ప్రపంచకప్‌కు భారత జట్టు ప్రకటన.. తెలంగాణ అమ్మాయికి ఛాన్స్
దక్షిణాఫ్రికా వేదికగా జరగున్న తొలి అండర్-19 మహిళల టీ20 ప్రపంచకప్‌కు భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఈ జట్టుకు భారత సీనియర్ జట్టు విధ్వంసకర ఓపెనర్ షఫాలీ వర్మ నాయకత్వం వహించనుంది. కాగా షఫాలీ వర్మ సీనియర్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నప్పటకీ.. ఇంకా 19 ఏళ్లు పూర్తి కాకపోవడంతో అండర్-19 జట్టుకు ఎంపికైంది.
అదే విధంగా భారత వికెట్ కీపర్ రిచా ఘోష్ కూడా ఈ జట్టులో భాగమైంది. ఇక షాఫాలీ డిప్యూటీగా శ్వేతా షెరావత్ వ్యవహరించనుంది. శ్వేతా షెరావత్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉంది. ఇటీవల ముగిసిన అండర్-19 ఛాలెంజర్ ట్రోఫీలో అత్యధిక పరుగుల సాధించిన బ్యాటర్‌గా షెరావత్ నిలిచింది. అదే విధంగా ప్రపంచకప్ జట్టులో తెలంగాణ అమ్మాయి గొంగడి త్రిషకు చోటు దక్కింది. ఇక ఈ మెగా ఈవెంట్ వచ్చే ఏడాది జనవరి 14 నుంచి ప్రారంభం కానుంది.
అండర్-19 ప్రపంచకప్‌కు భారత జట్టు: షఫాలీ వర్మ (కెప్టెన్), శ్వేతా సెహ్రావత్ (వైస్ కెప్టెన్), రిచా ఘోష్ (వికెట్ కీప్), జి త్రిష, సౌమ్య తివారీ, సోనియా మెహదియా, హర్లీ గాలా, హృషితా బసు, సోనమ్ యాదవ్, మన్నత్ కశ్యప్, అర్చన దేవి, పార్షవి చోప్రా, టిటాస్ సాధు , ఫలక్ నాజ్, షబ్నమ్
చదవండి: IND vs BAN: షకీబ్ బౌలింగ్ గురించి చిన్న పిల్లలకు తెలుసు! భారత బ్యాటర్లకు మాత్రం..