U
-
నేనున్నానని తెలిసింది!
‘‘ఈ సినిమా అసలు రిలీజ్ అవుతుందా? లేదా అనుకున్నాను. మంచి రిలీజ్ బజ్ వచ్చింది ఇప్పుడు. ప్రేక్షకులకు నేనున్నానని తెలిసింది. తెలియనప్పుడే చాలా ట్రై చేశాను. ఇప్పుడు మరింత గట్టిగా ట్రై చేస్తాను’’ అన్నారు కొవెర. ఆయన హీరోగా నటించి, స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన సినిమా ‘యు’. ‘కథే హీరో’ అనేది ఉపశీర్షిక. ఈ చిత్రం ఈరోజు విడుదల కానుంది. ఈ సందర్భంగా కొవెర మాట్లాడుతూ – ‘‘ప్రముఖ కథారచయిత, డైరెక్టర్ విజయేంద్ర ప్రసాద్‌గారి దగ్గర నాలుగేళ్లు వర్క్ చేశాను. ఆయనతో పని చేయడం వల్ల నా ఆలోచనా పరిధి పెరిగింది. దాదాపు 16 మంది హీరోలకు కథలు వినిపించాను. ఇప్పుడు ఈ సినిమాకు నిర్మాతగా, ప్రొడ్యూసర్‌గా, డైరెక్టర్‌గా చేయడంతో పాటు హీరోగా నటించాను. విజయేంద్రప్రసాద్‌గారు ఇన్పుట్స్ ఇచ్చారు. ప్రతి క్రైమ్ వెనక డబ్బు ఒక ప్రధాన కారణంగా ఉంటుందని నమ్ముతాను నేను. ఈ సినిమా కథనం అండర్‌వరల్డ్‌లో జరిగే ఆర్థిక లావాదేవీల అంశాల ఆధారంగా తెరకెక్కించాను. ఇంతకుముందు ఈ సినిమాను మరో ఇద్దరు హీరోలకు వినిపించాను. మూడేళ్ల క్రితం అఖిల్‌కు కూడా ఓ కథ చెప్పాను. నేను కథలు రాస్తాను. అమ్ముతాను కూడా. అల్లు శిరీష్‌కి ఓ స్టోరీ అమ్మాను. ప్రస్తుతం హీరోగా ఒకటి, డైరెక్టర్‌గా మరొక అవకాశం వచ్చింది. ఈ సినిమా రిజల్ట్‌ని బట్టి నెక్ట్స్ ప్రాజెక్ట్స్ కమిట్ అవుదామని అనుకుంటున్నాను. కథలు రాయడం మాత్రం ఆపను’’ అన్నారు. -
శంకర్ ఇన్స్పిరేషన్తో...
కొవెర, హిమాన్షి కాట్రగడ్డ జంటగా నటించిన చిత్రం ‘యూ’, కథే హీరో అనేది ట్యాగ్‌లైన్. శ్రీమతి నాగానిక సమర్పణలో కొవెర క్రియేషన్స్ బ్యానర్‌పై విజయలక్ష్మీ కొండా నిర్మించారు. కొవెర హీరోగా, దర్శకునిగా చేసిన ఈ చిత్రం ఈ నెల 28న విడుదల కానుంది. ఈ సందర్భంగా జరిగిన పాత్రికేయుల సమావేశంలో ముత్యాల రాందాస్ మాట్లాడుతూ– ‘‘చిన్న సినిమాలను విడుదల చేయాలంటే మినిమమ్ పది లక్షల రూపాయలు కావాలి. సినిమా కాన్సెప్ట్ బాగా లేకపోతే ఆ డబ్బులు కూడా తిరిగి రావటం లేదు. మంచి కాన్సెప్ట్‌తో వస్తున్న సినిమా ‘యూ’. ట్రైలర్, టైటిల్ బావుంది’’ అన్నారు. చిత్ర హీరో, దర్శకుడు కొవెర మాట్లాడుతూ – ‘‘డైరెక్టర్ శంకర్ గారి ఇన్స్పిరేషన్తో ఇలాంటి డిఫరెంట్ సినిమాను చేశాను. అవినీతి, అక్రమాల వల్ల జరిగే అనర్థాలను సందేశాత్మకంగా తెరకెక్కించాను. వంద కోట్ల సినిమాను కోటి రూపాయలతో తెరకెక్కించాను. ఇలాంటి ఆలోచనతో కూడా సినిమాలు చేయొచ్చా అనేంత గొప్పగా సినిమా ఉంటుంది’’ అన్నారు. బాలాజీ నాగలింగం, స్క్రీన్‌ప్లే రైటర్ మధు తదితరులు పాల్గొన్నారు. -
8కె కెమెరాతో...
రచయిత, దర్శకుడు విజయేంద్రప్రసాద్ వద్ద అసిస్టెంట్‌గా పని చేసిన కొవెర హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహించిన చిత్రం ‘యు’. ‘కథే హీరో’ అన్నది ఉపశీర్షిక. హిమాన్షి కాట్రగడ్డ కథానాయిక. ‘శుభలేఖ’ సుధాకర్ ముఖ్య పాత్రలో నటించారు. నాగానిక సమర్పణలో విజయలక్ష్మీ కొండా, నాగానిక చాగంరెడ్డి నిర్మించిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటోంది. విజయలక్ష్మి కొండా, నాగానికి చాగంరెడ్డి మాట్లాడుతూ– ‘‘యు’ అంటే అండర్ వరల్డ్. ఇప్పటివరకూ అండర్ వరల్డ్ కాన్సెప్ట్‌తో చాలా సినిమాలు వచ్చాయి. కానీ, మా తరహాలో ఎవరూ చేయలేదు. హాలీవుడ్లో కూడా ఈ తరహాలో రాలేదు. ఈ నెలాఖరులో లేదా ఆగస్టు మొదటి వారంలో సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. హీరో, దర్శకుడు కొవెర మాట్లాడుతూ– ‘‘8కె కెమెరాతో మొత్తం షూటింగ్ జరుపుకొన్న తొలి తెలుగు సినిమా మాదే. నాకు తెలిసి ఇండియాలో కూడా ఇదే తొలి సినిమా అవుతుంది. 8కె వల్ల సినిమా క్వాలిటీ ఎక్స్ట్రార్డినరీగా వచ్చింది. ఇది చాలా చిన్న సైజ్ కెమెరా. లైట్స్ ఎక్కువ వాడకుండా ఎలాంటి షాట్స్నైనా చాలా ఈజీగా తీయొచ్చు’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: రాకేశ్ గౌడ్, సంగీతం: సత్య మహవీర్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ఏఆర్ శౌర్య, శివ గణపర్తి, సహ నిర్మాత: మూర్తి నాయుడు పాదం. -
పల్లెటూరు టు వండర్ వరల్డ్
రచయిత, దర్శకుడు విజయేంద్రప్రసాద్ వద్ద అసి స్టెంట్గా పనిచేసిన కొవెర హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహించిన చిత్రం ‘యు’. హిమాన్షి కాట్రగడ్డ కథానాయిక. నాగానిక సమర్పణలో విజయలక్ష్మీ కొండా, నాగానిక చాగంరెడ్డి నిర్మించిన ఈ సినిమా జూలైలో రిలీజ్ కానుంది. హీరో, దర్శకుడు కొవెర మాట్లాడుతూ– ‘‘యు’ టైటిల్‌కి కథే హీరో. విజయేంద్రప్రసాద్‌గారి వద్ద పనిచేసిన అనుభవంతో ఈ కథ రాసుకున్నా. పల్లెటూరిలో మొదలై వండర్ వరల్డ్‌లో ఎండ్ అయ్యే కథ ఇది. ఈ చిత్రం చేయడానికి మా అమ్మ, నా భార్య మద్దతుగా నిలిచారు. టాలీవుడ్లో ఇప్పటివరకూ ఎవరూ టచ్ చేయని ప్రాజెక్ట్ ఇది’’ అన్నారు.‘‘మా అబ్బాయి ప్రతిరోజూ నన్ను ‘ఒక్క చాన్స్ అమ్మ. సినిమా చేయాలి’ అని అడిగేవాడు. మా అబ్బాయి కోసం ఈ సినిమా చేశాం’’ అన్నారు విజయలక్ష్మీ కొండా. ‘‘డిజిటలైజేషన్కి సంబంధించిన కథ ఇది. దాన్ని పాజిటివ్ కోణంలో చూపించా రు’’ అన్నారు నటుడు ‘శుభలేఖ’ సుధాకర్. ‘‘సినిమా పరిశ్రమకు ఎన్నో ఆశలతో వచ్చారు కొవెర. ప్రాణం పెట్టి ఈ సినిమా చేశారు’’ అన్నారు నటుడు తనికెళ్ల భరణి. నాగానిక, హిమాన్షి, కెమెరామేన్ రాకేశ్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సినిమాకు సంగీతం: సత్య మహావీర్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: నాగశివ గణపర్తి, సహ నిర్మాత: మూర్తి నాయుడు పాదం. -
వినగానే నచ్చేసింది – దేవిశ్రీ
ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ వద్ద అసిస్టెంట్‌గా పనిచేసిన కొవెర దర్శకత్వం వహించిన తొలి చిత్రం ‘యు’. ‘కథే హీరో’ అన్నది ఉపశీర్షిక. కొవెర, హిమాన్షి కాంట్రగడ్డ జంటగా విజయలక్ష్మి కొండా నిర్మించిన ఈ చిత్రంలోని తొలి పాటను మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ విడుదల చేశారు. అనంతరం దేవిశ్రీ మాట్లాడుతూ– ‘‘ఈ పాట చాలా ఆహ్లాదంగా ఉంది. వినగానే నచ్చేసింది. ఈ సినిమాలోని అన్ని పాటలు మంచి హిట్ అయి మ్యూజిక్ డైరెక్టర్ సత్య మహావీర్‌కి మంచి పేరు రావాలి. సినిమా కూడా మంచి విజయం సాధించాలి’’ అన్నారు. దర్శకుడు కొవెర మాట్లాడుతూ– ‘‘ సత్య మహావీర్ మంచి సంగీతం అందించి, సినిమాని మరో స్థాయికి తీసుకెళ్లారు. మిగిలిన పాటలని, సినిమా త్వరలో రిలీజ్ చేస్తాం’’ అన్నారు. సంగీత దర్శకుడు సత్య మహావీర్, స్క్రీన్ ప్లే రచయిత మధు పాల్గొన్నారు. ఈ సినిమాకి కెమెరా: రాకేశ్ గౌడ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: శివ నాగశివ గణపర్తి, మూర్తినాయుడు పాదం, సమర్పణ: నాగానిక. ∙కొవెర, దేవిశ్రీ ప్రసాద్ -
యూత్ కోసం వొడాఫోన్ ‘యూ’
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెలికం కంపెనీ వొడాఫోన్ యువతను లక్ష్యంగా చేసుకుని ‘యూ’ పేరుతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సర్కిల్లో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా రూ.89 మొదలుకుని రూ.289 వరకు 14-28 రోజుల వ్యాలిడిటీతో ప్రీ-పెయిడ్ ప్యాక్స్‌ను ఆఫర్ చేస్తోంది. ప్యాక్‌నుబట్టి డేటాతోపాటు నైట్ డేటా ఉచితం. ఎంపిక చేసుకున్న మూడు నంబర్లకు నిముషానికి 20 పైసల చార్జీతో కాల్స్ చేసుకోవచ్చు. డేటా అయిపోతే కంపెనీ నుంచి 60 ఎంబీ రుణం తీసుకోవచ్చు. దీనికిగాను కస్టమర్ ఆ తర్వాత చేసిన రిచార్జ్ మొత్తం నుంచి రూ.20లను తగ్గిస్తారు. మై వొడాఫోన్ యాప్ నుంచి 2 నెలలపాటు ఉచితంగా సంగీతం వినొచ్చని కంపెనీ సర్కిల్ బిజినెస్ హెడ్ రోహిత్ టాండన్ ఈ సందర్భంగా మీడియాకు తెలిపారు.