UK couple
-
రాసిపెట్టి ఉండటమంటే ఇదేనేమో.. రాత్రికి రాత్రే కోటీశ్వరులయ్యారు!
రాసి పెట్టి ఉండాలే గానీ.. తమకంటూ రావాల్సిన సొమ్ము దానంతట అదే వస్తుందనే సామెత నిజమైంది. పాతబడిన ఇళ్లకు మెరుగులు దిద్దే క్రమంలో ఓ జంటకు ఊహించని రీతితో ఏకంగా రూ.2కోట్లకు పైగా విలువ చేసే బంగారు నాణేలు లభించాయి. దీంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ ఘటన యూకేలో చోటుచేసుకుంది. ది టైమ్స్ కథనం ప్రకారం.. నార్త్ యార్క్ షైర్లోని ఎల్లెర్బీ గ్రామంలో ఓ జంటకు పాతబడిన ఇళ్లు ఉంది. దీంతో తమ పాతబడిన ఇంటిని బాగుచేసుకునేందుకు వారు రెడీ అయ్యింది. ఈ క్రమంలో తమ ఇంట్లోని కిచెన్‌ను బాగుచేయడం కోసం తవ్వకాలు జరిపారు. అనూహ్యంగా ఒక ప్లేస్‌లో గునపానికి ఏదో తగిలిన శబ్ధం రావడంతో షాకయ్యారు. మరికాస్త తవ్వగా, ఓ లోహపు క్యాన్ కనిపించింది. క్యాన్‌ను బయటకు తీసి ఓపెన్ చేసి చూడగా బంగారు నాణేలు కనిపించాయి. దీంతో వారి ఆనందం ఒక్కసారిగా రెట్టింపు అయ్యింది. అయితే, ఆ నాణేలపై 1610-1727 నాటి ముద్రలు ఉన్నాయి. ఇవి ఒకటో జేమ్స్, ఒకటో చార్లెస్ రాజుల కాలం నాటివని అంచనా వేశారు. దాదాపు 264 బంగారు నాణేలు వారికి దొరికాయి. ప్రస్తుతం వాటి విలువ దాదాపు.. ఇప్పటి మార్కెట్ ప్రకారం రూ.2.3 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. ఈ జంట త్వరలోనే తమ ఇంట్లో దొరికిన నాణేలను విక్రయించనుంది. అందుకోసం వారు ఓ వేలం సంస్థను కూడా సంప్రదించినట్టు సమాచారం. #UK Couple Find Gold Coins Worth Rs 2.3 Crore Buried Under Their Kitchen Floor: Report #News #2022 https://t.co/BHJhZgNrQN — Real News Time (@ErdenSorgul) September 2, 2022 -
ఫుల్లుగా తాగారు.. ఆపై..!
సాధరణంగా తాగి జీవితాలు నాశనం చేసుకునే వారి గురించే చదువుతుంటాం.. కానీ లైఫ్ సెట్ చేసుకున్న వారి గురించి ఎక్కడ చూడటం కాదు కదా కనీసం చదివి కూడా ఉండం. కానీ ఇలాంటి సంఘటనే ఒకటి శ్రీలంకలో జరిగింది. ఫుల్లుగా తాగిన ఓ కొత్త జంట ఏకంగా హనీమూన్ కోసం వెళ్లిన హోటల్‌నే కోనేశారు. వినడానికి కాస్తా విడ్డూరంగా అనిపించినా ఇది మాత్రం నిజం. కాస్తా ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన శ్రీలంకలో చోటు చేసుకుంది. బ్రిటన్‌కు చెందిన గినా లైయాన్స్, మార్క్ లీలు తమ హనీమూన్ ట్రిప్ కోసం శ్రీలంకకు వెళ్లారు. అక్కడ ఓ హోటల్లో దిగారు. ఫుల్లుగా తాగి ఎంజాయ్ చేస్తున్న వారికి ఓ వెరైటీ ఆలోచన వచ్చింది. రూమ్ రెంట్‌కు తీసుకోవడం కంటే ఏకంగా ఈ హోటల్‌నే కొంటే ఎలా ఉంటుంది అనుకున్నారు. ఆలోచన రావడమే తడవుగా ఆ హోటల్ యాజమానుల దగ్గరకు వెళ్లారు. తమ ఆలోచన గురించి వారికి చెప్పారు. హోటల్ కూడా కాస్తా పాతబడటం.. త్వరలోనే దాని లీజ్ కూడా అయిపోతుండటంతో హోటల్ యజమానులు కూడా గినా, మార్క్ ప్రతిపాదనను అంగీకరించారు. అలా తాగిన మైకంలోనే బేరసారాలు కానిచ్చేశారు. అలా దాదాపు 30 వేల పౌండ్లు పోసి ఆ హోటల్‌ను మూడేళ్లకు తీసుకున్నారు. అంటే మన కరెన్సీలో 29 లక్షల రూపాయలు. ఇంకేముందు.. వాళ్ల హనీమూన్ ట్రిప్ కాస్త బిజినెస్ ట్రిప్‌గా మారిపోయింది. View this post on Instagram How #luckybeachtangalle was born! ❤️ A post shared by Lucky Beach (@luckybeachtangalle) on Oct 7, 2018 at 1:54am PDT అలా ఈ సంవత్సరం జులై 1 నుంచి ఆ హోటల్ని మూడేళ్ల పాటు లీజ్‌కు తీసుకొన్నారు.. దానికి ‘లక్కీ బీచ్ తంగళ్లె’ అనే పేరు పెట్టి దాన్ని అందంగా తీర్చిదిద్దారు. ఇక.. అప్పటి నుంచి టూరిస్టులు ఆ హోటల్‌కు క్యూ కడుతున్నారట. బాగుంది కదా ఐడియా.. తాగితే తాగారు కానీ.. మంచి బిజినెస్ దొరికింది.. అంతే కాదు వాళ్లు ఆ ఏరియాలో చిన్నపాటి సెలబ్రిటీలు అయ్యారు. వీరి బిజెనేస్ కూడా సక్సెస్ ఫూల్‌గా దూసుకుపోతుందంట. -
రైలు మొత్తానికి వారిద్దరే..!
ఉదకమండలం (ఊటి) : లాహిరి లాహిరి లాహిరిలో.. ఓహో జగమే ఊగెనుగా.. తూగెనుగా అన్నట్టు సాగింది యూకేకు చెందిన గ్రాహం విలియం లిన్, సిల్వియా ప్లాసిక్ హనీమూన్ ట్రిప్. యునెస్కో గుర్తింపు పొందిన తమిళనాడులోని నీలగిరి పర్వతాల అందాలను ఈ జంట ప్రత్యేక రైలు (చార్టర్డ్ సర్వీసెస్)లో వీక్షించింది. 2.5 లక్షల రూపాయలు చెల్లించి ప్రత్యేక రైలులో.. ప్రత్యేక ప్రయాణం చేసిన ఇంగ్లిస్ కపుల్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ప్రసిద్ద నీలగిరి పర్వతాల పర్యటన కోసం దక్షిణ రైల్వే ‘నీలగిరి మౌంటేన్ రైల్వే’పేరిట చార్టర్డ్ రైల్వే సర్వీసులను నడుపుతుండేది. అయితే, 1997లో మొదలైన ఈ సర్వీసులు 2004లో ఆగిపోయాయి. అధునాతన కోచ్‌లు, లోకోమోటివ్స్‌ను అందుబాటులోకి తెచ్చి రైల్వే శాఖ నీలగిరి మౌంటేన్ సర్వీసులను ఈ శుక్రవారం మళ్లీ పునఃప్రారంభించింది. లక్కీగా యూకే దంపతులు విలియం, సిల్వియాకు నీలగిరి మౌంటేన్ సర్వీసుల మొదటి ట్రిప్‌లో ప్రయాణించే అవకాశం వచ్చింది. దాంతో మూడు కోచ్‌ల ప్రత్యేక చార్టర్డ్‌లో.. పచ్చని ప్రకృతి నెలవైన నీలగిరి అందాలను ఆస్వాదిస్తూ.. 13 సొరంగాల గుండా పయనించి తమ జీవితంలో మరపురాని సంతోషాల్ని సొంతం చేసుకున్నారు. 143 సీట్ల సామర్థ్యం గల రైలు మొత్తాన్ని అద్దెకు తీసుకుని ఈ యూకే జంట హనీమూన్ ట్రిప్‌ను గ్రాండ్‌గా డిజైన్ చేసుకుంది. మెట్టుపాలెం నుంచి ఊటి వరకు 48 కిలోమీటర్లు సాగిన ఈ ప్రయాణం అయిదున్నర గంటల పాటు కొనసాగింది. -
మరణంలోనూ అతని వెంటే ఆమె..
లండన్: తనవుకొక మనసుగా 70 ఏళ్లు కలిసి జీవించారు. ఏడాది కిందట ఆ భర్త మతిమరుపు వ్యాధికి గురయ్యాడు. భార్యను గుర్తుపట్టడం మానేశాడు. ఇది భరించలేని ఆమె ఆస్పత్రి పాలైంది. భర్త కూడా అదే ఆస్పత్రిలో చికిత్స పొందాడు. చివరికి ఒక ఉదయాన భర్త కన్నుమూశాడు. అతను చనిపోయిన నాలుగు నిమిషాల వ్యవధిలోనే ఆమె కూడా తుది శ్వాస విడిచింది! బ్రిటన్‌లో చోటుచేసుకున్న ఈ సంఘటనకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. లిస్టర్షైర్లోని విగ్స్టన్లో నివసించే విల్ఫ్ రసెల్(93) బ్రిటిష్ ఎయిర్‌ఫోర్స్ మాజీ ఉద్యోగి. రెండో ప్రపంచ యుద్ధంలోనూ పాల్గొన్నాడు. అదే సమయంలో వెరా అనే పడతిని ప్రేమించి, పెళ్లాడాడు. యుద్ధం తర్వాత ఇంజనీర్‌గా సెటిల్ అయ్యాడు. ఆదిదంపతులుగా విరాజిల్లుతూ పిల్లలు, మనవళ్లు, మునిమనవళ్లతో కాలం గడిపారు. కాగ, గత ఏడాది రస్సెల్ మతిమరుపు వ్యాధికిగుర్య్యాడు. భార్య సహా దేనినీ గుర్తుపట్టలేని స్థితిలోకి వెళ్లాడు. 70 ఏళ్ల అనురాగం ఊహించని విధంగా ముక్కలయ్యేసరికి వెరా తట్టుకోలేకపోయింది. మనోవేదనతో మంచం పట్టింది. పిల్లలు వాళ్లిద్దరినీ ఆస్పత్రిలో చేర్పించారు. డాక్టర్ల సూచనమేరకు రెండు నెలల కిందట రస్సెల్‌ను ఇంట్లోనే ఉంచి చికిత్స అందిస్తున్నారు. గత బుధవారం ఉదయం 6:50కి అతను ప్రాణాలు విడిచాడు. సరిగ్గా నలుగు నిమిషాల్లోనే.. భర్త మరణవార్త తెలియకముందే వెరా(91) కూడా చనిపోయింది. ‘బహుశా.. ఇద్దరం కలిసే పోవాలని వాళ్లు అనుకుని ఉండొచ్చు. నిమిషాల్లోనే అంతా జరిగిపోయింది’ అని రస్సెల్ మనవడు మీడియాకు చెప్పాడు. -
ఓ ట్వీట్.. ఉగ్రవాద దంపతులకు జీవిత ఖైదు
లండన్‌లో ఉగ్రవాద దాడికి కుట్రపన్నిన దంపతులకు జీవిత ఖైదు విధించారు. లండన్ రవాణ వ్యవస్థపై ఉగ్రవాదదాడి జరిగి పదేళ్లు కావస్తున్న సందర్భంగా మహ్మద్ రెహ్మాన్ (25), సనా అహ్మద్ ఖాన్ (24) ఆత్మాహుతి దాడికి పాల్పడేందుకు కుట్ర పన్నినట్టు కోర్టు నిర్ధారించింది. వీరిద్దరినీ దోషులుగా ప్రకటించిన కోర్టు రెహ్మాన్‌కు 27 ఏళ్లు, సనాకు 25 ఏళ్ల చొప్పున జైలు శిక్ష విధించినట్టు బ్రిటీష్ మీడియా వెల్లడించింది. రెహ్మాన్ ట్విట్టర్ ఎకౌంట్లో పోస్ట్ చేసిన ట్వీట్ల ఆధారంగా భద్రత అధికారులు గత మేలో ఈ దంపతులను అదుపులోకి తీసుకున్నారు. లండన్‌లో బాంబు పేల్చడానికి తగిన ప్రదేశాలు ఎక్కడ ఉన్నాయని సలహా కోరుతూ ఓ ట్వీట్ చేశాడు. బాంబులను ఎలా పేల్చాలి, ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ గురించి ఆన్లైన్లో సెర్చి చేసినట్టు అధికారులు కనుగొన్నారు. భద్రతాధికారులు రెహ్మాన్‌ను అరెస్ట్ చేశాక వారి ఇంట్లో సోదాలు చేశారు. బాంబు తయారీ పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. రెహ్మాన్, సనా ఇంటర్నెట్లో ఉగ్రవాద కార్యకలాపాల గురించి తెలుసుకునేవారని, సోషల్ మీడియా ద్వారా ఉగ్రవాద భావజాలాన్ని పంచుకునేవారని ఓ ఉన్నతాధికారి చెప్పారు.