Turmeric crop cultivation
-
నల్లతామరకు విరుగుడు.. ఈ కుంకుడు ద్రావణం!
నల్గొండ జిల్లా చందంపేట మండలంపోలేపల్లి వాస్తవ్యులు లోకసాని పద్మారెడ్డి అనే మెట్ట ్రపాంత రైతు సాగు చేస్తున్న 12 ఎకరాల కుంకుడు తోట కొత్త ఆవిష్కరణలకు పురుడుపోసింది. మొదటిది... చెట్టుకు ఏడాదికి 400 కిలోల వరకు కుంకుడు కాయల దిగుబడినిచ్చే సరికొత్త రైతు వంగడం ఆవిష్కారమైంది. కుంకుడు ద్రావణం రెండోది.కుంకుడు కాయల పొడికి రెండు రకాల ఔషధ మొక్కల పొడిని చేర్చి.. ఆ పొడితో తయారు చేసిన ద్రావణం సేంద్రియ వ్యవసాయంలో సస్యరక్షణ కోసం వినియోగిస్తూ పద్మారెడ్డి, ఆయన మిత్రులైన కొందరు రైతులు చక్కటి ఫలితాలు సాధిస్తుండటం విశేషం. సేంద్రియ పురుగుమందుగా, శిలీంధ్రనాశనిగానే కాక పంట పెరుగుదలకు కూడా కుంకుడు ద్రావణం దోహదం చేస్తోందని ఆయన చెబుతున్నారు. పండ్ల తోటలు, వరి, కూరగాయలు తదిరత పంటల సేంద్రియ సాగులో ఉపయోడపడుతోందన్నారు.200 లీ. డ్రమ్ముకు 2 కిలోలు...2 కిలోల కుంకుడు పొడిని 200 లీటర్ల డ్రమ్ములో 2 గంటలు నానబెట్టి, పిసికి, వడకడితే సిద్ధమయ్యే ద్రావణాన్ని పంటలకు పిచికారీ చేసుకోవచ్చు. మళ్లీ నీరు కలపాల్సిన అవసరం లేదు. రెండేళ్లుగా తాము ప్రయోగాత్మకంగా ఈ ద్రావణాన్ని వాడుతున్నామని చెబుతూ.. ఎన్ని రోజులైనా నిల్వ ఉంచి వాడుకోవచ్చు అన్నారు.ఇంటిపంటలకు...లీటరు నీటికి 10 గ్రాముల కుంకుడు పొడిని కలిపిన ద్రావణం ఇంటిపంటలు/ మిద్దె తోటల రైతులకూ కుంకుడు పొడి ఎంతో ఉపయోగకరంగా ఉందని పద్మారెడ్డి తెలిపారు.వరిలో తెగుళ్లకు...కుంకుడు ద్రావణాన్ని ఆకుకూరలకు ఒక్కసారి చాలు. పంటలు ఏపుగా పెరగడానికి కూడా ఈ ద్రావణం దోహదపడుతుందని పద్మారెడ్డి తెలిపారు. బత్తాయి తదితర పండ్ల తోటలకు 30 రోజుల వ్యవధిలో వాడుకోవచ్చు. కూరగాయల సాగులో 15 రోజులకోసారి పిచికారీ చేయొచ్చు. వరి పంట కాలంలో 3 దఫాలు.. నాటేసిన 15–25 రోజులకు, 60 రోజులకు, 90 రోజులకు చల్లాలి. ఊస తెగులు/కాండం తొలిచే పురుగును ఈ ద్రావణం పూర్తిగా నివారిస్తుందని పద్మారెడ్డి స్వానుభవంగా చెప్పారు.మిరపలో నల్లతామరకు...మిరప రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న బ్లాక్ త్రిప్స్ (నల్లతామర)ను కూడా కుంకుడు ద్రావణం 70–80% నియంత్రిస్తున్నట్లు సేంద్రియ మిరప తోటలో రుజువైందని పద్మారెడ్డి చెబుతున్నారు. రసాయనిక పురుగుమందులు అసలు వాడకుండా కుంకుడు ద్రావణాన్ని ప్రతి 15 రోజులకోసారి పిచికారీ చేస్తే సేంద్రియ మిరప రైతులకు మంచి ఫలితాలు వస్తున్నాయన్నారు. గ్రోత్ ప్రమోటర్‌గా, ఫంగిసైడ్‌గా ఇది పనిచేస్తుందని, మిరపకాయలపై మచ్చలు కూడా రావని పద్మారెడ్డి(99481 11931) చెబుతున్నారు. -
పంట తెగుళ్ల బారిన పడకుండా ప్రత్యామ్నాయ మార్గాల్లో సాగు
-
పసుపే.. పోచమ్మ తల్లి..
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ కర్మభూమిగా పేరున్న భారత ఉప ఖండంలో పసుపును ఎంతో పవిత్రమైనదిగా భావిస్తుంటారు. శుభకార్యాల నుంచి పూజల దాకా అన్నింటా పసుపును ప్రత్యేకంగా వినియోగిస్తారు. మరి అలాంటి పసుపు పంటను పండించే రైతులు కూడా ఎంతో నియమ నిష్టలతో ఉంటారు. పసుపు పంటను పోచమ్మ తల్లిగా భావిస్తూ కచ్చితమైన పద్ధతులు, జాగ్రత్తలను పాటిస్తారు. ఉదయమైనా, సాయంత్రమైనా స్నానం చేశాకే పంట చేనులోకి వెళతారు. చెప్పులను కూడా చేను బయటే వదిలేస్తారు. అంటు, ముట్టు వంటివి పాటించే సమయంలో సదరు రైతు కుటుంబాల వారు చేనులోకి అడుగుకూడా పెట్టరు. నిజామాబాద్, జగిత్యాల, నిర్మల్ తదితర జిల్లాల్లో తరతరాలుగా ఇలా పసుపును సాగు చేస్తున్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. ఆశించిన లాభాలు రాకున్నా ‘పోచమ్మ తల్లి’పంటగా భావిస్తూ సంప్రదాయంగా సాగు చేస్తున్నవారు చాలా మంది ఉన్నారు. తాతముత్తాతల నాటి నుంచీ పండిస్తున్నాం.. మేం తాతముత్తాతల నాటి నుంచీ పసుపు పంట సాగు చేస్తున్నాం. పసుపు మా తల్లి పంట. పుట్టి పసుపు (రెండు క్వింటాళ్లు) అమ్మితే తులం బంగారం వచ్చేదని మా తాతలు చెప్పేవారు. ఇప్పటికీ ఇతర పంటల ఆదాయం ఖర్చులకు పోయినా పసుపుపై మిగులు ఉంటుందనే నమ్మకంతో సాగు చేస్తుంటాం. ధర లేకపోవడంతో ఈ సాగు కొంత తగ్గించాం. కానీ అసలు సాగు చేయకుండా మాత్రం ఉండలేం. తల్లి పంట కావడంతో ఒకసారి లాభం రాకున్నా మరోసారి వస్తుంది. –గడ్డం కళావతి, మహిళా రైతు, రెంజర్ల, ముప్కాల్ మండలం, నిజామాబాద్ జిల్లా నిజామాబాద్ మార్కెట్‌కు ఏటా 10 లక్షల క్వింటాళ్లు రాష్ట్రంలోనే అత్యధికంగా నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్‌కు ఏటా సుమారు 10 లక్షల క్వింటాళ్ల వరకు పసుపు పంట వస్తుంది. ఇక రాష్ట్రంలో మొత్తంగా సుమారు రెండు లక్షల ఎకరాల్లో పసుపు సాగవుతోంది. ఇందులో అత్య ధికంగా నిజామాబాద్ జిల్లాలో 35 వేల ఎకరా లు, జగిత్యాలలో 25,000, నిర్మల్‌లో 20,000, వరంగల్‌లో 6,000, మహబూబాబాద్ 4,500, వికారాబాద్‌లో 3,500, హన్మకొండ 2,800, భూపాలపల్లి 1,200 ఎకరాల్లోనూ, ఆదిలాబాద్, పెద్దపల్లి, సంగారెడ్డి, కరీంనగర్ జిల్లాల్లో ఓ మోస్తరుగా పసుపు సాగవుతోంది. సాధార ణంగా ఎకరానికి 120 నుంచి 140 క్వింటాళ్ల పచ్చి పసుపు దిగుబడి వస్తుంది. దానిని ఉడకబెట్టి పాలిష్ చేస్తే 22–25 క్వింటాళ్లు అవుతుంది. రాష్ట్రంలో సాధారణంగా పండించే పసుపు లో 3% వరకు ‘కర్క్యుమిన్’ (ఔషధ లక్షణా లున్న రసాయనం) ఉంటోంది. వైఎస్ సీఎంగా ఉన్న సమయంలో బాల్కొండ నియోజకవర్గంలోని కమ్మర్‌పల్లిలో 30 ఎకరాల్లో వ్యవసాయ వర్సిటీకి అనుబంధంగా పసుపు పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయించారు. ఆ పరిశోధన కేంద్రంలో 4% ‘కర్క్యుమిన్’వచ్చే దుగ్గిరాల ఎరుపు, పీసీటీ పసుపు వంగడాలను అభివృద్ధి చేశారు. పోచమ్మ తల్లిగా భావిస్తాం.. పసుపు పంటను పోచమ్మ తల్లిగా భావిస్తాం. ఈ పంట ఉంటేనే మిగతా వ్యవసాయం కలసి వస్తుందనేది మా నమ్మకం. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి పసుపు సాగు చేయని ఏడాది లేదు. అంటు ముట్టు ఉన్నప్పుడు పసుపు తోటలోకి వెళ్లం. – కాశారం లత, మహిళా రైతు, మెండోరా మార్కెట్‌కు అనుగుణంగా సాగు చేస్తున్నా ఎనిమిదేళ్లుగా కొత్త వంగడాల పసుపు సాగు చేస్తున్నా. మార్కెట్ డిమాండ్‌కు తగినట్టుగా కర్క్యుమిన్ శాతం అధికంగా 4–5 శాతం ఉండే రాజేంద్ర సోనియా, ఏసీసీ–79, ప్రగతి, పీతాంబర్, రాజేంద్ర సోనాల, రాజపురి, బీఎస్సార్–2 రకాలను వేస్తున్నా. తెగుళ్లు సోకకుండా ఎత్తు మడుల పద్ధతి పాటిస్తున్నా. – నలిమెల చిన్నారెడ్డి, యువరైతు, మగ్గిడి, ఆర్మూర్ మండలం రాష్ట్రంలో పెద్ద పసుపు మార్కెట్ ఇక్కడే.. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్‌కు రాష్ట్రంలోనే అత్యధికంగా పసుపు వస్తుంది. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా ప్రతి సీజన్లో భారీగానే పసుపు వస్తోంది. డిమాండ్‌కు అనుగుణంగా ధర లభిస్తోంది. – వెంకటేశం, మార్కెటింగ్ శాఖ ఉప సంచాలకుడు -
విత్తన తిప్పలు తప్పాయిలా
బాల్కొండ : రెంజర్లకు చెందిన రైతు బొమ్మెన భూమేశ్వర్‌కు రెండెకరాల భూమి ఉంది. ఒక ఎకరంలో సోయా, మరో ఎకరంలో పసుపు పంట సాగు చేస్తున్నాడు. మూడేళ్లుగా సోయా పండిస్తున్నాడు. మొదటి రెండేళ్లు సోయా విత్తనాల కోసం చాలా ఇబ్బంది పడ్డాడు. పండించిన పంటలోంచి విత్తనాలను ఉత్పత్తి చేసుకోవడం గురించి తెలుసుకున్నాడు. ఏరువాక కేంద్రం శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాఖ అధికారుల సలహాలు తీసుకున్నాడు. విత్తనాలను ఉత్పత్తి చేసి వాటితోనే ఖరీఫ్‌లో పంట సాగు చేస్తున్నాడు. విత్తనోత్పత్తి గురించి ఆయన మాటల్లోనే.. ‘‘సోయా పంట చేతికి రాగానే ఒక బస్తా సోయా విత్తనాలను వేరుగా ఆర బెట్టాను. తేమ శాతం 12కు చేరుకున్న తర్వాత మట్టి పెళ్లలను, పగిలిన, ముక్కిన విత్తనాలను తీసివేశాను. తర్వాత కార్బండిజమ్, మ్యాంకోజబ్ కలిపి విత్తనాలకు పట్టించి, మళ్లీ ఎండలో ఆరబెట్టాను. రెండు రోజుల తర్వాత ప్లాస్టిక్ బస్తాలో నింపి, తేమ తగలకుండా జాగ్రత్తలు తీసుకున్నాను. సోయా పంట విత్తే సమయంలో విత్తనాలను మళ్లీ ఆర బెట్టాను. 100 విత్తనాలను తీసుకొని నీటిలో నానబెట్టాను. అందులోంచి 80 శాతం కంటే ఎక్కువ విత్తనాలకు మొలకలు వచ్చాయి. దీంతో విత్తనాలను పొలంలో చల్లాను. ఎకరానికి 40 కిలోల విత్తనాలు సరిపోయాయి. 80 శాతం కంటే ఎక్కువే మొలకెత్తాయి. పంట బాగా ఎదుగుతోంది. ఇప్పటివరకు ఎలాంటి తెగులూ సోకలేదు. పూత కూడా బాగానే వస్తోంది. మంచి దిగుబడి వస్తుందని ఆశిస్తున్నా’’ అని వివరించాడు.