
హిమాన్షి కాట్రగడ్డ , కొవెర
రచయిత, దర్శకుడు విజయేంద్రప్రసాద్ వద్ద అసిస్టెంట్‌గా పని చేసిన కొవెర హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహించిన చిత్రం ‘యు’. ‘కథే హీరో’ అన్నది ఉపశీర్షిక. హిమాన్షి కాట్రగడ్డ కథానాయిక. ‘శుభలేఖ’ సుధాకర్ ముఖ్య పాత్రలో నటించారు. నాగానిక సమర్పణలో విజయలక్ష్మీ కొండా, నాగానిక చాగంరెడ్డి నిర్మించిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటోంది. విజయలక్ష్మి కొండా, నాగానికి చాగంరెడ్డి మాట్లాడుతూ– ‘‘యు’ అంటే అండర్ వరల్డ్. ఇప్పటివరకూ అండర్ వరల్డ్ కాన్సెప్ట్‌తో చాలా సినిమాలు వచ్చాయి. కానీ, మా తరహాలో ఎవరూ చేయలేదు. హాలీవుడ్‌లో కూడా ఈ తరహాలో రాలేదు.
ఈ నెలాఖరులో లేదా ఆగస్టు మొదటి వారంలో సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. హీరో, దర్శకుడు కొవెర మాట్లాడుతూ– ‘‘8కె కెమెరాతో మొత్తం షూటింగ్ జరుపుకొన్న తొలి తెలుగు సినిమా మాదే. నాకు తెలిసి ఇండియాలో కూడా ఇదే తొలి సినిమా అవుతుంది. 8కె వల్ల సినిమా క్వాలిటీ ఎక్స్‌ట్రార్డినరీగా వచ్చింది. ఇది చాలా చిన్న సైజ్ కెమెరా. లైట్స్ ఎక్కువ వాడకుండా ఎలాంటి షాట్స్‌నైనా చాలా ఈజీగా తీయొచ్చు’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: రాకేశ్ గౌడ్, సంగీతం: సత్య మహవీర్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ఏఆర్ శౌర్య, శివ గణపర్తి, సహ నిర్మాత: మూర్తి నాయుడు పాదం.
Comments
Please login to add a commentAdd a comment