎలా నిభాయి స్తారనేది ఆయన భవితకు కీలకం. ఇక మోదీ పార్లమెంటుకు తక్కువగా, విదేశాలకు ఎక్కువగా వెళ్లే ప్రధానిగా ఇప్పటికే గుర్తింపు పొందారు. ఈసారి కూడా మొహం చాటేసి ప్రజాస్వామ్య వ్యవస్థల పట్ల ఏమంత గౌరవం లేదనే భావన బలపడేట్టు చేస్తారా? లేక సభలో కూడా సమర్థ నేతగా రుజువు చేసుకుంటారా? సాధారణంగా మన రాజకీయ పరిశీలకుల మధ్య ఏకాభిప్రాయం కుదరడం అరుదు. కానీ ఈ పార్లమెంటు వర్షాకాల సమావేశాల ‘వాతావరణం’పై అందరిదీ ఒకటే మాట... ఉత్తరాది వరదలను మించిన ఉధృతితో ఉభయ సభల్లోనూ తుపానులు చెలరేగనున్నాయి. గత ఏడాది సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఏ అస్త్రాలను ప్రయోగించి కాంగ్రెస్‌ను చిత్తుచేసిందో సరిగ్గా అవే అస్త్రాలను ఎదుర్కోడానికి అది నేడు అధికార పక్షంగా రక్షణ వ్యూహాలను రచిస్తుండటం ఆసక్తికరం. రేపు ప్రారం భం కానున్న పార్లమెంటు సమావేశాలకు వ్యూహ, ప్రతివ్యూహాలు ఇప్పటికే సిద్ధమయ్యాయి. అటు కేంద్రంలోనూ, ఇటు బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనూ కూడా వరుసగా వెలుగుచూస్తున్న అవినీతి, కుంభకోణాలను కేంద్రంగా చేసు కొని అధికార పక్షాన్ని చుట్టుముట్టి దాడి చేసే విషయంలో విపక్షాలన్నీ ఏకా భిప్రాయంతో ఉన్నాయి. ప్రత్యేకించి ఇటీవల కొంత కాలంగా మీడియాలో నూ, రాజకీయాల్లోనూ తీవ్ర ప్రకంపనలను సృష్టిస్తున్న ‘లలిత్ గేట్’, ‘వ్యాపం’ వంటి కీలక అంశాలపై ప్రధాని నరేంద్ర మోదీ... గత ప్రధానులు పీవీ, మన్మోహన్ లను మించిన ‘మౌన ముద్ర’ దాల్చటం ప్రతిపక్షాలకు బల మైన అంశంగా మారింది. ఒకప్పటి ఐపీఎల్ షోమేన్, నేటి ‘పరారీలోని నింది తుడు’ లలిత్ మోదీకి సాయం చేసిన వ్యవహారంలో కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్తోపాటూ, రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజే ఇరుక్కు పోయా రు. ఇక వ్యాపమ్ కుంభకోణంకేసుతో సంబంధమున్న వారు 48 మంది సాక్షులు, దోషులు, పాత్రికేయులు వరుసగా ఆత్మహత్యలకో, హత్యలకో, అనుమానాస్పద మరణాలకో గురికావడం ప్రత్యేకించి అధికార పక్షాన్ని రక్షణ స్థితిలోకి నెట్టేస్తోంది. సుష్మా, రాజే, చౌహాన్లను పదవుల నుంచి తాత్కాలి కంగానైనా తప్పించకపోతే ప్రజలు తమ పార్టీని కాంగ్రెస్‌తో కలిపి ఒకే గాటన కట్టేస్తారని పలువురు బీజేపీ నేతలు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇవి చాలదన్నట్టు మహారాష్ట్ర మంత్రులు పంకజ ముండే, వినోద్ తావ్డేలపై అవినీతి ఆరోపణల కారణంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌ను, ప్రజా పంపిణీ నిధుల కుంభకోణంలో ఆరోపణలను ఎదుర్కొం టున్న ఛత్తీస్గడ్ ముఖ్యమంత్రి రమణ్‌సింగ్‌ను గద్దె దింపాలని కాంగ్రెస్, తదితర ప్రతిపక్ష పార్టీలన్నీ బలంగా డిమాండ్ చేస్తున్నాయి. ఇటీవలి కాలంలో అధికార పార్టీకి చెందిన పలువురు ముఖ్యమంత్రులు, కేంద్ర, రాష్ట్రాల మం త్రులు వివిధ వివాదాల్లో ఇరుక్కున్నారు. ఇంతవరకు ఈ సమస్యలన్నిటిపైనా మాటా పలుకూ లేకుండా ఉన్న ప్రధాని మోదీ సమాధానం చెప్పాలని ప్రతి పక్షాలు పార్లమెంటును స్తంభింపచేయడం తప్పదు. ఇక.. మోదీ సర్కారు భూసేకరణ బిల్లును ప్రవేశపెడితే దానికదే ఒక పెద్ద రణక్షేత్రం కానుంది. జీఎస్టీ బిల్లు, కులగణన వివరాలను సర్కారు వెల్లడించకపోవటం, నల్ల ధనంపై ఇచ్చిన హామీల అమలు వంటి అంశాలు ఎలాగూ ఉండనే ఉన్నాయి. ఈ సమావేశాలు వర్షార్పణమే?! ఈ నెల 21 నుంచి ఆగస్టు 13 వరకూ సాగనున్న ఈ సమావేశాల్లో .. రాజ్య సభలో పెండింగ్‌లో ఉన్న 9 బిల్లులు, లోక్‌సభలో పెండింగ్‌లో ఉన్న 4 బిల్లుల తోపాటు 11 కొత్త బిల్లులను ఆమోదం కోసం ప్రవేశ పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో వివాదాస్పద భూసేకరణ బిల్లు, జీఎస్టీ బిల్లు వంటి పలు కీలక బిల్లులు ఉన్నాయి. సార్వత్రిక ఎన్నికల తదుపరి అస్తిత్వ పరమైన ముప్పును ఎదుర్కొంటున్నట్టనిపించిన కాంగ్రెస్‌కు ‘కాలం కలిసి వచ్చినట్ట’నిపిస్తోంది. అధికార పక్ష అవినీతి సెల్ఫ్‌గోల్స్ పరంపర ఆ పార్టీకి ఊపిరిపోసింది. అది ప్రత్యేకించి రాహుల్ గాంధీ సమరోత్సాహంలో కనిపిస్తోంది. పైగా బిహార్‌లో నితీష్‌కుమార్, లాలూ యాదవ్‌ల సయోధ్య ప్రాతిపదికగా బీజేపీయేతర ప్రతిపక్షాలన్నీ ఒక్క తాటిపైకి వచ్చే పరిస్థితి నెలకొంది. ప్రకాశ్ కారత్కు భిన్నమైన వ్యవహార శైలితో పట్టువిడుపులను ప్రదర్శించే సీతారాం ఏచూరి ప్రధాన వామపక్షమైన సీపీఎం పగ్గాలు చేపట్ట డం ప్రతిపక్షాలకు కలసి వచ్చే అంశం. బెంగాల్‌లోని వామపక్షాల ప్రత్యర్థి మమతా బెనర్జీ సైతం బీజేపీతో తలపడే వైఖరిని చేపట్టడం విపక్షాలకు అను కూలాంశంగా మారింది. విపక్షాలు ఒక్కటిగా నిలిచి ప్రభుత్వాన్ని ముట్టడిలో ఉన్న స్థితికి నెట్టేయడం నేరుగా బిహార్ ఎన్నికల తీరును ప్రభావితం చేస్తుంది. అందుకే అధికార, విపక్షాలలో ఏ ఒక్కటీ వెనక్కు తగ్గే సూచనలు కనిపించటం లేదు. ఈ నేపధ్యంలో ఈ పార్లమెంటు సమావేశాల్లో ఉభయ సభల కార్యకలా పాలు పూర్తిగా స్తంభించిపోవడం తప్పక పోవచ్చు. ఎదురు దాడే అత్యుత్తమ రక్షణ విపక్షాల దాడుల నుంచి రక్షణ కోసం యత్నించే కంటే వారిపై తామే ఎదురు దాడికి దిగడమే అత్యుత్తమమని గత నెల 24వ తేదీన జరిగిన పార్లమెంటరీ వ్యవహారాలపై కేబినెట్ కమిటీ సమావేశంలోనే ఎన్డీఏ వ్యూహ రచన చేసి నట్టు తెలుస్తోంది. ఎక్కడా వెనుకడుగు వేస్తున్నట్లు కనిపించకుండా ఉండట మే గాక, ఆరోపణలు ఎదుర్కొంటున్న తమ మంత్రులను, ముఖ్యమంత్రుల ను సమర్థించుకుంటూ.. ప్రతిపక్షాలపై, ముఖ్యంగా కాంగ్రెస్‌పై ఎదురు దాడికి దిగేందుకు సిద్ధమవుతోంది. విపక్షాల దాడుల నేపథ్యంలో అవసరమైతే సమావేశాలను మరో వారం పొడిగించడానికి సిద్ధపడాలే తప్ప, కుదిస్తే ప్రభుత్వం వెనుకడుగు వేస్తోందన్న సంకేతాలు వెళతాయని అది భావిస్తోంది. మనీ లాండరింగ్, హవాలా, బెట్టింగ్ కేసుల్లో ఆరోపణలను ఎదుర్కొం టూ లండన్‌లో తలదాచుకున్న లలిత్ మోదీకి పోర్చుగల్ వెళ్లి వచ్చేందుకు సుష్మా సహాయపడటమే కాదు, ఆమె భర్త, కుమార్తె ఆయనకు ఉచిత న్యాయ సహాయం అందించారు. అలాగే రాజే కుటుంబంతో లలిత్కున్న వ్యాపార లావాదేవీలు కూడా రట్టయ్యాయి. వారిని పదవుల నుంచి తొలగించాలని ప్రతిపక్షాలు పట్టుపడుతున్నాయి. సుష్మా, రాజేలు లలిత్‌కు సాయం చేయటం లో ఎలాంటి తప్పూ లేదని బీజేపీ, కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఇప్పటికే సమర్థించుకుంటున్నారు. వారు పదవుల నుంచి తప్పుకోవాల్సిన అవసరం లేదని స్పష్టంచేస్తున్నారు. పార్లమెంటులో కూడా ఇదే వైఖరిని కొనసాగించ నున్నారు. పైగా కాంగ్రెస్ నేతలపై లలిత్ మోదీ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావి స్తూ ఎదురు దాడికి దిగాలని భావిస్తున్నారు. మధ్యప్రదేశ్‌లో 2007-2013 మధ్య జరిగిన ‘వ్యవసాయిక్ పరీక్షా మండల్ (వ్యాపమ్)’ కుంభకోణంలో ఆ రాష్ట్ర గవర్నర్ రాంనరేశ్‌యాదవ్, ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌చౌహాన్ సన్నిహితుల పాత్రపైనా ఆరోపణలు వెల్లువెత్తాయి. రెండేళ్ల క్రితం ఈ కుంభకోణంపై దర్యాప్తు ప్రారంభమైనప్పటి నుంచి దాదాపు ఈ కుంభకోణంతో ప్రత్యక్షంగా సంబంధమున్న వారిలో పలువురు అసహజ, అనుమానాస్పద పరిస్థితుల్లో మరణిస్తున్నారు. తాజాగా ‘ప్రజాభిప్రాయం’ మేరకు సీబీఐ దర్యాప్తు జరిపించాలని చౌహాన్ సర్కార్ కోర్టును కోరిందనే ‘రక్షణ’తో ఆయన రాజీనామా విషయాన్ని దాటవేయా లని చూస్తోంది. కాంగ్రెస్ హయాంలోని వివిధ కుంభకోణాలను ప్రస్తావిస్తూ ఎదురు దాడి చేయడంతో చర్చను పెడదోవ పట్టిస్తే గందరగోళం తప్పదనే ఎత్తుగడను ప్రయోగించనుంది. ఇక ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి రమణ్‌సింగ్ కుటుంబ సభ్యుల ప్రమేయం ఉన్న కుంభకోణం విషయంలోనూ, మహారాష్ట్ర మంత్రులు పంకజ ముండే, వినోద్ త్వాండేలపై అవినీతి ఆరోపణల విష యంలో ముఖ్యమంత్రి ఫడ్నవిస్‌ను ఆ పదవి నుంచి తప్పించాలనే అంశం పైనా బీజేపీ అదే ఎదురు దాడి వ్యూహాన్ని అనుసరించనుంది. భూసేకరణ బిల్లును అవసరమైతే వాయిదా వేసుకుని, అనవసర పోరాటానికి దిగకుండా ఉండాలని ఆలోచిస్తోంది. కాకపోతే వస్తువులు, సేవల పన్ను (జీఎస్టీ) బిల్లు కాంగ్రెసేతర ప్రతిపక్షాల సహాయంతో సులభంగానే గట్టెక్కనుంది. ఇద్దరికీ అగ్నిపరీక్షే ఇరు పక్షాలు దాడి ఎత్తుగడలతోనే బరిలోకి దిగనున్న ఈ పార్లమెంటరీ సంగ్రామం... పోల్చడానికే వీల్లేని నేతలుగా కనిపించే నరేంద్ర మోదీ, రాహల్ గాంధీలిద్దరికీ లిట్మస్ టెస్ట్ కానుండటం విశేషం. లోక్‌సభలో నిదురించే బాలునిగా ప్రసిద్ధుడైన రాహుల్ నేడో రేపో కాంగ్రెస్ పగ్గాలు పట్టే ముహూర్తం కోసం ఎదురు చూస్తున్న నేత. పార్లమెంటుకు బయట చూపుతున్న సమరో త్సహం సంగతి ఎలా ఉన్నా, లోపల ప్రధాన విపక్ష సేనాని పాత్రను ఎలా నిభాయిస్తారనేది ఆయన భవితకు కీలకం. ఆయన నాయత్వశక్తిపై ఆ పార్టీ లోనే ఉన్న సందేహాలను తొలగించడానికి లభించిన మంచి అవకాశమిది. ఏం చేస్తారో చూడాలి. ఇక మోదీ పార్లమెంటుకు అతి తక్కువగా హాజరై, విదేశా లకు అతి ఎక్కువగా వెళ్లే ప్రధానిగా ఇప్పటికే గుర్తింపు పొందారు. లోక్‌సభలో ఎలాంటి దాడినైనా తిప్పికొట్టగల సమర్థ నాయకురాలు సుష్మా స్వయంగా ఈ సమావేశాల్లో విపక్షాలకు ముఖ్య లక్ష్యం కానున్నారు. ఇక మోదీయే ముం దుండి పార్లమెంటరీ పోరును నడపాల్సి ఉంటుంది. పార్లమెంటుకు మొహం చాటేసి ఆయనకు ప్రజాస్వామ్య వ్యవస్థల పట్ల ఏమంత గౌరవం లేదనే భావన బలపడేట్టు చేస్తారా? లేక సభలో కూడా తాను బయటిలాగే ప్రత్యర్థు లను బెంబేలెత్తించగల సమర్థ నేతగా రుజువు చేసుకుంటారా? - పృథ్వీరాజ్ -
అతి తీవ్ర తుఫానుగా మారిన మాదీ
-
తుఫాను ప్రభావంతో వణుకుతున్న భీమవరం ప్రజలు
-
తీరం దాటిన హెలెన్ తుఫాన్
-
అల్లకల్లోలంగా మారిన సముద్రం
-
నష్టం అపారం
తుపాన్ ప్రభావంతో నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు జిల్లాలో పంట నష్టం భారీగా జరిగింది. కొన్ని చోట్ల శనివారం కూడా వర్షం కురిసింది. తెరిపినిచ్చిన ప్రాంతాల్లో అధికారులు పంట నష్టం అంచనాకు బయలు దేరారు. ప్రధానంగా వరి, మొక్కజొన్న, పత్తి, కూరగాయలు భారీగా దెబ్బతిన్నాయి. వేలాది ఎకరాలు నీట మునగడంతో రైతులు బెంబేలెత్తిపోతున్నారు. దెబ్బతిన్న పంటలకు పరిహారం ఇవ్వడంతోపాటు తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సిందేనంటూ రైతులు శనివారం పలుచోట్ల ఆందోళనకు దిగారు. - న్యూస్‌లైన్ నెట్వర్క్ నంగునూరులో భారీగా.. నంగునూరు: వర్షాలకు పంటలకు అపార నష్టం వాటిల్లింది. వాగుపై నిర్మించిన ఆరు చెక్‌డ్యాంలు పొంగిపొర్లుతుండడంతో పరీవాహక ప్రాంతాల్లో పంటలు నీటమునిగాయి. మగ్దుంపూర్, బద్దిపడగ, నంగునూరు, తిమ్మాయిపల్లి, వెల్కటూర్, వెంటాపూర్, పాలమాకుల తదితర గ్రామాల్లో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ప్రాథమిక అంచనా ప్రకారం 4,340 ఎకరాల్లో నష్టం వాటిల్లింది. ఇందులో వరి 1,625 ఎకరాలు, పత్తి 1,565 ఎకరాలు, మొక్కజొన్న 1,150 ఎకరాలు నష్టపోయినట్టు అధికారులు వెల్లడించారు. ఆది వారం నుంచి రెవెన్యూ సిబ్బంది అన్ని గ్రామాల్లో తిరిగి సర్వే నిర్వహిస్తారని తెలిపారు. మండలంలో సుమారు 70 ఇళ్లు కూలినట్టు తహశీల్దార్ అంబదాస్ రాజేశ్వర్ తెలిపారు. జిన్నారంలో 790 ఎకరాలు జిన్నారం, న్యూస్‌లైన్: మండలంలో మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు సుమారు 790 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. వర్షం నుంచి పంటలను కాపాడుకునేందుకు రైతులు నానా తంటాలు పడుతున్నారు. కూరగాయ పంటలు సైతం నీటమునిగి ఎందుకు పనికిరాకుండా పోయాయి. వరి 220 ఎకరాలు, మొక్కజొన్న 150 ఎకరాలు, పత్తి 120, కూరగాయ పంటలు 300 ఎకరాల్లో దెబ్బతి న్నాయి. మాధవరం, జిన్నారం, నల్లవల్లి, గుమ్మడిదల, కొడకంచి, మంత్రికుంట, సోలక్పల్లి, అండూర్ తదితర గ్రామాల్లో పంటల నష్టం తీవ్రత అధికంగా ఉంది. మాధవరంలో వరి, నల్లవల్లిలో మొక్కజొన్నకు నష్టం వాటిల్లింది. చేతికొచ్చిన మొక్కజొన్న తడిసి పోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మాధవరం పంచాయతీ ఏడు ఇళ్లు కూలిపోయాయని సర్పంచ్ సురేందర్‌గౌడ్ తెలిపారు. జిన్నారం మండల వ్యవసాయ శాఖ అధికారులు గుమ్మడిదల, నల్లవల్లి, కొత్తపల్లి, మాధవరం తదితర గ్రామాల్లో నష్టపోయిన పంటలను పరిశీలించారు. తగిన ఆర్థిక సహాయాన్ని అందించాలని రైతులు అధికారులను వేడుకున్నారు. 3,650 ఎకరాలకు దెబ్బ కౌడిపల్లి: వర్షాల కారణంగా మండలంలో 3,650 ఎకరాల్లో పంటనష్టం జరిగినట్లు తహశీల్దార్ అన్వర్ తెలిపారు. శనివారం ఆయన ఏఓ రాజుతో కలిసి వెల్మకన్న, కొట్టాల, లింగంపల్లి తదితర గ్రామాల్లో వర్షాల కారణంగా దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. అనంతరం తహశీల్దార్ మాట్లాడుతూ మండలంలో వరిపంట నేలవాలి నీటమునగడంతోపాటు కోతకోసి పెట్టిన పంటసైతం దెబ్బతిందని, మొలకలు సైతం వస్తున్నాయని తెలిపారు. 3,325 ఎకరాల్లో వరి, 225 ఎకరాల్లో మొక్కజొన్న, వంద ఎకరాల్లో పత్తిపంటకు నష్టం వాటిల్లిందన్నారు. వర్షాల కారణంగా 450 ఇళ్లు ధ్వంసమైనట్టు తెలిపారు. నష్టం వివరాలపై రోజూ కలెక్టర్‌కు నివేదిక ఇస్తున్నామన్నారు. బుజిరంపేటలో వీఆర్ఓ సోమరాజు గ్రామసభను ఏర్పాటు చేసి పంటనష్టం వివరాలు తెలుసుకున్నారు. వర్షంలోనూ రాస్తారోకో చిన్నకోడూరు:తడిసిన మొక్కజొన్నలు కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ టీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతులు శనివారం చిన్నకోడూరు మండలం రామంచలోని కొనుగోలు కేంద్రం ఎదుట గల సిద్దిపేట -సిరిసిల్ల రహదారిపై వర్షంలోనే రాస్తారోకో చేశారు. ఐకేపీ కొనుగోలు కేంద్రానికి వచ్చిన మొక్కజొన్నలు కొనుగోలు చేసినా తరలించకపోవడం, వచ్చిన ధాన్యాన్ని బయటే ఉంచడంతో వర్షాలకు తడిసి ముద్దయినట్టు టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కుంట వెంకట్‌రెడ్డి, నాయకు లు రాధాకృష్ణశర్మ, దేవునూరి తిరుపతి, మూర్తి బాల్‌రెడ్డి, రాంచంద్రం తెలిపారు. మొలకెత్తిన, తడిసిన విత్తనాలను ఆరబోయడానికి వీలు లేకుండా వర్షం కురుస్తుం డటంతో రైతులు దిక్కుతోచని పరిస్థితిలో ఉండిపోయారన్నారు. తేమ శాతం ఎక్కువగా ఉందని తిరస్కరిస్తే పరిస్థితి ఏమిటని వారు ప్రశ్నించారు. రూరల్ సీఐ ప్రసన్నకుమార్ అక్కడికి చేరుకుని రైతులతో మాట్లాడారు. సంబంధిత అధికారులతో మాట్లాడి కొనుగోలు చేసిన ధాన్యాన్ని తరలిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు. అనంతరం ఆర్డీఓ ముత్యం రెడ్డి అక్కడికి చేరుకుని కొనుగోళ్లను ప్రారంభించి వెంట వెంటనే మక్కలను తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. ఆదుకోవాలంటూ రైతుల ఆందోళన కల్హేర్: నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు మండలంలో భారీ పంట నష్టం జరిగింది. కల్హేర్, మార్డి, బీబీపేట, రాపర్తి, మాసాన్‌పల్లి, కృష్ణాపూర్ తదితర గ్రామాల్లో వందలాది ఎకరాల్లో పంట నష్టం జరిగింది. వరి, మక్కలకు మొలకలు రావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. శనివారం వారు మొలకలొచ్చిన పంటతో తహశీల్ కార్యాలయం ఎదుట బైఠాయించారు. కల్హేర్ పీఏసీఎస్ చైర్మన్ వీర్శెట్టి ఆధ్వర్యంలో రైతులు దెబ్బతిన్న వరి, మక్కలను తహశీల్దార్‌కు చూపించారు. పరిహారం అందేలా చూడాలని వేడుకున్నారు. ఏఓ అరుణ, వీఆర్వో విఠల్ రాపర్తిలో పంట నష్టాన్ని అంచనా వేశారు. -
జీహెచ్ఎంసీ అప్రమత్తం ! ఎం.టి. కృష్ణబాబు
సాక్షి, సిటీబ్యూరో : తుపాను హెచ్చరికలు.. వరుస సెలవుల నేపథ్యంలో అనుకోకుండా నగరంపై తుపాను ప్రభావం చూపినా ఎదుర్కొనేందుకు అవసరమైన అన్ని ముందుజాగ్రత్త చర్యలు తీసుకున్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ ఎం.టి. కృష్ణబాబు తెలిపారు. వాతావరణ శాఖ సమాచారం మేరకు నగరంపై తుపాను ప్రభావం ఉండనప్పటికీ అప్రమత్తంగా ఉన్నామన్నారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ బహుశా 13, 14 తేదీల్లో వర్ష ప్రభావం ఉంటే ఉండవచ్చునన్నారు. వరుస సెలవులు, ముఖ్యమైన పండుగ అయినందున ఉద్యోగులందరూ ఊళ్లకు వెళ్లే అవకాశం ఉన్నందున, సెలవుల్ని రద్దు చేశామన్నారు. ఇప్పటికే సెలవు మంజూరైన వారు సైతం ఉపసంహరించుకొని నగరంలో అందుబాటులో ఉండాల్సిందిగా ఆదేశాలు జారీ చేశామని చెప్పారు. వర్షవిపత్తుల్లో సహాయక చర్యలు నిర్వర్తించే విపత్తునివారణ, ఇంజినీరింగ్, టౌన్‌ప్లానింగ్, తదితర విభాగాల్లోని వారికి ఇవి వర్తిస్తాయన్నారు. వర్ష ప్రభావాన్ని తట్టుకునేందుకు చేసిన ఏర్పాట్ల గురించి వెల్లడించారు. 20 కారిడార్ల అభివృద్ధి గుర్తించిన 20 కారిడార్లలో రహదారులను పూర్తిస్తాయిలో అభివృద్ధి పరచనున్నట్లు తెలిపారు. ఇందుకు దాదాపు రూ. 125 కోట్లు ఖర్చు కాగలదని అంచనా వేసినట్లు తెలిపారు. డిసెంబర్ ఒకటి నుంచి ఆ పనులు ప్రారంభిస్తామని, ఈలోగా టెండర్ల ప్రక్రియ తదితరమైనవి పూర్తిచేయనున్నట్లు చెప్పారు. సమావేశంలో ఈఎన్సీ ధన్సింగ్ పాల్గొన్నారు. రహదారుల మరమ్మతుల తీరిదీ... ఇప్పటి వరకు రూ. 14.54 కోట్లతో 238 రహదారి మరమ్మతు పనులు చేపట్టామని కృష్ణబాబు తెలిపారు. వాటిల్లో 172 పనులు పూర్తికాగా, మరో 15 పనులు చివరి దశలో ఉన్నాయని చెప్పారు. మరో రూ. 3.7 కోట్ల మేర పనులు జరగాల్సి ఉందన్నారు. దక్షిణ మండలంలోని ఈ పనులు చేసే కాంట్రాక్టరు ఎక్కువ పనులు తీసుకొని పనులు చేయలేదన్నారు. సదరు కాంట్రాక్టును రద్దుచేసి, తిరిగి టెండరు పిలుస్తున్నామని తెలిపారు. ఇవన్నీ జీహెచ్ంఎసీ పరిధిలోవని చెప్పారు. ఆర్అండ్బీ, జాతీయ రహదారుల మార్గాల్లోని రహదారులకు ఆయా విభాగాలే మరమ్మతులు చేస్తాయని చెప్పారు. -
‘ఫైలిన్’మరింత ఉధృతం: వాగుల్లో ఇద్దరి మృతి
మచిలీపట్నం, న్యూస్‌లైన్ : ఫైలిన్ తుపాను తీరం చేరకముందే జిల్లాలో ఇద్దరిని బలిగొంది. మరో బాలిక వాగులో కొట్టుకుపోయి గల్లంతైంది. తుపాను ప్రభావంతో కురిసిన వర్షాలకు జిల్లాలోని కుంపిణీవాగు, కొండవాగు, బుడమేరు, పోతులవాగు పొంగి ప్రవహిస్తున్నాయి. ఆగిరిపల్లి మండలం సింహాద్రి అప్పారావుపేటకు చెందిన కరేటి శైలజ (15), నక్కనబోయిన పావని (14) గురువారం కుంపిణీ వాగులో గల్లంతవగా శైలజ శవమై తేలింది. ముసునూరు మండలం యల్లాపురానికి పుట్టింటికి వచ్చేందుకు పశ్చిమగోదావరి జిల్లా పరిధిలో తమ్మిలేరు దాటేందుకు ప్రయత్నించిన కంభంపాటి శాంతమ్మ (46) నీటి ఉధృతికి కొట్టుకుపోగా ఆమె మృతదేహం బలివే వద్ద దొరికింది. నేటినుంచి మరింత ఉధృతం బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం తుపానుగా మారి విశాఖపట్నానికి తూర్పు ఆగ్నేయ దిశగా 800 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. శుక్రవారం నుంచి తుపాను ప్రభావం మరింత ఉధృతమవుతుందని వారు తెలిపారు. కోస్తా ప్రాంతంలో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వివరించారు. తుపాను ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారింది. 40 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం తుపాను ప్రభావంతో బుధ, గురువారాల్లో జిల్లా వ్యాప్తంగా 40 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా వీరులపాడులో 126, అత్యల్పంగా నాగాయలంకలో 0.8 మిల్లీమీటర్ల వర్షం కురిసినట్లు అధికారులు తెలిపారు. భారీ వర్షాలతో నందిగామ, మైలవరం తదితర ప్రాంతాల్లో పూత, పిందె దశలో ఉన్న పత్తి పైరు దెబ్బతిందని రైతులు చెబుతున్నారు. తుపాను విపత్తును తట్టుకునేందుకు జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. మచిలీపట్నం, నాగాయలంక, కోడూరు, కృత్తివెన్ను, బంటుమిల్లి, అవనిగడ్డ, మోపిదేవి మండలాలకు ప్రత్యేకాధికారులను నియమించారు. వీరితో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి, జిల్లా ప్రత్యేకాధికారి బీఆర్ మీనా వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించి సూచనలు, సలహాలు అందజేశారు. తుపాను ప్రభావంతో మంగినపూడి బీచ్‌లోకి పర్యాటకులను గురువారం నుంచి అనుమతించటం లేదు. సముద్రంలోనే 40 బోట్లు... నాలుగైదు రోజుల క్రితం సముద్రంలోకి గిలకలదిండి హార్బర్ నుంచి చేపల వేటకు వెళ్లిన 40 బోట్లను వెంటనే తిరిగి వచ్చేయాలని మత్స్యశాఖ డీడీ టి.కళ్యాణం గురువారం ఆదేశాలు జారీ చేశారు. ఒక్కొక్క బోటులో ఎనిమిది మంది చొప్పున ఉన్నారని వివరించారు. శుక్రవారానికి ఈ బోట్లు గిలకలదిండి హార్బర్‌కు చేరే అవకాశముంది. పొంగి ప్రవహిస్తున్న వాగులు... బుధవారం రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలతో పశ్చిమకృష్ణాలో కొండవాగు, బుడమేరు, పోతులవాగు పొంగి ప్రవహిస్తున్నాయి. జి.కొండూరు సమీపంలోని వెలగలేరు వద్ద బుడమేరులో ఇవి కలుస్తాయి. ఇటీవల కాలంలో ఇక్కడి హెడ్ రెగ్యులరేటర్లకు గేట్లు అమర్చారు. పది అడుగుల మేర నీటి మట్టం ఇక్కడకు చేరితే ప్రమాద స్థాయికి చేరినట్లని స్థానికులు చెబుతున్నారు. ప్రస్తుతం ఎనిమిది అడుగుల మేర నీటి మట్టం ఉందని, మరిన్ని వర్షాలు కురిసి వరద ఉధృతి పెరిగితే రెగ్యులేటర్ గేట్లు తెరవాల్సి ఉంటుందని పేర్కొంటున్నారు. ఈ గేట్లు తెరిస్తే వెలగలేరు సమీపంలో రైలు కట్టకు దిగువన ఉన్న కొత్తూరు తాడేపల్లి, సింగ్‌నగర్, పాయకాపురంలలోకి వరదనీరు ప్రవేశించే అవకాశం ఉంది. ముసునూరు మండలంలో ఉన్న రామిలేరువాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. నందిగామ ప్రాంతంలో ఉన్న మున్నేరువాగులోకి వరదనీటి రాక అధికమైంది. తుపాను ప్రభావంతో మరింత వర్షం కురిస్తే ఈ వాగులు ప్రమాదస్థాయిని మించి ప్రవహించే అవకాశం ఉందని స్థానికులు అంటున్నారు. ప్రత్యేక అధికారుల నియామకం... జిల్లాలో తుపాను ప్రబావిత ప్రాంతాలకు ప్రత్యేకాధికారులను కలెక్టర్ బుద్ధప్రకాష్ ఎం.జ్యోతి నియమించారు. మచిలీపట్నానికి జెడ్పీ సీఈవో, మత్స్యశాఖ ఏడీలను, నాగాయలంకకు మత్స్యశాఖ డీడీ, జిల్లా బీసీ సంక్షేమశాఖాధికారిలను, కోడూరుకు సాంఘిక సంక్షేమశాఖ జేడీ, డీఆర్డీఏ పీడీలను, కృత్తివెన్నుకు డ్వామా పీడీ, విజయవాడ మత్స్యశాఖ ఏడీలను, బంటుమిల్లికి ఎస్సీ సొసైటీ ఈడీని, అవనిగడ్డకు జిల్లా సహకార శాఖాధికారిని, మోపిదేవికి రాజీవ్ విద్యామిషన్ పీవో నియమితులయ్యారు. వీరితో పాటు భారీ వర్షాలు కురిసి విపత్కర పరిస్థితులు ఏర్పడితే ప్రజలను కాపాడేందుకు జగ్గయ్యపేటకు మెప్మా పీడీని, చందర్లపాడుకు ఏపీఎంఐపీ ప్రాజెక్టు డెరైక్టర్‌ను, కంచికచర్లకు వ్యవసాయశాఖ జేడీని, ఇబ్రహీంపట్నానికి డీపీవోను, విజయవాడ అర్బన్‌కు అటవీ అధికారిని, విజయవాడ రూరల్‌కు వీజీటీఎం ఉడా అధికారిని, పెనమలూరుకు జిల్లా యువజన సంక్షేమ శాఖాధికారిని, కంకిపాడుకు పరిశ్రమల శాఖ జీఎంను, తోట్లవల్లూరుకు అర్బన్ ల్యాండ్ సీలింగ్ ప్రత్యేకాధికారిని, పమిడిముక్కలకు కార్మిక శాఖ డెప్యూటీ కమిషనర్‌ను, ఘంటసాలకు చేనేత, జౌళిశాఖ ఏడీని, చల్లపల్లికి గృహనిర్మాణ సంస్థ పీడీని నియమించారు.