చెన్నైలో ఇద్దరు తెలుగు మహిళలు అరెస్ట్!
సాక్షి, చెన్నై: నకిలీ సర్టిఫికెట్లు చూపి అమెరికా వీసా పొందేందుకు ప్రయత్నించిన ఇద్దరు తెలుగు మహిళలు సహా నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ఎప్పటిలాగే న్నైలోని అమెరికా రాయబార కార్యాలయంలో ఆ దేశ వీసా పొందేందుకు అనేక మంది వచ్చారు. వారిలో నలుగురు మాత్రం నకిలీ సర్టిఫికెట్లను అందజేసినట్లు అధికారులు గుర్తించారు. దీనిపై రాయబారి కార్యాలయం అధికారులు చెన్నై పోలీసు కమిషనర్ కార్యాలయానికి ఫిర్యాదు చేశారు.
నకిలీ సర్టిఫికెట్లు ఇచ్చి వీసా పొందాలని యత్నించిన తెలంగాణకు చెందిన కృష్ణవేణి (41), కరుణశ్రీ (45) తోపాటు కన్యాకుమారికి చెందిన ధోని (46), దిలీప్ (26)పై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని అందులో కోరారు. చెన్నై సెంట్రల్ క్రైమ్ డిపార్ట్మెంట్ జాయింట్ కమిషనర్ మల్లిక పర్యవేక్షణలో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరిపారు. అనంతరం నిందితులు కృష్ణవేణి, కరుణశ్రీ, ధోని, దిలీప్లను పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో దిలీప్ పట్టభద్రుడు.