Ugadi Panchangam 2020
-
శార్వరి నామ సంవత్సర (మేష రాశి) రాశిఫలాలు
మేషరాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆర్థికస్థితి బాగున్నప్పటికీ ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు అవసరం అవుతాయి. గృహసంబంధమైన వ్యాపారాలు కొంత నత్తనడకన నడిచినా కొన్ని ప్రాజెక్టులలో లాభాలకు ఇబ్బంది ఉండదు. వెబ్‌సైట్స్ వల్ల లాభపడతారు. సంవత్సర ద్వితీయార్ధంలో మీ అంతరాత్మ సాక్షికి విరుద్ధంగా ఆర్థిక ప్రయోజనాల కోసం కొన్ని కార్యక్రమాలు చేస్తారు. ఆఫీస్‌కు సంబంధించి బ్రాంచీలు ఏర్పాట్లు చేస్తారు. పెట్టుబడికి వెనుదిరగరు. కొత్తవారిని నియమిస్తారు. అన్నివిధాలా బాగానే చూసుకున్నా కొంతమంది వ్యక్తులు నిత్యం సణుగుతూనే ఉంటారు. వారివల్ల ప్రయోజనం ఉండదు. అయినా భరించక తప్పదు. ఏ దేవుడికైనా, దేవతకైనా పూజ చేసేటప్పుడు అభిషేకంలో మహాతీర్థం పొడిని ఉపయోగించండి. మీరు ఎంతో రహస్యంగా ఉంచిన మీ వ్యక్తిగత విషయాలు బయటకు పొక్కుతాయి. ఇది మీకు మనస్తాపం కలిగిస్తుంది. దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న మీ ఫైళ్ళపై ఉన్నతాధికారులు సంతకాలు చేస్తారు. సంతాన విద్యావిషయాలు, వ్యక్తిగత విషయాలు అన్నీ సాధ్యమైనంతవరకు మీరే దగ్గరుండి చూసుకుంటారు. సంవత్సర ద్వితీయార్ధంలో ఫలితాలు చాలా బాగుంటాయి. కాలమే అన్ని ప్రశ్నలకు సమాధానం చెబుతుంది. భగవంతుని సంకల్పం ప్రకారం నడుస్తుందని నమ్మకం కలిగి ఉంటారు. మానసిక దైవారాధన పెరుగుతుంది. మీ ఆలోచనలకు కార్యరూపం ఇస్తున్న ఒక కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటారు. గాలిలో దీపం పెట్టి దేవునిపై భారం వేయరు. కష్టం, అంకితభావం ఈ రెండూ దైవమని నమ్ముతారు. జీవితాశయాన్ని సాధిస్తారు. అఖండ ఖ్యాతి లభిస్తుంది. ఈ సంతోష సంబరాలను మీరు ఆస్వాదించలేరు. నా ఉన్నతిని చూసి గర్వపడే నా ఆత్మీయుడు, సన్నిహితుడు నాకు శాశ్వతంగా దూరమైనప్పుడు ఈ విజయోత్సవాలు, విందులు, వినోదాలు దేనికి? ఎవరు చూసి సంతోషించడానికి? అనే వేదన మనస్సులో చెలరేగుతుంది. ‘నా స్థితిని చూసి కృత్రిమంగా ఆత్మీయతలు చూపే వారు నా హితులా? కాదు అధికారం చుట్టూ తిరిగే ఈ భజనపరులు వీళ్ళు ఎన్నటికీ నా వారు కాదు. నా వాడు పోయాడు, నాకు శాశ్వత దుఃఖాన్ని మిగిల్చాడు. ఇలాంటి ఆలోచనలు తీవ్రమైన మనోవేదనకు కారణం అవుతాయి కొంతమంది విషయంలో. సాధించిన కీర్తిప్రతిష్ఠలు కాపాడుకోవడానికి మరింత శ్రమించవలసి వస్తుంది. ఎక్కడా విశ్రాంతికి తావులేకుండా శ్రమిస్తారు. నమ్మకస్తులైన సహచరవర్గం మీ ఆశయాలు సాధించడానికి మీతో సహకరిస్తారు. మీరు సహకరిస్తున్న ఆప్తులు వెళ్ళిపోతారేమోనన్న దిగులు మనసులో ఉంటుంది. మీరిచ్చే ధనానికి, వారు చేసే శ్రమకు చాలా వ్యత్యాసం ఉంటుంది. వివాహాది శుభకార్యాలు ఘనంగా నిర్వహిస్తారు. కొన్ని విషయాలపై ఎడతెరపి లేని రాజీలేని చర్యలు చోటు చేసుకుంటాయి. మూర్ఖులను మార్చలేమని గ్రహిస్తారు. కండరాలు, కీళ్ళనొప్పులు బాధిస్తాయి. సందర్భోచిత నిర్ణయాలు తీసుకుని అందరి మెప్పు పొందుతారు. మేధావిగా పేరు వస్తుంది. పైకి శాంతంగా కనిపించినా కటువుగా కనిపించకపోయినా మనస్సులో ఉన్న పగ, ప్రతీకారాన్ని ఎంతో కాలం పోషిస్తారు. అంతర్గతమైన అసహనం, పడినటువంటి పాట్లు జరిగిన అవమానాలు మరిచిపోలేరు. విదేశాల నుండి మీరు కోరుకున్న శుభసమాచారం అందుకుంటారు. కార్యానుకూలతకు కృషితో పాటు లౌక్యం కూడా అవసరమని గ్రహిస్తారు. కనీస లౌక్యం లేకుండా ప్రవర్తించి మీరే విచార పడతారు. లౌక్యం అనే విద్యను ఏ విధంగానైనా సాధించాలన్న పట్టుదల మీలో కలుగుతుంది. దైనందిన జీవితం రొటీన్‌గా ఉండకూడదని మార్పులు చేయాలని నిర్ణయించుకుంటారు. పిల్లల విషయంలో ఒక దిగులు ఆలోచన ఉంటుంది. ఇంట్లోను, వ్యాపార ప్రదేశాలలోను అష్టమూలికా గుగ్గిలంతో ధూపం వేయండి, శుభప్రదం. ఉదర సంబంధ వ్యాధులను నిర్లక్ష్యం చేయవద్దు. గొప్పలు చెప్పుకునే కొందరు స్వార్థపరులు స్థిరాస్తుల విషయంలో మిమ్మల్ని మోసం చేయడానికి ప్రయత్నించి భంగపడతారు. పరోపకారం చేసే వారిని మీరు ప్రోత్సహిస్తారు. ఇందువల్ల అనుకోని కొందరు ముఖ్యమైన వ్యక్తులు దగ్గరవుతారు. అడ్డంకిగా మారినటువంటి కొన్ని ఇబ్బందికరమైన విషయాలు చర్చకు వస్తాయి. స్వయంకృతాపరాధాలు మీ నష్టాన్ని పూరించుకోవడానికి కఠినమైన క్రమశిక్షణతో మిమ్ములను మీరే సరిదిద్దుకునే ప్రయత్నాలు చేస్తారు. కొత్త మిత్రులు దూరమవుతారు. పాతమిత్రులు దగ్గరవుతారు. రాజకీయపరమైన విషయాలలో మీ జోక్యం అనివార్యమవుతుంది. ప్రత్యక్షంగాకానీ, పరోక్షంగాకానీ మీ రాజకీయ ప్రవేశం ఉంటుంది. మీరు కొనుగోలు చేసిన స్థిరాస్తి విలువ పెరుగుతుంది. ఉన్నతమైన ఆశయాలు కలిగిన వ్యక్తితో కలిసి పనిచేయాలనుకునే మీ ఆరాటం ఫలిస్తుంది. సమాజంలో ఉన్నతస్థానంలో ఉన్న వారికి మీ సలహాలు, సంప్రదింపులు అవసరం అవుతాయి. మొండితనంతో ఓ అధికారి ఎంతమంది ప్రముఖులు చెప్పినా మీ ప్రయోజనాలకు అడ్డుపడుతున్న ఆ అధికారికి స్థానచలనం సంభవిస్తుంది. దాంతో మీ సమస్య తీరుతుంది. మీరు కోరుకున్న మంచి ఉద్యోగ అవకాశం లభిస్తుంది. సాఫ్ట్వేర్ రంగంలోని వారికి శక్తిసామర్థ్యాలకు తగినటువంటి ఉద్యోగం లభిస్తుంది. విదేశాలలో చదువుకోవాలనే మీ కోరిక ఈ సంవత్సరం నెరవేరుతుంది. అంతేగాక విదేశాలలో ఉద్యోగం చేయడానికి అవకాశం కోసం ఎదురుచూస్తున్న వారికి అటువంటి అవకాశాలు లభిస్తాయి. మీ కార్యక్రమాలన్నీ క్రమశిక్షణాయుతంగా, రహస్యంగా ముందుకు సాగుతాయి. తోడబుట్టిన వాళ్ళకు మీ కుటుంబ సభ్యులకు తెలియకుండా ఆర్థిక సహాయం చేస్తారు. విలువైన భూమిని కొనుగోలు చేస్తారు. కమర్షియల్ ఏరియాలో ఒక అపార్ట్మెంట్ కొనుగోలు చేస్తారు. మీ కొనుగోళ్ళు అన్నీ గోప్యంగా ఉంటాయి. ఉద్యోగంలో బదిలీ వేటు తప్పకపోవచ్చు. అయితే కొన్ని సాంకేతిక కారణాల వల్ల మీ బదిలీ ఆగిపోతుంది. విద్యాపరంగా బాగుంటుంది. పోటీపరీక్షలో విజయం సాధిస్తారు. ఒక ముఖ్యమైన వ్యక్తికి మీరు అంతరంగికులు కావడం వల్ల ఆ వ్యక్తి చేసే తప్పుడు పనులకు మీరే కారణం అని వైరివర్గం భావిస్తారు. అయితే వాస్తవరూపంలో ఇది కొంతవరకు మాత్రమే నిజం. పోలీస్ స్టేషన్స్, కోర్టులు, తగాదాలు, వివాదాలు, మధ్యవర్తి పరిష్కారాలు ఇలాంటి సమస్యలను ఎదుర్కొనవలసి వస్తుంది. ఉద్యోగంలో ప్రమోషన్ లభిస్తుంది. రుద్రజడ ఉపయోగించండి. పునర్వివాహ ప్రయత్నాలు తృటిలో తప్పిపోతాయి. శ్రీ వేంకటేశ్వరస్వామిని పూజించడం చెప్పదగిన సూచన. కుటుంబంలో ఐకమత్యం సాధించడానికి మీరు చేసే ప్రయత్నాలు విఫలం అవుతాయి. కొన్ని అన్యాయాలను మీరు నిరోధించలేకపోతారు. ధనం ఒక్కటే శాశ్వతమని భావించిన వ్యక్తులకు మీ ధర్మసూత్రాలు నచ్చవు. సామాజిక పోకడలు మీపై ప్రత్యక్షంగాకానీ, పరోక్షంగా కానీ ప్రభావం చూపుతాయి. మీరు తీసుకున్న నిర్ణయాలపైన వాటి ప్రభావం ఉంటుంది. సమ్మెలు, బంద్‌లు, ఉద్యమాలు వాటి వల్ల కొన్నిసందర్భాలలో లాభపడతారు. కొన్ని సందర్భాలలో నష్టపోతారు. కార్యాలయంలో మీకు స్వేచ్ఛా, స్వాతంత్య్రాలు లభిస్తాయి. ఉన్నతాధికారులు మీకు స్వేచ్ఛను ఇస్తారు. దాని వలన దీర్ఘకాలికంగా అన్యాయానికి గురి అవుతున్న వారికి మీ వల్ల న్యాయం జరుగుతుంది. అదేవిధంగా మీ ఉత్తర్వులు వివాదస్పదమవుతాయి. కొందరు కోర్టుకు ఎక్కుతారు. ఇందులో మీకు ఎలాంటి స్వార్థ ప్రయోజనాలు లేవు గనుక నిశ్చింతగా ఉంటారు. సివిల్ సర్వీస్‌లకు ఎంపిక అవుతారు. మీ ఆధ్వర్యంలో నడిచే విద్యాసంస్థలు, సేవాసంస్థలు పురోగమనంలో ఉంటాయి. ఆధ్యాత్మిక రంగంలో ఉన్నవారికి మంచి కీర్తిప్రతిష్ఠలు, ధనం లభిస్తాయి. మీ పాండిత్యానికి, కృషికి అన్నివిధాలుగా తగిన గుర్తింపు లభిస్తుంది. సిద్ధ గంధం ధరించండి. -
శార్వరి నామ సంవత్సర ( వృషభ రాశి) రాశిఫలాలు
ఈ రాశివారికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంది. గతంలో మీ జీవితభాగస్వామి పేరుమీద కొనుగోలు చేసిన భూమికి మంచి ధర వస్తుంది. మంచి ధరకు అమ్మి కమర్షియల్ ఏరియాలో విలువైన షాపుగానీ, స్థలంగానీ కొనుగోలు చేయగలుగుతారు. వేరేచోట వ్యవసాయ భూమి కొనుగోలు చేస్తారు. కొన్ని సందర్భాలలో కీలక స్థానంలో ఉన్న అధికారులు చెప్పుడు మాటలు విని మీ నుండి కనీసం వివరణ కూడా కోరకుండా ఏకపక్ష నిర్ణయాలు చేస్తారు. లౌక్యంగా ప్రతిఘటించి, వాస్తవాలు నిరూపించి మీ ప్రయోజనాలు, మీ స్థానాన్ని కాపాడుకోగలుగుతారు. తోలు ఉత్పత్తుల వ్యాపారాలు, ఎగుమతి, దిగుమతి వ్యాపారాలు, తక్కువ వ్యవధిలో సాగే తాత్కాలిక వ్యాపారాలు కలిసి వస్తాయి. నౌకా రవాణా, జల రవాణా లాభిస్తుంది. చార్టర్డ్ అకౌంటెంట్స్ వారికి ఈ సంవత్సరం బాగుంది. కీర్తిప్రతిష్ఠలు లభిస్తాయి. అయితే క్లయింట్స్ నిబద్ధత గురించి ఒకటి రెండుసార్లు ఆలోచన చేయండి. వివాహాది శుభకార్యాలకు సంబంధించి మీరు చేసే ప్రయత్నాలు విసుగు పుట్టిస్తాయి. దైవానుగ్రహం వల్ల మీ ప్రమేయం లేకుండానే ఆకస్మికంగా పెళ్ళి సంబంధం కుదురుతుంది. పదిరూపాయలు ఖర్చయ్యే చోట ఇరవై రూపాయలు ఖర్చుచేసి శుభకార్యాలు వైభవంగా నిర్వహిస్తారు. మీ పలుకుబడి ఉపయోగించి ప్రభుత్వపరంగా మంచి ఆర్డర్లు తీసుకువస్తారు. మంచి లాభాలు పొందగలుగుతారు. సమాజంలో ఉన్నతస్థానంలో ఉన్న వ్యక్తులతో కలిసి పనిచేస్తారు. స్త్రీల వల్ల కొన్ని సమస్యలు పరిష్కారమవుతాయి. స్త్రీల దగ్గర ఒక నమ్మకాన్ని ఏర్పర్చుకోగలుగుతారు. సంవత్సర ద్వితీయార్ధంలో రెండు నెలలు వృత్తి ఉద్యోగాలపరంగా సంతృప్తి ఉండదు. సాంకేతికపరమైన విద్యారంగంలో రాణిస్తారు. సంతానపరమైన విషయాలు సజావుగా ఉన్నప్పటికీ జ్యేష్ఠ కుమార్తె లేక జ్యేష్ఠ కుమారుడి విషయంలో జాగ్రత్తలు తీసుకోవలసిన పరస్థితి ఏర్పడుతుంది. స్త్రీ సంతానం పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తారు. నూతన భాగస్వాములతో కలిసి కొత్త వ్యాపారాన్ని ప్రారంభిస్తారు. వ్యాపారంలో లాభాలు సంతృప్తికరంగానే ఉంటాయి. భాగస్వాములతో వ్యాపారం చేసే కన్నా నాలుగు గేదెలు పెట్టుకుంటే మంచిదని భావిస్తారు. గతంలో ఎదురైన చేదు అనుభవాలే దీనికి కారణమవుతాయి. లక్ష్మీప్రమిదలతో దీపారాధన చేయండి. రుద్రజడను ఉపయోగించండి. ఉద్యోగంలో స్థానచలనం తప్పకపోవచ్చు. అయినప్పటికీ మీ ఉనికిని కాపాడుకోగలుగుతారు. కుటుంబంలో, బంధువులలో ఏకాభిప్రాయం సాధించి ఎంతోకాలంగా ఉన్న సమస్యలను పరిష్కరించగలుగుతారు. సోదరసోదరీ వర్గానికి అండగా ఉంటారు. మధ్యవర్తిత్వం చేయవద్దు. వివాహాది శుభకార్యాల విషయంలో ఇతరులకు సహాయం చేస్తారు. బాధ్యత అంతా మీపై వేసుకుంటారు. మీ ఇంట్లో జరిగే శుభకార్యానికి బంధుమిత్రుల నుండి ఇదే రకమైన సహాయసహకారాలు లభిస్తాయి. ప్రేమ వివాహాలు విఫలం అవుతాయి. తాత్కాలిక వ్యామోహంలో జీవితాన్ని కష్టాలపాలు చేసుకోవద్దు. ప్రేమపెళ్ళిళ్ళకు సంబంధించిన వ్యవహారాలు చికాకు కలిగిస్తాయి. ఇటువంటి వాటిని ప్రోత్సహించరు. పునర్వివాహాలు చేసుకోవాలనుకునే వారి ప్రయత్నాలు ఫలిస్తాయి. మధ్యమధ్యలో జీవితభాగస్వామితో విభేదాలు ఏర్పడతాయి. స్పెక్యులేషన్‌కు దూరంగా ఉండండి. కొన్ని అమ్మకాలకు సంబంధించిన విషయాలలో లాభపడతారు. ఋణాలు తీరుస్తారు. తనఖాలు విడిపిస్తారు. విలువైన వస్తువులను, ఆభరణాలను కొనుగోలు చేస్తారు. అన్నిరకాల దేవుళ్ల అభిషేకాలకు మహాతీర్థం పొడిని ఉపయోగించండి. అనుకూలమైన ఫలితాలు మొత్తం మీకే దక్కవు. వ్యవహారాలకు మాత్రం సంబంధించిన వ్యక్తులకు వాటా పంచవలసి వస్తుంది. మీ ఎదుగుదల కొందరికి కంటకంగా మారుతుంది. అసూయగ్రస్తులైన ఇటువంటి వారితో మీ సన్నిహితులు కూడా చేరడం మీకు ఆశ్చర్యం కలిగించే అంశంగా మారుతుంది. కార్యాలయంలో రాజకీయాలు అధికం అవుతాయి. కుల సంబంధమైన రాజకీయాలు చోటుచేసుకుంటాయి. ఇతరుల సలహాలు నచ్చేవి అమలు చేయండి. అంతేగాని ఇతరులు సలహాలు చెప్పడానికి వీలులేని భయానక వాతావరణం మాత్రం కలిగించవద్దు. పట్టుదలతో పాటు పట్టువిడుపులు కూడా మంచికి దారితీస్తాయని గ్రహించండి. వైరివర్గం గుడ్‌విల్‌ను దెబ్బతీయగలుగుతారు. యోగాభ్యాసాల ద్వారా ఆరోగ్యం ఎంతో మెరుగుపడుతుంది. ప్రభుత్వపరంగా, ప్రైవేట్‌పరంగా రావలసిన బిల్లులు ఆలస్యం అవుతాయి. మీ ప్రాధాన్యత ఎంతమాత్రం తగ్గదు. ప్రత్యామ్నాయం లేని పరిస్థితులలో చాలా మందికి మీరే దిక్కవుతారు. పనిచేసే సామర్థ్యం, నేర్పరితనం మిమ్మల్ని నిలబెడతాయి. అంతేగాని ఎవరో చూపించిన అభిమానం మాత్రం కాదు. అందరినీ కలుపుకుని సమిష్టి ప్రయోజనాల కోసం మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇందు వలన కీర్తి, ధనం లభిస్తుంది. అయినవాళ్ళ విషయంలో జోక్యం చేసుకుంటారు. మీ పరపతి వల్ల వాళ్ళకు ప్రభుత్వపరమైన స్కాలర్షిప్పులు, ప్రభుత్వపరమైన స్కీముల వల్ల లబ్ధి చేకూరుతుంది. ఆర్ట్‌గ్యాలరీలు, బ్యూటీపార్లర్లు, అలంకార సంబంధిత వ్యాపారాలు లాభిస్తాయి. వస్త్ర వ్యాపారాలు చేసే వ్యాపారులకు ప్రతికూల కాలం. ప్రింటింగ్, వ్యాపార ప్రకటనలు, మార్కెటింగ్ మధ్యస్థంగా ఉన్నాయి. విలాసవంతమైన జీవితానికి దూరంగా ఉండాలని భావిస్తారు. అయితే అది ఆచరణలో సాధ్యంకాదు. ఆర్థికపరమైన మినహాయింపులు, ఇన్కమ్ట్యాక్స్లకు సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి. విలువైన పత్రాలు, డాక్యుమెంట్లు చోరికి గురి అయ్యే అవకాశం ఉంది. జాగ్రత్త వహించండి. లీజులు, డైరీలు, లిఖితపూర్వక వ్యవహారాల యందు జాగ్రత్త వహించండి. కొనుగోలులో లాభపడే అవకాశాలు ఉన్నాయి. నిపుణులను సంప్రదించి కొనుగోలు చేస్తారు. సంతానానికి సంబంధించిన విద్యా విషయాలలో ఖర్చు చాలా ఎక్కువగా అవుతుంది. అయినా ఖర్చులకు వెనుకాడరు. దురభ్యాసాలు కలిగి, క్రమశిక్షణ లేని మీ సన్నిహితుల వల్ల ఇబ్బందిపడతారు. కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. కొంతకాలం రక్తసంబంధీకులతో విభేదాలు చోటుచేసుకుంటాయి. కంటికి సంబంధించిన అనారోగ్యాలు రావచ్చు. మనోనిగ్రహంతో, కఠినమైన క్రమశిక్షణతో ఆరోగ్యాన్ని గాడిలో పెడతారు. సంవత్సర ద్వితీయార్ధంలో వెన్నునొప్పి బాధిస్తుంది. వివాదాలకు, తగాదాలకు దూరంగా ఉండాలని మీరు భావించినా కాలం అందుకు సహకరించదు. మీమీద వచ్చిన ఆరోపణలను సమర్థవంతంగా తిప్పికొడతారు. పిల్లల విషయంలో ఒక దిగులు, ఆలోచన ఉంటుంది. విదేశీయాన విషయాలు, విదేశాలలో చదువుకోవడానికి చేసే ప్రయత్నాలు, విదేశీ వ్యాపారాలు, గ్రీన్‌కార్డు మొదలైనవి సానుకూలపడతాయి. తక్కువస్థాయి వ్యక్తులతో కలిసి పనిచేయడానికి ఇష్టపడరు. ప్రయోజనాలు వదులుకుంటారు కానీ మీరు మీ మనస్సాక్షికి కట్టుబడి ఉంటారు. అంగట్లో అమ్మకానికి అన్నీ ఉన్నాయి. కొనడానికి మన వద్దే డబ్బుల లేవన్న వాస్తవాన్ని గ్రహిస్తారు. ఈ అవినీతి ప్రపంచంలో ధనంతో కాని పని లేదని గ్రహిస్తారు. న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా రావలసిన ప్రయోజనాలకు కూడా సమాజంలో ధనం వెచ్చించాల్సిన దుస్థితి దాపురించిందని బాధపడతారు. ధర్మానికి, న్యాయానికి కాని కాలం సంభవించిందని బాధపడతారు. చదివిన ధర్మశాస్త్రాల సారాంశం తెలిసివస్తుంది. పెద్దలు చెప్పిన నీతిసూత్రాలు, ధర్మసూత్రాలు పాటించినందుకు తగిన శాస్తి జరిగిందని మీకు మీరే సరిపెట్టుకుంటారు. విద్యార్థినీవిద్యార్థులు నిత్యం సరస్వతీ తిలకాన్ని నుదుటన ధరించడం, జ్ఞానచూర్ణాన్ని సేవించడం వలన మంచి ఫలితాలు పొందగలుగుతారు. రియల్ ఎస్టేట్ రంగంలోని వారికి మంచి రోజులు వస్తాయి. మీ వాక్చాతుర్యం, శక్తిసామర్థ్యాలు మంచి ఫలితాలనిస్తాయి. ధనం ఎంత వచ్చినా చేతిలో నిలబడకపోవడం అన్న దిగులు తీరుతుంది. నిలువుధనం ఏర్పడుతుంది. స్నేహం అనెడి మూడు అక్షరముల తీయని మాట మన సంస్కతి సాంప్రదాయాలలో ప్రముఖమైన స్థానాన్ని పొంది ఎన్నో మహత్తరమైన కార్యక్రమాలకు, ఆదర్శమైన విషయాలకు సమాజ పరిరక్షణకు ప్రధాన భాగం వహించి వర్ధిల్లుతుంది. స్నేహమే జీవితంగా, ప్రాణంగా భావించి స్నేహానికి నిజమైన అర్థాన్ని తెలియజేసిన మహనీయులు ఎందరో ఉన్నారు. ప్రస్తుత సామాజిక ప్రపంచంలో స్నేహాన్ని కూడా డబ్బులు పెట్టి కొనుక్కోవలసి వస్తుంది. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం ఆవుతాయి. వ్యాపార అభివృద్ధి నిమిత్తం దూరప్రయాణాలు చేస్తారు. -
శార్వరి నామ సంవత్సర (మిథున రాశి) రాశిఫలాలు
ఈ రాశివారికి ఈ సంవత్సరం చాలా బాగుంది. వివాహాది శుభకార్యాల విషయంలో మీ మాటే నెగ్గించుకుంటారు. శుభకార్యాలకు సంబంధించిన విషయాలు ఒక కొలిక్కి వస్తాయి. ప్రతి విషయంలోనూ తోడబుట్టినవాళ్ళు, తల్లిదండ్రులు, మీ హితవు కోరే పెద్దలు కొండంత అండగా నిలుస్తారు. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడానికి సోమరితనాన్ని పక్కనపెట్టి శారీరకంగా, మానసికంగా శ్రమించాలి. ప్రతిష్ఠాత్మకమైన సంస్థలలో పనిచేయడానికి అవకాశాలు లభిస్తాయి. ప్రతిరంగంలోనూ గట్టిపోటీ ఎదుర్కొంటారు. మీ శక్తిసామర్థ్యాలను ప్రదర్శించవలసిన పరిస్థితులు ఏర్పడతాయి. విద్యాసంబంధమైన విషయాలలో రాణిస్తారు. ఐ.ఎ.ఎస్, ఐ.పి.ఎస్. వంటి ఉన్నత పరీక్షలకు ఎంపికవుతారు. ఇతరత్రా పోటీపరీక్షలలో విజయం సాధిస్తారు. ఇంట్లో ప్రోత్సాహం బాగానే ఉన్నా చిల్లరమల్లర తగాదాలు చికాకు కలిగిస్తాయి. కంబైండ్ స్టడీస్ వల్ల నష్టపోతామని గ్రహించి జాగ్రత్తపడతారు. మీ బంధువుల ఆస్తులకు సంబంధించి, పూర్వీకుల ఆస్తి పంపకాలకు సంబంధించి వ్రాసిన డాక్యుమెంట్లు అస్పష్టంగా ఉంటాయి. అవి విభేదాలకు దారితీస్తాయి. మీరు మధ్యవర్తిత్వం చేసి వ్యవహారాన్ని ఒక కొలిక్కి తీసుకువస్తారు. అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని సూచిస్తారు. ఇందువల్ల పరోక్షంగా మీరు లాభపడతారు. రాని బాకీలు వివాదస్పదం అవుతాయి. మధ్యవర్తి పరిష్కారం వల్ల లాభం, నష్టం లేకుండా బయటపడతారు. ఒకచోట నష్టపోయినా దైవానుగ్రహం వల్ల మరోచోట లాభపడతారు. సభలు, సమావేశాలు, బహిరంగ సభలు సర్వసాధారణం అవుతాయి. ఆదాయనికి మించిన ఖర్చులను అదుపు చేయడంలో విజయం సాధిస్తారు. సంవత్సర ద్వితీయార్ధంలో విదేశాలలో విద్యను అభ్యసించడానికి, ఉద్యోగం కొరకు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యా ఋణం కూడా మంజూరు అవుతుంది. ప్రభుత్వపరంగా రావలసిన రాయితీలు, సబ్సిడీలు, అధికార ధ్రువీకరణ పత్రాలు, మీకు సానుకూలపడతాయి. నూనె, లోహపు వ్యాపారులకు, వస్త్ర వ్యాపారులకు, రత్న వ్యాపారులకు, రవాణా వ్యాపారులకు కాలం మద్యస్థంగా ఉంది. కార్యాలయంలో మిమ్మల్ని ఏదో ఒక వర్గానికి చెందిన వ్యక్తిగా ముద్రవేస్తారు. కానీ మీరు అందరి మనిషిగా ఆమోదించబడతారు. కష్ట సమయంలో ఒక స్త్రీ సహకారం లభిస్తుంది. అలంకార సంబంధమైన వ్యాపారాలు లాభిస్తాయి. నిల్వ ఉంచిన అపరాలు, ఆహారధాన్యాల వల్ల లాభపడతారు. సివిల్ కేసుల్లో తీర్పులు మీకు అనుకూలంగా వస్తాయి. ప్రేమ వివాహం గురించి మీ అభిప్రాయాలు విమర్శలకు దారితీస్తాయి. విదేశాల నుండి వచ్చే ఆర్థిక సహాయం వల్ల మీ ఆధ్వర్యంలో నడుస్తున్న వివిధ రకాల సంస్థలు పురోగమనంలో ఉంటాయి. సినీరగంలోని వారికి, టీవీ రంగంలోని వారికి అనుకూలమైన కాలం. వివాహాది శుభకార్యాలు ఘనంగా చేస్తారు. ఎంతోకాలంగా బరువుగా మారిన బాధ్యతలను దించుకోగలుగుతారు. పిల్లల విషయంలో ఒక దిగులు ఆలోచన ఉంటుంది. ఇతరుల మీద మీరు చేసిన ఆరోపణలకు సంబంధించిన విషయం తాలూకు సాక్ష్యాధారాలు మీ చేతికి లభిస్తాయి. రుద్రజడను ఉపయోగించండి. కోర్టుపరంగా వాయిదాపడుతూ వస్తున్న విషయాలు ఒక పరిష్కార దశకు వస్తాయి. చదువు, క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలకు సంబంధించి దూరప్రయాణాలు ఫలిస్తాయి. పిల్లల ఎదుగుదలకు గట్టి పునాది వేయడానికి, బాగా చదివించడానికి నిర్ణయించుకుంటారు. అందుకు తగిన ధనం కోసం మీ సిద్ధాంతాలను మార్చుకుంటారు. భార్యవైపు బంధువులకు సహాయం చేస్తారు. కొన్ని బాధ్యతల నుండి కొందరికి ఉద్వాసన చెబుతారు. నిర్మొహమాటంగా ప్రవర్తిస్తారు. మీ పరిశీలనలో కొన్ని ముఖ్యమైన రహస్యాలు తెలుసుకుంటారు. అవి వృత్తి ఉద్యోగాలపరంగా ఎంతగానో ఉపయోగపడతాయి. దైవికం అనే పొడితో ధూపం వేయండి. ప్రశాంతంగా ఉన్న వాతావరణాన్ని చెడగొట్టే వ్యక్తులు ప్రధాన సమస్య అవుతారు. సోదరసోదరీ వర్గానికి సహాయం చేస్తారు. వృత్తి,ఉద్యోగ, వ్యాపారాలపరంగా మిమ్మల్ని దెబ్బతీయాలని చూసే శత్రువర్గాల ప్రయత్నాలు విఫలం అవుతాయి. ప్రతి విషయంలో ఉన్నతాధికారులు, రాజకీయ నాయకుల అండదండలు మీకు లభిస్తాయి. ఆత్మీయవర్గంతో కొద్దికాలం విభేదాలు చోటుచేసుకుంటాయి. పెద్దల, వృద్ధుల విషయాలలో మరింత శ్రద్ధ వహించాలని నిర్ణయం తీసుకుంటారు. చెప్పుకోదగిన కారణాలు లేకపోయినా ఒకానొక సందర్భంలో వైరాగ్యం ఆవహిస్తుంది. వైరాగ్యంలో, నైరాశ్యంలో ఒక విధమైన అనుభూతిని పొందుతారు. మీ మనస్సుకు తగిలిన గాయాన్ని ఇతరులతో పంచుకోవడానికి ఇష్టపడరు. మీ ఉద్ధేశ్యంలో అవినీతితో సమాజం మైలపడినప్పటికీ నిజాయితీగా ఉన్న మీలాంటి వాళ్ళకు ప్రశంసలు, చికాకులు వస్తాయి. యథార్థమైన ఈ సత్యాన్ని గ్రహించడానికి ఎంతగానో బాధపడతారు. వాస్తవాలు మింగుడుపడవు. ఈ సమస్యను ధర్మదేవతకే వదిలేస్తున్నానని నిర్ణయిస్తారు. వివాదస్పదమైన ఆస్తి కలిసొస్తుంది. వివాహాది, శుభకార్యాల విషయంలో మీకు కొన్ని అభ్యంతరాలు ఉన్నప్పటికీ సర్దుకుపోతారు. మౌనం వహిస్తారు. దైవసంకల్పం ఎలా ఉంటే అలా జరుగుతుంది అనే వాస్తవాన్ని గ్రహిస్తారు. ఆధ్యాత్మిక రంగంలో తీయని మాటలు చెప్పి మోసం చేసేవారు ఎదురవుతారు, జాగ్రత్త వహించండి. సంతానాన్ని విదేశాలలో చదువు కోసం పంపించే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆకర్షణీయమైన స్కీముల వల్ల స్కీముల్లో చేరడం వల్ల, చీటీలు కట్టడం వల్ల నష్టపోతారు. అధికారులతో మంతనాలు, రాజకీయ పైరవీలు లాభిస్తాయి. సంతానానికి సంబంధించి వివాహ ప్రయత్నాలు ఆకస్మికంగా లాభిస్తాయి. మంచి సంబంధం కుదురుతుంది. ఉద్యోగంలో ప్రమోషన్ లభిస్తుంది. కొన్నాళ్ళు ఉద్యోగంలో అసంతృప్తి వాతావరణం నెలకొంటుంది. నిర్మొహమాటంగా మాట్లాడే మీ ధోరణి వల్ల ఇబ్బందులు వస్తాయి కొంతమంది దంపతుల దాంపత్య జీవితంలో విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. కష్టపడి సాధించుకున్న పదవి మానసిక అశాంతికి కారణమవుతుంది. సర్వీస్‌లో వివాదస్పద వ్యక్తిగా మిగలకుండా ఉండటానికి కొన్ని ప్రయోజనాలు వదులుకుంటారు. రియల్ ఎస్టేట్, ఆహారధాన్యాల వ్యాపారం, చేతివృత్తి పనివారికి, హోల్‌సేల్ వ్యాపారం చేసేవారికి, నిర్మాణరంగ పనులు చేసేవారికి కాలం అనుకూలంగా ఉంది. మీ పేరుమీద కొనుగోలు చేసిన స్థిరాస్తుల విలువ పెరుగుతుంది. అవివాహితులకు వివాహకాలం. సంతాన సాఫల్యకేంద్రాల వల్ల, దొంగస్వామీజీల వల్ల మోసపోతారు. మీరు స్వయంశక్తితో పోటీపరీక్షలలో విజయం సాధించి మంచి ఉద్యోగం పొందుతారు. సంతానలేమితో బాధపడుతున్న వారికి సంతానప్రాప్తి కలుగుతుంది. మీరు చేయాలనుకునే కార్యక్రమాలు వెంటనే చేయడం మంచిది. రహస్య చర్చలు, సంభాషణలతో కాలయాపన చేయడం మంచిదికాదు. ఇందువలన మానసిక ఆందోళన ఎక్కువై, మానసిక ప్రశాంతత తగ్గుతుంది. రాజకీయ పలుకుబడి వల్ల మీకు టెండర్లు వస్తాయి. మీరు అందలం ఎక్కించిన రాజకీయ నాయకులు, మీ ద్వారా ఉద్యోగం పొందిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్ల మీకు ఇబ్బందులు కలుగుతాయి. జాగ్రత్త వహించండి. ఎన్నో అవకాశాలు మీకు కలిసివస్తాయి. ఏది మంచిదో ఎంచుకుంటే ఎక్కువ లాభపడతారు. జాగ్రత్తగా పరిశీలించి నిర్ణయం తీసుకోండి. ఓర్పు, నేర్పు సహనంతో అందరితో కలిసి పనిచేసే ధోరణి అవలంబిస్తారు. ప్రజాసంబంధాలు పెంచుకుంటారు. విలువైన పత్రాలు, డాక్యుమెంట్స్ మొదలైన వాటి భద్రత విషయంలో జాగ్రత్త వహించండి. తల్లిదండ్రులను మెప్పించలేక ఇటు ఇంట్లో పోరు, బయటపోరు తట్టుకోలేక ఎవరినీ సంతృప్తిపరచలేరు. తల్లిదండ్రుల ప్రేమ సృష్టిలో ప్రతిజీవి ఆస్వాదిస్తుంది. మనోహరమైన తల్లిదండ్రుల ప్రేమ ముందు ప్రపంచం చాలా చిన్నదిగా అనిపిస్తుంది. అన్ని బంధాలకు అతీతమైనది మాతృప్రేమ. అటువంటి పవిత్రమైన సృష్టి సహజమైన ప్రేమను కొనుక్కోవలసి రావటం దురదృష్టానికి పరాకాష్ట. తల్లి విషం పెడితే ఆ విషయం నలుగురికీ చెప్పి రచ్చ చేయడం కన్నా ఆ విషం త్రాగటమే మంచిది. బాధాతప్త హదయంతో ఇలాంటివి ఎన్నో భరిస్తారు. అంటే ఇలాంటి స్థాయికి దిగజారిన సంఘటనలు ఎదురవుతాయి. మీ పేరును, మీ సంస్థ పేరును ఉపయోగించుకొని లాభపడే అవకాశవాదుల నిజస్వరూపం తెలుస్తుంది. ముఖ్యమైన విషయాలలో జీవితభాగస్వామితో విభేదాలు రావచ్చు. సంతానాన్ని గారాబం చేయటం వలన ఏర్పడిన పరిస్థితులు మీకు మ్రింగుడుపడవు. పిల్లల విషయంలో ఒక ఆలోచన, దిగులు ఉంటుంది. కుటుంబంలో బంధువులలో అంతర్గత రాజకీయాలు చిరాకు కలిగిస్తాయి. మార్పురాని వ్యక్తులలో మార్పుతేవడానికి ఇక ప్రయత్నం చేయవద్దు. మీ వృత్తికి సంబంధించిన విషయాలు, ప్రయాణానికి సంబంధించిన వివరాలు, మీ రోజువారి వివరాలు గోప్యంగా ఉంచాలి లేనిపక్షంలో నష్టపోయే ప్రమాదం ఉంది. ఆగిపోయిన నిర్మాణకార్యక్రమాలు, కాంట్రాక్టు వ్యవహారాలు పూర్తిచేస్తారు. మీ పనితీరును మెచ్చుకుంటారు. ముఖ్యమైన పత్రాలు లేక ప్రశంసాపత్రాలు వస్తాయి. ఇతరుల సహాయ సహకారాలతో శుభకార్యాలు పూర్తిచేస్తారు. ప్రతిచోట పోటీ, అనారోగ్యకర వాతావరణం, సహాయ నిరాకరణ మొదలైన ఈతిబాధలు అధిగమించి పనులను విజయవంతంగా చేసుకోగలుగుతారు. యజ్ఞభస్మాన్ని నుదుటన ధరించండి. కళా, సాహిత్య, సంగీతరంగాలలో సంతానాన్ని ప్రోత్సహిస్తారు. మీ ప్రోత్సాహానికి మంచి ఫలితాలు సంతానం సాధిస్తారు. -
శార్వరి నామ సంవత్సర (కర్కాటక రాశి ) రాశిఫలాలు
ఈ రాశివారికి ఈ సంవత్సరం అనుకూల ఫలితాలు సూచిస్తున్నాయి. సాంకేతిక, వ్యాపార రంగాలలో శ్రమకు తగిన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. వ్యవసాయదారులకు శ్రమకు తగిన ఫలితం ప్రత్యక్షంగానో, పరోక్షంగానో లభిస్తుంది. కొందరికి ఇతరుల మీద ఉన్న ద్వేషం మీ మీద అభిమానంగా మారి సహాయపడతారు. ప్రత్యర్థివర్గాన్ని కారణం చూపి ఇబ్బందిపాలు చేయగలుగుతారు. మీరు కలలు కన్న గమ్యాన్ని చేరుకుంటారు. సాహిత్య, కళా, విద్య, పరిశోధన రంగాలలో చేసిన కృషికి తగిన గుర్తింపు, గౌరవం, కీర్తిప్రతిష్ఠలు లభిస్తాయి. ఆపదలు తప్పుకుంటే మిగిలేది అదృష్టమేనని గ్రహించండి. స్థిరాస్తుల వ్యవహారాలలో పెద్దలు మీకు అనుకూలంగా వ్యవహరిస్తారు. సర్పదోషనివారణా చూర్ణములో సర్వరక్షాచూర్ణము కలిపి స్నానం చేయడం వలన సర్పదోషాలు మరియు గ్రహాల వలన కలుగు బాధలు తొలగిపోతాయి. వ్యాపారంలో రొటేషన్, లాభాలు బాగుంటాయి. కాంట్రాక్టులు, సబ్‌కాంట్రాక్టులు, లైసెన్సులు, లీజులు పొడిగించే వంటి విషయాలు మీకు లాభిస్తాయి. ప్రతి చిన్నవిషయానికి పలుకుబడి ఉపయోగించవలసి వస్తుంది. రాజకీయ నాయకుల జోక్యం కూడా అనివార్యం అవుతుంది. జీవితభాగస్వామితో సఖ్యత చాలా విషయాలను ప్రభావితం చేస్తుంది. ఇది కీలక అంశం అని గుర్తించండి. విదేశాలలో ఉన్న మీ బంధువులు అక్కడ చేసిన అప్పులు తీర్చలేక ఇబ్బందిపడతారు. మీ శక్తిసామర్థ్యాలతో ఈ సమస్యకు పరిష్కారం కనుగొంటారు. అనేక సమస్యలు వస్తుంటాయి. ఎప్పటికప్పుడు పరిష్కార మార్గాలు దొరుకుతుంటాయి. ఈ గ్రహ శకలం భూమిని తాకవు. తాకుతాయేమోనని మేధావులు, శాస్త్రవేత్తలు ఆందోళన అన్నింటికీ అతీతంగా భగవంతుడు తీసుకున్న నిర్ణయం వల్ల శకలాలు భూమిని తాకవు. అదేవిధంగా సమస్యలు మీ వరకు వస్తాయి. కానీ మిమ్మల్ని పడగొట్టవు. మీ వ్యక్తిగత, వృత్తి, ఉద్యోగాలపరంగా రహస్య సమాచారం ఇతరులకు చేరుతుంది. ఇది మీ నిర్లక్ష్యం వల్లనే జరుగుతుంది. మీ వైరివర్గానికి కొమ్ముకాస్తున్న వారు బలహీనులవడం మీకు ఆయాచితవరంగా మారుతుంది. ఆర్థికస్థిరత్వం సాధించి సంతృప్తి పొందుతారు. ఖర్చులు వృథాకావు. పెట్టుబడిగా భావించండి. టీ, కాఫీ, హోటల్ వ్యాపారులకు, చిల్లర సరుకులు అమ్మేవారికి, కమీషన్ ఏజంట్లకు, ట్రావెలు ఏజెన్సీలకు, బ్యూటీపార్లర్లకు, చెప్పుల షాపువారికి, ఫ్యాన్సీ షాపుల వారికి, గాజుల ఉత్పత్తిదారులకు, గిల్టు నగలు అమ్మేవారికి, ముద్రణ, ప్రచురణరంగాల వారికి, మిల్లులు, పిండిమరలు నడిపేవారికి, ఎలక్టాన్రిక్ వస్తువులు అమ్మేవారికి, ఫర్నీచర్ వ్యాపారులకు, బేకరీ నడిపే వారికి, గృహనిర్మాణ సామాగ్రి అమ్మేవారికి, సుగంధద్రవ్య వ్యాపారులకు, ఫంక్షన్‌హాల్స్ నిర్వాహకులకు కాలం అనుకూలంగా ఉంది. నూటికి తొంబైశాతం లాభాల బాటలో నడుస్తాయి. అఘోరపాశుపత హోమం చేయడం వలన శనైశ్చరుని అనుగ్రహం లభిస్తుంది. వివాహాది, శుభకార్యాలు ఘనంగా నిర్వహిస్తారు. అనారోగ్య కారణాల వల్లన ఒక ముఖ్యమైన ఇంటర్వ్యూలో మీ ప్రతిభాపాటవాలు ప్రదర్శించలేరు. జ్వరంతో ఉండి పోటీపరీక్షలు వ్రాస్తారు. కీలకమైన ఘట్టాల్లో ఈ విధమైన అనారోగ్యం ఇబ్బందిపెడుతుంది. అయినా ఫలితాలు మీకు అనుకూలంగానే ఉంటాయి. సాహిత్య, సాంస్కతిక సభలు, కళా సంబంధమైన పోటీలు మొదలైనవి ఘనంగా నిర్వహిస్తారు. ఎక్కడైతే సామర్థ్యం, నిపుణత ఉంటాయో వాటిని ప్రోత్సహించాలని నిర్ణయించుకుంటారు. మీకు ఎదురైన అనుభవాలు ఇతరులకు ఎదురు కారాదని భావిస్తారు. పిల్లల విషయంలో ఒక దిగులు, ఆలోచన ఉంటుంది. సంతానంపై వచ్చిన దుష్ప్రచారం నిజం కాదని తెలుస్తుంది. సరిదిద్దవలసిన వివాదాలు మితిమీరుతాయి. పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మేలు జరుగుతుంది. విడిపోవాలని నిర్ణయించుకున్న భార్యాభర్తలను కలపడానికి మీరు చేసే ప్రయత్నాలు ఫలించవు. కొంతమందికి పిల్లనిచ్చిన చోట అల్లుడితో సమస్యలు కొడుకుకి పెళ్ళి చేసి పిల్లను ఇంటికి తెచ్చుకుంటే కోడలితో సమస్యలు గోడపెట్టుగా, చెంపపెట్టుగా తయారవుతాయి. ఈ సమస్య నుండి బయటపడడానికి పరిపరివిధాలా శ్రమించవలసి వస్తుంది. చాలా విషయాలలో మౌనంగా ఉండవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. నిజాలు మాట్లాడే స్వేచ్ఛ కూడా ఉండదు. ఏ దేవుడికైనా, దేవతకైనా పూజచేసేటప్పుడు మహాతీర్థం పొడిని ఉపయోగించండి. కొన్ని సందర్భాలలో అత్యంత సన్నిహితమైనవి వివాహ జీవితాలు, అత్యంత బలహీనమైనవి వివాహ బంధాలు అని సరిపెట్టుకుంటారు. రెండవ వివాహ ప్రయత్నాలు చేసుకునే వారికి ఈ సంవత్సరం బాగుంది. మంచి సంబంధం కుదురుతుంది. మీ దగ్గర లంచాలు తీసుకున్న వాళ్ళు అవినీతి గురించి మాట్లాడడం మీకు చెప్పరాని ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అవినీతి గురించి మాట్లాడడానికి అవినీతిపరులకే ఎక్కువ హక్కు ఉందని మీరు భావిస్తారు. అనుకోకుండా పిల్లల విషయంలో ఖర్చులు వచ్చిపడతాయి. మీ బాధ్యతలు విస్మరించకుండా పిల్లల విషయంలో తగిన విధంగా ప్రవర్తిస్తారు, ఖర్చుచేస్తారు. నైతిక ధర్మానికి ప్రాతిపదికగా నిలుస్తారు. కీళ్ళనొప్పులు, ఇ.ఎన్.టి సమస్యలు ఇబ్బంది పెడతాయి. ప్రకృతివైద్యాల పట్ల, వనమూలికల పట్ల ఎక్కువ ఆకర్షితులవుతారు. అందుకు సంబంధించిన గ్రంథాలను ఆసక్తిగా పరిశీలిస్తారు. భాగస్వామ్య వ్యాపారంలో లాభాల పంపకాల విషయంలో మీకు అన్యాయం జరిగే అవకాశం ఉంది. ఉన్నతస్థానాలలో ఉన్నవారు, పెద్దలు గౌరవనీయులు సమసమాజ నిర్మాణానికే కంకణం కట్టుకున్నామని చెబుతున్న పెద్దలు మీ పట్ల అన్యాయమైన తీర్పునిస్తారు. ఎవరో చేసిన పనికి మీరు బాధపడాల్సి వస్తుంది. మనఃక్లేశానికి గురౌతారు. న్యాయం, ధర్మం గాడి తప్పి సామాజిక స్పృహ కోల్పోయి మీకు జరిగిన అన్యాయాన్ని ఎవరూ ఖండించరు. ప్రేక్షకపాత్ర వహిస్తారు. కాలం అనంతమైనది. చాలా గొప్పది. ఈశ్వరేచ్ఛననుసరించి కాలమే అన్యాయానికి సమాధానం చెబుతుంది. మీ ద్వారా పనులు చేయించుకుని, మీ శ్రమను శక్తిసామర్థ్యాలను ఉపయోగించుకుని కొంతమంది వ్యక్తులు ఇవ్వవలసిన ప్రతిఫలం కన్నా తక్కువ ఇచ్చి ఎంతో చేశామని చెప్పుకోవడానికి ప్రయత్నిస్తారు. ఆ ధనాన్ని మీరు తిరస్కరిస్తారు. మీరు అనుకున్నది సాధించడానికి ఏటికి ఎదురీదుతారు. కొంతవరకు అనుకూల ఫలితాలు సాధిస్తారు. అతీంద్రియ శక్తులు ఉన్నాయని, మహిమ కలిగిన మనుషులు మనకు బాగా సన్నిహితులని కొద్దిపాటి పెట్టుబడితో నిధులు, నిక్షేపాలు తవ్వమని, బాగుపడదామని మోసకారి మాటలు చెప్పేవారిని మీరు దగ్గరకు చేర్చుకొని నష్టపోతారు. దేవాలయాల సొమ్ము తిన్నవారెవరూ బాగుపడరని ఆచరణలో మీ కళ్ళముందు ఋజువవుతుంది. ఎందుకంటే ఆలయాల పరిరక్షణ గురించి, ఆస్తుల గురించి, రాబడి గురించి, ధూపదీప నైవేద్యాల గురించి అన్నింటినీ సక్రమంగా ఒకమార్గంలో పెట్టడానికి మీరు చేసే ప్రయత్నాలకు ఒక బలమైన వర్గం అడ్డుపడుతుంది. అందినంత దోచుకుంటారు. చివరికి బొక్కబోర్లాపడతారు. మీ కృషి వ్యర్థం కాలేదు అని తెలియజేయడానికే ఈ ప్రస్తావన. టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నవారికి నూతన అవకాశాలు కలిసి వస్తాయి. ట్యూషన్లు చెప్పేవారికి డిమాండ్ పెరుగుతుంది. నిరుద్యోగులైన విద్యావంతులకు అర్హతలకు తగిన ప్రభుత్వ ఉద్యోగం లభిస్తుంది. ధనం సంపాదించడం కోసం అహర్నిశలూ కష్టపడతారు. చేతికి వచ్చిన ధనం సద్వినియోగం అవుతుంది. మెల్లమెల్లగా బాధ్యతలు, రుణాలు తీర్చుకుంటారు. కఠినమైన కాలాన్ని అధిరోహించడంలో ఒక వింత అనుభూతి పొందుతారు. ఆస్తుల కోసం, ధనం కోసం తల్లిదండ్రులతో కూడా వివాదం కల్పించే ప్రయత్నాలు కొందరు చేస్తారు. మీకు లేని ఉద్దేశ్యాలను మీపై ఆపాదించి రక్తసంబంధీకులకు దూరం చేయాలని బంధువులలో ఒక కూటమి విశేష ప్రయత్నాలు చేస్తుంది. అయితే వీటన్నింటిని మీరు సమర్థవంతంగా ఎదుర్కొనగలుగుతారు. మీ వ్యక్తిత్వాన్ని నిరూపించుకుంటారు. కార్యాలయంలో సమర్థవంతంగా పనిచేస్తున్న మీరు మంచి కోసం కొన్ని సంస్కరణలు, మార్పులు చేస్తారు. సోమరిపోతులకు మీ ఉత్తర్వులు నచ్చవు. చట్టంలో ఉండే లొసుగులను ఉపయోగించుకొని మిమ్ములను ఇబ్బంది పెట్టే ఆలోచన చేస్తారు. చివరికి మీ నిజాయతీయే గెలుస్తుంది. సమాజాన్ని ఆవరించడం మీకు భరించలేని విషయంగా మారుతుంది. కృషికి, సామర్థ్యానికి కానికాలం దాపురించిందని సమర్థించుకుంటారు. మనస్సులో భావాలు ఏ విధంగా ఉన్నా నలుగురు నడిచిన దారిలోనే నడవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. -
శార్వరి నామ సంవత్సర (సింహ రాశి) రాశిఫలాలు
ఈ రాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగుంది. విదేశీయాన ఖర్చులకు ఎక్కువ మొత్తంలో ధనం ఖర్చు చేస్తారు. మీరు చేస్తున్నది మంచికో, చెడుకో అర్థం కాని పరిస్థితి ఏర్పడుతుంది. సంతానం, కుటుంబసభ్యుల కోరిక కాదనలేక ఎప్పటిక్పుడు సర్దుబాటు కావడం విశేషం. సామాజికంగా, రాజకీయంగా వచ్చే మార్పులు మీ మీద ప్రత్యక్షంగా మంచి ప్రభావాన్ని చూపిస్తాయి. గతంలో తీసుకున్న కఠిన నిర్ణయాలు, పడిన కష్టాలు ఇప్పుడు లాభిస్తాయి. మాటపట్టింపు, మొండి వైఖరి వల్ల కొన్నింటికి దూరంగా ఉంటారు. పరిస్థితుల ప్రభావం వల్ల జీవనమార్గం సక్రమంగానే దొర్లుతుంది. అనువంశికంగా రావలసిన ఆస్తులు ఎట్టకేలకు సానుకూలపడతాయి. రూపాయి ఖర్చు అయ్యేచోట వంద రూపాయలు ఖర్చు అవుతాయి. సంతానం భవిష్యత్తు కోసం ధనాన్ని ఖర్చు చేస్తారు. వాళ్ళ పేరుమీద స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. ఐశ్వర్యనాగిని ఉపయోగించడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. క్రీడలు, రాజకీయాలపై మీ అంచనాలు నిజమవుతాయి. అయితే జూదాలకు, పందాలకు దూరంగా ఉండడం మంచిది. సామాజిక పరిస్థితుల మీద విరక్తి పుడుతుంది. ఈ సమాజంలో మనుగడ సాగించగలమా? అన్న మానసిక వేదన కలుగుతుంది. ప్రతినిత్యం నాగసింధూరం నుదుటన ధరించడం వలన నరదృష్టి తొలగిపోయి, జనాకర్షణ ఏర్పడుతుంది. విద్య వైజ్ఞానికరంగాలలో అనుకున్నది సాధిస్తారు. పి.హెచ్.డి. వంటివి పూర్తిచేస్తారు. సివిల్ సర్వీస్‌లు, ఇతర పోటీపరీక్షలలో విజయం సాధిస్తారు. టెండర్ల విషయంలో అయోమయం ఏర్పడుతుంది. మీ వ్యక్తిగత, ఆఫీస్ రహస్యాలను మీ శత్రువర్గానికి చేరవేస్తున్న నమ్మకద్రోహులను గమనించి తగిన చర్యలు తీసుకుంటారు. వృత్తి రహస్యాలు, వ్యక్తిగత బలహీనతలు ఎక్కడా బయటపెట్టరాదన్న సూత్రాన్ని తెలుసుకుంటారు. టైలర్లకు, కోళ్ళపారాలు నడిపేవారికి బాగాలేదు. అన్నిరకాల వాయిద్యకారులకు మంచి రోజులు. పేరు, ధనం రెండూ సంపాదిస్తారు. కవులకు, రచయితలకు కీర్తిప్రతిష్ఠలు వస్తాయి. సన్మానాలు జరుగుతాయి. ఉద్యోగంలో ప్రమోషన్ లభిస్తుంది. కార్యాలయ సంబంధమైన సమస్యను అధిగమించడానికి ఈ ప్రమోషన్ ఉపయోగపడుతుంది. వివాహాది శుభకార్యాల విషయంలో గట్టి నిర్ణయాలు తీసుకుంటారు. బాధ్యతలు ఎలాగైనా నెరవేర్చాలని నిశ్చయించుకుంటారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో అనుకున్నంత అభివృద్ధి ఉండకపోవచ్చు. కొత్త పరిచయాలు, స్నేహితుల వల్ల ఉపయోగం కలుగుతుంది. కీళ్ళనొప్పులు, కాళ్ళనొప్పులు రావచ్చు. సంవత్సర ద్వితీయార్ధంలో సంతాన విషయమై శ్రద్ధ వహించవలసి వస్తుంది. అన్నిరకాల దేవుళ్ళ అభిషేకాలకు మహాతీర్థం పొడిని ఉపయోగించండి. యూనియన్స్ పోరాటంలో ఉత్సాహంగా పాల్గొంటారు. న్యాయం కోసం చేసే పోరాటంలో ముందుంటారు. న్యాయస్థానాల వరకు పోరాటం పోవచ్చు. రాజకీయ జీవితం బాగుంటుంది. సినిమాలు, డిస్ట్రిబ్యూటర్లకు గత సంవత్సరం కన్నా అనుకూల కాలం. మీరు అనుకున్న పనులు సమయానికి కాస్త అటుఇటుగా పూర్తవుతాయి. భగవంతుడు అన్నీ ఇచ్చినా మిగతావి మనం చేసుకోవలసిన ముఖ్య కార్యాలు ఉన్నాయన్న భావంతో కాంట్రాక్టులు, లీజులు, లైసెన్స్‌లు, రెన్యువల్స్ అనుకూలిస్తాయి. ఆదాయం పెంచుకునే మార్గాలు అన్వేషిస్తారు. విజయం సాధిస్తారు. సోదరసోదరీ వర్గానికి రహస్యంగా సహాయం చేస్తారు. ఈ విషయమై ఇంట్లో గొడవలు వచ్చి కొంతకాలం మనశ్శాంతి కోల్పోతారు. ఉన్నతవిద్యను అభ్యసించే అవకాశం, ఇతర భాషలను నేర్చుకునే ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యాసంస్థలు, సామాజిక సేవాసంస్థలు, లోహపు వ్యాపారాలు చేసేవారు అనుకూల ఫలితాలు సాధిస్తారు. చేతివృత్తి పనివారికి కూడా మంచి ఫలితాలే సూచిస్తున్నాయి. సంతానం లేని వారికి సంతానప్రాప్తి సంభవం. అవివాహితులైన వారికి వివాహప్రాప్తి. నిర్మాణాలను దగ్గరుండి పర్యవేక్షించడం చెప్పదగిన సూచన. నాణ్యతలో లోపాలు ఉన్నాయని మీపై ఆరోపణలు రావచ్చు. ప్రభుత్వ నిర్ణయాల వలన కొద్దిమంది రియల్ఎస్టేట్ వ్యాపారంలో నష్టపోతారు. పోటీపరీక్షలలో విజయం సాధించి కుటుంబ ప్రతిష్ఠ నిలబెడతారు. మీరు ఎంతో శ్రమించి మంచి ఫలితాలు సాధించినప్పటికీ మీ వైరివర్గం వారు మీ శ్రమను గుర్తించక విమర్శిస్తారు. శత్రువులతో వాదించే కన్నా కాలమే సమస్యలను పరిష్కరిస్తుందని మౌనంగా ఉండిపోతారు. మీరు నిజాయితీగా, స్పష్టంగా మాట్లాడటం వల్ల వైరివర్గం దానిని మీ అహంభావంగా భావించి మీపై అకారణంగా మీ సన్నిహిత సహచరవర్గంలో ఉండే వారి వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఎవరిపట్ల మీకు ఆసక్తి, అనురాగం ఉన్నాయో వారి వల్లనే మానసిక వేదన కలుగుతుంది. వచ్చిన అవకాశాలు చేజార్చుకోవద్దు, నిర్ణయాలు తీసుకోవడం ఆలస్యం చేయవద్దు. వ్యాపారంలో నూతన ప్రయోగాలు చేసి మంచి ఫలితాలు సాధిస్తారు. రుద్రజడను ఉపయోగించండి. మీ కంపెనీకి ప్రజలలో గుడ్‌విల్, నమ్మకం పెరుగుతుంది. భాగస్వామ్య వ్యాపారంలో మీరే కేంద్రబిందువు అవుతారు మిగిలిన భాగస్వాముల పాత్ర నామమాత్రం అవుతుంది. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఒక ఆశ ఫలించడం మీకు, మీ భాగస్వాముల ఆనందానికి అవధులు ఉండవు. బ్యాంకు రుణాలు, అనుకూలమైన స్థలం, ప్రభుత్వ రాయితీలు మొదలైనవి అనుకూలం. మీరు ఆశించిన విధంగా, ఊహించని విధంగా మీ జ్యేష్ఠ సంతానానికి ఉద్యోగం లభిస్తుంది. ఆడపిల్లల గురించి, వాళ్ళ పెళ్ళిళ్ళ గురించి గట్టిగా ఆలోచన చేస్తారు. వివాహ ప్రయత్నాలు ప్రారంభిస్తారు. అవి సఫలం అవుతాయి. మంచి సంబంధం కుదురుతుంది. పునర్వివాహ ప్రయత్నాలు చేసేవారికి కష్టంమీద సంబంధం కుదురుతుంది. ప్రేమవివాహాలు చేసుకున్న వారికి చేదు అనుభవాలు సంభవిస్తాయి. భగవంతుడు నొసట రాసిన రాత శాశ్వతమని నమ్ముతారు. ఈ నమ్మకం చాలా విషయాలలో మీకు మనోధైర్యాన్ని కలిగిస్తుంది. కీలకమైన పోటీపరీక్షలలో నామమాత్రంగా శ్రమించి అనుకూల ఫలితాలు సాధిస్తారు. అనూహ్యంగా ప్రతి విషయంలోనూ అదృష్టం కలిసి వస్తుందని భావించవద్దు. అదృష్టం కోసం ఎదురుచూడడం వలన ఆశ, కృషికి తగిన ఫలితం లభిస్తుంది. ఈ విషయాన్ని గ్రహించి తగిన విధంగా ప్రవర్తిస్తారు. పాస్‌పోర్ట్, వీసాల కోసం ప్రయత్నించే వారికి అవి లభిస్తాయి. గ్రీన్‌కార్డు కోసం ఎదురుచూసే వాళ్ళకి గ్రీన్‌కార్డు లభిస్తుంది. ప్రభుత్వ సంబంధమైన కొన్నిరకాల ఉత్తర్వులు మీకు మేలు చేస్తాయి. మీ పలుకుబడి ఉపయోగించి తక్కువ కొటేషన్‌తో ఎక్కువ లాభాలు ఉన్న కాంట్రాక్టులను మీ స్వంతం చేసుకుంటారు. దూరప్రాంతాలకు మీ పిల్లలను పంపించి చదివిస్తారు. సంసారం గుట్టు రోగం రట్టు అనే సామెత మీ విషయంలో నిజమవుతుంది. మీ సమస్యలను ఎవరితోనూ పంచుకోవడానికి ఇష్టపడరు. మంచి విషయాలు చెబితే జనం ఓర్చుకోలేరు. చెడ్డ విషయాలు సమస్యలు చెబితే లోకువగా చూస్తారని మీ అభిప్రాయం. ఉద్యోగాల విషయంలో మధ్యవర్తుల వల్ల, కమీషన్ ఏజెంట్ల వల్ల నష్టపోయే అవకాశం ఉంది. జాగ్రత్త వహించండి. దొడ్డిదారిలో ఉద్యోగాలు సంపాదించుకునే మార్గాలకు స్వస్తి చెప్పండి. అవి ఎండమావులని గ్రహించండి. సనాతన సంప్రదాయాలు మీద మీకున్న నమ్మకం బలీయమైనది. కోర్టుతీర్పులు మీకు అనుకూంగా ఉంటాయి. కాంట్రాక్ట్ పద్ధతిన ఉద్యోగాలు చేస్తున్న వారికి ఉద్యోగం పర్మినెంట్ అవుతుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం. దుష్ప్రచారాలను పట్టించుకోకుండా మీ పని మీరు చేసుకుపోవడం వల్ల సానుకూల ఫలితాలు సాధిస్తారు. రాజకీయపరమైన నిర్ణయాలు లాభిస్తాయి. నయవంచకుల సలహాలు ప్రక్కన పెడతారు. ఉన్నతాధికారులు మీ శ్రమను గుర్తిస్తారు. కొంతమందికి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోవాలనే ఆలోచనలు వస్తాయి. సహోద్యోగులు మీ మీద చేస్తున్న దుష్ప్రచారం అబద్ధాలని నిరూపిస్తారు. ముఖ్యమైన సభలు, సమావేశాలకు ఆహ్వానాలు అందటం మీకు ఆశ్చర్యం కలిగిస్తుంది. బహిరంగ సభల్లో చక్కగా ప్రసంగిస్తారు. కొన్ని అవార్డులు మీకు లభిస్తాయి. కుటుంబ వ్యవహారాలను నిర్లక్ష్యం చేస్తున్నారనే అపవాదు వస్తుంది. ఎటువంటి విమర్శలకు ప్రతిస్పందించకుండా నిండుకుండలా ఉంటారు. విలువలేని వ్యక్తులకు ప్రాధాన్యతనిచ్చి మాట్లాడడానికి ఇష్టపడరు. ఆచరణలో మీ ఈ నిర్ణయం మంచి ఫలితాలను ఇస్తుంది. సాంకేతిక విద్యలో చక్కగా రాణిస్తారు. వ్యాపార సంబంధమైన విషయాలు కూడా లాభిస్తాయి. పన్నులు వసూలు చేసే అధికారుల వల్ల కొన్ని చికాకులు సంభవిస్తాయి. దైవసంకల్పం ముందు మానవుడు చాలా బలహీనుడని కొన్ని సంఘటనలు నిరూపిస్తాయి. మార్పులు పరివర్తన కాలానుగుణంగానే నడుస్తాయి. కానీ మన ప్రయత్నాల వల్ల రావని గ్రహిస్తారు. ఇన్సూరెన్స్ విషయంలో జాగ్రత్త వహించండి. చోరభయం పొంచి వుంది. పూర్వీకులు రాసిన డాక్యుమెంట్లు, వీలునామాలోని లోపాలు కీలక సమయంలో ఇబ్బంది పెడతాయి. స్పష్టతలేని పెద్దల అభిప్రాయాలు సంకటానికి గురిచేస్తాయి. దురుసుగా మాట్లాడి అయినవాళ్ళని దూరం చేసుకోవడం మంచిలక్షణం కాదు. కోపంగా మీరు మాట్లాడినప్పటికీ విషయాలను కంటితో చూసి నిజానిజాలను బేరీజు వేసుకుంటారు. టీ.వీ, సినీరంగాలలోని వారికి, కళాకారులకు, సాంకేతిక సిబ్బందికి నూతన అవకాశాలు కలిసివస్తాయి. వచ్చిన అవకాశాలను సక్రమంగా సద్వినియోగం చేసుకుంటారు. రాజకీయ పదవి లభిస్తుంది. -
శార్వరి నామ సంవత్సర (కన్యా రాశి) రాశిఫలాలు
ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఆర్థికాభివృద్ధి బాగుంది. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. గతంలో కన్నా ఆస్తుల విలువ పెరుగుతుంది. సంసార పురోగతి మానసిక సంతోషానికి కారణమవుతుంది. వాహనయోగం, గృహయోగం అనుకూలపడతాయి. శుభకార్య సంబంధమైన విషయాలు సానుకూలపడతాయి. స్నేహితులు, బందువులతో ఏర్పడిన విభేదాలు సమసిపోతాయి. రాజకీయ పదవి లభిస్తుంది. వ్యాపారరంగంలోని వారికి అనుకూలంగా ఉంది. ఈ సంవత్సరం తలపెట్టిన కార్యక్రమాలు మూడువంతులు పూర్తవుతాయి. కొన్ని విషయాలు, వ్యవసాయ సంబంధమైన విషయాలు లాభిస్తాయి. ఆదాయానికి మించిన ఖర్చులను అదుపు చేయడంలో విఫలమవుతారు. ఆదాయ మార్గాలను పెంచుకోవడం సర్వదా శ్రేయస్కరం అని భావిస్తారు. అంతర్గత రాజకీయాలు చికాకు కలిగిస్తాయి. మార్పురాని వ్యక్తులలో మార్పు తీసుకురావడానికి ఇక ఎలాంటి ప్రయత్నాలు చేయకూడదని నిర్ణయించుకుంటారు. అంతర్గత రాజకీయాల కారణంగా ఒకరికి తెలియకుండా మరొకరికి ఆర్థిక సాయం చేయవలసి వస్తుంది. ముఖ్యమైన ప్రయాణాలు, రహస్య ప్రయాణాలు లాభిస్తాయి. ప్రజా జీవితంలో విశేష ప్రభావం చూపే అంశాలను, చలనచిత్ర అంశాలను, రాజకీయాలను మీకు అనుకూలంగా మార్చుకోగలరు. రాని బాకీలు వివాదస్పదం అవుతాయి. సివిల్, క్రిమినల్ కేసులలో తీర్పులు మీకు అనుకూలంగా వస్తాయి. కులాంతర వివాహాల గురించి, ప్రేమ వివాహాల గురించి మీ వ్యాఖ్యానాలు, అభిప్రాయాలు విమర్శలకు దారితీస్తాయి. ఈ విషయంలో మీరు సమాజాన్ని పట్టించుకోరు. విదేశాల నుండి వచ్చే ఆర్థికసాయంతో మీ ఆధ్వర్యంలో నడుస్తున్న విద్యాసంస్థలు, సేవాసంస్థలు, అనాథాశ్రమాలు పురోగమనంలో ఉంటాయి. స్త్రీతో వైరానికి ముందుకు దూకవద్దు. వీలైనంత వరకు వివాదాలకు, వివాదస్పద చర్చలకు దూరంగా ఉండండి. అనువంశిక ఆస్తుల విషయమై డాక్యుమెంట్స్‌లో ఉన్న విషయాలు అస్పష్టంగా ఉండడంతో విభేదాలకు, వివాదాలకు దారితీస్తుంది. డాక్యుమెంట్స్‌లో స్పష్టత ఉండదు, ఇదీ సమస్య. చెవి, ముక్కు, గొంతులకు సంబంధమైన అనారోగ్యాలు బాధిస్తాయి. మధ్యమధ్యలో వైరల్ జ్వరాలు ఇబ్బంది పెడతాయి. వ్యాపార వ్యవహారాలలో అయినవాళ్ళను, బంధువులను దూరంగా ఉంచి లాభపడతారు. సరైన సమయంలో నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థిక ప్రయోజనాలను, బంధుత్వాలను వేరువేరుగా చూస్తారు. ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటారు. ప్రతి విషయము ధనంతో ముడిపడి ఉందని తెలుసుకొని జాగ్రత్తగా వ్యవహరిస్తారు. అధికారులతో మంతనాలు, రాజకీయ పైరవీలు లాభిస్తాయి. ఐశ్వర్యనాగిని ఉపయోగించడం వలన మహాలక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. విద్యా సంబంధమైన విషయాలకు అధికంగా ధనం ఖర్చు చేయవలసి వస్తుంది. మీ పెద్దలపరంగా ఆర్థిక లబ్ధి చేకూరుతుంది. పోటీ పరీక్షలలో మంచి ఫలితాలను సాధిస్తారు. మంచి ఉద్యోగం లభిస్తుంది. సంతానాన్ని చదువులకోసం విదేశాలకు పంపించే ప్రయత్నాలు ఫలిస్తాయి. బ్యాంకు ఋణాలు లభిస్తాయి. ఆకర్షణీయమైన స్కీముల్లో చేరడం వల్ల, చిట్టీలు కట్టడం వల్ల నష్టపోతారు. ప్రైవేటు ఆర్థిక సంస్థలలో పెట్టిన డబ్బు పోతుంది. ధనాన్ని తిరిగి తెచ్చుకునే ప్రయత్నాలు ఫలించవు. మీ స్నేహితుల రాజకీయ పదవుల కోసం పెద్ద ఎత్తున ప్రయత్నిస్తారు. మీ వంతు సహాయం మీరు అందిస్తారు. ప్రతిష్ఠాత్మకమైన సంస్థలో పనిచేయడానికి అవకాశం లభిస్తుంది. ప్రతి విషయంలోనూ, ప్రతి రంగంలోనూ గట్టి పోటీ ఎదుర్కొనవలసి వస్తుంది. రియల్ ఎస్టేట్, ఆహారధాన్యాల వ్యాపారం బాగుంటుంది. కొన్నిచోట్ల భూమి ధర పడిపోతుంది. వ్యవసాయ సంబంధమైన విషయాలు, లాభాలు అయోమయంగా ఉంటాయి. సోదరసోదరీ వర్గంతో సంబంధబాంధవ్యాలు బలపడతాయి. ప్రతినిత్యం హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. వివాహాది శుభకార్యాలు ఘనంగా చేస్తారు. సంతానానికి సంబంధించి వివాహ ప్రయత్నాలు ఆకస్మికంగా లాభిస్తాయి. మంచి సంబంధం కుదురుతుంది. బరువుబాధ్యతలు తీర్చుకోగలిగామన్న సంతృప్తి కలుగుతుంది. రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్, లైసెన్సులు, లీజులు పునరుద్ధరణ వంటివి సజావుగా సాగిపోతాయి. ఉద్యోగంలో ప్రమోషన్ లభిస్తుంది. కొన్నాళ్ళు ఉద్యోగంలో అసంతృప్తి వాతావరణం నెలకొంటుంది. కార్యాలయంలో మీ పనితీరు చాలామందికి నచ్చదు. ఉద్యోగం చేయడం కత్తిమీద సాముగా తయారవుతుంది. మీరు చేసే పని ఒకరికి మంచి అనిపిస్తే, పదిమందికి చెడు అనిపిస్తుంది. కష్టపడి సాధించుకున్న పదవి మానసిక అశాంతికి కారణమవుతుంది. సర్వీస్‌లో వివాదస్పద వ్యక్తిగా మిగలకుండా ఉండడానికి ప్రయోజనాలు వదులుకుంటారు. మీడియాపరంగా చికాకులు గోచరిస్తున్నాయి. కోపాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిది. నిత్యం సిద్ధగంధంతో శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని పూజించండి. ఆధ్యాత్మిక, సామాజిక కార్యక్రమాల్లో ఎన్నడూ లేనంత ఉత్సాహంగా పాల్గొంటారు. ప్రత్యర్థులలో ఐకమత్యం లేకపోవడం మీకు లాభిస్తుంది. ఇతరులపై మీరు చేసే ఆరోపణలకు సంబంధించిన విషయాల తాలూకు సాక్ష్యాధారాలు లభిస్తాయి. అన్ని విషయాలు మీ అదుపులో ఉన్నట్లుగానే పరిస్థితులు ఉంటాయి. రెండు నెలలు గృహంలో ఐకమత్యం లోపిస్తుంది. రాజకీయ పదవి లభిస్తుంది. జల, వాయు, ఆహార కాలుష్యం వల్ల ఇబ్బందులు ఏర్పడతాయి. ఊహలు, అపోహలు, ప్రక్కనపెట్టి నిజజీవితంలో బ్రతకడం చెప్పదగిన సూచన ఇంటి కొనుగోలు విషయంలో ఆచితూచి అడుగువేయండి. చేతివృత్తి పనివారికి, హోల్‌సేల్ వ్యాపారం చేసేవారికి, నిర్మాణరంగ పనులు చేసేవారికి కాలం అనుకూలంగా ఉంది. నూతన బ్యాంకు ఖాతాలు తెరుస్తారు. ఇతరులు మీకు ఇచ్చిన చెక్కులు బౌన్స్ అయ్యే అవకాశం ఉంది. మీ హితవు కోరే పెద్దలను, ఆత్మీయులను దూరం చేసుకోవద్దు. ఆయుర్వేదం, హోమియోపతి వైద్యం పట్ల ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు. ప్రయాణాలలో వస్తుభద్రత గురించి గట్టి జాగ్రత్తలు తీసుకోండి. అనవసరమైన వివాదాలతో కాలాయాపన చేసే మీ వాళ్ళను సరైన దారిలో పెట్టడానికి మీరు చేసే ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. భూమి సంబంధమైన విషయాలు మీకు అనుకూలంగా మారడం వల్ల మీ సాటివారికి, తోటివారికి అసూయ పెరుగుతుంది. ఎగుమతి, దిగుమతి వ్యాపారాలు బాగుంటాయి. మీరు చేయాలనుకునే కార్యక్రమాలు వెంటనే చేయండి. రహస్య చర్చలు, సంభాషణలు, కాలయాపన చేయటం మంచిది కాదు. ఇందువలన మానసిక ఆందోళన ఎక్కువై మానసిక ప్రశాంతత తగ్గుతుంది. కాంట్రాక్టులు, సబ్‌కాంట్రాక్టులు లాభిస్తాయి. ఉద్యోగంలో బదిలీ కొరకు మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. మీరు అందలం ఎక్కించిన రాజకీయ నాయకులు, మీ ద్వారా ఉద్యోగం పొందిన వాళ్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్ల మీకు ఉపయోగం లేదు, జాగ్రత్త వహించండి. గతంలో నిలిచిపోయిన పనులను తిరిగి ప్రారంభిస్తారు. ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటారు. యోగాసనాలు, మెడిటేషన్ వంటి విషయాలలో ఆసక్తి పెరుగుతుంది. మీ ఇంటి ఆడపడుచులకు అన్యాయం జరగకుండా గృహ ఆస్తి విషయాలను సక్రమంగా నిర్వహిస్తారు. ఎంతోకాలం క్రితం సంభవించిన మహాప్రస్థానం మీ మనస్సు మీద చెప్పలేని ప్రభావం చూపిస్తుంది. కుడి మోకాలు ఎక్కువగా ఇబ్బంది పెట్టవచ్చు. వివాహాది శుభకార్యాల విషయంలో మీ మాటే నెగ్గించుకుంటారు. వ్యాపారంలో నమ్మకంతో మీరు ఇచ్చిన అప్పు సంకటంగా మారుతుంది. మీరు ఇతరులు చెప్పిన విషయాలు వినిపించుకోని వ్యక్తులు, తాము పట్టుకున్న కుందేటికి మూడే కాళ్ళు అని వాదించే వ్యక్తులు ఇబ్బందికరంగా మారి వాళ్ళ జీవితాలు పాడు చేసుకుంటారు. అయిన వాళ్ళు, ఆత్మీయులు జీవితాలను పాడు చేసుకుంటుంటే ప్రేక్షకపాత్ర పోషించవలసి వస్తుంది. అవగాహన లోపం వల్ల తక్కువ ఖరీదు చేసే స్థిరాస్తిని ఎక్కువ మొత్తం వెచ్చించి కొనుగోలు చేస్తారు. ఎంతో అనుభవం ఉన్న మీరు ఈ ఒక్క విషయంలో పొరపాటు నిర్ణయం తీసుకుంటారు. ఉపకరించే పరిచయాలను దుర్వినియోగం చేయరు. మీ ఆత్మీయులను, కష్టాలలో ఉన్న స్నేహితులను, బంధువులను కష్ట సమయంలో ఆదుకుంటారు. తల్లిదండ్రులను, పెద్దలను గౌరవించి వారి పట్ల మీ బాధ్యతను సక్రమంగా నెరవేరుస్తారు. కళా, సాహిత్య, సంగీత రంగాలలో సంతానాన్ని ప్రోత్సహిస్తారు. పన్నులు వసూలు చేసే అధికారుల వల్ల ఇబ్బందులు రావచ్చు, జాగ్రత్త వహించండి. సోదరసోదరీ వర్గానికి సహాయం చేయవలసిన పరిస్థితి వస్తుంది. ప్రశాంతంగా ఉన్న వాతావరణాన్ని చెడగొట్టే వ్యక్తులు ప్రధాన సమస్య అవుతారు. మీకు ఏ మాత్రం సంబంధం లేని విషయాలకు మీరే బాధ్యతవహించాల్సి వస్తుంది. వృత్తి, ఉద్యోగాలపరంగా పోటీ ఏర్పడుతుంది. వృత్తి, ఉద్యోగ వ్యాపారపరంగా మిమ్మల్ని దెబ్బతీయాలని చూసే శత్రువర్గాల ప్రయత్నాలు విఫలం అవుతాయి. ప్రతి విషయంలోనూ ఉన్నతాధికారులు, రాజకీయ నాయకుల అండదండలు మీకు లభిస్తాయి. ఆత్మీయవర్గంతో కొద్దికాలం విభేదాలు కలుగుతాయి. స్పెక్యులేషన్లో నష్టపోయే అవకాశం ఉంది, జాగ్రత్త వహించండి. బంధువులతో ఏర్పడిన విభేదాలు పరిష్కరించడానికి విధిలేని పరిస్థితులలో మీరు మధ్యవర్తిత్వం వహించాల్సి వస్తుంది. ఓ శుభకార్యానికి కూడా మీరే మధ్యవర్తిత్వం వహించాల్సి వస్తుంది. ఇందువల్ల ప్రయోజనం లేకపోగా మీపై అనవసర నిందలుపడతాయి. రుద్రజడ వాడండి. వివాదస్పదమైన ఆస్తి కలిసివస్తుంది. ఐ.ఎ.ఎస్., ఐ.పి.ఎస్., ఐ.ఐ.టి వంటి ఉన్నత పరీక్షలకు ఎంపిక అవుతారు. వ్యాపారంలో లాభాలు బాగుంటాయి. ఆరోగ్య వృద్ధికోసం చేసే నూతన విధానాలు మంచి ఫలితాలనిస్తాయి. స్వయంకృతాపరాధాల వలన కొంత నష్టపోతారు. అయితే అది పెద్దగా లెక్కించదగినది కాదు. -
శార్వరి నామ సంవత్సర (తులా రాశి) రాశిఫలాలు
ఈ రాశివారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వ్యాపార సంబంధమైన విదేశీయాన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారాన్ని విస్తరిస్తారు, కొత్త బ్రాంచీలు విస్తరిస్తారు. మీ పేరుమీద ఇతరులు చేసే వ్యాపారాలు మధ్యస్తంగా ఉంటాయి. ప్రతి విషయాన్ని కొత్తకోణంలో ఆలోచనచేసి నూతనమైన పద్ధతులు కనిపెట్టాలని యోచిస్తారు. భాగస్వామ్య వ్యాపారాలలో భాగస్వాముల ఖర్చు ఉమ్మడి ఖాతాలలో వాడకం వాటాలను దాదాపు మించిపోతుంది. ఇలాంటివి సామరస్యంగా నాలుగు గోడల మధ్య పరిష్కారం చేసుకుంటారు జలవనరులు మీరు ఆశించిన చోట ఏర్పడతాయి. విదేశాలలో ఉన్న మీ వాళ్ళు అభివృద్ధి చెందటం, వాళ్ళ వల్ల పేరుప్రతిష్ఠలు రావడం సంతోషం కలుగుతుంది. అదనపు బరువుబాధ్యతలు తప్పవు. సంతాన పురోభివృద్ధికి కృషి చేస్తారు. మీరు చేస్తున్న అన్ని విషయాలను గోప్యంగా ఉంచుతారు. రావలసిన బాకీలు కొద్దికొద్దిగా జమ చేసుకుంటారు. అసలు గురించే మీ ఆందోళన. వడ్డీల మీద ఆశపెట్టుకోరు. బంధువర్గం, దగ్గరివాళ్ళు, వయస్సులో పెద్దవాళ్ళు సాయం చేయవలసిన పెద్దలే నవ్వుతూ ద్రోహం చేస్తారు. మీకు ప్రతికూలంగా మాట్లాడుతారు. అభివృద్ధి చెందుతున్న పిల్లల మొహం చూసి కూడా వాళ్ళ అభిప్రాయాలలో మార్పురాదు. ఉన్నవాళ్ళకు ఇంకా మేలు చేయాలని అన్యాయమైన పంచాయితీలు చేస్తారు. ఎదిరించి ప్రయోజనం లేదని తెలుసుకుంటారు. నమ్మకం పెట్టుకున్నందుకు, మీ పొరపాటుకు ఈ శిక్షపడాల్సిందేనని మీరే మౌనంగా బాధను దిగమింగుకుంటారు. మీరు అనుకున్నది, ఆశించినది, కృషి చేసినది నిజంగా మీదే అవుతుంది. ఆర్థికస్థితిలో మార్పు వస్తుంది. ఇతరులకు జవాబు చెప్పవలసిన పనిలేదు. ఉంటే తింటాం లేకపోతే లేదు. బయటవారితో మాట అనిపించుకోవాల్సిన పరిస్థితి లేదు అన్న భావన చాలా ఊరట కలిగిస్తుంది. అన్నిరకాల దేవుళ్ళ అభిషేకాలకు, పూజలకు మహాతీర్థం పొడి ఉపయోగించండి. శుభకార్యాలకు సంబంధించిన విషయాలకు శాస్త్రపరమైన ఇబ్బందులు ఎదురవుతాయి. ప్రతి దానికి వంకలు పెట్టే వాళ్ళని సంతృప్తిపరచలేమని కాస్త ఆలస్యంగా గ్రహిస్తారు. స్టేషనరీ, ప్రింటింగ్ పుస్తకాలు, ఎలక్ట్రానిక్ సామాగ్రి, రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాలలో లాభాలు వస్తాయి. నిష్కారణమైన ద్వేషానికి మందు కనిపెట్టలేమని గ్రహించి ఊరట చెందండి. నిబంధనలకు తిలోదకాలు ఇచ్చి మీకు అన్యాయం చేస్తారని విచారించవద్దు. మీ ప్రయోజనాలు రాచబాటలో వస్తాయి. మీ సన్నిహిత రాజకీయవర్గం డబ్బులు తీసుకుని మీ వ్యతిరేక వర్గానికి మేలు చేస్తారు. దీర్ఘకాలిక పోరాటానికి మీరు సంకల్పించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఏకపక్ష నిర్ణాయాలు తీసుకోకుండా ఏదైనా పని చేసేటప్పుడు సన్నిహితులను, నిపుణులను సంప్రదించండి. కార్యాలయంలో పని ఒత్తిడి పెరుగుతుంది. శాడిస్టు మనస్తత్వం కలిగిన అధికారుల వల్ల ఇబ్బందిపడతారు. పెయింటింగ్, ఆర్ట్ డిజైనింగ్లకు మంచి ఖ్యాతి లభిస్తుంది. పొదుపు చేసిన ధనాన్ని సక్రమమైన వాటిల్లో పెట్టుబడిగా పెడతారు. వీలైనంత వరకు దుబారా ఖర్చులు తగ్గిస్తారు. వీలైనంత పొదుపుగా కాలం గడపాలని చూస్తారు. అయితే సాంతం త్యాగం చేయరు. ఇతరులకు పెట్టే వాటిల్లో లోటు చేయరు. అనవసరమైన వ్యక్తుల సలహాలను దూరంగా పెడతారు. కుటుంబ వ్యవహారాల్లో, వ్యక్తిగత విషయాలలో బంధుమిత్రుల ప్రమేయాన్ని పూర్తిగా తగ్గిస్తారు. వివాహాది శుభకార్యాలు ఘనంగా చేస్తారు. మెరిట్మార్కులు సాధిస్తారు. సంతానాన్ని అధికగారాబం చేస్తున్నారన్న విమర్శలు వస్తాయి. వాటిని పట్టించుకోకండి. ఎప్పుడో కొనుగోలు చేసిన భూములకు, పొలాలకు మంచి ధర లభిస్తుంది. అమ్మాలన్న ఉద్దేశ్యంతో కొనుగోలు చేసిన ఓ ఫ్లాట్‌ను అమ్మి ధనాన్ని వ్యాపారంలో పెట్టుబడిగా పెడతారు. బంధువుల మధ్య తగాదాలు మీకు చికాకు కలిగిస్తాయి. ప్రతి విషయంలోనూ జీవితభాగస్వామికి కానీ, మరొకరికి కానీ సంజాయిషీ ఇవ్వాల్సి రావడం మీ మానసిక అసహనానికి కారణం అవుతుంది. సమాజంలో మీకున్న గుడ్‌విల్‌ను నిలబెట్టుకోగలుగుతారు. ఒక యూనిట్‌గా చేసే వ్యాపారాలు అభివృద్ధి పథంలో నడుస్తాయి. కష్టపడి పనిచేసి ఫలితాలను ఆశిస్తారు. కష్టపడకుండా ఎలాంటి ఫలితాలను ఆశించరు. మనస్సు విప్పి మాట్లాడడం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయి అనేది అనుభవపూర్వకంగా తెలుసుకుంటారు. శుభకార్యాల నిమిత్తం బంధువులకు సహాయం చేస్తారు. ఇబ్బందికరంగా మారిన పెళ్ళిని కష్టతరంగా పూర్తిచేస్తారు. బంధువులలో ఐకమత్యం కొరకు మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. మీరు సాధించిన పురోగతి, ఆర్థికస్థితి, పేరుప్రతిష్ఠలు చూసి సంతోషించే ఏకైక ఆత్మీయుడు లేకపోవడం మీ తీవ్రమనోవేదనకు కారణం అవుతుంది. కుటుంబంలో మరొకరి సంపాదన ప్రారంభం అవుతుంది. ఆర్థికబలం పెరుగుతుంది. పోలీస్‌స్టేషన్ స్థాయి పరిష్కారాలు ఇష్టం లేకపోయినా స్నేహితులను ఆదుకోవడానికి మీ పలుకుబడిని ఉపయోగించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ప్రేమ వివాహాలను, కులాంతర వివాహాలను మీరు సరిపెట్టుకోలేరు. ఈ విషయంలో ఎక్కడా రాజీపడరు. కొన్ని సందర్భాలలో చేతినిండా పని ఉంటే బావుండు, క్షణం తీరిక లేకుండా ఉంటే బాగుండు అనిపిస్తుంది. రుద్రజడను ఉపయోగించండి. కొన్ని వ్యాపార సంబంధమైన విషయాలకు మీరు నాయకత్వం వహిస్తారు. మంచి లాభాలు సాధిస్తారు. లాభాలు పంచుకునే విషయంలో పనిచేయని వ్యక్తులకు, సోమరిపోతులకు భాగాలు ఇవ్వాల్సి వస్తుంది. ఇది మీ మనోవేదనకు కారణం అవుతుంది. దొంగకు, దొరకు ఒకే న్యాయం. ఇది మీరు జీర్ణించుకోలేకపోతారు. కుటుంబసభ్యుల సంతోషం కోసం విలువైన ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఆధ్యాత్మిక, చారిత్రాత్మక ప్రదేశాలను సందర్శిస్తారు. సివిల్ సర్వీస్‌లలో విజయం సాధించడానికి ఎంతో కష్టపడతారు. కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. మనస్సుకు ఊరట కలుగుతుంది. మీ మీద ఉన్న బాధ్యతలు స్నేహితుడిలా గుర్తుచేస్తాయి. వివాహాది శుభకార్యాల విషయంలో కుటుంబపరంగా సమిష్టి నిర్ణయం తీసుకుంటారు. ఎక్కువగా ఆలోచన చేయకుండా శుభకార్యాలను ఘనంగా చేస్తారు. చిన్నాచితకా వ్యాపారాలు, చేతివృత్తులు, ఆధ్యాత్మిక సంబంధమైన వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. ప్రతి పనిని ఇతరుల సహాయంతో చేసి వచ్చిన లాభాలలో వారికి వాటా ఇచ్చి, వారిని సంతృప్తిపరుస్తారు. వ్యక్తిగత బలహీనత కలిగిన అధికారి మీ చేతికి చిక్కుతాడు. అతని సహాయంతో కొన్ని ముఖ్యమైన పనులను సాధించుకుంటారు. నమ్మకం లేకపోయినా, ఎదుటివారి నిర్ణయం వల్ల, అనాలోచిత చర్యల వల్ల ఎంతో ప్రయోజనం పొందాల్సిన ఓ వ్యవహారంలో కొద్దిపాటి లాభాలు మాత్రమే దక్కుతాయి. వాస్తవాలు గ్రహించి నిర్ణయాలు తీసుకోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. సర్పదోషనివారణా చూర్ణములో సర్వరక్షా చూర్ణము కలిపి స్నానం చేయడం మంచిది. మీ ఆత్మీయవర్గం మీ శత్రువర్గం ఎప్పుడూ మీ కార్యక్రమాలపై, మీరు చేసే పనులపై నిఘా ఉంచుతారు. మీ ఆత్మీయవర్గం మీ ఎదుగుదలను సహించలేరు. మీ ఎదుగుదలలో మీరు తొక్కిన అడ్డంకులను ప్రచారం చేస్తారు, విమర్శిస్తారు. స్త్రీల సహాయనిరాకరణ వల్ల, వాళ్ళతో ఏర్పడిన విభేదాల వల్ల కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు పూర్తిచేయడానికి ఆటంకాలు ఏర్పడతాయి. అంతరాత్మ ప్రబోధానుసారం కొన్ని కార్యక్రమాలను వదిలివేస్తారు. రాజకీయ పదవి లభిస్తుంది. కొన్ని ప్రయోజనాలు వదులుకొని మీ పెద్దరికం, మర్యాదను సమాజంలో నిలుపుకుంటారు. మీడియా ప్రతినిధులతో సాంగత్యం ఏర్పడుతుంది. కష్టసుఖాలను సరిసమానంగా చూస్తారు. ఏది కోల్పోయినా మనోధైర్యం మాత్రం కోల్పోరు. వైఫల్యాల నుండి నేర్చుకున్న పాఠాలు చేతికి అందడానికి సాంకేతిక కారణాలు అడ్డువస్తాయి. శక్తికి మించి శ్రమిస్తారు. అందరూ కూడి వచ్చి సహాయం చేస్తామని చెబుతారు. సమస్యలు మొదలుకాగానే మొహం చాటేస్తారు. కష్టాలు ఎప్పుడూ ఒంటరిగా రావు. రెండో మూడో కలిసొస్తాయి. వృత్తి, ఉద్యోగాలకు సంబంధించి అధికారులు చికాకు పెడుతున్న తరుణంలో అండగా ఉంటాడు అని భావించిన వ్యక్తి విరోధంతో దూరం కావడం జరుగుతుంది. ఈ సమస్యల వలయం నుంచి బయటకు రావవాల్సిన స్థితిలో ఆర్థిక ఒత్తిడులు, ఆరోగ్యం, న్యాయపరమైన సమస్యలు వస్తాయి. వాటిని అధిగమిస్తారు. కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్తలు వహిస్తారు. ప్రతి విషయాన్ని ఆచితూచి పరిశీలిస్తారు. డబుల్ రిజిస్ట్రేషన్ గండం నుండి బయటపడతారు. మిమ్మల్ని మోసం చేయాలనుకున్న వారికి గట్టిగా బుద్ధి చెబుతారు. వాళ్ళని ఎవరూ నమ్మకుండా బహిష్కరించే విధంగా చేయగలుగుతారు. పిల్లల విషయంలో ఒక దిగులు, ఆలోచన ఉంటుంది. సెంటిమెంట్స్ ప్రకారం వ్యాపారంలో ప్రధాన నిర్ణయాలు తీసుకుంటారు. విదేశాలలో ఉన్నవారితో సంబంధ బాంధవ్యాలు వ్యాపారాభివృద్ధికి ఉపయోగపడతాయి. సమాజంలో ఉన్నతస్థానంలో ఉన్నవారు మిమ్ములను నమ్మకంలోకి తీసుకుంటారు. రాజకీయ జీవితంలో స్వల్ప ఒడిదుడుకులు ఉంటాయి. చలనచిత్ర రంగంలోని వారికి, టీవీ రంగంలోని వారికి అనుకూలమైన కాలం. విదేశాలలో నివసించేవారు స్వగృహం కొనుగోలు చేస్తారు. గ్రీన్‌కార్డు, స్టాంపింగ్ వంటివి అనుకూలిస్తాయి. -
శార్వరి నామ సంవత్సర (ధనస్సు రాశి ) రాశిఫలాలు
ఈ రాశివారికి ఈ సంవత్సరం చాలా బాగుంది. ఆర్థికంగా ఎదుగుతారు. పేరుప్రతిష్ఠలు పెరుగుతాయి. మీ ద్వారా సహాయసహకారాలు పొంది, మీ పలుకుబడితో ఉన్నతస్థానాలలో ఉన్న అధికారులు, రాజకీయ నాయకులు మీపట్ల సానుకూలంగా ప్రవర్తిస్తారు. పరోక్షంగా వారిని కూడా భాగస్వాములను చేసి నూతన వ్యాపారం ప్రారంభిస్తారు. ప్రారంభించిన వ్యాపారం చాలా బాగుంటుంది. అధికంగా లాభాలు వస్తాయి. మీ కత్తికి రెండు వైపులా పదును ఉన్నట్లు తోస్తుంది. స్త్రీల వల్ల మేలు జరుగుతుంది. అధికార స్థానంలో ఉన్న స్త్రీల వల్ల మరింత మేలు జరుగుతుంది. న్యాయబద్ధమైన, చట్టబద్ధమైన మీ కోరికలను వారి ఆమోదిస్తారు. అంతేకాక ప్రతి విషయంలోను స్త్రీల సహాయసహకారాలు మీకు లభిస్తాయి. వ్యాపార నిమిత్తం స్థలం కొనుగోలు చేస్తారు. నూతన అవకాశాలను ఉపయోగించుకుంటారు. ఆర్థికపరమైన పురోగతి బాగుంటుంది. స్థిరాస్తులు వృద్ధిచేస్తారు. పట్టుదలతో కృషి చేసి సానుకూల ఫలితాలు సాధిస్తారు. సమాజంలో మీరంటే ఏమిటో నిరూపించుకుంటారు. గతంలో మిమ్మల్ని కించపరిచిన వారే గౌరవించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. రహస్యంగా స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. ఉద్యోగంలో స్థానచలనం తప్పదనుకుంటారు. కానీ చివరిక్షణంలో ఆ స్థానచలనం ఆగిపోతుంది. అష్టమూలికా తైలంతో నిత్యం దీపారాధన చేయండి. గృహప్రవేశాలు, శుభకార్యాలు సంతోషపరుస్తాయి. చిన్నపిల్లలు, వృద్ధులు, స్త్రీలు, అనాథలు వారికి సంబంధించిన సేవాసంస్థలకు చెప్పుకోదగిన సహాయం చేస్తారు. మీకు దొంగ లెక్కలు చెప్పేవారు అధికమవుతారు. కనుక ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా, స్వయంగా పరిశీలించుకోవడం మంచిది. సౌకర్యం కోసం కార్యాలయం మారుస్తారు. అర్ధాంతరంగా నిలిచిపోయిన నిర్మాణ పనులు పట్టుదలతో పూర్తిచేస్తారు. బాల్యంలో సరదాగా నేర్చుకున్న పనులు, విజ్ఞాన సంబంధిత విషయాలు ఇప్పుడు మీకు ఉపయోగపడతాయి. వృత్తి, ఉద్యోగాలపరంగా ఉన్న పోటీని సమర్థవంతంగా ఎదుర్కొంటారు. ప్రతి విషయంలోనూ ముందు జాగ్రత్తలు తీసుకుంటారు. మీ పాండిత్యం అందరిచేత ప్రశంసించబడుతుంది. అసూయాగ్రస్తులైన శత్రువర్గంతో ఇబ్బందులు ఏర్పడినా వాటిని అధిగమించగలుగుతారు. శత్రువర్గం అంటే చిన్న శత్రువర్గం కాదు. ఉన్నతస్థానంలో ఉన్న అధికారుల అండదండలు కలిగిన వారితో పోరాటం చేయవలసి వస్తుంది. మీ మిత్రవర్గం, మీకు సన్నిహితంగా చెప్పుకునే వారు మీరు పోరాటంలో ఓడిపోవాలని కోరుకుంటారు. శల్యసారథ్యం చేస్తారు. దైవానుగ్రహం వల్ల మీరే విజయం సాధించగలుగుతారు. మీ ఉనికికి, స్థానానికి ఇబ్బంది లేకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. భాగస్వామ్య వ్యాపారాలు లాభాల బాటలో నడుస్తాయి. భాగస్వాముల నిరాశా వైఖరి మీకు విసుగు కలిగిస్తుంది. వారిని మార్చే ప్రయత్నంలో మీరు విజయం సాధిస్తారు. వారిని కార్యోన్ముఖులను చేయగలుగుతారు. ప్రతినిత్యం నాగసింధూరం నుదుటన ధరించడం వలన నరదిష్టి, నరఘోష తొలగిపోయి జనాకర్షణ ఏర్పడుతుంది. ఐ.ఎ.ఎస్., ఐ.పి.ఎస్., ఐ.ఐ.టి ఉద్యోగాలకుఎంపికవుతారు. వచ్చిన అవకాశాలను సక్రమంగా సద్వినియోగం చేసుకుంటారు. ప్రభుత్వపరంగా, ప్రైవేటు సంస్థలపరంగా రావలసిన పెద్ద మొత్తంలోని ధనం మీ చేతికి అందుతుంది. మీ స్వంత ఆలోచనలు అమలు చేసే ముందు పూర్వాపరాలు సన్నిహితులతో, మిత్రులతో చర్చించడం మరువవద్దు. కలిసి వచ్చే కాలాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకోండి. ఓర్పు, సంయమనం చాలా ముఖ్యమని గ్రహించండి. న్యాయబద్ధంగా మీకు రావలసిన ఉద్యోగం కోసం న్యాయస్థానాలను ఆశ్రయించాల్సిన పరిస్థితి వస్తుంది. నిత్యం సిద్ధగంధంతో శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని పూజించడం చెప్పదగినది. సంస్కారహీనులు, వ్యసనాలకు బానిసలైన చిన్ననాటి మిత్రులను దూరంగా ఉంచుతారు. వారి ప్రవర్తన కారణంగా మీ చేతిలో ఉన్న సహాయం కూడా చేయరు. దూరప్రాంత విద్య, ఉద్యోగం వంటి ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రజాసంబంధాలు పెంచుకోవడానికి అనుకూల సంవత్సరమిది. యూనియన్ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. తోటివారికి న్యాయం జరగాలని మీరు జరిపే పోరాటం ఫలిస్తుంది. సాంకేతిక కారణాల వలన పొరపాటు సమాచారాన్ని విని అదే నిజమని నమ్ముతారు. ఇందువల్ల ప్రయోజనాలకు నష్టం ఏర్పడకపోయినా అపార్థాలు చోటుచేసుకుంటాయి. ఆధ్యాత్మిక వ్యవహారాలవైపు దృష్టి మళ్ళించడం మంచిది. మనోనిగ్రహంతో కఠినమైన క్రమశిక్షణతో ఆరోగ్యాన్ని గాడిలో పెడతారు. కుటుంబసభ్యులతో కలిసి విందువినోదాలలో పాల్గొంటారు. అప్పు ఇవ్వడం, అప్పు తీసుకోవడం రెండూ కలిసిరావు. శుభకార్య ప్రయత్నాలు సానుకూలపడతాయి. ఇమెయిల్స్ లేదా ఫోన్ సంభాషణల ద్వారా మీకు ఉపయోగపడే సమాచారం అందుకుంటారు. స్వయం నిర్ణయాలకు ప్రాధాన్యం ఇస్తారు. నిదానమే ప్రధానమన్న సూక్తిని పాటించడం మంచిది. రాజకీయ పదవి లభిస్తుంది. అంతరంగిక చర్చలు జరిగే చోట కొత్తవారికి చోటు కల్పించకండి. మీ మాటలకు వక్రభాష్యాలు చెప్పేవారు అధికమవుతారు. జాగ్రత్త వహించండి. దుబారా ఖర్చులు, ఆదాయాన్ని మించిన ఖర్చులు ఇబ్బంది పెడతాయి. ఆడంబరాలకు ఇంత వ్యయం చేయాలా? అనే భావన కలుగుతుంది. ఇసుక నుండి తైలం తీయవచ్చు కానీ ఇష్టంలేని వ్యక్తుల నుంఢి ప్రేమాభిమానాలు సాధించడం సాధ్యంకాని పని అని గ్రహిస్తారు. కొందరి విషయంలో కఠినమైన నిర్ణయాలు తీసుకుంటారు. సైట్ పెరిగే అవకాశం ఉంది. జాగ్రత్త వహించండి. వివాదాలకు, తగువులకు దూరంగా ఉండాలని మీరు భావించినా కాలం అందుకు సహకరించదు. మీ మీద వచ్చిన ఆరోపణలను సమర్థవంతంగా తిప్పికొట్టగలుగుతారు. మీ సామర్థ్యాన్ని మరోసారి ఋజువు చేసుకుంటారు. మీ మీద ఆధారపడిన అనేకమందికి న్యాయం చేస్తారు, ఆదుకుంటారు. ఎక్కడ చెప్పవలసిన మాటలు అక్కడ చెప్పి లౌక్యంగా విధులు నిర్వర్తించుకోవడమే సమాజ ప్రవృత్తిగా భావిస్తారు. ఆ విధంగా ప్రవర్తించకపోతే ‘‘పాముపడగ నీడలోనైనా సురక్షితంగా ఉండవచ్చునేమో కానీ ఆ మోసపూరిత సమాజంలో బ్రతకలేమని గ్రహిస్తారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఇప్పటినుండే లొంగి ఉండడం మీ సిద్ధాంతాలకు విరుద్ధంగా పనిచేయడం మీకు చేతకాదని తేల్చి చెప్పేస్తారు. ఆత్మగౌరవం లేని వ్యక్తుల సహాయం అక్కర్లేదని తెగతెంపులు చేసుకుంటారు కృషిని నమ్ముకుంటారు. భగవంతుడిని కూడా కోరికలు అడిగే పద్ధతికి స్వస్తి చెబుతారు. మీ కృషి వ్యర్థం కాదని చాలా సందర్భాలలో ఋజువవుతుంది. రియల్ ఎస్టేట్ సంబంధమైన వ్యాపార వ్యవహారాలు బాగుంటాయి. ఇంటి సమస్యలు తగ్గుముఖం పడతాయి. మీ పని మీరు నిరాటంకంగా చేసుకుపోవడానికి అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. వంశపారంపర్యంగా సంక్రమించవలసిన ఆస్తుల విషయంలో పెద్దవారు వ్రాసిన డాక్యుమెంట్స్‌లో లోపాలు బయటపడతాయి. కీలకమైన బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించి కీర్తిప్రతిష్ఠలు గడిస్తారు. మీ ప్రాధాన్యత ఎంతమాత్రం తగ్గదు. ప్రత్యామ్నాయం లేని పరిస్థితులలో చాలా మందికి మీరే దిక్కవుతారు. పనిచేసే సామర్థ్యం, నేర్పరితనం, నీతి నిజాయితీలే మిమ్మల్ని నిలబెడతాయి. అయినవారి విషయంలో న్యాయం జరుగుతుంది. ఒరిగిపోయిన ఓ జీవి జ్ఞాపకాలు అదేపనిగా గుర్తుకురావడం వల్ల చెప్పలేని మానసిక వేదన, హృదయభారం, వైరాగ్యం, నిర్వేదం, నిరుత్సాహం కలిగిస్తాయి. కొన్ని సందర్భాలలో ఇంకా ఏమి సాధించాలని జీవిస్తున్నామన్న భావన మనస్సును వేధిస్తుంది. భగవంతుడి సంకల్పం ముందు మానవుడి శక్తిసామర్థ్యాలు, అభ్యర్థనలు, విన్నపాలు, ప్రార్థనలు, పూజలు పనిచేయవన్న కఠోర సత్యాన్ని తెలుసుకుంటారు. ప్రింట్మీడియా ద్వారా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా నూతన అవకాశాలు కలిసివస్తాయి. వంశపారంపర్యంగా ఆస్తులు కలిసివస్తాయి. వ్యాపార విస్తరణకు అవసరమైన ప్రభుత్వ అనుమతులు ఆలస్యమవుతాయి. కొన్ని అవకాశాలు చేతిలో ఉండి ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఆర్థికపరమైన ఇబ్బందులు ఇన్కవ్ుట్యాక్స్ సమస్యలు తొలగిపోతాయి. విలువైన పత్రాలు, డాక్యుమెంట్స్ భద్రత విషయంలో జాగ్రత్త వహించండి, చోరభయం పొంచి వుంది. సంతానానికి సంబంధించిన విద్యా విషయాలలో ఖర్చు చాలా ఎక్కువ అవుతుంది. వాటిని సమర్థవంతంగా నిర్వహిస్తారు. విలాసవంతమైన జీవితానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. మీ పరిధిలో లేని పనులు చేసిపెట్టమని ఒత్తిడి పెరుగుతుంది. విధి నిర్వహణలో ఇది సమస్యగా మారుతుంది. రాజకీయ నాయకులను కొనుక్కుంటే ఏ రకమైన తప్పు చేసినా శిక్షలు పడవు అని గ్రహిస్తారు. గనులు, ఇసుక వ్యాపారాలలో లాభాలు గడిస్తారు. కొంతమంది రాజకీయ నాయకులకు మీరు అంతరంగికులుగా ఉంటారు. వివాహాది శుభకార్యాలు ఘనంగా నిర్వహిస్తారు. స్టాక్ మార్కెట్లు కలిసిరావు. -
శార్వరి నామ సంవత్సర (కుంభ రాశి) రాశిఫలాలు
ఈ రాశివారికి ఈ సంవత్సరం మంచి ఫలితాలు సూచిస్తున్నాయి. మీ దగ్గర మధ్యవర్తులు ఇతరుల పేర్లు చెప్పి డబ్బు గుంజుతారు. అందులో అబద్ధాలు ఉన్నాయని తెలిసినా డబ్బు సర్దుబాటు చేస్తారు. నమ్ముకున్న వ్యక్తులు, మీవాళ్లు అనుకున్న వ్యక్తులు, రాజకీయ నాయకులు, అధికారులు చెప్పుకోదగిన స్థాయిలో ఉపయోగపడరు. అందరినీ వ్యతిరేకించి మీరు పట్టుబట్టి ఉన్నతస్థానంలో ఉంచిన వ్యక్తులు మీకు మేలు చేస్తారు. ఆత్మీయవర్గం కూడా కొన్ని సందర్భాలలో అపార్థం చేసుకోవడం జరుగుతుంది. అత్యున్నత విజ్ఞానవాదులు, ఎంతో పుణ్యం కలిగినవారు, సమాజంలో ప్రఖ్యాతి కలిగిన వారు వారి వారి భావాలకు విరుద్ధంగా మీతో స్నేహం చేస్తారు, మీ మాటలు, సలహాలు, ప్రవర్తన వారిని విశేషంగా ఆకట్టుకుంటాయి. నిత్యం ఓం నమశివాయ వత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి. ప్రభుత్వ కార్యాలయంలో మీ పరపతి పెరుగుతుంది. అయినా సాధారణ ఫలితాలు మాత్రమే సాధిస్తారు. మొండి బాకీల వ్యవహారాలు కొత్త మలుపు తిరుగుతాయి. మీ సాటివాళ్ళు మీకన్నా అధికంగా లాభం పొందుతారు. ఈ విషయం మిమ్మల్ని బాధించినా కొంతకాలం తరువాత మీకు కూడా అదే విధమైన ప్రయోజనాలు చేకూరుతాయి. భాగస్వాములుగా చేరమని ఒత్తిడి తెస్తారు. అనుభవం లేని రంగాలలో కొత్తవారిని నమ్మి వ్యాపారంలో దిగుతారు. కోర్టు వ్యవహారాలు అనుకూలిస్తాయి. స్టాక్ మార్కెట్ల జోలికిపోవద్దు. మీ మాటలకు వక్రార్థాలు వచ్చే అవకాశం ఉంది. విదేశీయాన ప్రయత్నాలు ఊహించిన సమయం కంటే ముందే అనుకూలిస్తాయి. విదేశీయాన ప్రయత్నాలలో మీకు సహకరించిన వారి ఋణం తీర్చుకుంటారు. కార్యాలయంలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తారు. పరిస్థితులను మీకు అనుకూలంగా మలుచుకుంటారు. నిజమైన మిత్రులు ఎవరో? కాని వారు ఎవరో? కంటికి స్పష్టంగా తెలుస్తుంది. స్త్రీల వల్ల సమస్యలు రాకుండా జాగ్రత్త పడాలని నిర్ణయించుకుంటారు. గణాంకములలో మోసాలు చెల్లించిన ధనాన్ని చెల్లించలేదని, తీసుకోని ధనము తీసుకున్నారని మొదలైన నిందలు అసౌకర్యానికి గురిచేస్తాయి. నష్టము, బాధలు ఏ స్థాయిలో జరిగినా ఇలాంటివి అల్పమని గ్రహించండి. విలువైన వస్తువులకు ఇన్సూరెన్స్ చేయడం మరిచిపోకండి. దొంగతనాలకు అవకాశం ఉంది, జాగ్రత్త వహించండి. కుటుంబ ప్రతిష్ఠను దెబ్బతీసే ప్రయత్నాలను సమర్థవంతంగా ఎదుర్కొంటారు. అనుమానాస్పద భూములు, ఆర్థికలావాదేవీల జోలికి వెళ్ళవద్దు. గృహ సంబంధిత విషయాలకు అధిక ధనం వెచ్చిస్తారు. ఇరుగు పొరుగు వారితో పరుష సంభాషణలు, బేధాభిప్రాయాలు సంభవిస్తాయి. అనుకున్న కార్యక్రమాలు పూర్తయి, మంచి స్థితి సాధించినా సుఖపడటానికి కొంత సమయం పడుతుందని గ్రహిస్తారు. భాగస్వాముల మధ్య విభేదాలు ఇతరులకు ఉపయోగపడే విధంగా మారడం బాధ కలిగిస్తుంది. నిష్కారణంగా నోరుజారి పరువు తీసుకొని బజారుకు ఎక్కే ఆత్మీయవర్గం మనోవేదనగా మారుతారు. మీ ఓర్పు, సహనం కృత్రిమంగా తెచ్చిపెట్టుకున్నట్లుగానే అందరికీ అర్థం అవుతుంది. సమస్యలు ఎదురైనా అభివృద్ధి సాధించడానికి శారీరకంగా, మానసికంగా అహోరాత్రులు శ్రమిస్తారు. కాంట్రాక్టులు, సబ్‌కాంట్రాక్టులు, లైసెన్సులు లీజులు లాభిస్తాయి. దైవానుగ్రహం వెన్నంటి రక్షిస్తున్నట్లుగా భావిస్తారు. బరువుబాధ్యతలు, శుభకార్యాలు పూర్తి చేయడానికి అధికంగా ధనం వెచ్చిస్తారు. స్థిరాస్తులు అమ్మేటప్పుడు అన్ని విషయాలలో జాగ్రత్త వహించండి, మోసపోయే అవకాశం ఉంది. రాజకీయాలలో రాణిస్తారు. రాజకీయ పలుకుబడి పెరుగుతుంది. విందువినోదాలలో కొత్త విషయాలు తెలుసుకుంటారు. కీలక సమాచారం లభిస్తుంది. అపురూపమైన ప్రదేశాలను కుటుంబసభ్యులతో కలిసి సందర్శిస్తారు. మానసిక ప్రశాంతత కలుగుతుంధి. నాగబంధాన్ని ఉపయోగించండి. సమాజంలో పెద్దలుగా చలామణీ అవుతున్న వారి అంతరంగిక రహస్యాలు మీకు తెలుస్తాయి. దీక్షలు ఘనంగా పూర్తిచేస్తారు. మహత్తరమైన కార్యక్రమాలను శ్రమించి ఒంటరిగా అనుకూల ఫలితాలు సాధిస్తారు. ఉన్నతస్థానాలలోని వారి సహకారం లేకుండా మీరు సాధించిన వాటికి మీ శక్తికొలది సహాయపడతారు. వృద్ధాశ్రమాలు, అనాథాశ్రమాలు, వికలాంగులకు సంబంధించిన వాటికి మీ సంపూర్ణ సహకారాలను అందజేస్తారు. విదేశాల నుండి కూడా నిధులు పోగుచేసి వారికి సహాయం చేద్దామనుకున్న మీ ప్రయత్నాలకు ఓ వ్యక్తి సైంధవుడిలా అడ్డుపడతాడు. మాట తప్పే మనుషుల వల్ల నష్టం కలుగుతుంది. కళా, సాంస్కృతిక వ్యవహారాలలో, క్రీడలలో నూతన అవకాశాలు అందివస్తాయి. మీ వ్యాపారానికి సంబంధించిన వ్యవహారాలు, వ్యక్తిగత విషయాలు ఇతరులకు తెలియటం వల్ల వివాదాలు, విమర్శలు చోటుచేసుకుంటాయి. కుటుంబ విషయాలను నిర్లక్ష్యం చేయవద్దు. మీ పర్యవేక్షణ అవసరము. వృత్తిఉద్యోగాలకు సంబంధించిన ఒక ముఖ్యమైన విషయాన్ని రహస్యంగా చక్కబెడతారు. మీరు కోరుకున్న కోరికలు తీరుతాయి. విదేశాలలో ఉన్న మీ ఆత్మీయవర్గం ఆకస్మికంగా రావడం జరుగుతుంది. ఇందుకు కారణాలు ఎంత వెతికినా మీకు కనిపించవు. కొన్ని విషయాలు పట్టించుకోకుండా ఉంటేనే మనశ్శాంతి లభిస్తుందన్న నిజాన్ని మీరు గ్రహిస్తారు. ప్రేమ వివాహాలకు సంబంధించిన వ్యవహారాలు మీ చొరవ వల్ల ఒక కొలిక్కి వస్తాయి. గ్రీన్‌కార్డు కోసం ప్రయత్నించే వారికి ఈ సంవవత్సరం సానుకూలపడుతుంది. వ్యాపార విస్తరణ కోసం బ్యాంకు ఋణాలు తీసుకుంటారు. నూతన భాగస్వాముల చేరిక ఉత్సాహాన్ని కలిగిస్తుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీరు ఎన్నుకున్న ప్రదేశాలను బట్టి లాభనష్టాలు ఉంటాయి. సమున్నతమైన శిఖరాలను అధిరోహించాలని, అందరికీ ఆదర్శంగా ఉండాలని భావిస్తారు. మీరు శ్రమించిన ఒకానొక వ్యవహారం లాభిస్తుంది. ఇక తిరుగులేని అరుదైన విజయాన్ని నమోదు చేసుకుంటారు. కీర్తిప్రతిష్ఠలు లభిస్తాయి. శక్తిసామర్థ్యాలకు తగిన గుర్తింపు, చదివిన చదువుకు తగిన ఉద్యోగం లభిస్తుంది. ఎగుమతి, దిగుమతి వ్యాపారాలకు కాలం అనుకూలంగా ఉన్నప్పటికీ సామాజిక పరిస్థితులు, వాతావరణ పరిస్థితుల వలన కొంత ఇబ్బంది కలుగుతుంది. లీజులకు సంబంధించిన విషయాలు, ఇసుక వ్యాపారము కొంత వివాదస్పదం అవుతాయి. ప్రతి కీలక సమయంలోనూ దైవానుగ్రహం, రాజకీయ పలుకుబడి మిమ్ములను రక్షిస్తాయి. ప్రైవేటు వ్యక్తుల నుండి లోనులు తీసుకోవలసిన పరిస్థితి బహుశా రావచ్చు. వృత్తిఉద్యోగాలపట్ల అంకితభావంతో దివారాత్రులు శ్రమిస్తారు. అందరి మెప్పులను పొందగలుగుతారు. ప్రమోషన్ లభిస్తుంది. కానీ కొంతమంది కుహానా వ్యక్తులు మీ శ్రమ, అంకితభావం వెనుక స్వార్థప్రయోజనాలు ఉన్నాయని ప్రచారం చేస్తారు. మీ వ్యక్తిత్వంలో, దినచర్యలో ఉన్న లోపాలను తెలుసుకోవడానికి విశ్వప్రయత్నం చేస్తారు. ఆరోగ్య సంబంధమైన సమస్యలు కొంతకాలం బాధపెడతాయి. అరికాలి మంటలు, మోకాళ్ళనొప్పులు, ఇ.ఎన్.టి. ప్రాబ్లమ్స్ ఇబ్బందిపెట్టే అవకాశం ఉంది. ప్రధానంగా కీళ్ళు, వెన్నెముక బాధలు ఉండవచ్చు. సోదరసోదరీ వర్గానికి రహస్యంగా ఆర్థికసహాయం అందిస్తారు. వాళ్ళలో ఐకమత్యం లేకపోవడం వల్ల మీరు చేసిన సహాయం బయటపెడతారు. ఎంత కలిసి వచ్చినా డబ్బులు ఉన్నా సంఘంలో మంచి స్థాయి లభించినా దేనికీ లోటు లేని పరిస్థితి ఉన్నా ఏదో ఒక మానసిక అప్రశాంతత బాధిస్తుంది. గతించిపోయిన వ్యక్తి జ్ఞాపకాలు ఎంతగానో బాధిస్తాయి. మరుపు అంత తేలిక కాదని గ్రహిస్తారు. కాలానికి ఎదురీదడం మీ వల్ల కాదని గ్రహిస్తారు. ట్రాన్స్పోర్ట్, ట్రావెలింగ్ బిజినెస్లోని వాళ్ళకి బాగుంది. వ్యవసాయరంగంలో ఉన్న వారికి ఫలితాలు బాగున్నాయి. డాక్టర్లు, లాయర్లకు, విద్యాసంస్థల వారికి ఇబ్బంది లేనటువంటి కాలం అయినప్పటికీ సొంత వ్యక్తుల పొరపాట్లు అపఖ్యాతికి దారితీయవచ్చు. పోటీపరీక్షలో గానీ మామూలు పరీక్షలలో గానీ మీరు వ్రాసింది కాపీ కొట్టిన వారికి ఎక్కువ మార్కులు, మీకు తక్కువ మార్కులు వస్తాయి. కాపీయింగును ప్రోత్సహించడమే తప్పని తెలుసుకుంటారు. రాజకీయ మార్పులు చేర్పులు మీకు లాభిస్తాయి. విదేశాలలో ఉన్న మీ ఆత్మీయవర్గం ప్రశాంతంగా ఉన్నారని తెలుస్తుంది. అక్కడి నుండి వచ్చే ఫోన్‌కాల్స్ మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది. నిష్కారణ వేధింపులకు గురి అవుతున్న మీ సంతానానికి ఏదో ఒక పరిష్కార మార్గం చూపించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. చిల్లరమల్లర తగాదాలు, మధ్యవర్తిత్వాలు, రాజీయత్నాలు విసుగుపుట్టిస్తాయి. ఏ పనిచేయాలనుకున్నా సమాజాన్ని, ఆత్మగౌరవాన్ని దృష్టిలో ఉంచుకోవాల్సి వస్తుంది. ఇందువలన చేతిలో ఉన్న పనులను కూడా చేయలేకపోతారు. అందరూ అన్ని పనులు చేయలేరని సరిపెట్టుకుంటారు. స్వగృహయోగం ఏర్పడుతుంది. -
శార్వరి నామ సంవత్సర (వృశ్చిక రాశి) రాశిఫలాలు
ఈ రాశివారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుటుంబ పురోగతి, ఆర్థిక పురోగతి బాగుంటాయి. విద్యాసంబంధమైన విషయాలు సానుకూలపడతాయి. కొన్ని స్థిరాస్తులు కొంటారు. కొన్ని స్థిరాస్తులు అమ్మి వేరేవిధంగా అభివృద్ధి చేస్తారు. ఉద్యోగపరంగా మీ స్థాయి పెరుగుతుంది. పరపతి కలిగిన రాజకీయ నాయకులు, స్నేహితులు అండగా ఉంటారు. బలహీనమైన అధికారులు, పనికిరాని స్నేహితులు, బంధువర్గం దూరమవుతారు. ఆర్థికపురోగతికి నూతన వ్యాపారాలు చేయాలని గట్టిగా నిర్ణయించుకుంటారు. అయితే ఈ విషయాన్ని గోప్యంగా ఉంచుతారు. మీడియా వల్ల మేలు జరుగుతుంది. న్యాయ పోరాటానికి కొన్ని విషయాలలో సిద్ధపడతారు. ఇతరుల అవినీతికి సంబంధించిన విషయాలు వెలుగులోకి తెచ్చి రుజువు చేస్తారు. కాంట్రాక్ట్, సబ్‌కాంట్రాక్టులు, లీజులు అనుకూలిస్తాయి. వ్యాపారంలో నూతన బ్రాంచీలు నెలకొల్పుతారు. మీ ఆధ్వర్యంలో నడుస్తున్న విద్యాసంస్థలకు మంచి కీర్తిప్రతిష్ఠలు లభిస్తాయి. నిరుద్యోగులైన విద్యావంతులకు చదువుకున్న చదువుకు తగిన ఉద్యోగం లభిస్తుంది. పోటీపరీక్షలలో విజయం సాధిస్తారు, జీవితాశయం నెరవేరుతుంది. రాజకీయ జీవితం బాగుంటుంది. రాజకీయ పదవీప్రాప్తి, ఆశించిన లాభాలు, ఫలితాలు మీకు చేతికి అందుతున్న వేళ స్వార్థపరులు మీకు సన్నిహితంగా మెలుగుతారు. చాలా జాగ్రత్త వహించండి. సినిమా, టీ.వీ, ట్రావెల్స్, ఆటోమొబైల్స్ రంగంలోని వారికి అనుకూలంగా ఉంటుంది. అన్నదానానికి, గోసంరక్షణకు మీ శక్తిమేర విరాళాలు ఇస్తారు. భాగస్వాముల పనితీరుని ఒక కంట కనిపెడుతూనే ఉంటారు. వారిలో లోపం కంటపడినప్పుడల్లా హెచ్చరికలు జారీ చేస్తుంటారు. మితిమీరిన ఆత్మవిశ్వాసంతో ఎప్పుడూ వ్యవహరించరు. పరిస్థితులు బేరీజు వేసుకుని సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకుని లాభపడతారు. సర్పదోష నివారణా చూర్ణములో సర్వరక్షా చూర్ణము కలిపి స్నానం చేయండి. ఎక్కువ జీతం ఇచ్చి నమ్మకమైన సేవక జనాన్ని నియమించుకుంటారు. అపార్ట్మెంట్ కొనుగోలు విషయంలో జాగ్రత్తగా ఆలోచన చేసి నిర్ణయం తీసుకోండి. చెప్పుడు మాటలు విని కాకుండా వాస్తవాలు స్వయంగా తెలుసుకుని నిర్ణయం తీసుకోండి. బంగారం, వెండి, విలువైన వస్తువుల భద్రత విషయంలో జాగ్రత్త వహించండి. వాయిదా పద్ధతిలో అవసరం లేకపోయినా కొన్ని వస్తువులు కొనుగోలు చేస్తారు. ప్రభుత్వపరంగా రావలసిన బిల్లులు చేతికి అందుతాయి. స్పెక్యులేషన్‌కి దూరంగా ఉండండి. పన్నులు వసూలు చేసే అధికారుల వల్ల ఇబ్బందులు వస్తాయి. సరైన సమయానికి ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయండి. ఇతరులు ఇచ్చిన చెక్కులు బౌన్స్ అవుతాయి. ఇదే సమస్యగా మారుతుంది. డబ్బులు వసూలు చేసుకోలేరు, వారిపై చర్య తీసుకోలేరు. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న అగ్రిమెంట్స్ పూర్తవుతాయి. నూతన లైసెన్సులు లభిస్తాయి. విద్యాసంబంధిత, నిర్మాణ సంబంధిత ఋణాలు మంజూరు అవుతాయి. నిత్యం హనుమాన్ సింధూర్ ధరించడం వలన మనోధైర్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. పశువుల పెంపకం, పౌల్ట్రీ వ్యాపారులకు అనుకూలం. ఫంక్షన్‌హాల్స్ నిర్వాహకులకు మధ్యస్థంగా ఉంది. పాల ఉత్పత్తులకు సంబంధించిన వ్యాపారంలో లాభాలు బాగుంటాయి. ఇంటర్నెట్ సెంటర్, వైద్య పరికరాలు అమ్మే వ్యాపారులకు అనుకూలంగా ఉంది. రాజకీయ పైరవీలు లాభిస్తాయి. కీళ్ళనొప్పులు, ఇ.ఎన్.టి. సమస్యలు ఇబ్బంది పెడతాయి. యోగాసనాలు, మెడిటేషన్ వల్ల లబ్ధి పొందుతారు. తెలిసి తెలియని వైద్యం చేయించుకోవద్దు. ప్రకృతి వైద్యాలకు దూరంగా ఉండండి. నరదిష్టి, బంధుఘోష అధికంగా ఉంటుంది. వివాహాది శుభకార్యాలు ఘనంగా నిర్వహిస్తారు. పుస్తక పఠనం, గ్రంథ రచన పట్ల శ్రద్ధ అధికమవుతుంది. పట్టుదలతో కృషి చేస్తారు. ఈ పట్టుదల వెనుక ఆంతర్యంలో ప్రతీకారం, పగ పొంచి ఉంటాయి. సందర్భోచిత నిర్ణయాలు తీసుకుని మీ పెద్దరికాన్ని కాపాడుకుంటారు. సోదరసోదరీ వర్గంతో సంబంధ బాంధవ్యాలు సక్రమంగా నిర్వర్తిస్తారు. అధిక శ్రమ చేస్తారు. అయితే మీరు ఊహించని పరిణామాలు ఏర్పడటం వల్ల ప్రత్యర్థుల వ్యూహం వల్ల అంతగా లాభాలు రావు. అయినప్పటికీ మరో రూపంలో ధనం వస్తుంది. ఆ లోటు పూడుస్తుంది. మీ పేరు మీద ఇతరులు చేసే వ్యాపారాలలో అవకతవకలు చోటు చేసుకుంటాయి. మీ సన్నిహితుల సహకారంతో వాటిని ఒక గాడిలో పెట్టగలుగుతారు. సామాజిక సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. కార్యాలయంలో టీమ్ స్పిరిట్‌తో పనిచేసి మంచి ఫలితాలు సాధించి ఉన్నతాధికారుల మెప్పు పొందుతారు. ఉద్యోగంలో స్థాయి పెరుగుతుంది. వాహనం మార్పు చేస్తారు లేదా కొత్త వాహనాన్ని కొనుగోలు చేస్తారు. రాజకీయ పదవిప్రాప్తి. కోర్టుపరమైన వ్యవహారాల గురించి విస్తృతమైన చర్చ కొనసాగిస్తారు. కోర్టుతీర్పులు రాకుండానే మధ్యవర్తి ప్రయత్నాలు ఫలిస్తాయి. శాంతి, సహనం, ఓర్పు వహించి చర్చలు ఫలవంతం చేసుకుంటారు. మీ ప్రయోజనాలు కాపాడుకుంటారు. మీ వ్యాపారంలో ఓ స్త్రీ భాగస్వామ్యం కలిసి వస్తుంది. మీ భాగస్వాముల వద్ద, స్నేహితుల వల్ల మీ విశ్వాసాన్ని నిరూపించుకోవలసి రావడం ఇబ్బందిగా మారుతుంది. మీరు సహకరించదు. మీ మీద వచ్చిన ఆరోపణలను సమర్థవంతంగా తిప్పికొట్టగలుగుతారు. మీ సామర్థ్యాన్ని మరోసారి ఋజువు చేసుకుంటారు. మీ మీద ఆధారపడిన అనేకమందికి న్యాయం చేస్తారు, ఆదుకుంటారు. ఎక్కడ చెప్పవలసిన మాటలు అక్కడ చెప్పి లౌక్యంగా విధులు నిర్వర్తించుకోవడమే సమాజ ప్రవృత్తిగా భావిస్తారు. ఆ విధంగా ప్రవర్తించకపోతే ‘‘పాముపడగ నీడలోనైనా సురక్షితంగా ఉండవచ్చునేమో కానీ ఆ మోసపూరిత సమాజంలో బ్రతకలేమని గ్రహిస్తారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఇప్పటినుండే లొంగి ఉండడం మీ సిద్ధాంతాలకు విరుద్ధంగా పనిచేయడం మీకు చేతకాదని తేల్చి చెప్పేస్తారు. ఆత్మగౌరవం లేని వ్యక్తుల సహాయం అక్కర్లేదని తెగతెంపులు చేసుకుంటారు కృషిని నమ్ముకుంటారు. భగవంతుడిని కూడా కోరికలు అడిగే పద్ధతికి స్వస్తి చెబుతారు. మీ కృషి వ్యర్థం కాదని చాలా సందర్భాలలో ఋజువవుతుంది. రియల్ ఎస్టేట్ సంబంధమైన వ్యాపార వ్యవహారాలు బాగుంటాయి. ఇంటి సమస్యలు తగ్గుముఖం పడతాయి. మీ పని మీరు నిరాటంకంగా చేసుకుపోవడానికి అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. వంశపారంపర్యంగా సంక్రమించవలసిన ఆస్తుల విషయంలో పెద్దవారు వ్రాసిన డాక్యుమెంట్స్‌లో లోపాలు బయటపడతాయి. కీలకమైన బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించి కీర్తిప్రతిష్ఠలు గడిస్తారు. మీ ప్రాధాన్యత ఎంతమాత్రం తగ్గదు. ప్రత్యామ్నాయం లేని పరిస్థితులలో చాలా మందికి మీరే దిక్కవుతారు. పనిచేసే సామర్థ్యం, నేర్పరితనం, నీతి నిజాయితీలే మిమ్మల్ని నిలబెడతాయి. అయినవారి విషయంలో న్యాయం జరుగుతుంది. ఒరిగిపోయిన ఓ జీవి జ్ఞాపకాలు అదేపనిగా గుర్తుకురావడం వల్ల చెప్పలేని మానసిక వేదన, హృదయభారం, వైరాగ్యం, నిర్వేదం, నిరుత్సాహం కలిగిస్తాయి. కొన్ని సందర్భాలలో ఇంకా ఏమి సాధించాలని జీవిస్తున్నామన్న భావన మనస్సును వేధిస్తుంది. భగవంతుడి సంకల్పం ముందు మానవుడి శక్తిసామర్థ్యాలు, అభ్యర్థనలు, విన్నపాలు, ప్రార్థనలు, పూజలు పనిచేయవన్న కఠోర సత్యాన్ని తెలుసుకుంటారు. ప్రింట్మీడియా ద్వారా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా నూతన అవకాశాలు కలిసివస్తాయి. వంశపారంపర్యంగా ఆస్తులు కలిసివస్తాయి. వ్యాపార విస్తరణకు అవసరమైన ప్రభుత్వ అనుమతులు ఆలస్యమవుతాయి. కొన్ని అవకాశాలు చేతిలో ఉండి ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఆర్థికపరమైన ఇబ్బందులు ఇన్కవ్ుట్యాక్స్ సమస్యలు తొలగిపోతాయి. విలువైన పత్రాలు, డాక్యుమెంట్స్ భద్రత విషయంలో జాగ్రత్త వహించండి, చోరభయం పొంచి వుంది. సంతానానికి సంబంధించిన విద్యా విషయాలలో ఖర్చు చాలా ఎక్కువ అవుతుంది. వాటిని సమర్థవంతంగా నిర్వహిస్తారు. విలాసవంతమైన జీవితానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. మీ పరిధిలో లేని పనులు చేసిపెట్టమని ఒత్తిడి పెరుగుతుంది. విధి నిర్వహణలో ఇది సమస్యగా మారుతుంది. రాజకీయ నాయకులను కొనుక్కుంటే ఏ రకమైన తప్పు చేసినా శిక్షలు పడవు అని గ్రహిస్తారు. గనులు, ఇసుక వ్యాపారాలలో లాభాలు గడిస్తారు. కొంతమంది రాజకీయ నాయకులకు మీరు అంతరంగికులుగా ఉంటారు. వివాహాది శుభకార్యాలు ఘనంగా నిర్వహిస్తారు. స్టాక్ మార్కెట్లు కలిసిరావు. -
శార్వరి నామ సంవత్సర (మకర రాశి) రాశిఫలాలు
ఈ రాశివారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి. విదేశీ సంబంధమైన అవకాశాలు మీకు మీ రక్తసంబంధీకులకు, మీ కుటుంబీకులకు వస్తాయి. ఇది మీ ప్రతిష్ఠను పెంచుతుంది. కృషి వ్యర్థం కాదన్న సంగతి చాలా సందర్భాలలో ఋజువు అవుతుంది. విదేశాలలో మీ వారికి కీలక సమయంలో తగు సహాయం చేస్తారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించవలసి వస్తుంది. కుటుంబ విషయాల తాలూకు ప్రభావం మీ వృత్తి ఉద్యోగ, వ్యాపారాల మీద పడుతుంది, జాగ్రత్త వహించండి. ఎంత జాగ్రత్త వహించినా సహచరవర్గము, అనుచర వర్గము, సోదర వర్గము వల్ల కొన్ని చికాకులు, సమస్యలు తప్పకపోవచ్చు. ఎవరిని నమ్మాలో ఎవరితో కలిసి నూతన కార్యక్రమాలు ప్రారంభించాలో నిర్ణయించుకోవడం కష్టతరం అవుతుంది. ఈ విషయంలో సరి అయిన నిర్ణయాలు తీసుకుంటే ఎక్కువగా లాభపడగలుగుతారు. ఆత్మవిశ్వాసంతో, అభిమానంతో మీరు పెంచి పోషించిన మనుషులు మీ పట్ల సగౌరవంగా ప్రవర్తించరు. మీ వ్యతిరేక వర్గానికి సహాయం చేస్తారు. ఒకనాటి శత్రువులు, మిత్రులు కావటం వల్ల కొంత మనశ్శాంతి లభిస్తుంది. నమ్మకద్రోహాన్ని, కృతఘ్నతను భరించలేరు. ఇవి పదేపదే గుర్తుకువచ్చి మనస్సును బాధిస్తాయి. లౌక్యం లోపించటం వల్ల, స్వతంత్ర భావాల వల్ల కొన్ని చెప్పుకోలేని సమస్యలు ఏర్పడతాయి. కొన్ని సమస్యలను ఒంటరిగానే ఎదుర్కొంటారు. దైవానుగ్రహం వల్ల ఆపదలను దాటుకుని అనుకూల ఫలితాలు సాధిస్తారు. స్వల్పకాల పరిచితుల వల్ల అపరిమితమైన సహాయసహకారాలు, సేవలు అందుతాయి. ఉద్యోగపరంగా స్థానచలనానికి మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. లీజులు, లైసెన్సులు అనుకూలిస్తాయి. ప్రభుత్వపరంగా రావలసిన రాయితీలు, మినహాయింపులు వస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలు, దానధర్మాలు సామాజిక సేవ పురోగతిలో ఉంటాయి. అనుకూల ఫలితాలు వస్తాయి. ఎగుమతి, దిగుమతి వ్యాపారాలు లాభిస్తాయి. మీ సంస్థ గుడ్‌విల్, ప్రతిష్ఠ పెరుగుతుంది. రవాణా సంబంధితమైన ప్రింటింగ్, డాక్యుమెంట్స్, అప్లికేషన్స్, ఇంటర్వ్యూ కార్డులు మొదలైన విషయాలలో జాగ్రత్తగా పరిశీలించి ముందుకు సాగాలి. రొటీన్ సంతకాల విషయంలో సాంప్రదాయ వ్యక్తిగత బంధుత్వ అనుబంధాలకు అతీతంగా వ్యవహరించండి. పొరపాటు సంతకాల వల్ల ఇబ్బందులు రావచ్చు. అతికష్టం మీద ముఖ్యమైన తప్పిదాలలో మీ పొరపాటు లేదని మాత్రం ఋజువు అవుతుంది. వ్యవసాయం, వ్యవసాయ సంబంధమైన విషయాలు, వ్యవసాయ అనుబంధ వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. పిక్నిక్లు, విందువినోదాలు, విహారయాత్రలు వంటి కార్యక్రమాలలో అపశ్రుతులు సంభవించవచ్చు, జాగ్రత్త వహించండి. వీలైనంత వరకు ఇలాంటి కార్యక్రమాలకు దూరంగా ఉండండి. మీ స్థానాన్ని ఆశించిన వారు భంగపడటం మీకు ఆశ్చర్యం కలిగించదు. ఎందరు ఏమి చేసినా దైవానుగ్రహం ఉంటే చెడు కూడా మంచిగా మారుతుందని ఋజువు అవుతుంది. మీ స్వయంకృతాపరాధాలు, మీ వల్ల జరిగిన తప్పిదాలు పెద్దగా ప్రాధాన్యతను సంతరించుకోవు. సంవత్సర ద్వితీయార్ధంలో స్త్రీలకు సంబంధించి వివాదాలలోకి మీ పేరు లాగబడే అవకాశం ఉంది. మీకు లభించవలసిన ప్రయోజనాలకు ఓ మహిళ వలన ఆటంకాలు ఏర్పడతాయి. పంతాలు, పట్టింపులకు పోకుండా చర్చలతో సమస్యలు పరిష్కరించుకుంటారు. నిందల బరువు దింపుకుంటారు. మీ ప్రత్యర్థుల రాజకీయ పలుకుబడి మీ విషయంలో పనిచేయదు. అయితే కృత్రిమంగా ప్రభుత్వపరంగా ఇబ్బందులు రావచ్చు. వాతావరణంలో వచ్చిన మార్పులు ఆరోగ్యం మీద, వృత్తిఉద్యోగాల మీద ప్రభావం చూపుతుంది. స్వంత విషయాలకు విచ్చలవిడిగా ఖర్చు పెడతారని మీ మీద వచ్చిన ఆరోపణలకు సంఘటనలే సమాధానం చెబుతాయి. వృత్తిఉద్యోగాల కొరకు శ్రమించి సంపూర్ణ న్యాయం చేశామన్న సంతృప్తి కలుగుతుంది. అందరినీ సమన్యాయంతో చూస్తారన్న ప్రఖ్యాతి కూడా లభిస్తుంది. మీ సహచరవర్గంలో ప్రతిభ కలిగిన వాళ్ళను గుర్తించలేకపోయామన్న బాధ కలుగుతుంది. ఈ విషయంలో అంతర్మ«థనం చెందుతారు. నిబంధనలకు, నైతిక ధర్మానికి తిలోదకాలు ఇచ్చి మీ సాటి వాళ్ళు అధికంగా, మీతో సమానంగా ప్రయోజనాలు పొందుతారు. ఇందువల్ల మానసిక వైరాగ్యం కలుగుతుంది. ఆలోచనలు పరిపరివిధాలా పోతాయి. శత్రువర్గం ఐకమత్యంగా ఉండకుండా ఉండడానికి తగు జాగ్రత్తలు తీసుకుంటారు. స్పెక్యులేషన్‌కు దూరంగా ఉండటం చెప్పదగిన సూచన. అభివృద్ధికి ప్రముఖ వ్యక్తుల అండదండలు లభిస్తాయి. ఓర్పు వహించి కీలకమైన వ్యూహం అమలు చేస్తారు. చివరివరకు మీ ఆంతర్యం ఇతరులకు తెలియకుండా జాగ్రత్తపడతారు. విద్యా ఆర్థిక సంబంధిత విషయాలలో పురోగతి బాగుంటుంది. మీ జీవితాశయం సాధించుకోవడానికి విశేషంగా కృషి చేస్తారు. స్నేహితులు, సన్నిహితులు ప్రతి విషయంలో అండదండగా ఉంటారు. రాజకీయ జీవితంలో ఒడిదుడుకులు ఉన్నప్పటికీ మొత్తం మీద సజావుగానే సాగుతుంది. మంచివాళ్ళను ఆదర్శంగా తీసుకుని మీ జీవన గమనంలో కొన్ని మార్పులు చేస్తారు. వివాహాది శుభకార్యాలు ముడిపడతాయి. కొన్ని మంచి కార్యాలకు సంబంధించి ఋణాలు చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. వృత్తిఉద్యోగాలపరంగా అభివృద్ధి బాగుంటుంది. ఉద్యోగంలో నూతన బాధ్యతలను సక్రమంగా నిర్వహించి పై అధికారుల మెప్పు పొందుతారు. ఆర్థికపరిస్థితి అభివృద్ధి చేసుకోవడానికి విశేషంగా కృషిచేస్తారు. సన్నిహితుల పేరుమీద వ్యాపారం ప్రారంభిస్తారు. వ్యాపారం సక్రమంగా సాగడానికి అవసరమైన బలం, బలగం, రాజకీయ పలుకుబడి ఉపయోగపడతాయి. విలువైన స్థిరాస్తులలో కొంత భాగాన్ని అమ్ముదామని ప్రయత్నించినా కొన్ని కారణాల వలన కొంతకాలం వాయిదా వేస్తారు. న్యాయస్థానాలలో తీర్పులు మీకు అనుకూలంగా వస్తాయి. అందువలన ఎంతో ఊరట కలుగుతుంది. కుటుంబంలో మరొకరి సంపాదన పెరుగుతుంది. మీ ఆధ్వర్యంలో నడుస్తున్న విద్యాసంస్థలు, సేవాసంస్థలు, అనాథాశ్రమాలు సానుకూలంగా ఉంటాయి, మంచిపేరు వస్తుంది. అసూయాగ్రస్తులైన కొంతమంది వల్ల కృత్రిమంగా ఇబ్బందులు ఏర్పడతాయి. పన్నులు వసూలు చేసే అధికారుల వల్ల ఎటువంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తపడతారు. ఐకమత్యంతో సమిష్టిగా కృషి చేస్తే ఏ కార్యాన్నైనా సఫలీకృతం చేయవచ్చునని భావిస్తారు. అందరినీ కలుపుకుని ఒక ముఖ్యమైన కార్యంలో లాభం పొందుతారు. సమిష్టిగా లాభాలు పంచుకుంటారు. ఇతరులు అడిగే ప్రశ్నలకు ఓర్పుగా సమాధానాలు చెబుతారు. మీ ప్రమేయం లేకుండానే మిమ్మల్ని అందరూ స్వంత వ్యక్తిగా భావిస్తారు. విదేశాలలోని మీ వారికి గ్రీన్‌కార్డు లభించిందన్న శుభవార్త అందుకుంటారు. క్రయవిక్రయాలలో మెలకువలు పాటించండి. కళ్ళు అలసటకు విద్యాసంస్థల వారికి ఇబ్బంది లేనటువంటి కాలం అయినప్పటికీ సొంత వ్యక్తుల పొరపాట్లు అపఖ్యాతికి దారితీయవచ్చు. పోటీపరీక్షలో గానీ మామూలు పరీక్షలలో గానీ మీరు వ్రాసింది కాపీ కొట్టిన వారికి ఎక్కువ మార్కులు, మీకు తక్కువ మార్కులు వస్తాయి. కాపీయింగును ప్రోత్సహించడమే తప్పని తెలుసుకుంటారు. రాజకీయ మార్పులు చేర్పులు మీకు లాభిస్తాయి. విదేశాలలో ఉన్న మీ ఆత్మీయవర్గం ప్రశాంతంగా ఉన్నారని తెలుస్తుంది. అక్కడి నుండి వచ్చే ఫోన్‌కాల్స్ మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది. నిష్కారణ వేధింపులకు గురి అవుతున్న మీ సంతానానికి ఏదో ఒక పరిష్కార మార్గం చూపించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. చిల్లరమల్లర తగాదాలు, మధ్యవర్తిత్వాలు, రాజీయత్నాలు విసుగుపుట్టిస్తాయి. ఏ పనిచేయాలనుకున్నా సమాజాన్ని, ఆత్మగౌరవాన్ని దృష్టిలో ఉంచుకోవాల్సి వస్తుంది. ఇందువలన చేతిలో ఉన్న పనులను కూడా చేయలేకపోతారు. అందరూ అన్ని పనులు చేయలేరని సరిపెట్టుకుంటారు. స్వగృహయోగం ఏర్పడుతుంది. -
శార్వరి నామ సంవత్సర (మీన రాశి ) రాశిఫలాలు
ఈ రాశివారికి ఈ సంవత్సరం భూమి సంబంధమైన వ్యాపారాలలో లాభాలు పొందుతారు. అమ్మకాలు, కొనుగోలు వల్ల లాభపడతారు. విశేషంగా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో రాణిస్తారు. సంతాన పురోభివృద్ధికి కొంత సమయాన్ని కేటాయిస్తారు. సంతాన పురోగతి మందగించకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. సోదరసోదరీ వర్గం ప్రేమ వివాహాలు చికాకు కలిగిస్తాయి. ఇలాంటి వ్యవహారాలకు దూరంగానే ఉండాలని నిర్ణయించుకుంటారు. ఓ విధంగా మీరు బాధ్యతల నుండి తప్పుకుంటారు. స్త్రీల సహాయసహకారాలు లభిస్తాయి. కుటుంబంలో ఐకమత్యం నెలకొంటుంది. ఇందువల్ల మీరు బయట కార్యక్రమాలను సులువుగా, ఉత్సాహంగా చేయగలుగుతారు. స్నేహితులతో కలిసి మీరు పార్ట్‌టైం వ్యాపారం చేస్తారు, అది లాభిస్తుంది. సంపాదించడానికి పడ్డ కష్టం పొదుపు చేయడానికి కూడా పడతారు. నూనె వ్యాపారాలు చేసే వ్యాపారస్తులకు అనుకూల కాలం. భవిష్యత్తు కార్యక్రమం గురించి స్పష్టమైన ప్రణాళిక ఉండదు. ఎప్పటికప్పుడు ఉపాయంతో బయటపడే విషయంపైనా దృష్టి కేంద్రీకరిస్తారు. లీజులు పొడగింపబడతాయి. ఉద్యోగపరంగా ఒక నెలరోజులు ఇబ్బంది పడవలసి వస్తుంది. మీకు సహాయపడే వాళ్ళకు మీ వృత్తి ఉద్యోగాలలో ప్రత్యక్ష సంబంధాలు లేకుండా పోవుట వలన మీకు ఈ ఇబ్బంది కలుగుతుంది. బంధువర్గంలోని వారికి మీరు ఎంతమేలు చేసినా చివరికి విరోధమే మిగులుతుంది. నైతిక ధర్మమే మిమ్మల్ని అడుగడుగునా రక్షిస్తుంది. నిజనిజాలు మీ దృష్టికి రాకుండా మీ సన్నిహితులు, ఆత్మీయులు చేసే ప్రయత్నాలు మీ దృష్టికి వస్తాయి. విందులు, వినోదాలు అందరూ కలిసే పెళ్ళిళ్ళ సంబరాలలో తగిన స్థానం లభించకపోవచ్చు. దీనిని అవమానంగా భావించి, బాధపడి కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకుంటారు. స్థిరాస్తుల కొనుగోలు విషయాలలో కొంత జాప్యం జరుగుతుంది. ఇది మీకు లాభించే అంశమే. సంస్థాపరంగా అందరూ కలిసి తీసుకున్న నిర్ణయాలు వివాదస్పదం అవుతాయి. విమర్శలు ఎదుర్కొనవలసిన బాధ్యత మాత్రం మీ ఒక్కరిపైనే పడుతుంది. మీ ప్రతిపాదనలు విదేశాలలో ఆమోదింపబడతాయి. గతంలో వివాదస్పదమైన డాక్యుమెంట్స్ తిరగదోడడం వల్ల మీకు లాభం ఉంటుంది. అగ్రిమెంట్లు, లైసెన్సులు కూడా మీకు అనుకూలిస్తాయి. ఆకస్మిక ధనం చేతికి రావడం వల్ల కొన్ని మొండి బాకీలు తీర్చగలుగుతారు. పొదుపు పథకాలలో ధనాన్ని పెట్టుబడిగా పెట్టి కొంతమేర లాభపడతారు. సరైన సమయంలో మీకు న్యాయం జరగకపోవచ్చు కాస్త ఆలస్యంగా మీకు మరింత మంచి జరుగుతుంది. అధికారులతో, పెద్దలతో ముఖ్యమైన వాళ్ళతో ఆచితూచి మాట్లాడడం, సంబంధబాంధవ్యాలు దెబ్బతినకుండా జాగ్రత్తగా ఉండడం చెప్పదగిన సూచన. చలనచిత్ర పరిశ్రమకు చెందిన విషయ వ్యవహారాలు లాభిస్తాయి. మీ అభిప్రాయాలను వాయిదా వేయడానికి వీలులేని పరిస్థితులలో నిర్మొహమాటంగా మీ అభిప్రాయాలు తెలియజేయవలసి వస్తుంది. ప్రత్యర్థులు, పోటీదారుల నుండి ఊహించలేని విధంగా పోటీలు ఎదురవుతాయి. అయితే మీరు తీసుకున్న ముందుజాగ్రత్త చర్యల వల్ల చెప్పుకోదగిన నష్టమేమీ కలుగదు. ఆహార సంబంధమైన నియమాలు పాటిస్తారు. మీరు ఊహించని విధంగా సొంత మనుషులు, ఆత్మీయులు అని భావించిన వారి వల్ల ఇబ్బంది కలుగుతుంది. కొంత నష్టం కూడా కలుగుతుంది. పెద్దగా తెలివితేటలు లేని వారు మిమ్మల్ని నమ్మించి మోసం చేయడం మీకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. మీరు సాధించిన గొప్ప విజయాలు ఇతరులు గుర్తించకపోయినా స్వజనులు గుర్తిస్తారు. వ్యాపార విస్తరణలో అనుచరగణం ప్రముఖ పాత్ర వహిస్తారు. రొటేషన్ మనీ కొరకు స్వల్ప ఇబ్బందులు తప్పకపోవచ్చు. ఋణాలు తీసుకుంటారు. ఉన్నతస్థాయి వ్యక్తులతో పరిచయాలు, పరపతి, అనుబంధాలు వృద్ధిచెందినా తక్షణ ఆర్థిక సహకారానికి ఆ పరిచయాలు ఉపయోగపడవు. ప్రకృతి బీభత్సాల వల్ల పరోక్షంగా కానీ, ప్రత్యక్షంగా కానీ నష్టం సంభవించవచ్చు. కాంట్రాక్టుల కన్నా సబ్‌కాంట్రాక్టులు లాభిస్తాయి. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అమ్మే వ్యాపార వర్గాల వారికి చెప్పుకోదగిన లాభాలు వస్తాయి. ఆత్మీయవర్గం చేసే పొరపాటు వల్ల పోలీస్స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిరగవలసి రావచ్చు. ఒక ఉన్నత పదవికి మీ పేరు సిఫారసు చేయబడుతుంది. రాజకీయ పదవి లభిస్తుంది. ఎంతో ఆత్మీయులనుకోని మీరు భావించిన వారు విదేశాలలో స్థిరపడి మిమ్మల్ని మరిచిపోయినా మిత్రవర్గం అండగా నిలుస్తారు. ముఖ్యమైన వాటిని ఇన్సురెన్స్ చేయండి. మేలు జరుగుతుంది. నడమంత్రపు రాజకీయ అధికారంతో మీ మీద జులుం చూపించాలని ప్రయత్నించేవారు ఆపదలో పడతారు. మీ పరిస్థితి సురక్షితంగానే ఉంటుంది. బలవంతులు, మేధావులు మీ సేవలను వినియోగించుకుంటారు. ఇతర భాషలు నేర్చుకోవలన్న ఆసక్తి కలుగుతుంది. ఆచరణలో మంచి ఫలితాలు వస్తాయి. ఉద్యోగం లేనివారికి ఉద్యోగప్రాప్తి, సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. అవివాహితులైన వారికి వివాహప్రాప్తి. కొందరికి పునర్వివాహ ప్రాప్తి కూడా సంభవం. స్త్రీల వల్ల కొన్ని ప్రయోజనాలు పొందుతారు. ఆరోగ్యకరమైన వాతావరణంలో, మానవీయ కోణంలో సహాయం చేస్తున్న ఓ స్త్రీ విషయంలో అసభ్యకరమైన అసత్య ప్రచారం మీ మీద కొనసాగుతుంది. స్నేహానికి అర్థం తెలుసుకోలేని మూర్ఖులు ఇలాంటి ప్రచారం చేస్తున్నారని భావిస్తారు. స్త్రీ పురుషుల మధ్య ఉన్న స్నేహాన్ని వక్రీకరించే ఈ సమాజం పట్ల విరక్తి కలుగుతుంది. ఆధ్యాత్మిక ప్రసంగాలు పెద్దగా ఆకర్షించవు. ఏదో లోపం ఉన్నట్లుగా తోస్తుంది. దీక్షా కార్యక్రమాలు స్వయంగా నియమనిష్ఠలతో నిర్వహిస్తారు. సామాజిక కార్యక్రమాలలో, ఆధ్యాత్మిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. వ్యాపారంలో లాభాలు వచ్చినా మరెందులోనైనా లాభాలు వచ్చినా ధనం ఏదో ఒక రూపేణా జారిపోతుంది. పొదుపు చేయడానికి గట్టి ప్రయత్నం చేస్తారు. అందులో విజయం సాధిస్తారు. ప్రభుత్వానికి చెల్లించవలసిన పన్నుల గురించి న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తారు. కోర్టుతీర్పులు అనుకూల ప్రభావం చూపిస్తాయి. కొన్ని దురలవాట్లను వదిలించుకుంటారు. అందువల్ల ఇంట్లో ప్రశాంత వాతావరణం ఏర్పడుతుంది. మీకు రావలసిన ధనం మూడు వంతులు మీ చేతికి అందుతుంది. అధిక మొత్తంలో ధనం సంతానం కొరకు వెచ్చించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. కాకతాళీయంగా మీరు పరిచయం చేసిన వ్యక్తులు మీ పలుకుబడిని, పేరుని అడ్డం పెట్టుకుని అడ్డదారిలో ధనం సంపాదిస్తారు. ఈ విషయం ఆలస్యంగా మీ దృష్టికి వస్తుంది. మీ నిజాయితీ నిరూపించుకోవాల్సిన పరిస్థితి కూడా రావచ్చు. ఇది ఇబ్బందికరంగా మారుతుంది. మీ ప్రత్యర్థులు దీనిని అడ్డం పెట్టుకుని లబ్ధి పొందే అవకాశం ఉంది. జాగ్రత్త వహించండి. కుటుంబ వ్యవహారాలలో, వ్యాపారంలో మంచి అభివృద్ధి లభిస్తుంది. దీర్ఘకాలపు సమస్యలు పరిష్కారం అవుతాయి. మీకు జరిగిన నమ్మకద్రోహానికి తగిన ప్రతీకారం తీర్చుకుంటారు. ఉన్నతస్థానాన్ని అధిరోహించడానికిక మీ శత్రువులు చేసే ప్రయత్నాలకు గండికొడతారు. వైరివర్గాన్ని బలహీనపరుస్తారు. ఎదుగుదలకు అవకాశం లేకుండా చేస్తారు. ఆర్థికసంస్థలలో పనిచేస్తున్న వారు ప్రతి విషయంలోనూ జాగ్రత్త వహించాలి. ఉద్యోగంలో ప్రమోషన్ లభిస్తుంది. మీ ప్రాధాన్యత తగ్గించడానికి కొంతమంది ప్రయత్నాలు చేసినా అవి తాత్కాలికమే. శుభకార్యాలు ఘనంగా చేస్తారు. మళ్ళీ మీరు అనుకున్న స్థానానికి రాగలుగుతారు. వాస్తవాలకు అతీతంగా ఊహాలోకంలో మీరు తీసుకున్న నిర్ణయాలు మంచి ఫలితాలను ఇవ్వవు. ఏకపక్ష నిర్ణయాలు కలిసిరావు. నలుగురితో కలిసి చర్చించి నిపుణుల సలహాలు తీసుకుని మీ ఆలోచనలను అమలు చేయండి. ఉద్యోగపరంగా మీరు తీసుకున్న నిర్ణయాలను క్రిందిస్థాయి ఉద్యోగులు వ్యతిరేకిస్తారు. చెప్పుడు మాటలు మోస్తారు. రాజకీయాలలో రాణిస్తారు. తాత్కాలిక వేతనాల మీద ఉద్యోగం చేస్తున్న వారికి ఉద్యోగం పర్మినెంట్ అవుతుంది. యూనియన్లకు, సంఘాలకు సంబంధించిన విషయాలకు మీ నాయకత్వంలో సలహాలు సత్ఫలితాలను సాధిస్తాయి. వివాహాది శుభకార్యాలు ముడిపడతాయి. మంచి సంబంధం కుదురుతుంది. బరువుబాధ్యతలను దించుకోగలిగామన్న సంతప్తి కలుగుతుంది. ఉద్యోగంలోనూ, వ్యాపారంలోనూ మార్పులు వస్తాయి. క్రీడారంగంలోని వారికి ప్రోత్సహకాలు, అవార్డులు లభిస్తాయి. నూతన ప్రాడక్టులు విజయవంతమవుతాయి. వ్యాపారం బాగుంటుంది. సినీరంగంలోని వారికి మిశ్రమ ఫలితాలు, టీవీ రంగంలోని వారికి మంచి ఫలితాలు లభిస్తాయి. దేవాలయాలలో అవినీతి మీకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. గుడి, గుడిలో లింగాన్ని మింగే వాళ్ళకు ఎలాంటి శిక్ష పడుతుందోనని రకరకాలుగా ఆలోచిస్తారు. దేవుడి సొమ్ము తినడానికి వాళ్ళకి చేతులు ఎలా వస్తున్నాయో అర్థం కాక అయోమయంలో పడతారు. కార్యాలయంలో గ్రూపు తగాదాలు పరాకాష్టకు చేరుకుంటాయి. జలసంబంధమైన వ్యాపారాలు బాగుంటాయి. మీరు కొనుగోలు చేసిన ఆస్తుల విలువ పెరుగుతుంది.