Tufts University
-
ఈటింగ్ కాంటెస్ట్‌లో పాల్గొన్న విద్యార్థిని మృతి
ఈటింగ్ కాంపిటీషన్లో పాల్గొన్న ఓ విద్యార్థిని మృతిచెందిన సంఘటన తాజాగా వెలుగుచూసింది. గెలవాలనే తొందరలో ఆహారం గొంతులో ఇరక్కుపోయి, ఊపిరాడక అర్థాంతరంగా తనువుచాలింది. అసలేంజరిగిందంటే.. అమెరికాలో టఫ్ట్స్ యూనివర్సిటీ గతవారం హాట్ డగ్స్ ఈటింగ్ కాంపిటీషన్ నిర్వహించింది. ఈ కాంపిటీషన్లో అదే యూనివర్సిటీలో బయోటెక్నాలజీ చదువుతున్న మడ్లిన్ అనే 20 ఏళ్ల విద్యార్థిని కూడా పాల్గొంది. ఐతే హఠాత్తుగా హాట్ డగ్ గొంతులో ఇరుక్కుపోవడంతో, ఊపిరిఆడక ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. నిర్వహణ బృందం హుటాహుటిన బోస్టన్ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. డాక్టర్లు ఎంతప్రయత్నించినా ఆమె ప్రాణాలను మాత్రం కాపాడలేకపోయారు. సంఘటన జరిగిన తర్వాత రోజు ఆమె మరణించిందని వైద్యులు మీడియాకు వెల్లడించారు. నిజానికి ఆమె ఒక గొప్ప అథ్లెట్ కూడా. ఈ విషాద సంఘటన తాజాగా వెలుగుచూసింది. చదవండి: ఐదేళ్లుగా వెతుకులాట.. దొరికిన గోల్డ్ ఐలాండ్.. లక్షల కోట్ల సంపద! -
వెన్నతో గుండెకు నష్టం లేదు
వాషింగ్టన్ : వెన్న తినడం వల్ల గుండెకు వచ్చిన ప్రమాదమేమీ లేదని తాజాగా ఒక అధ్యయనంలో తేలింది. నిర్ణీత పరిమాణంలో వెన్నని తీసుకుంటే మధుమేహం నుంచి కూడా తప్పించుకోవచ్చని టఫ్ట్స్ యూనివర్సిటీ పరిశోధకులు తెలిపారు. వెన్న తీసుకోవడం వల్ల హృదయ సంబంధ వ్యాధులు రావని పేర్కొన్నారు. మొత్తం 15 దేశాల్లో ఈ సర్వేను నిర్వహించారు. రోజుకు 14 గ్రాముల (ఒక టేబుల్ టీ స్పూన్) వెన్నను ఆహారంలో తీసుకోవచ్చని వివరించారు. మరీ ఎక్కువ పరిమాణంలో వెన్న తీసుకుంటే గుండె సంబంధిత వ్యాధుల బారిన పడే అవకాశం ఉందని పరిశోధకులు ల్యూరా పింపిన్ పేర్కొన్నారు. పిండిపదార్థాలు, చక్కెర, వంట నూనెల కన్నా వెన్న మేలని తెలిపారు. -
సన్నగా ఉంటే దీర్ఘాయువు
బోస్టన్: సన్నగా ఉన్నవాళ్లు ఎక్కువకాలం జీవిస్తారని అమెరికాలోని హార్వర్డ్, టఫ్ట్స్ వర్సిటీల అధ్యయనంలో తేలింది. చిన్నతనం నుంచి మధ్య వయస్సు వరకు ఎక్కువగా బరువు పెరిగినవారు త్వరగా చనిపోయే అవకాశాలుంటాయని పరిశోధకులు చెప్పారు. శరీర పరిణామక్రమం, మరణాల మధ్య సంబంధంపై వారు పరిశోధనలు చేశారు. వీటిలో 80,266 మంది మహిళలు, 36,622 మంది పురుషులు పాల్గొన్నారు. వారంతా 5, 10, 20,30,40 ఏళ్లప్పుడు వారి శరీరాకృతులు ఎలా ఉండేవో చెప్పారు. 50 ఏళ్లప్పుడు వారి శరీర ద్రవ్యరాశి సూచిక(బీఎంఐ)ను నమోదు చేశారు. 60 ఏళ్ల తర్వాత వారిపై పరిశీలన ను కొనసాగించారు. 60 దాటిన తర్వాత మరో 15 ఏళ్లలోపు చనిపోయే అవకాశం సన్నగా ఉన్న మహిళల్లో 11 శాతం, పురుషుల్లో 20.3 శాతం. అదే లావుగా ఉన్నవారిలో ఇది పెరిగి మహిళల్లో 19.7 శాతం, పురుషుల్లో 24.1 శాతంగా నమోదైంది.