రాసి పెట్టి ఉండాలే గానీ.. తమకంటూ రావాల్సిన సొమ్ము దానంతట అదే వస్తుందనే సామెత నిజమైంది. పాతబడిన ఇళ్లకు మెరుగులు దిద్దే క్రమంలో ఓ జంటకు ఊహించని రీతితో ఏకంగా రూ.2కోట్లకు పైగా విలువ చేసే బంగారు నాణేలు లభించాయి. దీంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ ఘటన యూకేలో చోటుచేసుకుంది.
ది టైమ్స్ కథనం ప్రకారం.. నార్త్ యార్క్ షైర్‌లోని ఎల్లెర్బీ గ్రామంలో ఓ జంటకు పాతబడిన ఇళ్లు ఉంది. దీంతో తమ పాతబడిన ఇంటిని బాగుచేసుకునేందుకు వారు రెడీ అయ్యింది. ఈ క్రమంలో తమ ఇంట్లోని కిచెన్‌ను బాగుచేయడం కోసం తవ్వకాలు జరిపారు. అనూహ్యంగా ఒక ప్లేస్‌లో గునపానికి ఏదో తగిలిన శబ్ధం రావడంతో షాకయ్యారు. మరికాస్త తవ్వగా, ఓ లోహపు క్యాన్ కనిపించింది. క్యాన్‌ను బయటకు తీసి ఓపెన్ చేసి చూడగా బంగారు నాణేలు కనిపించాయి. దీంతో వారి ఆనందం ఒక్కసారిగా రెట్టింపు అయ్యింది.
అయితే, ఆ నాణేలపై 1610-1727 నాటి ముద్రలు ఉన్నాయి. ఇవి ఒకటో జేమ్స్, ఒకటో చార్లెస్ రాజుల కాలం నాటివని అంచనా వేశారు. దాదాపు 264 బంగారు నాణేలు వారికి దొరికాయి. ప్రస్తుతం వాటి విలువ దాదాపు.. ఇప్పటి మార్కెట్ ప్రకారం రూ.2.3 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. ఈ జంట త్వరలోనే తమ ఇంట్లో దొరికిన నాణేలను విక్రయించనుంది. అందుకోసం వారు ఓ వేలం సంస్థను కూడా సంప్రదించినట్టు సమాచారం.
#UK Couple Find Gold Coins Worth Rs 2.3 Crore Buried Under Their Kitchen Floor: Report #News #2022 https://t.co/BHJhZgNrQN
— Real News Time (@ErdenSorgul) September 2, 2022
Comments
Please login to add a commentAdd a comment