Ugra Attack
-
మీ త్యాగాన్ని జాతి మరువదు
న్యూఢిల్లీ: 2001లో పార్లమెంట్‌పై ఉగ్ర దాడి ఘటనలో నేలకొరిగిన వారికి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఉప రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగ్దీప్ ధన్‌ఖడ్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా జాతి యావత్తూ మంగళవారం నివాళులర్పించింది. పార్లమెంట్ భవనం వెలుపల జరిగిన కార్యక్రమంలో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, అన్ని పార్టీల ఎంపీలు ఘనంగా నివాళులర్పించారు. 2001 పార్లమెంట్ దాడి ఘటనలో వీరమరణం పొందిన వారికి జాతి ఎల్లప్పుడూ రుణపడి ఉంటుందని రాష్ట్రపతి ముర్ము అనంతరం ట్వీట్ చేశారు. దేశం కోసం ప్రాణాలను ఫణంగా పెట్టిన వారి త్యాగాన్ని, ధైర్యసాహసాలను ఎన్నడూ మరువబోమని ప్రధాని మోదీ ట్విట్టర్లో తెలిపారు. ఘనంగా నివాళులర్పించిన రాజ్యసభ అంతకుముందు, పార్లమెంట్‌పై దాడి ఘటనలో ప్రాణాలర్పించిన వారికి రాజ్యసభ నివాళులర్పించింది. సభ్యులు తమ స్థానాల నుంచి లేచి నిలబడి మౌనం పాటించారు. సభా కార్యకలాపాలు ప్రారంభం కాగానే డిప్యూటీ చైర్మన్ హరివంశ్ రాయ్ మాట్లాడారు. స్వతంత్ర భారతదేశ చరిత్రలో డిసెంబర్ 13వ తేదీ ఎప్పటికీ విషాదకరమైన రోజుగానే గుర్తుండిపోతుందన్నారు. 2001 డిసెంబర్ 13వ తేదీన లష్కరే తోయిబా, జైషే మొహమ్మద్ ఉగ్ర సంస్థలకు చెందిన ఐదుగురు ఉగ్రవాదులు పార్లమెంట్ వద్ద కాల్పులకు తెగబడ్డారు. పార్లమెంట్ భవనంలోకి చొచ్చుకుపోయేందుకు వారు చేసిన యత్నాన్ని బలగాలు తిప్పికొట్టాయి. ఈ ఘటనలో ఐదుగురు ఢిల్లీ పోలీసులు, సీఆర్పీఎఫ్ మహిళా జవాను ఒకరు, పార్లమెంట్ సిబ్బంది ఇద్దరు, జర్నలిస్ట్ ఒకరు ప్రాణాలు కోల్పోగా భద్రతా బలగాల కాల్పుల్లో ఉగ్రవాదులందరూ హతమయ్యారు. -
అమెరికా వర్సిటీలో ముగిసిన ఆపరేషన్
♦ అఫ్గానిస్తాన్ దాడిలో 16 మంది మృతి ♦ 53 మందికి గాయాలు కాబూల్: అఫ్గానిస్తాన్ రాజధాని కాబూల్‌లోని అమెరికా యూనివర్సిటీపై జరిగిన ఉగ్రదాడిలో 16 మంది మరణించగా, 53 మంది గాయపడ్డారు. గాయపడ్డ వారిలో 9 మంది పోలీసులున్నారు. వర్సిటీలో నష్టాన్ని తగ్గించేందుకు రంగంలోకి దిగిన పోలీసులు ఉగ్రవాదులతో దాదాపు 10 గంటలపాటు హోరాహోరీగా పోరాడి ఆపరేషన్‌ను పూర్తి చేశారు. వర్సిటీలో చిక్కుకున్న విద్యార్థులను రక్షించారు. ఇంతవరకు ఈ ఘటనకు ఏ ఉగ్రవాద సంస్థా బాధ్యత వహించకున్నా.. అఫ్గానిస్తాన్ దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో తాలిబాన్లు దాడులకు పాల్పడుతుండటంతో.. వారే ఈ ఘటనకు బాధ్యులని భావిస్తున్నారు. అయితే.. వర్సిటీపై దాడికి పాకిస్తాన్లో ప్రణాళిక రచించినట్లు తెలుస్తోందని అఫ్గాన్ అధ్యక్షుడు అషఫ్ ్రఘనీ తెలిపారు. ఈ విషయమై పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ రహీల్ షరీఫ్‌కు ఫోన్ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే పాక్ విదేశాంగ శాఖ ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది. ఈ దాడులతో భద్రత విషయంలో ప్రమాణాలు పెంచాల్సిన అవసరముందన్నారు. మృతిచెందిన వారిలో ఎనిమిది మంది విద్యార్థులు, ఓ ఉపాధ్యాయుడు, పోలీసులు, సెక్యూరిటీ గార్డులున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. మరణించిన వారిలో అధిక భాగం కిటికీల వద్ద కూర్చున్నవారేనని అధికారులు తెలిపారు. దాదాపు 9 గంటల పాటు జరిగిన ఈ దాడిలో పోలీసులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు మిలిటెంట్లు మృతి చెందారు. దాడి జరిగిన సమయంలో యూనివర్సిటీలో 200 మందికి పైగా ఉన్నారు.