అమెరికా వర్సిటీలో ముగిసిన ఆపరేషన్ | Attack at University in Kabul Shatters a Sense of Freedom | Sakshi
Sakshi News home page

అమెరికా వర్సిటీలో ముగిసిన ఆపరేషన్

Published Fri, Aug 26 2016 2:57 AM | Last Updated on Mon, Sep 4 2017 10:52 AM

అమెరికా వర్సిటీలో ముగిసిన ఆపరేషన్

అమెరికా వర్సిటీలో ముగిసిన ఆపరేషన్

అఫ్గానిస్తాన్ దాడిలో 16 మంది మృతి
53 మందికి గాయాలు

 కాబూల్: అఫ్గానిస్తాన్ రాజధాని కాబూల్‌లోని అమెరికా యూనివర్సిటీపై జరిగిన ఉగ్రదాడిలో 16 మంది మరణించగా, 53 మంది గాయపడ్డారు. గాయపడ్డ వారిలో 9 మంది పోలీసులున్నారు. వర్సిటీలో నష్టాన్ని తగ్గించేందుకు రంగంలోకి దిగిన పోలీసులు ఉగ్రవాదులతో దాదాపు 10 గంటలపాటు హోరాహోరీగా పోరాడి ఆపరేషన్‌ను పూర్తి చేశారు. వర్సిటీలో చిక్కుకున్న విద్యార్థులను రక్షించారు. ఇంతవరకు ఈ ఘటనకు ఏ ఉగ్రవాద సంస్థా బాధ్యత వహించకున్నా.. అఫ్గానిస్తాన్ దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో తాలిబాన్‌లు దాడులకు పాల్పడుతుండటంతో.. వారే ఈ ఘటనకు బాధ్యులని భావిస్తున్నారు.

అయితే.. వర్సిటీపై దాడికి పాకిస్తాన్‌లో ప్రణాళిక రచించినట్లు తెలుస్తోందని అఫ్గాన్ అధ్యక్షుడు అషఫ్ ్రఘనీ తెలిపారు. ఈ విషయమై పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ రహీల్ షరీఫ్‌కు ఫోన్ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే పాక్ విదేశాంగ శాఖ ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది. ఈ దాడులతో భద్రత విషయంలో ప్రమాణాలు పెంచాల్సిన అవసరముందన్నారు. మృతిచెందిన వారిలో ఎనిమిది మంది విద్యార్థులు, ఓ ఉపాధ్యాయుడు, పోలీసులు, సెక్యూరిటీ గార్డులున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.  మరణించిన వారిలో అధిక భాగం కిటికీల వద్ద కూర్చున్నవారేనని అధికారులు తెలిపారు. దాదాపు 9 గంటల పాటు జరిగిన ఈ దాడిలో పోలీసులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు మిలిటెంట్లు మృతి చెందారు. దాడి జరిగిన సమయంలో యూనివర్సిటీలో 200 మందికి పైగా ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement