యూకే వెబ్సైట్ సంచలన ప్రకటన
లండన్: నేతాజీ సుభాష్ చంద్రబోస్ విమాన ప్రమాదంలో చనిపోయాడంటూ అమెరికాకు చెందిన ఓ వెబ్ సైట్ సంచలన ప్రకటన చేసింది. దీనికి సంబంధించిన సాక్ష్యాలను వెల్లండించింది. భారత స్వాతంత్ర్య సమరయోధుడు బోస్ తైవాన్ విమాన ప్రమాదంలోమరణించారని నిక్కచ్చిగా తేల్చి చెబుతోంది. తమ ప్రకటనకు మద్దతుగా నేతాజీ సన్నిహిత సహచరుడు, ఇద్దరు జపాన్ వైద్యులు, నర్స్ ఒక జర్నలిస్టు, ఇలా అయిదుగురి సాక్షులను అధికారికంగా ప్రకటించింది. దీంతో నేతాజీ డెత్ మిస్టరీపై మరింత చర్చకు తెరలేచింది.
భారత జాతీయ సైన్యం యొక్క స్థాపకుడైన బోస్ 1945 ఆగస్టు 18 న మరణించాడని ధృవీకరిస్తోంది. విమానం ఒక ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆయన అదే రోజు అర్ధరాత్రి మరణించారంటోంది. దీంతో పాటు నేతాజీ చనిపోతూ భారత ప్రజలకు ఒక సందేశానిచ్చినట్టుగా పేర్కొంది. ఆనాటి విమాన ప్రమాదంనుంచి ప్రాణాలతో బైటపడిన బోస్ అంగరక్షకుడు , కల్నల్ హబాబుర్ రెహమాన్ 1 945 ఆగస్టు 24న ఒక ప్రకటన చేశారంటోంది. అది నేతాజీ చివరి మాటలతో కూడిన ప్రకటన అని పేర్కొంది. "తన మరణానికి ముందు ఆయన (బోస్) తన ముగింపు సమీపంలో ఒక సందేశాన్ని ఇచ్చారు. తాను భారతదేశం యొక్క స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్న క్రమంలో తన ప్రాణాలనుకూడా ధారపోస్తున్నాని చెప్పారు. భారతదేశ ప్రజలు తమ స్వాతంత్ర్యం పోరాటం కొనసాగించాలని ఆకాంక్షించారు. లాంగ్ లివ్ ఆజాద్ హింద్ అంటూ కన్నుమూశారని కల్నల్ ప్రకటించాడంటోంది.
1945 సెప్టెంబర్‌లో ఫిన్నె , డేవిస్ ల ఆధ్వర్యంలో భారతదేశ రెండు ఇంటిలిజెన్స్ బృందాలు బ్యాంకాంక్ , సైగాన్, తాయ్ పే లలో పర్యటించి విచారించాయంటోంది. అనంతరం విమానం ప్రమాదంలో బోస్ మరణించినట్టుగా ఒక అంచనాకు వచ్చారని తెలిపింది. దీంతోపాటుగా నేతాజీకి చికిత్సచేసిన ఇద్దరు డాక్టర్లు, నర్సు అందించిన వివరాలను ఉటంకింస్తోంది. ఈ కేసులో పరిశోధనకు వెళ్లిన ముంబై జర్నలిస్టు హరీన్ షా కు బోస్‌కు చికిత్స అందించిన నర్స్ చెప్పిన వివరాలను ఈ వెబ్సైట్లో ప్రచురించారు.