Two teenagers killed
-
మృత్యువులోనూ వీడని స్నేహం
♦ రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకుల మృతి ♦ మేడ్చల్ 44వ జాతీయ రహదారిపై ఘటన ♦ బైక్‌ను ప్రైవేట్ బస్సు ఢీకొనడంతో ప్రమాదం ♦ మద్యం మత్తులో డ్రైవర్..? మేడ్చల్: ఓ ప్రైవేట్ బస్సు బైక్‌ను ఢీకొనడంతో ఇద్దరు స్నేహితులు దుర్మరణం చెందారు. మేడ్చల్ పట్టణ శివారులో బుధవారం సాయంత్రం ఈ సంఘటన చోటుచేసుకుంది. సీఐ రాజశేఖర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్ జిల్లా తూఫ్రాన్ మండలం కాళ్లకల్‌కు చెందిన ఎంకినోళ్ళ సాయికుమార్(19) తన కుటుంబంతో కలిసి మేడ్చల్ కిందిబస్తీలో నివాసముంటున్నాడు. బిహార్‌కు చెందిన సిపూన్(22) కాళ్లకల్‌లోని ఓ కంపెనీలో పనిచేసుకుంటూ అదే బస్తీలో ఉంటున్నాడు. ఈనేపథ్యంలో ఇద్దరూ స్నేహితులయ్యారు. ఇదిలా ఉండగా, బుధవారం సాయంత్రం స్నేహితులు బైక్‌పై బుధవారం సాయంత్రం 4 గంటల సమయంలో 44వ జాతీయ రహదారిపై మేడ్చల్ నుంచి చెక్‌పోస్టుకు వెళ్తున్నారు. ఈక్రమంలో ఇసుకబావి వద్ద వెనుక నుంచి వచ్చిన ఓ కంపెనీ ఉద్యోగులను నగరానికి తీసుకెళుతున్న ప్రైవేట్ బస్సు వేగంగా వచ్చి ఢీకొంది. దీంతో సిపూన్, సాయికుమార్ రోడ్డుపై పడిపోయారు. సాయికుమార్ తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. గాయపడిన సిపూన్ను 108 వాహనంలో నగరంలోని గాంధీ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందాడు. ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు నగరంలోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. అయితే, బస్సు డ్రైవర్ వేగంగా నిర్లక్ష్యంగా నడిపాడని అతడిని అదుపులోకి తీసుకున్నాడు. మద్యం మత్తులో వాహనం నడిపి ఉండొచ్చనే అనుమానంతో వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ ఆసుపత్రికి పంపినట్లు సీఐ తెలిపారు. అయితే, ఇంటర్ పూర్తి చేసిన సాయికుమార్ పాలీటెక్నిక్లో చేరే ప్రయత్నంలో ఉన్నాడు. అతడికి ఓ సోదరుడు ఉన్నాడు. సిపూన్ బిహార్ నుంచి ఒంటరిగా వలస వచ్చి కార్మికుడిగా జీవనం సాగిస్తుండేవాడు. ఈమేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
పండుగ వేళ..మృత్యుహేల
ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ద్విచక్రవాహనం ఇద్దరు యువకుల దుర్మరణం మద్యం మత్తులో నడపడమే కారణం? శోకసంద్రంలో మృతుల కుటుంబాలు ములుగు : ద్విచక్రవాహనం అదుపు తప్పి శుక్రవారం అర్ధరాత్రి ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన దుర్ఘటనలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. అతిగా మద్యం తాగి ఇంటికొస్తుం డగా ఎదురుగా వచ్చిన లారీ లైట్ల వెలుతురు కళ్లపై పడటంతో సదరు యువకులు ద్విచక్రవాహనంపై అదుపు కోల్పోరుు, లారీని ఢీకొట్టారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. వీరి దుర్మరణంతో బాధిత కుటుంబాల్లో పండుగ పూట విషాదఛాయలు అలుముకున్నారుు. ములుగు మండలంలోని పాల్సాబ్పల్లికి చెందిన బిల్లా నర్సింహారెడ్డి అలియాస్ నాని (28), ములుగు మండలకేంద్రానికి చెందిన పైడిమల్ల శ్రావణ్ (23) సంక్రాంతి రోజున స్థానికంగా విందు చేసుకున్నారు. విందు అనంతరం ఇంటికి ద్విచక్రవాహనంపై వస్తుండగా జాకారంలోని మసీదు సమీపంలో రోడ్డు పక్కకు ఆగి ఉన్న లారీని ఢీకొట్టారు. దీంతో ఇద్దరు మృత్యువాతపడ్డారు.మృతులిద్దరూ అవివాహితులే. సంఘటనా స్థలం నుంచి మృతదేహాలను 108 వాహనంలో ములు గు సివిల్ ఆస్పతికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. సాయంత్రం వారి స్వగ్రామాల్లో అం త్యక్రియలు నిర్వహించారు. ములుగు సర్పంచ్ గుగ్గిళ్ల సాగర్, ఎంపీటీసీ పోరిక గోవింద్‌నాయక్ బాధిత కుటుంబాలను పరామర్శించారు. తల్లి మందలించినా వినకుండా వెళ్లిన శ్రావణ్ మృతుడు పైడిమల్ల శ్రావణ్ ఇటీవల అయ్య ప్ప మాల వేసుకొని విరమించుకున్నాడు. అతడి తండ్రి సురేందర్ మాలను కొనసాగిం చి విరమణకు శబరిమలకు బయలుదేరారు. తండ్రి ఇంట్లో లేకపోవడంతో శ్రావణ్ శుక్రవారం రాత్రి ఇంటి నుంచి వెళుతుండగా..‘ ఈ రాత్రి ఎటుపోతన్నవ్ కొడుక. ఎక్కడికి పోకు’ అని మందలించింది. తల్లి మాట లను పట్టిం చుకోకుండా శ్రావణ్ తన స్నేహితుడు బిల్లా నానితో కలిసి విందుకు వెళ్లి వస్తుండగా ఈ ఘటన జరిగింది. కాగా తమ కుమారుడు మృతిచెందాడనే విషయం తెలుసుకున్న సురేందర్ శబరి యూత్రనువిరమించుకొని, ఇంటికి తిరిగి బయలుదేరారు.