కల్లు తాగి, మహిళను చంపి.....
నల్గొండ: కొందరు తాగుబోతులు ఓ మహిళ వద్ద కల్లు తాగి, బంగారం కోసం ఆమెను హత్య చేశారు. దేవరకొండ మండలం తూర్పుపాలెంలో ఈ దారుణం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం కొందరు దుండగులు కల్లు అమ్మే మహిళ వద్దకు వచ్చి కల్లు తాగారు. ఆ తరువాత మెడలో బంగారు గొలుచు కోసం ఆమెను హత్య చేశారు.
ఎవరికీ అనుమానం రాకుండా ఆ మహిళ మృతదేహాన్ని బావిలో పడవేశారు. ఆ తరువాత దుండుగులు పారిపోయారు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు రంగంలోకి దిగి, దర్యాప్తు మొదలు పెట్టారు.