గుడివాడలో గంజాయి పట్టివేత
గుడివాడలో గంజాయి పట్టివేత
Published Tue, Sep 13 2016 9:28 PM | Last Updated on Mon, Aug 20 2018 7:27 PM
గుడివాడ :
మత్తు పదార్థాలు విక్రయిస్తున్న ఇరువురు మహిళలను అరెస్టు చేసి వారి నుంచి 6 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు స్థానిక ఎక్సైజ్ సీఐ బి.వరాలరాజు తెలిపారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ గంజాయి అమ్ముతున్న ఇరువురు మహిళలను నెహ్రుచౌక్ సెంటర్‌లో అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. ముగ్గుబజారుకు చెందిన సీమసతీ చిన్నమ్మ వద్ద 4 కేజీలు, పెదఎరుకపాడుకు చెందిన షేక్ దేవమాత నుంచి 2 కేజీలు గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. వీరిని కోర్టులో హాజరుపర్చగా 15 రోజుల రిమాండ్ విధించారని తెలిపారు. మాదకద్రవ్యాలు అమ్మినా, వాటిని ప్రోత్సహించినా చట్టరీత్యా నేరమని, వారిపై కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ ఎస్సై తాతారావు, సిబ్బంది పాల్గొన్నారు.
Advertisement
Advertisement