TV screen
-
స్క్రీన్కు అతుక్కుంటే ప్రమాదమే!
న్యూఢిల్లీ: పన్నెండేళ్లలోపు చిన్నారులు ఎక్కువ సేపు స్క్రీన్లకు అతుక్కుపోతే మెదడు పనితీరులో మార్పులు చోటుచేసుకుంటున్నాయని శాస్త్రవేత్తల తాజా అధ్యయనం హెచ్చరిస్తోంది. గత 23 సంవత్సరాలపాటు 30,000 మంది చిన్నారుల మెదడు ఇమేజ్‌లను విశ్లేషించి సంబంధించిన సమగ్ర అధ్యయనాన్ని హాంకాంగ్, చైనా, ఆస్ట్రేలియా శాస్త్రవేత్తల బృందం బహిర్గతంచేసింది. చిన్నారుల మెదడు సంక్లిష్ట అభివృద్ది క్రమంపై ‘డిజిటల్’ ప్రభావం స్థాయిని లెక్కించేందుకు ఈ అధ్యయనం చేపట్టారు. మెదడు అభివృద్ధి చెందే క్రమంలో కొత్త రకం పనులు చేయాల్సి వచ్చినపుడు న్యూరాన్ల నెట్వర్క్ ఏ మేరకు మార్పులకు లోనవుతుందనే అంశాలనూ శాస్త్రవేత్తలు పరిశీలించారు. రీసెర్చ్ కోసం చిన్నారి మెదడు 33 విభిన్న ఇమేజ్‌లను విశ్లేషించారు... ► ఎక్కువ సేపు టీవీ చూడటం, కంప్యూటర్ గేమ్స్ ఆడటంతో 12 ఏళ్లలోపు చిన్నా రుల మెదడు పనితీరు ప్రభావితమవుతోంది ► దీంతో మెదడు పైపొర కార్టెక్స్లో నిర్మాణాత్మక మార్పులు జరుగుతున్నాయి ► జ్ఞాపకశక్తి, ప్లానింగ్ సామర్థ్యం, స్పందించే గుణంలో మార్పులు వస్తున్నాయి ► దీంతో స్పర్శ, ఒత్తిడి, వేడి, చల్లదనం, నొప్పి వంటి ఇంద్రియ సంబంధ అంశాలను మెదడు ప్రాసెస్ చేసే విధానంలోనూ మార్పులు కనిపించాయి ► జ్ఞాపకశక్తి, వినడం, భాష వంటి వాటిని గుర్తుంచుకునే మెదడు భాగంలో నిర్మాణాత్మక మార్పులు వచ్చాయి ► దృశ్య సమాచారాన్ని సరిపోల్చే మెద డు భాగంలో భౌతిక మార్పులు కనిపించాయి ► ముఖ్యంగా ‘ట్యాబ్’ను వినియోగించే వారి మెదడు పనితీరు, సమస్యల పరిష్కార సామర్థ్యం బాగా తగ్గిపోయాయి. ► మేథస్సు, మెదడు పరిమాణం తగ్గిపోవడానికి వీడియో గేమ్స్, అత్యధిక ఇంటర్నెట్ వినియోగమే కారణమని రీసెర్చ్ వెల్లడించింది. ► డిజిటల్ అనుభవాలు చిన్నారుల మెదడులో మార్పులు తెస్తున్నాయని అధ్యయనం కరస్పాండింగ్ రచయిత, హాంకాంగ్ యూనివర్సిటీకి చెందిన హూయిలీ చెప్పారు. -
వెరైటీ టీవీ.. చూడడమే కాదు ఏకంగా నాకేయొచ్చు
Japan Licking TV Screen With Food Flavours: ‘జపానోడు అక్కడ ఏదేదో కనిపెడుతుంటే’.. అంటూ ఓ అరవ డబ్బింగ్ సినిమాలో ఫన్నీ డైలాగ్ ఉంటుంది. అయితే అడ్వాన్స్ టెక్నాలజీని పుణికిపుచ్చుకున్న దేశంగా జపాన్.. క్వాలిటీ ఆవిష్కరణలకు కేంద్ర బిందువుగా ఉంటోంది. ఈ తరుణంలో జపాన్ నుంచి వచ్చిన ఓ తాజా ఆవిష్కరణపై సరదా చర్చ మొదలైంది. ‘టేస్ట్ ద టీవీ’ TTTV పేరుతో ఒక డివైజ్‌ను రూపొందించాడు ఓ జపాన్ ప్రొఫెసర్. ప్రొటోటైప్ టీవీ తెరను డెవలప్ చేసి దీనిని తయారు చేశాడు. ఇందులో తెర మీద రకరకాల రుచులను చూసే వీలు ఉంటుంది. ప్రత్యేకమైన సెటప్ ద్వారా టేస్టీ ట్యూబ్‌లను అమర్చి ఉంటుంది. చూడడానికి ఇది పది ఫ్లేవర్ల రంగులరాట్నం మాదిరి ఉంటుంది. మల్టీపుల్ సెన్సార్‌తో పని చేసేలా రూపొందించాడు ఆ ప్రొఫెసర్. వాయిస్ కమాండ్ తీసుకోగానే(ఏ ఫ్లేవర్ కావాలో.. ఉదాహరణకు చాక్లెట్ ఫ్లేవర్ అని చెప్పాలి).. అప్పుడు తెర మీద ఉన్న ప్లాస్టిక్ షీట్‌పై ఆ ఫ్లేవర్ వచ్చి పడుతుంది. అప్పుడు ఎంచక్కా నాకి రుచిచూసేయొచ్చు. ప్రొఫెసర్ హోమెయి మియాషిటా.. మెయిజి యూనివర్సిటీలో ప్రొఫెసర్. ఇది తయారు చేయడానికి మియాషిటా ఆధ్వర్యంలోని 30 మంది విద్యార్థుల బృందం కష్టపడింది. ‘‘కరోనా టైంలో జనాలు బయటకు వెళ్లలేని పరిస్థితి కదా. అందుకే రెస్టారెంట్, వాళ్లకు నచ్చిన రుచి అనుభవం ఇంట్లోనే అందించేందుకు ఇలా ఫుడ్ ఫ్లేవర్లను అందించే డివైజ్‌ను రూపొందించాం’’ అని ప్రొఫెసర్ హోమెయి మియాషిటా చెప్తున్నారు. Taste the TV కమర్షియల్ వెర్షన్‌ను 875 డాలర్లకు అందించబోతున్నారు. వీటితో పాటు టేస్టింగ్ గేమ్స్, క్విజ్‌లను కూడా రూపొందించబోతున్నారు. పిజ్జా, చాక్లెట్ రుచిని అందించే స్ప్రేను సైతం తయారు చేయనుంది ఈ టీం. ఎక్స్‌క్యూజ్‌మీ.. కొంచెం మీ ముఖాన్ని అద్దెకిస్తారా? -
బుల్లితెర శోభన్‌బాబు
బుల్లితెరపై విజె సన్నిగా అలరించిన అరుణ్ సీరియల్ నటుడిగా ప్రేక్షకుల అభిమానాన్ని పొందుతున్నాడు. ‘అందరూ సీరియల్ శోభన్‌బాబు అని కితాబులిస్తున్నారు’ అంటూ సరదాగా వివరించిన అరుణ్ సింగిల్ ట్రావెల్ జర్నీ అంటే అమితంగా ఇష్టపడతానని తన విషయాలు చెప్పుకొచ్చాడు. ‘మాది ఖమ్మం. పీజీ చేస్తున్నప్పుడు అవకాశం వస్తే ముందు ఒక టీవీ చానెల్లో లైఫ్‌సై్టల్ రిపోర్టర్‌గా పనిచేశాను. ఆ తర్వాత యాంకరింగ్ వైపు వచ్చాను. మూడేళ్లపాటు టీవీ యాంకర్‌గా వర్క్ చేశాను. నా యాంకరింగ్ చూసిన టీవీ సీరియల్ వాళ్లు ఆడిషన్స్‌కు పిలిచారు. అలా ‘కళ్యాణవైభోగం’ సీరియల్ ద్వారా నటుడిగా పరిచయం అయ్యాను. మూడేళ్లుగా ఈ సీరియల్లో లీడ్ రోల్ చేస్తున్నాను. ‘కళ్యాణవైభోగం’ సీరియల్లోని దృశ్యం సూర్యదేవర జయసూర్య అనే నేను ‘జీ తెలుగు’లో వచ్చే ‘కళ్యాణౖవైభోగం’ సీరియల్లో సూర్యదేవర జయసూర్యగా లీడ్ రోల్లో నటిస్తున్నాను. ఈ సీరియల్లో బిజినెస్ మ్యాన్‌గా రాణిస్తుంటాను. బిజినెస్ ఉమన్ నిత్యను చూసి, ఇష్టపడి పెళ్లిచేసుకుంటాను. తనే నా లైఫ్ అన్నట్టుగా ఉంటాను. అయితే, అనుకోకుండా మా ఇద్దరి మధ్య బిజినెస్ వార్ నడుస్తూ ఉంటుంది. ఒకానొక సందర్భంలో నిత్య చనిపోయిందని అందరూ అనుకుంటారు. నిత్య స్థానంలో అదే పోలికతో ఉండే మంగను చేర్చుతారు. ఈ విషయం ఎక్కడ బయటపడిపోతుందో అని భయం. ఇలా ఓ భిన్న కథాంశంతో సీరియల్ నడుస్తుంది. మా టీమ్‌లో అందరూ నన్ను సీరియల్ శోభన్‌బాబు అని పిలవడానికి కారణం కూడా అదే. మూడేళ్లుగా ఈ సీరియల్ టాప్ రేటింగ్‌లో ఉన్నందుకు గాను టీవీ అవార్డు నన్ను వరించింది. ఈ రంగానికి వచ్చినందుకు ఇదో అద్భుతమైన అవకాశంగా భావిస్తుంటాను. అమ్మ కష్టంతో ఎదిగాం ఖమ్మంలో అమ్మ విలేజ్ హెల్త్ రిప్రజెంటేటివ్‌గా వర్క్ చేసేవారు. ఇద్దరు అన్నయ్యలు. అమ్మ సింగిల్ పేరెంట్‌గా మా ముగ్గురిని చదివించింది. అమ్మ కష్టాన్ని అర్థం చేసుకుంటూ పెరిగాం. మా ముగ్గురిలో చిన్నవాడిని కాబట్టి నేను కాస్త గారంగానే పెరిగాను. పోస్టు గ్రాడ్యుయేషన్ చేస్తుండగా రిపోర్టర్‌గా, అటు నుంచి వీడియోజాకీగా.. అవకాశాలు వచ్చాయి. దీంతో టీవీనే నా ప్రపంచం అనుకుంటూ వచ్చేశాను. అన్నయ్యలిద్దరూ ఉద్యోగాల్లో సెటిల్ అయ్యారు. నాకున్న ఇష్టం కొద్దీ ఈ ఇండస్ట్రీకి వచ్చాను. అమ్మకు మా మీద చాలా నమ్మకం. ఏ వర్క్ అయినా స్వేచ్ఛ ఉంటుంది. ఇదే చేయ్, ఇదే చదువుకొని జాబ్ తెచ్చుకో.. అని అనలేదు. దీంతో సృజన ఉన్న ఈ రంగాన్ని ఎంచుకున్నాను. సీరియల్స్‌తో పాటు సినిమాలోనూ రాణించాలనుకుంటున్నాను. ప్రయాణాలతో ప్రమోదం సీరియల్ షూటింగ్, ఈవెంట్స్, షోస్ అంటూ నెలలో పాతిక రోజులు గడిచిపోతాయి. మిగతా రోజులను ట్రావెల్‌కు ఉపయోగించుకుంటాను. కొత్త కొత్త ప్రదేశాలను సందర్శించడం అంటే చాలా ఇష్టం. అలాగని ట్రూప్‌లుగా వెళ్లే జర్నీ అంటే ఇష్టముండదు. అమ్మవాళ్లు తీర్థయాత్రలు చేస్తుంటారు. నేను మాత్రం బైక్‌పైన ఫ్రెండ్స్‌తో ట్రావెల్ ఎక్కువ చేస్తుంటాను. ప్రపంచ పర్యాటక స్థలాలన్నీ సందర్శించాలనేది నా కల’ అంటూ తన జీవనవిధానంతోపాటు అభిరుచులనూ షేర్ చేశారు సన్ని. – నిర్మలారెడ్డి -
బుల్లితెరపైకి నయనతార!
తమిళసినిమా: ఒకప్పుడు ప్రముఖ నటీనటులు బుల్లితెరపై నటించడానికి వెనుకాడేవారు. బుల్లితెర తారలు వెండితెర అవకాశాల కోసం ఎదురు చూసేవారు. ఇప్పుడు అలాంటి వెనుకాడటాలేం లేవు. నిజానికి వెండితెర స్టార్స్ బుల్లితెరపైకి రావడానికి ఆసక్తి చూపుతున్నారు. నటుడు కమలహాసన్, విశాల్, విజయ్‌సేతుపతి, నటి వరలక్ష్మి వంటి ప్రముఖ స్టార్స్ ఇప్పటికే బుల్లితెర ప్రేక్షులను అలరిస్తున్నారు. తాజాగా అగ్రనటి, లేడీ సూపర్‌స్టార్‌గా రాణిస్తున్న నయనతార కూడా బుల్లితెర ప్రేక్షకులను కనువిందు చేయడానికి రెడీ అవుతున్నట్లు తాజా సమాచారం.అదేంటి చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉన్న నయనతార బుల్లితెరపైకి రావడం ఏమిటీ అని ఆశ్చర్య పోతున్నారా? నిజమే కథానాయకిగా బిజీబిజీగా ఉన్న నయనతార మణిరత్నం చిత్రాన్నే వదిలేసుకున్నట్లు వార్తలు ప్రచారం అవుతున్నాయి. అయినా ఈ సంచలన నటి బుల్లితెరపైకి రావడం షురూ అంటున్నారు. దీనికి సంబంధించిన ఒక ప్రోమోను కలర్స్ చానల్ ఇటీవల విడుదల చేసింది. అయితే ఆ చానల్లో ఏ కార్యక్రమంలో నయనతార పాల్గొనబోతున్నారన్నది సస్పెన్స్‌గా ఉంచారు. ఈ చానల్లో ప్రసారం కానున్న ఒక డాన్స్ కార్యక్రమానికి నటి నయనతార అతిథిగా పాల్గొనే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సాధారణంగా ఒక డాన్స్ కార్యక్రమానికి రెండు జట్లకు ఇద్దరు అతిథులు ఉంటారు. అయితే ఆ డాన్స్ కార్యక్రమానికి వారానికి ఒక కొత్త అతిథి పాల్గొంటారని, అలా ఒక వారంలో నటి నయనతార గెస్ట్‌గా పాల్గొనబోతున్నారని టాక్. సాధారణంగా తన చిత్రాల ప్రచార కార్యక్రమాల్లో కూడా పాల్గొనని నయనతార ఇప్పుడు బుల్లితెర కార్యక్రమంలో పాల్గొనబోతున్నారంటే ఆమె అభిమానులకు ఆసక్తిగానే ఉంది. ఇంతకీ ఏ కార్యక్రమంలో ఆమె పాల్గొనబోతోన్నారనే వారు మరింత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం నయనతార రజనీకాంత్‌తో కలిసి దర్బార్ చిత్రంలో నటిస్తున్నారు. ఈమె నటించిన కొలైయుధీర్ కాలం చిత్రం త్వరలో తెరపైకి రావడానికి రెడీ అవుతోంది. -
ఒలింపిక్ పార్క్‌లో ప్రమాదం
రియో డి జనీరో: ఒలింపిక్స్‌లో అపశ్రుతి చోటు చేసుకుంది. ఒలింపిక్ పార్క్‌లో ఏర్పాటు చేసిన భారీ టీవీ స్క్రీన్ సోమవారం ప్రమాదవశాత్తు నేలకూలింది. దీంతో ఏడుగురికి గాయాలయ్యాయి. రియో ఒలింపిక్ పార్క్‌ను పైనుంచి చిత్రీకరించేందుకు బ్లాక్ కెమెరా పేరిట స్పైడర్ క్యామ్‌ను ఏర్పాటు చేశారు. అయితే కెమెరా బరువును తక్కువగా అంచనా వేసి ఏర్పాటు చేసిన కేబుల్ వైర్లు తెగిపోవడంతో బాస్కెట్ బాల్ స్టేడియం బయట ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ చిన్నసైజు మోటర్‌బైక్ పరిమాణంలో ఉన్న కెమెరా చాలా ఎత్తు నుంచి కింద పడుతున్నట్టు వీడియో ఫుటేజిలో కనిపించింది. మరో వీడియోలో గాయపడిన ఇద్దరు మహిళలు కనిపించారు. కెమెరా బరువు అధికంగా ఉండడంతోనే ఈ ప్రమాదం జరిగిందని ఒలింపిక్ బ్రాడ్‌కాస్టింగ్ సర్వీసెస్ (ఓబీఎస్) పేర్కొంది. -
ఫోన్లోనే సగం వ్యాపారం..!
కోకో.ఇన్ పేరుతో క్లౌడ్ సర్వీసులు హైదరాబాద్‌లో ఏకైక క్లౌడ్ సేవల సంస్థ సౌదీ, ఆస్ట్రేలియా, సింగపూర్, యూఎస్, యూకేల్లో విస్తరణ 10 మిలియన్ డాలర్ల పెట్టుబడికి సిద్ధమైన విదేశీ సంస్థ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో ‘మీ టీవీ స్క్రీన్ మీద కనిపించే ఫోన్ నంబర్‌కు మిస్ కాల్ ఇవ్వండి’ ‘మిస్ కాల్ ఇవ్వండి.. బహుమతులు గెల్చుకోండి’ .. ఇలాంటి ప్రకటనలు మనకు పరిచయమే. కాకపోతే మిస్‌కాల్ మీదే సగానికి సగం వ్యాపారం ఆధారపడి ఉందనే విషయమే చాలా మందికి తెలియదు. ఆ విషయం పక్కన పెడితే.. మిస్డ్‌కాల్ ఇవ్వాలంటే కంపెనీకో టోల్ ఫ్రీ నంబర్.. కాల్స్‌ను రిసీవ్ చేసుకునేందుకు ఓ కాల్ సెంటరూ ఉండాలి కదా. ఇక్కడే ఉంది అసలైన సమస్య. పెద్ద కంపెనీలైతే సొంతంగా కాల్ సెంటర్‌ను, ఉద్యోగుల్ని ఏర్పాటు చేసుకుంటాయి. మరి చిన్న సంస్థలు.. ప్రత్యేకించి స్టార్టప్స్, ఔత్సాహిక పారిశ్రామిక వేత్తల పరిస్థితేంటి!! ఇలాంటి వారి కోసమే ప్రత్యేకంగా కోకో.ఇన్ పేరుతో క్లౌడ్ కమ్యూనికేషన్ సేవల్ని ప్రారంభించింది ఓజోన్‌టెల్ సిస్టమ్స్ ప్రై.లి. హైదరాబాద్‌లోనే తొలి క్లౌడ్ కంపెనీ కూడా ఇదే. మరిన్ని వివరాలు సంస్థ సీఈఓ సీఎస్ఎన్ మూర్తి మాటల్లోనే.. కస్టమర్లతో ఎప్పటికప్పుడు కమ్యూనికేషన్ (ఫోన్, ఈ-మెయిల్, సోషల్ మీడియా) ఉంటేనే వ్యాపారం విజయవంతం అవుతుందనేది నా అభిప్రాయం. ఈ కోణంలో చూస్తే దేశంలో ఏటా చిన్న, మధ్యతరహా పరిశ్రమల వ్యాపారం 50 మిలియన్ డాలర్లు ఉంటుంది. కానీ, వీటిలో చాలా కొద్ది మందికే సొంత కమ్యూనికేషన్ వ్యవస్థ ఉంది. అందుకే చిన్న కంపెనీలకూ కస్టమర్లతో మెరుగైన కమ్యూనికేషన్ సేవల్ని అందించేందుకే 2007లో 2 మిలియన్ డాలర్ల పెట్టుబడితో కోకో.ఇన్ సేవల్ని ప్రారంభించా. ప్రస్తుతం మన దేశంలోని 10 నగరాలతో పాటు మలేిసియాలోనూ కోకో సేవలు అందుబాటులో ఉన్నాయి. 500లకు పైగా కంపెనీలు..: ఈ-కామర్స్, రియల్ ఎస్టేట్, ట్రావెల్, ఎడ్యుకేషన్ ఇలా సుమారు 20 విభాగాల్లో 500లకు పైగా కంపెనీలు ఈ సేవల్ని వినియోగించుకుంటున్నాయి. జొమాటో, ప్రొక్టో, రెడ్‌బస్, అభిబస్, ఇండియా మార్ట్, మణిపాల్ యూనివర్సిటీ, బిగ్ బాస్కెట్, ప్రొప్ ఈక్విటీ, కామన్‌ఫ్లోర్.కామ్, హౌజింగ్, షాదీ.కామ్, గోబిబో.కామ్, డీహెచ్ఎఫ్ఎల్, మహీంద్రా ఫైనాన్స్ వంటివి చెప్పుకోవచ్చు. 6 నెలల్లో వర్జీనియా, సౌదీ, ఆస్ట్రేలియా, సింగపూర్, యూఎస్, యూకేల్లో సేవల్ని విస్తరించనున్నాం. ఈ ఏడాది రూ.75 కోట్ల వ్యాపారాన్ని లక్ష్యంగా పెట్టుకున్నాం. నెల రోజుల్లో 10 మిలియన్ల పెట్టుబడులు..: ఇప్పటివరకు సొంత పెట్టుబడులతోనే కంపెనీని నడుపుతున్నాం. తొలిసారిగా నిధుల సమీకరణపై దృష్టిపెట్టాం. ఓ విదేశీ కంపెనీ 10 మిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. మరో నెల రోజుల్లో పూర్తి వివరాలు వెల్లడిస్తాం. ప్రస్తుతం కంపెనీలో 65 మంది ఉద్యోగులున్నారు. మరింత మెరుగైన సేవల్ని అందించేందుకు మరి కొంత మంది ఉద్యోగుల్ని నియమించుకుంటున్నాం. త్వరలోనే వీడియో టెక్నాలజీ.. ప్రస్తుతం సోషల్ మీడియా, ఈ-మెయిల్, ఎస్ఎంఎస్, వాయిస్ సర్వీసులను అందిస్తున్నాం. ఆయా సేవల్ని బట్టి ధరలున్నాయి. రూ.5 వేల నుంచి రూ.6 లక్షల వరకూ ధరలను నిర్ణయించాం. ఆయా సర్వీసులను ఎంచుకునే కంపెనీకి వాటికి సంబంధించిన ఎలాంటి చర్యనైనా క్షణాల్లోనే సంబంధిత కంపెనీకి సమాచారం అందిస్తాం. ఉదాహరణకు సోషల్ మీడియా సర్వీస్‌ను ఎంచుకుంటే.. ట్వీటర్, ఫేస్బుక్, లింక్డిన్ వంటి వాటిల్లో కంపెనీ గురించి ఎలాంటి కామెంట్లు, పోస్టులు చేసినా.. వాటిని ట్రాక్ చేసి సంబంధిత కంపెనీకి చేరవేస్తాం. ఇటీవలే స్పీచ్ రికగ్నేషన్ టెక్నాలజీ సర్వీస్‌ను ప్రారంభించాం. దీని ప్రత్యేకతేంటంటే.. కంపెనీ కాల్ సెంటర్‌కు ఫోన్ చేసిన వ్యక్తి జెండర్ ఏంటి? వయస్సెంత ఉంటుంది. తన మూడ్ ఎలా ఉంది. వంటి వివరాలను సంబంధిత యాజమాన్యానికి క్షణాల్లోనే చెప్పేస్తాం. దీన్నిబట్టి కస్టమర్‌తో ఎవరు మాట్లాడాలో కంపెనీ నిర్ణయించుకునే వీలుకలుగుంది. ఈ సర్వీస్‌ను హౌజింగ్.కామ్, యూనీలివర్ కంపెనీలు వినియోగించుకుంటున్నాయి. మరో ఆరు నెలల్లో వీడియో టెక్నాలజీ సర్వీస్‌ను తీసుకొస్తాం. కోకో అంటే.. వెబ్ అప్లికేషన్‌కు కాలర్‌కు మధ్య కోకో ఓ అనుసంధానకర్త. అంటే మీ కంపెనీకి వచ్చే ఫోన్ కాల్స్, ఈ-మెయిల్స్, సోషల్ వెబ్సైట్లలో లైకులు, పోస్టులు, కామెంట్లు.. ఇలా ప్రతీది తీసుకొని సంబంధిత కంపెనీ విభాగానికి (మార్కెటింగ్, సేల్స్, ఎగ్జిక్యూటివ్ వంటి వి) ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే కోకో కూడా మీ కంపెనీ ప్రతినిధే. కాకపోతే ఇది పూర్తిగా వర్చుకల్ కమ్యూనికేషన్ అంతే. అద్భుతమైన స్టార్టప్‌ల గురించి అందరికీ తెలియజేయాలనుకుంటే startups@sakshi.com కు మెయిల్ చేయండి...