ఓడినా పర్వాలేదు.. ఛాంపియన్స్‌లా ఆడారు: ఇషాంత్ శర్మ
అండర్-19 ప్రపంచకప్ టైటిల్‌ను ఆరోసారి ముద్దాడాలన్న టీమిండియా కల నేరవేరలేదు. ఆదివారం బెన్నోని వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్లో యువ భారత జట్టు 79 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. టోర్నీ ఆసాంతం అద్బుతమైన ప్రదర్శన కనబరిచిన టీమిండియా.. కీలకమైన ఫైనల్లో మాత్రం చేతులేత్తాశారు. ముఖ్యంగా భారత బ్యాటర్లు ఒత్తడిలో చిత్తయ్యారు.
వరుసక్రమంలో పెవిలియన్‌కు క్యూ కడుతూ.. ఆసీస్‌కు నాలుగో సారి వరల్డ్‌కప్ టైటిల్‌ను అప్పగించేశారు. 254 పరుగుల లక్ష్య చేధనలో భారత్ 43.5 ఓవర్లలో 174 పరుగులకు కుప్పకూలింది. ఆదర్శ్ సింగ్(47), మురుగణ్ అభిషేక్(42 )టాప్ స్కోరర్లుగా నిలిచారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఆసీస్ నిర్ణీత నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 253 పరుగులు చేసింది.
హర్జాస్ సింగ్(64) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. ప్టెన్ హ్యూ వీబ్జెన్(48), ఓలీవర్ పీక్(42) పరుగులతో రాణించారు. ఈ నేపథ్యంలో యువ భారత జట్టుకు టీమిండియా వెటరన్ పేసర్ ఇషాంత్ శర్మ సపోర్ట్‌గా నిలిచాడు. ఫైనల్లో భారత్ ఓటమిపాలైనప్పటికీ టోర్నీ మొత్తం ఛాంపియన్స్‌లా ఆడిందని ఇషాంత్ కొనియాడాడు.
"మన అండర్-19 జట్టు ఛాంపియన్స్‌లా ఆడింది. ఈ టోర్నమెంట్లో వారు పడిన కష్టాన్ని ఒక్క మ్యాచ్(ఫైనల్)తో పోల్చవద్దు. ఈ రోజు మనది కాదు. ఆటలో గెలుపుటములు సహజం. కానీ టోర్నమెంట్ అంతటా యువ ఆటగాళ్లు అద్బుతమైన ప్రదర్శన కనబరిచారు. వారి ఆటతీరు, పోరాట పటిమని చూసి యావత్తు భారత్ గర్విస్తోంది. మీరు తల దించుకోండి బాయ్స్.. అంతకంటే బలంగా తిరిగి రండి" అంటూ ఇషాంత్ ఎక్స్(ట్విటర్)లో రాసుకొచ్చాడు.