ఆ నేడు 11 సెప్టెంబర్, 2001
వణికించిన ఉదయపు చీకటి!
తుపానులో చిక్కిన చిగురుటాకులా వణికిపోయింది ప్రపంచం. అమెరికా ట్విన్ టవర్స్‌పై ఉగ్రవాదులు జరిపిన వైమానిక దాడి... భౌతిక నిర్మాణాల మీద దాడి మాత్రమే కాలేకపోయింది. ఒక దుర్ఘటన... వేల ప్రశ్నలను లేవనెత్తింది. కొన్ని కీలక ఘటనలకు కారణమైంది.
19 మంది హైజాకర్లు నాలుగు కమర్షియల్ ఎయిర్‌లైనర్స్‌ను కంట్రోల్‌లోకి తెచ్చుకొని వరల్డ్ ట్రేడ్ సెంటర్ నార్త్ టవర్, సౌత్ టవర్, పెంటగన్‌లపై దాడి జరిపారు.
ఆ ఉదయం అందరి హృదయాలు శోకతప్తమయ్యాయి.ఎయిర్‌క్రాఫ్ట్ హైజాకింగ్, ఆత్మాహుతి దాడులు, సామూహిక హత్యాకాండ, టైజం.... ఇలా ఒకటి కాదు.. ఈ దాడులకు ఏ పేరు పెట్టుకున్నా ఫర్వాలేదు... స్థూలంగా చెప్పుకోవాలంటే... ఉగ్రవాద ఉన్మాదపు విశ్వరూపం కళ్లకు కట్టిన రోజు ఇది.