"34" అంతస్తుల్లో ఏముంది? | What " 34 " floors ? | Sakshi
Sakshi News home page

"34" అంతస్తుల్లో ఏముంది?

Published Mon, Aug 1 2016 11:08 PM | Last Updated on Mon, Sep 4 2017 7:22 AM

"34" అంతస్తుల్లో ఏముంది?

"34" అంతస్తుల్లో ఏముంది?

► 34 అంతస్తులతో పోలీస్‌ భవనం 
► ఒక్కో ఫ్లోర్‌ ఒక్కో విభాగానికి.. 
► సిటీలో ఎత్తయిన భవనం ఇదే..!
 
సాక్షి, సిటీబ్యూరో: మహానగరానికి మరో కలికితురాయి.. ప్రజలను అనుక్షణం కాపాడేందుకు, సిటీపై డేగకన్ను వేసేందుకు అధునాతన ‘పోలీస్‌ టవర్స్‌’ అధునాతన హంగులతో రానుంది. ‘ట్విన్‌ టవర్స్‌’ పేరుతో బంజారాహిల్స్‌లో నిర్మించనున్న ‘సిటీ పోలీసు కమిషనరేట్‌ హెడ్‌–క్వార్టర్స్‌ అండ్‌ ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌’ (హెచ్‌సీపీసీహెచ్‌క్యూ అండ్‌ ఐసీసీసీ) ‘ఏ–బి’గా రెండు టవర్లు మొత్తం 34 అంతస్తులు ఉంటాయి. ప్రతి అంతస్తుకు ఓ ప్రత్యేకత.. ఈ పోలీస్‌ సముదాయంపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.. 
 
 
పోలీస్‌ సముదాయం రెండు విభాగాలుగా ఉంటుంది. ‘ఏ’ టవర్‌లో జీ+19 అంతస్తులు, ‘బీ’ టవర్‌లో జీ+15 అంతస్తులు ఉంటాయి. పౌర విమానయాన మంత్రిత్వ శాఖ అనుమతించిన మేరకు 83.45 మీటర్ల ఎత్తులో నిర్మితమవుతున్న ఈ పోలీసు టవర్సే సిటీలో అత్యంత ఎత్తయిన భవనాలుగా రికార్డులకు ఎక్కనున్నాయి. ‘ఏ’ టవర్‌ నుంచి ‘బి’ టవర్‌కు వెళ్లేందుకు పై అంతస్తుల్లో నుంచి ప్రత్యేక కారిడార్‌ కూడా ఉంటుంది. ఈ ‘ట్విన్‌ టవర్స్‌’లో ఏవి ఎక్కడ ఉంటాయంటే.. 
 
ఏ–టవర్స్‌: 19 అంతస్తులు
గ్రౌండ్‌ ఫ్లోర్‌: క్విక్‌ రియాక్షన్‌ టీమ్, భవనం సెక్యూరిటీ కార్యాలయాలు
1వ అంతస్తు : పోలీసు లైబ్రరీ
2 : ఈ–చలాన్, ట్రాఫిక్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ మానిటరింగ్‌
3 : ట్రాఫిక్‌ ఆపరేషన్స్‌ వింగ్‌
4 : సిటీ ట్రాఫిక్‌ బ్రాంచ్‌
5 : పరిపాలన విభాగం, వైర్‌లెస్‌ కమ్యూనికేషన్స్‌ విభాగం
6 : విపత్తు నిర్వహణ కమాండ్‌ సెంటర్‌
7 : ముఖ్యమంత్రి, హోంమంత్రి, సీఎస్, డీజీపీతో పాటు ఇతర ప్రభుత్వ ఉన్నతాధికారుల కోసం కేటాయించిన కార్యాలయాలు
8: చైల్డ్‌ అండ్‌ ఉమెన్‌ సేఫ్టీ వింగ్‌
9 : కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌
10 : ఇంటెలిజెన్స్‌ బ్రాంచ్‌
11 : స్పెషల్‌ బ్రాంచ్, ప్రొ యాక్టివ్‌ ఇంటెలిజెన్స్‌ వింగ్‌
12 : ఇతర విభాగాల ఉన్నతాధికారుల కార్యాలయాలు
13 : వీవీఐపీ, వీఐపీ లాంజ్‌లు
14 : శాంతిభద్రతలు, నేరాలు, ట్రాఫిక్‌ విభాగాల అదనపు సీపీలు
15 : పోలీసు కమిషనర్‌ కార్యాలయం
16 : అత్యంత రహస్య రికార్డుల విభాగం
17 : స్పెషల్‌ ఆపరేషన్స్‌ మానిటరింగ్‌ యూనిట్‌
18 : అధికారుల ట్రైనింగ్‌ సెంటర్, గెస్ట్‌ రూమ్స్‌
19 : మిషన్స్‌ రూమ్‌
 
 
టవర్‌–బి: 15 అంతస్తులు
గ్రౌండ్‌ ఫ్లోర్‌: భవన ప్రవేశం, రిసెప్షన్‌
 
1వ అంతస్తు : సాధారణ శిక్షణ కేంద్రం, న్యాయ సలహాదారు కార్యాలయం
2 : సాంకేతిక శిక్షణ కేంద్రం
3: సోషల్‌ మీడియా మానిటరింగ్‌ వింగ్‌
4 : ఐటీ అప్లికేషన్స్‌ మానిటరింగ్, డెవలప్‌మెంట్‌ సెంటర్‌
5 : క్రైమ్‌ డేటా అనాలసిస్, ‘డయల్‌–100’
6 : విపత్తు నిర్వహణ కమాండ్‌ సెంటర్‌ (రెండు టవర్స్‌లో కలిపి) 
7 : ముఖ్యమంత్రి, హోంమంత్రి, సీఎస్, డీజీపీలతో పాటు ఇతర ప్రభుత్వ ఉన్నతాధికారుల కోసం కేటాయించిన కార్యాలయాలు 
(రెండు టవర్స్‌లో కలిపి) 8 : సిటీ క్రైమ్‌ బ్రాంచ్‌ 
9 : బడ్జెట్‌ అండ్‌ అకౌంట్స్‌ సెక్షన్స్‌
10 : సంయుక్త పోలీసు కమిషనర్‌ (సమన్వయం)
11 : సంయుక్త పోలీసు కమిషనర్‌ (పరిపాలన)
12 : పర్సనల్‌ అడ్మినిస్ట్రేషన్‌ బ్రాంచ్‌ 13 : సర్వే, కాల్‌ సెంటర్‌
14-15 : మినీ థియేటర్, మ్యూజియం, కాన్ఫరెన్స్‌హాల్‌ తదితరాలు
 
రెండింటికీ మధ్య
14, 15 అంతస్తుల్లో రెండింటినీ కలుపుతూ బ్రిడ్స్‌ వే ఉంటుంది 
ఆరో అంతస్తులో కాన్ఫరెన్స్‌ హాల్, ఐదో అంతస్తులో కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్, నాలుగులో డేటా సెంటర్‌ ఉంటాయి. 

Advertisement

పోల్

Advertisement