The Twin Towers
-
"34" అంతస్తుల్లో ఏముంది?
► 34 అంతస్తులతో పోలీస్ భవనం ► ఒక్కో ఫ్లోర్ ఒక్కో విభాగానికి.. ► సిటీలో ఎత్తయిన భవనం ఇదే..! సాక్షి, సిటీబ్యూరో: మహానగరానికి మరో కలికితురాయి.. ప్రజలను అనుక్షణం కాపాడేందుకు, సిటీపై డేగకన్ను వేసేందుకు అధునాతన ‘పోలీస్ టవర్స్’ అధునాతన హంగులతో రానుంది. ‘ట్విన్ టవర్స్’ పేరుతో బంజారాహిల్స్‌లో నిర్మించనున్న ‘సిటీ పోలీసు కమిషనరేట్ హెడ్–క్వార్టర్స్ అండ్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్’ (హెచ్‌సీపీసీహెచ్‌క్యూ అండ్ ఐసీసీసీ) ‘ఏ–బి’గా రెండు టవర్లు మొత్తం 34 అంతస్తులు ఉంటాయి. ప్రతి అంతస్తుకు ఓ ప్రత్యేకత.. ఈ పోలీస్ సముదాయంపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.. పోలీస్ సముదాయం రెండు విభాగాలుగా ఉంటుంది. ‘ఏ’ టవర్‌లో జీ+19 అంతస్తులు, ‘బీ’ టవర్‌లో జీ+15 అంతస్తులు ఉంటాయి. పౌర విమానయాన మంత్రిత్వ శాఖ అనుమతించిన మేరకు 83.45 మీటర్ల ఎత్తులో నిర్మితమవుతున్న ఈ పోలీసు టవర్సే సిటీలో అత్యంత ఎత్తయిన భవనాలుగా రికార్డులకు ఎక్కనున్నాయి. ‘ఏ’ టవర్ నుంచి ‘బి’ టవర్‌కు వెళ్లేందుకు పై అంతస్తుల్లో నుంచి ప్రత్యేక కారిడార్ కూడా ఉంటుంది. ఈ ‘ట్విన్ టవర్స్’లో ఏవి ఎక్కడ ఉంటాయంటే.. ఏ–టవర్స్: 19 అంతస్తులు గ్రౌండ్ ఫ్లోర్: క్విక్ రియాక్షన్ టీమ్, భవనం సెక్యూరిటీ కార్యాలయాలు 1వ అంతస్తు : పోలీసు లైబ్రరీ 2 : ఈ–చలాన్, ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్ మానిటరింగ్ 3 : ట్రాఫిక్ ఆపరేషన్స్ వింగ్ 4 : సిటీ ట్రాఫిక్ బ్రాంచ్ 5 : పరిపాలన విభాగం, వైర్లెస్ కమ్యూనికేషన్స్ విభాగం 6 : విపత్తు నిర్వహణ కమాండ్ సెంటర్ 7 : ముఖ్యమంత్రి, హోంమంత్రి, సీఎస్, డీజీపీతో పాటు ఇతర ప్రభుత్వ ఉన్నతాధికారుల కోసం కేటాయించిన కార్యాలయాలు 8: చైల్డ్ అండ్ ఉమెన్ సేఫ్టీ వింగ్ 9 : కౌంటర్ ఇంటెలిజెన్స్ 10 : ఇంటెలిజెన్స్ బ్రాంచ్ 11 : స్పెషల్ బ్రాంచ్, ప్రొ యాక్టివ్ ఇంటెలిజెన్స్ వింగ్ 12 : ఇతర విభాగాల ఉన్నతాధికారుల కార్యాలయాలు 13 : వీవీఐపీ, వీఐపీ లాంజ్‌లు 14 : శాంతిభద్రతలు, నేరాలు, ట్రాఫిక్ విభాగాల అదనపు సీపీలు 15 : పోలీసు కమిషనర్ కార్యాలయం 16 : అత్యంత రహస్య రికార్డుల విభాగం 17 : స్పెషల్ ఆపరేషన్స్ మానిటరింగ్ యూనిట్ 18 : అధికారుల ట్రైనింగ్ సెంటర్, గెస్ట్ రూమ్స్ 19 : మిషన్స్ రూమ్ టవర్–బి: 15 అంతస్తులు గ్రౌండ్ ఫ్లోర్: భవన ప్రవేశం, రిసెప్షన్ 1వ అంతస్తు : సాధారణ శిక్షణ కేంద్రం, న్యాయ సలహాదారు కార్యాలయం 2 : సాంకేతిక శిక్షణ కేంద్రం 3: సోషల్ మీడియా మానిటరింగ్ వింగ్ 4 : ఐటీ అప్లికేషన్స్ మానిటరింగ్, డెవలప్మెంట్ సెంటర్ 5 : క్రైమ్ డేటా అనాలసిస్, ‘డయల్–100’ 6 : విపత్తు నిర్వహణ కమాండ్ సెంటర్ (రెండు టవర్స్‌లో కలిపి) 7 : ముఖ్యమంత్రి, హోంమంత్రి, సీఎస్, డీజీపీలతో పాటు ఇతర ప్రభుత్వ ఉన్నతాధికారుల కోసం కేటాయించిన కార్యాలయాలు (రెండు టవర్స్‌లో కలిపి) 8 : సిటీ క్రైమ్ బ్రాంచ్ 9 : బడ్జెట్ అండ్ అకౌంట్స్ సెక్షన్స్ 10 : సంయుక్త పోలీసు కమిషనర్ (సమన్వయం) 11 : సంయుక్త పోలీసు కమిషనర్ (పరిపాలన) 12 : పర్సనల్ అడ్మినిస్ట్రేషన్ బ్రాంచ్ 13 : సర్వే, కాల్ సెంటర్ 14-15 : మినీ థియేటర్, మ్యూజియం, కాన్ఫరెన్స్‌హాల్ తదితరాలు రెండింటికీ మధ్య 14, 15 అంతస్తుల్లో రెండింటినీ కలుపుతూ బ్రిడ్స్ వే ఉంటుంది ఆరో అంతస్తులో కాన్ఫరెన్స్ హాల్, ఐదో అంతస్తులో కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్, నాలుగులో డేటా సెంటర్ ఉంటాయి. -
అదిరిపోయే రీతిలో పోలీస్ టవర్స్
ట్విన్ టవర్స్ పనుల్లో కదలిక... ఎర్త్‌వర్క్ కాంట్రాక్టు అప్పగింత పనులు పూర్తి ప్రతి 21 రోజులకు ఓ శ్లాబ్ పడేలా ప్రణాళిక 20 అంతస్తులు...83.4 మీటర్ల ఎత్తుతో ఐసీసీసీ అత్యాధునిక హంగులతో నిర్మాణం గరిష్టంగా రెండేళ్ళల్లో పూర్తి! సాక్షి, సిటీబ్యూరో: ‘ట్విన్ టవర్స్’ పేరుతో నగరంలోని బంజారాహిల్స్‌లో నిర్మించనున్న సిటీ పోలీసు కమిషనరేట్ హెడ్–క్వార్టర్స్, ఇంటిగ్రేడెట్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (హెచ్‌సీపీసీహెచ్‌క్యూ అండ్ ఐసీసీసీ) నిర్మాణం పనులు వచ్చే వారం ప్రారంభంకానున్నాయి. ప్రాథమికంగా రాళ్ళ తొలగింపు, భూమి చదును తదితర ఎర్త్వర్క్స్ చేయాలని అధికారులు నిర్ణయించారు. ఇప్పటికే దీని నిర్మాణానికి సివిల్ ఏవియేషన్, మున్సిపల్ శాఖల నుంచి అనుమతులు వచ్చిన నేపథ్యంలో గరిష్టంగా రెండు నెలల్లో భవన నిర్మాణానికీ శ్రీకారం చుట్టనున్నారు. రెండు సంవత్సరాల్లో నిర్మాణం పూర్తి చేసుకోనున్న ఈ ట్విన్ టవర్స్ నగరంలోనే అతి ఎల్తైన భవనంగా రికార్డులకు ఎక్కనుంది. నిర్ణీత కాలంలో, ప్రణాళికా బద్ధంగా, అందరికీ ఉపయుక్తంగా ఈ భవనాల నిర్మాణం పూర్తి చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి ‘సాక్షి’తో అన్నారు. 83.4 మీటర్లకు పరిమితం... బంజారాహిల్స్ రోడ్ నెం.12లోని ఏడెకరాల సంస్థలో ఈ జంట భవనాలను 135 మీటర్ల ఎత్తుతో నిర్మించాలని తొలుత భావించారు. ఈ మేరకు అనుమతి కోరుతూ రాష్ట్ర పురపాలక శాఖకు దరఖాస్తు చేసుకున్నారు. ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం బంజారాహిల్స్ ప్రాంతంలో 15 మీటర్లకు మించిన ఎత్తులో భవనాల నిర్మాణాలు జరపకుండా ఆంక్షలు అమల్లో ఉన్నాయి. ఈ ఆంక్షలను సడలిస్తూ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ భవనానికి ఆ శాఖ అనుమతిచ్చింది. మరోపక్క ఇంత ఎల్తైన భవనాలు నిర్మించాలంటే దానికి పౌర విమానయాన మంత్రిత్వ శాఖ నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే నగర పోలీసులు ఆ శాఖకు అనుమతులు కోరుతూ దరఖాస్తు చేసుకున్నారు. అయితే కొన్ని ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో 83.4 మీటర్ల ఎత్తు నిర్మించుకోవడానికి సివిల్ ఏవియేషన్ శాఖ అనుమతించింది. వీటిని పరిగణనలోకి తీసుకున్న పోలీసు విభాగం 20 అంతస్తులతో 83.4 మీటర్ల ఎత్తులో నిర్మించడానికి సమాయత్తమైంది. ఎర్త్‌వర్క్‌ను వేరుచేసి వేగంగా... ఈ ట్విన్ టవర్స్ నిర్మాణానికి సంబంధించిన టెండర్లు ఆహ్వానించడం, వాటిని పరిశీలించడం, కాంట్రాక్టు అప్పగించడం తదితర వ్యవహారాలన్నింటినీ రహదారులు, భవనాల శాఖ పర్యవేక్షిస్తోంది. సాంకేతిక కారణాల నేపథ్యంలో ఈ భవనాల నిర్మాణాలు చేపట్టడానికి గరిష్టంగా రెండు నెలల కాలం పట్టే అవకాశం ఉంది. అప్పుడైనా తొలుత భూమి చదునుకు సంబంధించిన పనులతో ప్రారంభించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే కాలయాపన జరుగకుండా ఎర్త్ వర్క్‌ను వేరుచేసి, మరో టెండర్‌ను ఆహ్వానించారు. దీన్ని ఓ ప్రైవేట్ సంస్థ దక్కించుకోవడంతో వచ్చే వారం పనులు ప్రారంభించడానికి కాంట్రాక్టర్లు సన్నాహాలు చేస్తున్నారు. ఆ స్థలంలో ఉన్న రాళ్ళ తొలగింపు, నేల చదును చేయడం తదితర పనుల్ని పూర్తి చేసే ఈ సంస్థ నిర్ణీత కాలంలో పోలీసు విభాగానికి అప్పగిస్తుంది. ఈ లోపు భవనాల నిర్మాణానికి సంబంధించి టెండర్లు, ఇతర ప్రక్రియలు పూర్తి కావడంతో తక్షణం నిర్మాణ పనులు చేపట్టే అవకాశం ఉంటుంది. ప్రతి 21 రోజులకు ఒక శ్లాబ్... లండన్, న్యూయార్క్ తరహాలో ఉత్తమంగా తయారయ్యే ఈ ఐసీసీసీ నిర్మాణం ప్రారంభమైన నాటి నుంచి గరిష్టంగా రెండేళ్ళల్లో పూర్తి చేయించడానికి పోలీసు విభాగం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. పోలీసులతో పాటు ఇతర ప్రభుత్వ విభాగాలకూ ఉపయుక్తంగా ఉండేలా దీన్ని నిర్మించనున్నారు. ఆద్యంతం ఆధునిక టెక్నాలజీని వినియోగించనున్నారు. నగర ప్రజల భద్రతే ప్రామాణికంగా ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీగా అందుబాటులోకి రానున్న ఈ ట్విన్ టవర్స్ నిర్మాణం ఆగస్టులో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ప్రతి 21 రోజులకు ఒక స్లాబ్ చొప్పున పూర్తి చేస్తూ గరిష్టంగా రెండేళ్ళ కాలంలో దీని నిర్మాణాన్ని పూర్తి చేయడానికి ప్రణాళికలు చేస్తున్నారు. దీని నిర్మాణ వ్యయం దాదాపు రూ.1002 కోట్లు వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. అధునాత హంగులు... ♦ ఈ ఐసీసీసీని పూర్తిస్థాయిలో డబుల్ ఇన్సులేటెడ్ గ్లాస్‌తో నిర్మించనున్నారు. ♦ టవర్స్‌లో ఉండే సోలార్ విద్యుత్ ఉత్పత్తి ప్యానెల్స్ అదనపు ఆకర్షణ. ♦ భవనం పైన హెలీప్యాడ్, భవనంలో పబ్లిక్ అబ్జర్వేషన్ డెస్క్, పోలీసు మ్యూజియం. ♦ 900 మంది కూర్చునే సామర్థ్యంతో ఆడిటోరియం, 740 వాహనాలకు పార్కింగ్ వసతి. ♦ పోలీసు శాఖకు చెందిన అన్ని విభాగాలూ ఒకే చోటకు.. ♦ కేవలం నగర పోలీసులకే కాకుండా ఇతర ప్రభుత్వ విభాగాలకూ ఇందులో భాగస్వామ్యం. ♦ భవనం 18వ అంతస్తులో నగర పోలీసు కమిషనర్ అధికారిక కార్యాలయం ఏర్పాటు. -
ఆ నేడు 11 సెప్టెంబర్, 2001
వణికించిన ఉదయపు చీకటి! తుపానులో చిక్కిన చిగురుటాకులా వణికిపోయింది ప్రపంచం. అమెరికా ట్విన్ టవర్స్‌పై ఉగ్రవాదులు జరిపిన వైమానిక దాడి... భౌతిక నిర్మాణాల మీద దాడి మాత్రమే కాలేకపోయింది. ఒక దుర్ఘటన... వేల ప్రశ్నలను లేవనెత్తింది. కొన్ని కీలక ఘటనలకు కారణమైంది. 19 మంది హైజాకర్లు నాలుగు కమర్షియల్ ఎయిర్లైనర్స్ను కంట్రోల్లోకి తెచ్చుకొని వరల్డ్ ట్రేడ్ సెంటర్ నార్త్ టవర్, సౌత్ టవర్, పెంటగన్లపై దాడి జరిపారు. ఆ ఉదయం అందరి హృదయాలు శోకతప్తమయ్యాయి.ఎయిర్‌క్రాఫ్ట్ హైజాకింగ్, ఆత్మాహుతి దాడులు, సామూహిక హత్యాకాండ, టైజం.... ఇలా ఒకటి కాదు.. ఈ దాడులకు ఏ పేరు పెట్టుకున్నా ఫర్వాలేదు... స్థూలంగా చెప్పుకోవాలంటే... ఉగ్రవాద ఉన్మాదపు విశ్వరూపం కళ్లకు కట్టిన రోజు ఇది.