వ్యభిచార గృహంపై దాడి, బుల్లితెర నటి అరెస్ట్
హైదరాబాద్ : హైదరాబాద్‌లోని బోయిన్పల్లి బాపూజీ నగర్లో వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ అపార్ట్‌మెంటుపై నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. పల్లవి అనే జూనియర్ ఆర్టిస్టుతో పాటు మరో ఇద్దరు విటులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. క్రాంతి అనే వ్యక్తి జూనియర్ ఆర్టిస్టులను తీసుకొచ్చి గుట్టుగా వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు ఇన్స్పెక్టర్ ఆనంద్ ఆధ్వర్యంలో దాడులు చేశారు.
అయితే ఆ జూనియర్ ఆర్టిస్టును మీడియాకు చూపించడానికి పోలీసులు నిరాకరించారు. అక్కడి నుంచి పల్లవిని బేగంపేట పోలీస్ స్టేషన్‌ను తరలించారు. ఈ దాడికి సంబంధించిన సమాచారం ఇవ్వడానికి పోలీసులు నిరాకరించారు. ఈ సందర్భంగా సెల్ఫోన్లు, నగదు స్వాధీనం చేసుకున్నారు.