Tungabhadhra
-
ముందే ఎత్తిన తుంగభద్ర గేట్లు
-
తుంగభద్ర జలాశయానికి భారీగా వరద ప్రవాహం
-
తుంగభద్ర బోర్డుకు తెలంగాణ వినతి
సాక్షి, హైదరాబాద్: తుంగభద్ర నదీ జలాల్లో రాజోలిబండ మళ్లింపు పథకం(ఆర్డీఎస్)కు ఉన్నవాస్తవ నీటి వాటా వినియోగానికి వీలుగా చేపట్టిన కాల్వల ఆధునీకరణ పనులను వేగవంతం చేయించాలని తెలంగాణ ప్రభుత్వం మరోమారు తుంగభద్ర బోర్డుకు విన్నవించింది. కాల్వల ఆధునీకరణ పనుల్లో త్వరితగతిన పనులు పూర్తిచేసేలా కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లకు ఆదేశాలివ్వాలని కోరింది. ప్రస్తుతం వర్కింగ్ సీజన్ ఆరంభమైన దృష్ట్యా పనులు మొదలు పెట్టేలా చూడాలంది. ఈ మేరకు రెండ్రోజుల కిందట తెలంగాణ బోర్డు కార్యదర్శికి లేఖ రాసింది. కర్ణాటక నుంచి ఆర్డీఎస్కు నీటిని తరలించే కాల్వలన్నీ పూడికతో నిండిపోవడంతో ఆశించిన మేర నీరు రావడం లేదు. దీంతో ఆర్డీఎస్ కాల్వల ఆధునీకరణ కోసం కర్ణాటకకు రాష్ట్రం రూ.72కోట్ల మేర డిపాజిట్ సైతం చేసింది. ఇందులో ప్యాకేజీ–1 పనులను 25%, ప్యాకేజీ–2 పనులను మరో 55% వరకు పూర్తి చేసింది. అయితే ఆనకట్టకు మరోవైపున ఉన్న కర్నూలు జిల్లా నేతలు, రైతులు ఆధునీకరణ పనులకు అడ్డు తగులుతుండటంతో పనులన్నీ నిలిచిపోయి రాష్ట్రానికి ఏటా కనీసం నాలుగు టీఎంసీలు కూడా రాష్ట్రానికి రావడం లేదు. దీంతో కేవలం 30వేల ఆయకట్టుకు మాత్రమే అంతంతమాత్రంగా సాగునీరందుతోంది. కాల్వల ఆధునీకరణ పనుల పురోగతిపై పదేపదే విన్నవిస్తున్నా ఏపీ ప్రభుత్వం అలసత్వం చూపుతోందని వారం రోజుల కిందట జరిగిన బోర్డు భేటీలో తెలంగాణ నిలదీసింది.దీనిపై ఏపీ, కర్ణాటకల నుంచి స్పందన లేకపోవడంతో మరోమారు లేఖ రాసింది. ఈ కాల్వల ఆధునీకరణ పనుల్లో జాప్యాన్ని నివారించి త్వరితగతిన పనులు పూర్తి చేసేలా కర్ణాటక, ఏపీలకు ఆదేశాలివ్వాలని కోరింది.( చదవండి: దశాబ్దాల స్వప్నం .. శరవేగంగా సాకారం) -
తుంగభద్ర పుష్కరాలకు రూ. 2.5 కోట్లు
సాక్షి, హైదరాబాద్ : తుంగభద్ర పుష్కరాలకు సంబంధించి ఏర్పాట్లు, అభివృద్ధి పనుల కోసం ప్రభుత్వం బుధవారం రూ.2.50 కోట్లు విడుదల చేసింది. ఈనెల 20 నుంచి డిసెంబర్ 1వ తేదీ వరకు తుంగభద్ర పుష్కరాలు జరగనున్నాయి. అయితే కోవిడ్ నేపథ్యంలో ఈ ఉత్సవాలను అత్యంత నిరాడంబరంగా నిర్వహించాలని ఇప్పటికే దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పలుమార్లు ప్రకటించారు. గతంలో గోదావరి, కృష్ణా పుష్కరాల మాదిరిగా భక్తులు పెద్దసంఖ్యలో హాజరైతే ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ప్రత్యేకంగా పుష్కరాల కోసం ఏర్పాట్లు చేయొద్దని నిర్ణయించింది. ఇందులో భాగంగానే అధికారికంగా పుష్కరఘాట్లను కూడా ఏర్పాటు చేయటం లేదు. ఆలంపూర్లోని జోగులాంబ దేవాలయం వద్ద మాత్రమే ఆలయం పక్షాన ఏర్పాట్లు ఉంటాయని ఇప్పటికే అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీ చేయటం విశేషం. -
తుంగ.. ఉప్పొంగ
సాక్షి, అనంతపురం, కర్నూలు : తుంగభద్ర ఉప్పొంగుతోంది. ‘అనంత’కు సాగునీటి బెంగ తీరనుంది. తంగభద్ర ఏటా ఒకసారి నిండడమే గగనం. అలాంటిది ఈ ఏడాది రెండుసార్లు వరద నీటితో పొంగి పొర్లింది. ఫలితంగా రెండు నెలలుగా తుంగభద్ర జలాశయం నుంచి నీరు దిగువకు వెళ్తోంది. తుంగా జలాలు హెచ్చెల్సీ ద్వారా వడివడిగా జిల్లాకు చేరుతున్నాయి. ఈ తరుణంలో ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తే సాగునీటి సలహా మండలి సమావేశంలో (ఐఏబీ) తీసుకున్న నిర్ణయం మేరకు అన్ని ప్రాంతాల ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు అవకాశం కనిపిస్తోంది. వరుణుడు కరుణించడంతో ‘అనంత’లో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. ఇక జిల్లాకు వరప్రదాయినిగా ఉన్న తుంగభద్ర, శ్రీశైలం జలాశయాలు కూడా నిండుకుండను తలపిస్తున్నాయి. రెండింటికీ ఇంకా ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. తుంగభద్ర జలాశయంలో 100.855 టీఎంసీలు నిల్వ ఉండగా.. ప్రస్తుతం 17,275 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. దీంతో 16,987 క్యూసెక్కుల నీటిని ఔట్‌ఫ్లో రూపంలో దిగువకు వదులుతున్నారు. శ్రీశైలం జలాశయంలో కూడా 215.33 టీఎంసీల నీరు నిల్వ ఉండగా.. 1.70 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదవుతోంది. 1.89 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలేస్తున్నారు. దీంతో ఈ సారి జిల్లా ఆయకట్టుకు ఎలాంటి ఇబ్బంది కలిగే పరిస్థితి లేదు. ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తేనే... ఈసారి సాగునీటికి ఢోకా లేకపోయినా.. ప్రణాళికలు లేకపోవడం వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయి. కాలువలపై పటిష్టమైన పర్యవేక్షణ లేకపోవడంతో తరుచూ గండ్లు పడుతుండగా.. నీటి ప్రవాహానికి అంతరాయం కలుగుతోంది. దీంతో ప్రాధాన్యత ప్రకారం సాగునీరు దేనికి ముందు ఇవ్వాలనే విషయమై అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. సాగునీటి సలహా మండలి సమావేశంలో సెప్టెంబర్ 1 నుంచి హెచ్‌ఎల్‌ఎంసీ, గుంతకల్లు బ్రాంచ్‌కెనాల్‌కు, అక్టోబర్ 1 నుంచి మిడ్‌పెన్నార్ సౌత్, నార్త్ కెనాల్‌కు, అక్టోబర్ 15 నుంచి తాడిపత్రి బ్రాంచ్‌కెనాల్‌కు సాగునీరు ఇవ్వాలి. ఇవేకాకుండా నవంబర్ 2 నుంచి చాగళ్లుకు విడుదల చేసి నీటితో నింపాలి. డిసెంబర్ 1 నుంచి పీఏబీఆర్ కుడికాలువ కింద 49 చెరువులకు విడుదల చేయాలి. తర్వాత ఈ ఏడాది ఎట్టి పరిస్థితిలోనూ మైలవరం కోటా కావాలని వైఎస్సార్ కడప జిల్లా ప్రజాప్రతినిధులు పట్టుబడుతున్నారు. ఈ నేపథ్యంలో అధికారుల ప్రణాళికలు చాలా కీలకం కానున్నాయి. నీటిని దిగువకు తీసుకెళ్లడంలో విఫలం హంద్రీనీవా, హెచ్చెల్సీలకు జలాశయాల నుంచి చెప్పుకోదగ్గ స్థాయిలో నీళ్లు వస్తున్నాయి. వరదనీరు దిగువకు వెళుతుండడంతో ఎక్కడా అభ్యంతరాలు కూడా లేవు. అయితే కాలువలు పటిష్టంగా లేకపోవడంతో నీరు తీసుకోవడానికి అధికారులుకే వెనుకంజ వేస్తున్నారు. తుంగభద్ర జలాశయం నుంచి జిల్లా సరిహద్దులోకి వస్తున్న నీరు 1,628 క్యూసెక్కులుగా నమోదవుతోంది. అయితే పీఏబీఆర్‌కు 175 క్యూసెక్కులు, ఎంపీఆర్‌కు 532 క్యూసెక్కుల నీరు మాత్రమే వచ్చి చేరుతోంది. ఫలితంగా రెండు జలాశయాల్లో కలిపి రెండున్నర టీఎంసీల నీళ్లు లేవు. 1000 క్యూసెక్కుల నీరు తీసుకోవాలని ఎంతగా ప్రయత్నిస్తున్నప్పటికీ హెచ్చెల్సీ అధికారులకు సాధ్యపడడం లేదు. మూడు రోజుల నుంచి జిల్లాలో వర్షాలు కురుస్తున్నా.. ఎగువన నీటి వాడకం తగ్గకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇందులో అధికారుల వైఫల్యం కూడా స్పష్టంగా కనిపిస్తోంది. అనుకున్న స్థాయిలో చేరని నీరు తొలుత జీడిపల్లి జలాశయం నుంచి కృష్ణా జలాలను పీఏబీఆర్‌కు 5 టీఎంసీలు ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. అయితే చెరువులకు నీటిని నింపడానికి ప్రాధాన్యత ఇస్తుండడంతో చివర్లో వదలాలనే భావనలో ఉన్నారు. దీంతో పీఏబీఆర్, ఎంపీఆర్ జలాశయాలకు అనుకున్న స్థాయిలో నీళ్లు చేరలేదు. ఇప్పటికైన హెచ్చెల్సీ అధికారులు దృష్టి సారిస్తే మిడ్‌పెన్నార్ సౌత్, నార్త్ కెనాళ్లు, తాడిపత్రి బ్రాంచ్ కెనాల్‌కు అనుకున్న ప్రకారం సాగునీటిని విడుదల చేయవచ్చనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. చదవండి : కరువు నేలకు జలాభిషేకం -
కర్నూలుకు ‘జల’దరింపేనా..
సాక్షి, కర్నూలు : కర్నూలు నగరానికి నీటి ముప్పు పొంచి ఉంది. ఇప్పటికే పలు కాలనీల్లో బిందెడు నీటి కోసం నానా అవస్థలు పడుతున్నారు. వర్షాభావ పరిస్థితుల వల్ల జలాశయాలు అడుగంటిపోవడం, తుంగభద్ర నదికి ఇప్పటికీ వరద రాకపోవడం, ప్రత్యామ్నాయ వనరులు అందుబాటులో లేకపోవడంతో రానురాను పరిస్థితులు ఆందోళనకరంగా మారుతున్నాయి. ఏప్రిల్‌లో పందికోన రిజర్వాయర్ నుంచి గాజులదిన్నె ప్రాజెక్టు (జీడీపీ)కు తరలించిన నీటినే ఇప్పటికీ నగరవాసులకు సరఫరా చేస్తున్నారు. ఇవి కూడా త్వరలోనే ఖాళీ అయ్యే అవకాశముంది. ప్రత్యామ్నాయ మార్గాలు కన్పించకపోవడంతో చెన్నై కష్టాలను తలచుకుంటూ కందనవోలు ప్రజలు కూడా ఆందోళన చెందుతున్నారు. అడుగంటిన సుంకేసుల, జీడీపీ కర్నూలు ప్రజల దాహార్తి తీర్చడానికి సుంకేసుల ప్రధాన వనరు. తుంగభద్రపై ఉన్న ఈ జలాశయం ఇప్పటికే అడుగంటిపోయింది. శుక్రవారం నాటి లెక్కల ప్రకారం కేవలం 0.143 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఇది మహా అయితే ఆరేడు రోజులకు సరిపోతుంది. ఆలోపు తుంగభద్ర నదికి వరద వస్తే కష్టాల నుంచి గట్టెక్కవచ్చు. కానీ ఆ పరిస్థితి కన్పించడం లేదు. ఎగువభాగంలో వర్షాలు లేకపోవడంతో తుంగభద్ర జలాశయానికి సైతం వరదనీటి చేరిక లేక వెలవెలబోతోంది. ఇక రెండో ప్రధాన నీటి వనరు గాజులదిన్నె ప్రాజెక్టు (జీడీపీ). ప్రస్తుతం దీని నుంచే నీటిని సరఫరా చేస్తున్నారు. ఇది కూడా అడుగంటింది. ప్రస్తుతం 0.117 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంది. ఈ నీరు ఐదు రోజులకు మించి చాలదని అధికారులు చెబుతున్నారు. రోజు విడిచి రోజు సరఫరా కర్నూలు, కోడుమూరు, పాణ్యం.. ఈ మూడు నియోజక వర్గాలకు చెందిన ప్రజలు నగర పాలక సంస్థ పరిధిలో నివసిస్తున్నారు. పాణ్యం నియోజకవర్గ పరిధిలోని కల్లూరు, కోడుమూరు నియోజకవర్గంలోని మామిదాల పాడు, మునగాలపాడు, స్టాంటన్ పురం కాలనీలకు రోజు విడిచి రోజు నీటిని సరఫరా చేస్తున్నారు. శివారు కాలనీలలో పైపులైన్ ఇబ్బందుల దృష్ట్యా మూడు రోజులకు ఒకసారి ఇస్తున్నారు. కర్నూలు నియోజకవర్గ పరిధిలో మాత్రం నిన్నటి వరకు ప్రతి రోజూ నీటిని సరఫరా చేసేవారు. అయితే.. ప్రస్తుతం నీటి నిల్వలు అడుగంటిపోవడంతో పాటు ప్రత్యామ్నాయ మార్గాలు కనిపించకపోవడంతో నగర పాలక పరిధిలోని అన్ని కాలనీలకు రోజు విడిచి రోజు సరఫరా చేస్తున్నట్లు ఎస్ఈ వేణుగోపాల్ వెల్లడించారు. వర్షాలు రాకపోతే పరిస్థితి మరింత ఇబ్బంది కరంగా మారే అవకాశముందని, కాబట్టి పొదుపు చర్యలు చేపడుతున్నామని ఆయన తెలిపారు. ట్యాంకర్ల ద్వారా నీరు వృథా కాకుండా చూస్తున్నామని, పబ్లిక్ కుళాయిలకు బిరడాలు బిగించామని వివరించారు. సమ్మర్ స్టోరేజీ ట్యాంకులు ఎండుతున్నాయి కర్నూలు నగరవాసులకు వేసవి కాలంలో నీటి కష్టాలు రాకూడదని సమ్మర్ స్టోరేజీ ట్యాంకు నిర్మించారు. దీని సామర్థ్యం 4,410 మిలియన్ లీటర్లు. పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేస్తే నగరానికి 45 రోజుల పాటు సరఫరా చేయొచ్చు. అయితే 2001వ సంవత్సరంలో నిర్మించిన ఈ ట్యాంకులో ఏనాడూ పూర్తిస్థాయిలో నిల్వ చేసిన దాఖలాలు లేవు. ప్రస్తుతం ఇందులో ఉన్న నీరు ఆరు రోజులకు మాత్రమే సరిపోతుంది. మొత్తంగా సుంకేసుల, జీడీపీ, సమ్మర్ స్టోరేజీ ట్యాంకుల్లోని నీరు 20 రోజులకు మించి రాదు. ఆ తర్వాత పరిస్థితి ఏంటన్న ఆందోళన నగరవాసులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. -
పది టీఎంసీలూ అనుమానమే
తాగునీరు, చెరువులకే నీరు.. పంటల సాగుకు లేనట్లే ‘సాక్షి’తో హెచ్చెల్సీ ఎస్ఈ శేషగిరిరావు అనంతపురం సెంట్రల్ : తుంగభధ్ర జలాశయం నుంచి ఈ ఏడాది 10 టీఎంసీలు కూడా నీళ్లు వచ్చే పరిస్థితి కనిపించలేదని హెచ్ఎల్సీ ఎస్ఈ శేషగిరిరావు పేర్కొన్నారు. బుధవారం ఆయన తుంగభద్ర పరిస్థితిపై ‘సాక్షి’తో మాట్లాడారు. తొలుత ఈ ఏడాది తుంగభద్ర జలాశయానికి 151 టీఎంసీలు వస్తాయని అంచనా వేశారని, దామాషా ప్రకారం 22.066 టీఎంసీలు హె చ్‌ఎల్‌సీకి కేటాయింపులు చేశారని అన్నారు. అయితే ఊహించని విధంగా తుంగభద్రకు ఇన్‌ఫ్లో పడిపోయిందన్నారు. ప్రస్తుతం కేవలం 1900 క్యూసెక్కుల చొప్పున తుంగభద్రకు వస్తోందన్నారు. వారం రోజుల క్రితం వరకూ జలాశయంలోకి మొత్తం 70 టీఎంసీలు వస్తాయని ఆశించగా, ప్రస్తుతం అది కూడా 65 టీఎంసీలకు కుదించారన్నారు. ఈలెక్కన దామాషా ప్రకారం హె చ్‌ఎల్‌సీకి 9.4 టీఎంసీలు మాత్రమే వచ్చే అవకాశముందన్నారు. గతేడాది అక్టోబర్‌లో జలాశయానికి 11 టీఎంసీలు వచ్చాయని, ఈ ఏడాది కూడా ఆ మేరకు ఇన్‌ఫ్లో ఉంటే మరో 1 టీఎంసీ మాత్రమే హె చ్‌ఎల్‌సీకి వస్తుందన్నారు. ఈ ఏడాదికి మొత్తం కలిపి 10 టీఎంసీలకు అటూ, ఇటూ మాత్రమే వస్తాయని వివరించారు. తాగునీటి అవసరాలకే 10 టీఎంసీలు కావాల్సి ఉంటుందన్నారు. హంద్రీనీవా సుజల స్రవంతి పథకం ద్వారా వచ్చే నీటిపై ప్రణాళికలు తయారు చేస్తున్నామన్నారు. ఈ ఏడాది హంద్రీనీవాకు మొత్తం 9 టీఎంసీలు కేటాయించారని చెప్పారు. ఇప్పటి వరకూ జీడిపల్లి జలాశయం నుంచి 0.78 టీఎంసీలు మాత్రమే పీఏబీఆర్‌లోకి వచ్చాయని తెలిపారు. హె చ్‌ఎల్‌సీ ఆయకట్టుకింద ఎక్కడా పంటల సాగు చేయొద్దని రైతులకు ఆయన తెలియజేశారు.